నిత్య జీవితానికి బలి అవసరమా?

నిత్య జీవితమునకు వారసులు ఎవరు?

మత్తయి; 19:16-22 ; మార్కు ; 10:17-22 ; లూకా; 18:18-30 వచనాలు మనం పరిశీలించినట్లయితే ధర్మ శాస్త్రంలోని ఆజ్ఞలను గైకొనుట ద్వారానే నిత్యజీవమునకు వారసులు అయ్యే అవకాశం ఉన్నట్లుగా యేసు బోధనలలో మన చూడగలం. 

ఏది నిత్య జీవం? 

యోహాను; 12:50 ప్రకారం దేవుని ఆజ్ఞయే నిత్య జీవం అని యేసు చెప్పారు.

నిత్య జీవములొ ఎవరు ప్రవేశిస్తారు?

యోహాను ; 3:36 వచనం ప్రకారం కుమారుని (యేసు) విశ్వసించు వాడు ప్రవేశిస్తాడు. 

యోహాను ; 6:40 కుమారుని విశ్వసించి నిత్యజీవం పొందుట దేవుని చిత్తమై యున్నది. 

యోహాను; 5:24 ప్రకారం యేసు మాటను విని యేసును పంపినవాని (దేవుని) యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. 

దేవుని ఏవిధంగా విశ్వసించాలి?

మార్కు ; 10:18 లూకా; 18:19 ; మార్కు ; 12:29;  యోహాను; 17:3 ; 7:28; మత్తయి ; 4:8-11 ; లూకా ; 4:8 ; యోహాను; 20:17 ; 5:37 పై యేసు బోధనల ప్రకారం - దేవుని ఒక్కనిగానే కాక ఆయనను అద్వితీయునిగా, పరలోకవాసిగా, అందరికంటే గొప్పవానిగా, సత్యదేవునిగా ఎవరును ఏకాల మందును ఆయనను చూడలేదని కూడా విశ్వసించాలి. 

యేసును ఏవిధంగా విశ్వసించాలి?  

యోహాను;4:29; 9:22; 12:43; 4:25-26; 2:22;  మార్కు; 8:29; లూకా; 9:20; మత్తయి; 16:16; అపో।।  కా 9:22; యేసును రక్షకునిగా, మధ్యవర్తిగా, గురువుగా, మనుష్యకుమారునిగా, ప్రవక్తగా, బోధకునిగా కాకుండా పై వాక్యముల ప్రకారం ముఖ్యంగా క్రీస్తు (మెసయ్య) గా విశ్వసించాలి. ఎందుకంటే యేసును క్రీస్తుగా నమ్మనివాడు అబద్దీకుడుగా మనం వాక్యాన్ని గమనించగలం. (యోహాను; 2:22)

నిత్యజీవానికి పోయే మార్గం ఎలాంటిది? ఎందరు ప్రవేశిస్తారు? 

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది. దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆదారి సంకుచితమునైయున్నది. దానిని కనుగొను వారు కొందరే. (మత్తయి ; 7:13-14)

పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పొర్ర్న బలము తోనూ, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హొమములన్నిటికంటేను, బలులకంటేను అధికమని ఆయనతో చెప్పెను. (మార్కు; 12:33)

ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. (లూకా; 12:15)

పై వాక్యముల ప్రకారం నిత్యజీవమునకు దేవుని విశ్వసించడం, యేసుని మెసెయ్యగా నమ్మడంతో పాటు, లేమి దాపురించినా, జీవితం ఇరుకై పోయినా సహనంతో జీవించుచు ధర్మశాస్త్ర ఆజ్ఞల ద్వారా నిత్యజీవములొ ప్రవేశిస్తారని తేటతెల్లమగుచున్నది. 

నిత్య జీవము కోసం త్యాగం - దాని ఫలితం: 

పేతురు ప్రశ్న: ఇదిగో మేము సమస్తమును విడిచి పెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, 

యేసు వారి సమాధానం: మీరు పండ్రెండు మంది ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి పునర్జన్మమందు తీర్పు తీర్చుదురు. మరియు విడిచిన ప్రతీదానిని నూరు రెట్లు పొందుదురు. ఇదియు గాక నిత్యజీవమును స్వతంత్రించు కొందురు. (మత్తయి ; 19:28-29)

తీర్పు ఏవిధంగా జరుగుతుంది? 

....నీతిమంతులు నిత్యజీవమునకు పోవుదురు. (మత్తయి ; 25:46) 

నీతిమంతులు ఎవరు? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదుగాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. (రోమా; 2:13)

నిత్య జీవానికి బలి అవసరమా? 

ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్కృయను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను, అక్షయతను వెదకు వానికి నిత్యజీవము నిచ్చును. (రోమా; 2:6-7)

వారు అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు మనుష్యుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. (రోమా; 1:23)

ఈ నిబంధన ఎవరిది?

మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు. (యెషయా; 28:18)

నిత్యజీవానికి యేసు బలి (రక్త ప్రోక్షణ) అనునది పాత నిబంధన కాదు, కొత్త నిబంధనా కాదు. దేవుని నిబంధన అంట కంటే కాదు. యేసు మాకోసం మరణించారు అని మరణముతో క్రైస్తవులు చేసుకున్న నిబంధన లేఖనము ప్రకారము కొట్టి వేయబడాలి. 

చెవిగలవారు ఆత్మ సంఘములలొ చెప్పుచున్న మాట వినుము గాక. జయించు వానిని దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింప నిత్తును. (ప్రకటన; 2:7)

పాప పరిహారం ఎలా?

ఈ గ్రంధం అల్లాహ్ తరపు నుండి అవతరించింది. ఆయన మహాశక్తి మంతుడు, మహాజ్ఞాని పాపాలను క్షమించేవాడూ, పశ్చాతాపాన్ని అంగీకరించేవాడును ; కఠినంగా శిక్షించేవాడూ, ఘనంగా కరుణించేవాడూను, ఆయన తప్ప ఆరాధ్యదైవం మరెవ్వడులేడు. ఆయన వైపునకే అందరూ తిరిగి పోవలసి ఉంది. (ఖుర్'ఆన్ ; 40:2-3)

పాపమని దేనినంటారు?


1. ....కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి - మేము యెహొవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. (సంఖ్యా కాండం; 21:7)

2. ......వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీవిదుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినక పోయిరి. (నెహెమ్యా: 9:29)

3. ......సకల దుర్నీతియు పాపము. (యోహాను; 5:17)

4. .........ఆజ్ఞాతిక్రమమే పాపము......... (1యోహాను; 3:4)

పై వాక్యములను బట్టి దేవుని తిరస్కరించినను, దేవునికి, దైవ ప్రవక్తలకును విరోధముగా మాటలాడినను దేవుని ఆజ్ఞలకు లోబడక - ఆజ్ఞాతిక్రమము చేసినను పాపమౌతుంది. 

పాపాలు ఎన్ని రకాలు?

1. .... అప్పుడు ఇశ్రాయేలీయులు - మేము నీసన్నిధిని పాపము చేసి యున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నాము అని యెహోవాకు మోర పెట్టగా .... (న్యాయాధిపతులు;10:10)

2. మరునాడు మోషే ప్రజలతో - మీరు గొప్ప పాపము చేసితిరి. ..... (నిర్గమ; 32:30)

3. ... మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా .... (ద్వితీ ; 21:22)

4. ....... తన సహోదరుడు మరనకారము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడు కొనును; అతని బట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు అట్టిదాని గూర్చి వేడుకోనవలేనని నేను చెప్పుట లేదు. (1యోహాను;5:16)

5. నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదనెను. .... (యోహాను; 19:11)

6. ..... సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడునుగాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండును. (మార్కు ; 3:28,29)

7. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి యెదుట గద్దింపుము. (1తిమోతి;5;20)

8. .... ఒకడు పొరబాటున పాపము చేసిన యెడల..... (సంఖ్యా; 15:27)

9. ........ మూర్ఖుని యోచన పాపము ..... (సామెతలు; 24:9)

10. .... కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును ....(యాకోబు;4:17)

11. .... విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము.  (రోమా ; 14:23)

పాపము - పర్యవసానము : 

1. అందుకు యెహోవా - యెవడు నా యెదుట పాపము చేసెనో వానిని నా గ్రంధములోనుండి తుడిచి వెయుదును. (నిర్గమ ; 32:33)

2. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. (న్యాయాధిపతులు ; 10:13)

3. ....వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు నాతో ఇట్లనెను - వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్ధన చేయకుము. (యిర్మియా; 14:10-11)

4. ... అతడు చేసిన నీటి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపముబట్టి మరణము నొందును. (;యెహజ్కెలు; 18:24)

5. ... విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. (యేహెజ్కేలు; 23:49)

6. ........నిరపరాధుల రక్తముతో యెరుషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. (2రాజులు; 24:5)

7. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపువలె ఎర్రనివైనను అవి గొర్రెచొచ్చు వలె తెల్లనివగును. (యెషయా;1:18)

ఈ విధముగా ఎన్నో రకాలుగా పాపాలు గూర్చి వాటి పరిహారం మరియు పర్యవసానాలు గూర్చి క్షమించబడే, క్షమార్హం కాని, మరణకరమైన, మరణకరము కాని ఎక్కువ, తక్కువ, చిన్న, గొప్ప, పొరపాటలను, బుద్ధిపూర్వకంగా చేసే మరియు అవిశ్వాస సంబంధమైన పాపాలను గూర్చి బైబిలు ప్రస్తావిస్తుంది. వాటన్నిటిని గూర్చి విశ్వాసమునకు సంబంధించిన పాపము - పరిహారము గూర్చి కొన్ని విషయాలు పరిశీలిద్దాము:

పాపము చేసేదెవరు? చేయనిదెవరు?

1. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్ష్యార్ధముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టియు నడువక, మీరు ధూపము వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. (యిర్మియా; 44:23)

2. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును ననుసరించువారు వారితో పోరాడుచుందురు. (సామెతలు; 28:4)

3. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏపాపమును చేయరు. (కీర్తనలు; 119:3)

4. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. (కీర్తనలు ; 119:11)

5. అయితే నేను పాపులను పిలువా వచ్చితిని గాని నీతి మంతులను పిలువ రాలేదు. (మత్తయి ; 9:13)

6. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయదని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. 
(1యోహాను; 5:18) 

పై వాక్యముల ప్రకారం యెహొహా మాటవినక, ధర్మశాస్త్రపు ఆజ్ఞల ప్రకారం తానూ నడవక ఇతరులను నడిపించక దుష్టులను పొగడువారే పాపాత్ములని, దేవుని మూలముగా పుట్టినవాడు ఆజ్ఞలను గైకొనుచు, హృదయములో భద్ర పరచు కొనుటయే గాక ధర్మశాస్త్రమును త్రోసివేయు వారితో పోరాడుచు ఎన్నటికిని పాపము చేయడని స్పష్టమగు చున్నది.

యేసు బోధల్లో ఏది పాపము? 


1. కాగా మీ పాపములలోనే యుండి మీరు చని పొవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
(యోహాను; 8:24)

ఇది యేసు పట్ల విశ్వాసమునకు సంబంధించిన విషయం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. యేసు - "నేను ఆయననని" విశ్వసించ మంటున్నారు. ఎవరని విశ్వసించాలి? దేవునిలో భాగమనా? త్రియేక దేవుడనా? దేవుడనా? మెసెయ్య అనా? ఏమని విస్వసించాలొ ఈ క్రింది వాక్యాన్ని పరిశీలించండి:

ఆ స్త్రీ ఆయనతో - క్రీస్తన బడిన "మెసెయ్య" వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్ప్పుడు మాకు సమస్తమును తెలియ జేయును అని చెప్పగా యేసు - నీతో మాటలాడుచున్న "నేనే ఆయననని" ఆమెతో చెప్పెను. (యోహాను; 4:25,26)

పై రెండు వాక్యములను బట్టి యేసు దేవుడని, దేవునిలో భాగమని, త్రియేక దేవుడని విశ్వసించు వాడు పాపము చేసిన వాడై పాపములోనే యుండి చనిపొవునని అర్ధమగుచున్నది. ఇంకా యేసును క్రీస్తనబడిన మెసెయ్యగా మాత్రమే విశ్వసించాలని స్పష్టమగుచున్నది. 

యూదులకు ఏపాపం వచ్చింది? 


1. నేను వచ్చి వారికి బోధింప కుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. (యోహాను; 15:22)

2. ..... ఎవడును చేయని క్రియలు నేను వారిమధ్య చేయ కుండిన యెడల వారికి పాపము లేకపోవును. (యోహాను; 15:24) 

3. ...ఆయన వారి యెడల యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. (యోహాను; 12:37)

4. అందుకు యేసు - మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని - చూచు చున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీపాపము నిలిచియున్నదని చెప్పెను. (యోహాను; 9:41)

5. ఎందుకనిన ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకోనిన యెడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించు కొని యుండిరి. (యోహాను; 9:22)

ఈ వాక్యముల ప్రకారం యేసు అనేక సూచ క్రియలు చేస్తూ తానే క్రీస్తునని ప్రకటిస్తున్నప్పటికి, యూదులు యేసును (క్రీస్తు) మెసెయ్యగా విశ్వసించక, విశ్వసించే వారిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తామని భయపెడుతూ వచ్చారు. తాము విశ్వసించక పోవడం ఒక పాపము అయితే విశ్వసించే వారిని అడ్డుకోవడం వలన మరో పెద్ద పాపము వారికి వచ్చి పడింది. ఇంకా మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లెకపొవునని యేసు చెప్పుట ద్వారా మనిషి జన్మతః పాపి కాదని కూడా రుజువగుచున్నది. 

ఈ పాపమును ఒప్పుకోన జేసేదేవరు?

ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. (యోహాను; 16:8)

పై వాక్యం ప్రకారం ఆదరణకర్త లేక ఉత్తవాది అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) దైవ వాణి ఖుర్'ఆన్ మరియు ప్రవచనాల ద్వారా యేసు మెసెయ్య అని ఆనాటి  యూదులను,క్రైస్తవులను యావత్ మానవాళిని ఒప్పుకొనెలా బోధించడం జరిగింది. తరువాత ఆయన అనుచరులైన ముస్లిములంతా నేటికీ యేసే మెసెయ్య అని లోకమును ఒప్పుకునజేయుచున్నారు. 

అపార్దానికి గురి అయిన ఒక యేసు బోధ!

1. అయితే పాపములను క్షమించుటకు భూమిమీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి ..... (మార్కు; 2:10) వీలైతే మార్కు; 2:1-12 మరియు 
మత్తయి ; 9:1-8 వరకు పరిశీలనగా చూడండి.

(ఎ) యేసు వాక్యము బోధించుచుండగా మధ్యలో అకస్మాత్తుగా జరిగిన సందర్భమిది. 

(బి) తీసుకొని వచ్చిన వారి యొక్క విశ్వాసము చూసి కుమారుడు నీ పాపములు క్షమించా బడియునవని వృక్ష వాయువు గలవానితో యేసు చెప్పారు. 

(సి) ఎప్పుడు తప్పు పట్టు కుందామా? ఎలా నేరము మోపుదామా? అని ఎదురు చూస్తున్న శాస్త్రులకు దురాలోచన పుట్టింది. దైవ దూషణ నేరం మోపాలను కున్నారు. 

2. ఆయన అక్కడినుండి వెళ్లి నప్పుడు శాస్త్రులను పరిశయ్యలును ఆయన మీద పగబట్టి ఆయన మీద నేరము మొపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి వేడుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింప సాగిరి. (లూకా; 11:53-54)

దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించ గలవాడెవడని, తన్నుతాను దేవునిగా చెప్పుకోనుచున్నాడని తమ హృదయంలో ఆలోచించు కోవడమే కాదు మరొక సందర్భంలో ముఖం మీదే యేసును అడిగినారు కూడా! 

3. అందుకు యూదులు - నీవు మనుష్య కుమారుడవై యుండి దేవుడవని చెప్పుకోనుచున్నావు. గనుక దేవదూషణ చేసినందుకే ........ (యోహాను ; 10:33)

యేసు దేవదూషణ చేయలేదు, దేవుడని ఎప్పుడూ చెప్పుకోలేదు. దేవుని కుమారుడని, (దాసుడని)చెప్పిన వివరణ ఉన్నది. 

4. .... నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి (దేవుడు) ప్రతిస్ట్హ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? (యోహాను; 10:35-36)

మీరు ఇలా తప్పుడుగా ఎందుకు ఆలోచిస్తున్నారు? సులభంగా అర్ధమవడానికి ఇలా చెప్పానని (మార్కు; 2:8-9) వచనాలలో వివరణ ఇచ్చి 11వ వచనంలో పక్ష వాయువు గలవానిని చూచి - నీవు లేచి నీ పరుపెత్తుంకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని యేసు మరలా తిరిగి చెప్పవలసి వచ్చింది. ప్రజలు యేసుకు ఇట్టి అధికారమిచ్చిన దేవునిచే మహిమ పరచి నట్లుగా వాక్య భాగంలో మనం చూడగలము. 

గ్రహించిన విషయాలు :   

1. యేసు తన జీవితకాలంలో ఎప్పుడునూ దేవదూషణ చేయలేదు. తానూ దేవుడనని చెప్పుకొనలేదు. దేవుడు ప్రతిష్ట చేసి (మెసెయ్యగా) ఈ లోకములోనికి పంపినట్లుగా నిరూపించుకొన ప్రయత్నించారు. 
2. యేసు నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొని నేరం మోపాలని ప్రయత్నించిన యూదులు, శాస్త్రులు, పరిశయ్యలు - దురాలోచనతో దేవదూషణ చేస్తున్నాడు తానూ దేవుడనని చెప్పు కొంటున్నాడని నింద మోపే ప్రయత్నం చేశారు. 

3. దేవుడు - యేసుకిచ్చిన అధికారముతోనే "నీ పాపములు క్షమించబడినవి" అని చెప్పినట్లు స్పష్టమగు చున్నది. "మూర్ఖుని యోచన పాపము ......." అని లేఖనము చెప్పుచున్నది. (సామెతలు;24:9)

నాడు ద్వేషంతో యెసుపై దేవదూషణ నేరం మోపాలని యూదులు, శాస్త్రులు, పరిశయ్యలు మూర్ఖపు ఆలోచనతో పాపం చేస్తే, నేడు పిచ్చి ప్రేమతో యేసుపై అపనిందను వేసి తాను దేవుడనని చెప్పుకోననప్పటికీ, "యేసే దేవుడని" చెప్పి, కొందరు క్రైస్తవ సోదరులు దేవదూషణకు పాల్పడుతున్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే యూదులు, శాస్త్రులు, పరిశయ్యలు "దేవదూషణ" చేయుచున్నాడని నేరము మోపవలసింది యేసు వారి మీద కాదు. 'దేవదూషణ చేస్తున్న నేటి క్రైస్తవుల మీదనే ఆ నేరము మోపాలి. ఎందుకంటే యేసు తానెప్పుడు దేవుడనని చెప్పుకోననప్పటికీ "యేసు దేవుడని" చెప్పి దేవదూషణకు పాల్పడుతున్నారు. 

పాపమునకు పరిహారము ఏమిటి? క్రీస్తు పూర్వం పాపపరిహారం ఎలా జరిగేది?

1. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచు కొని యెహోవా యొద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిన దేమనగా - మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము. నీవంగీకరింప దగినవి అవే మాకున్నవి. (హోషియ; 14:1-2)

2. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారి తోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనైయుందును వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనోందుదము అని తమ పొరుగు వారికి గాని సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చెసికొనను గనుక అల్పులేమి, ఘనులేమి అందరును నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. (యిర్మియా; 31:33-34)

3. ఆయన వేయి వేలమందికి క్రుపను చూపుచు, దోషమును అపరాధమును క్షమించును .(నిర్గమ;34:7)

4. నేను నేనే నా చిత్తానుసారంగా నీ యతిక్రమములను తుడిచి వేయు చున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చెసుకొనను. (యెషయా; 43:25)

పాపులు మారు మనస్సు నొంది దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపముతో చేసిన పాపాలు ఒప్పుకొని - మా పాపములన్నింటినీ పరిహరింపుమని మోర పెట్టిన యెడల వారి అపరాధములను, దోషములను, పాపములను క్షమించడమే గాక గత పాపములు ఎన్నటికినీ జ్ఞాపకం చేసుకొనని యెహోవా వాగ్దానం చేయుచున్నట్లు మన గ్రహించ గలం. 

యేసు ఏమని బోధించారు? 

1. మీకు ఒకని మీద విరొధమైనను కలిగి యున్న యెడల మీరు నిలబడి ప్రార్ధన చేయు నప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోక మందున్న మీ తండ్రియు (దేవుడు) మీ పాపములు క్షమించును. (మార్కు; 11:25-26)

2. మేము మాకిచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. (లూకా; 11:4)

3. ....యేసు - తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరేగుదురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను 
(లూకా; 23:34)

4. ... మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరును అలాగే నశింతురు. (లూకా;13:5)

5. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ( లూకా; 15:7)

పూర్తీ బైబిలు పరిశీలిస్తే దైవదూషణ, విగ్రహారాధన, వ్యభిచారము, నరహత్య లాంటి ఘోర పాపాల పరిహారానికి మరియు జన్మతః పాప పరిహారానికి బలులు ఇవ్వ మనగా ఇచ్చినట్లు కనీసం ఒక్క వాక్యం కూడా ఎక్కడా కనిపించదు, అయితే పాపులు తమ పాప పరిహారానికి విరిగి, నలిగిన హృదయంతో దీర్ఘ శాంతుడై యెహోవాను ప్రార్ధించిన వెంటనే ఆయన వారి పాపాలను క్షమించి, వేలేవేలుగా కృప జూపిన ఎన్నో సంఘటనలు బైబిలు గ్రంధంలో కానవస్తాయి. 

ఇంకా యేసు తన 'సువార్త' లో సయితము - దేవుడే పాపములను క్షమించే వాడని చెప్పడమే గాక తాను స్వయంగాను తనను హింసిస్తున్న వారిని గూర్చి "వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని" దేవాది దేవుడైన ఆ యెహొవానె ప్రార్ధించెను. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును అని యేసు ప్రకటించడాన్ని బట్టి పాప పరిహారానికి కేవలం పశ్చాత్తాపంతో కూడుకున్న మారుమనస్సు ఒక్కటే చాలునని ఎవరి బలి, ఎవరి రక్తము అవసరం లేదని స్పష్టమగుచున్నది.   పాపానికి పరిహారం పశ్చాత్తాపమే!

యేసు మాత్రమే దేవుని కుమారుడా? (దాసుడా?

ఆదాము దేవుని కుమారుడు ......... (లూకా; 3:38)

నీవు (దావీదు) నాకుమారుడవు నేడు నిన్ను కనియున్నాను. (కీర్తనలు; 2:7)

నేను నీ కుమారుడైన సోలోమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. (1దిన ; 28:6)

ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయేము నా జ్యేష్ట కుమారుడు కాడా? (యిర్మియా; 31:9)

ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ట పుత్రుడు. (నిర్గమ ; 4:22)

కావునా నేను అతనిని నా జ్యేష్ట కుమారునిగా చేయుదును. (కీర్తనలు ; 89:27)

నెనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును. (2వ సాముయేలు; 7:14)

సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులన బడుదురు. (మత్తయి ; 5:9)

మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి.
(మత్తయి; 5:44)

దేవుని ఆత్మా చేత ఎందరు నడిపింప బడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. (రోమా; 8:14)

మానవుడు జన్మతః పాపియా?

ఆ దినములలో తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్ష కాయలు తినునో వాని పళ్ళే పులియును. (యిర్మియా; 31:29,30)

పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. (యేహెజ్కేలు; 18:20)

కుమారుల దోషములను బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింప కూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విచించ కూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నొందును. (ద్వితియొప; 24:16)

ఆయన (యేసు) మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి యైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన (యేసు) శిష్యులు - బోధకుడా! వీడు గ్రుడ్డి వాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను. వీడా? వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు - వీడైనను వీని కన్నా వారైనను పాపము చేయలేదు. అనెను.... (యోహాను; 9:1-3)

తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెను. (2వ దిన వృ; 25:4)

సకల ప్రవక్తలు దేవుని రాజ్యములో ఉండుట: 

అబ్రహాము, ఇస్సాకు, యకోబులను సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు ..... (లూకా; 13:28)


సహోదరులారా! మానవులందరూ జన్మతః పాపులు, యేసు రక్తంలోనే మోక్షము అనేవాదనే నిజమైతే సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఎలా వున్నారు? ప్రవక్త లందరూ యేసు రక్తములొ కడుగబడ లేదు కదా! కాబట్టి ఇవి తప్పుడు భావనలు అని స్పష్టమౌతుంది.

దేవుడు మానవులను యదార్ధవంతులుగా పుట్టించాడు:

దేవుడు నరులను యదార్ధ వంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నరు. (ప్రసంగి ; 7:29)


దేవుడు అంత స్పష్టంగా మానవులందరూ పరిసుద్ధులు అని తెలియ పరుస్తుంటే క్రైస్తవులు మాత్రం మానవుడు జన్మతః పాపి అని కల్పిత సిద్ధాంతాలను నమ్ముతున్నారు. 

మానవుడు జన్మతః పాపి అయితే బైబిలులో నీతిమంతులు, పరిశుద్ధులు ఎందుకు ఉన్నారు?

నీ జనులందరూ నీతిమంతులై యుందురు. (యెషయా ; 60:21)


యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనుచో వాడే పరిశుద్ధుడు (సంఖ్యా; 16:7)

యెహోవా ఈతరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి. (ఆది ; 7:1)

అనేక ప్రవకలును, నీతిమంతులును ....(మత్తయి ; 13:17)

నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపినా, బరకీయ కుమారుడగు జెకర్యా రక్తము వరకు భూమి మీద చిందింప బడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. (మత్తయి ; 23:35)

నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. (మత్తయి ; 27:52)

నీతిమంతుల గోరీలను శ్రుంగారించును - మత్తయి 23:29)

దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి ..... (లూకా; 1:6)

దీని గూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. (లూకా; 1:75)

విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు (అపో;కా;11:24)

యోహాను నీతిమంతుడును, పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి.... . (మార్కు ; 6:20)  

దేవుని దృష్టికి ధర్మ శాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు. (రోమా; 2:13)

ఈ విధంగా నక్షత్రాల వలె లెక్కలేనన్ని వాక్యాలు మానవులు నీతిమంతులును, పరిశుద్ధులును అని నిత్యజీవానికి ధర్మశాస్త్రమును అనుసరించాలని బైబిలు గ్రంధం ప్రకటిస్తుంటే మనం యేసు రక్తములొ మోక్షమని సాతాను పన్నిన పన్నాగంలో పూర్తిగా కూరుకు పోయినాము. 

మానవుడు జన్మతః పాపి అయితే పాపి హృదయంలో దేవుని ఆత్మ ఎందుకు ఉంటుంది?

మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో వుంచి, మీ దేశములో మిమ్మును నివశింపజేసెదను.     (యేహెజ్కేలు; 37:14)


యెహోవా నా స్వాస్థ్య భాగము .......... (కీర్తనలు ; 16:5)

యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను.  (విలాప. వాక్య ; 3:24)

దేవుని ఆత్మ నన్ను సృజించెను...... (యోబు ; 33:4)

.... యెహోవా నీవే నా భాగము ......... (కీర్తనలు ; 119:57)

.......... యెహోవా నరుని నాసికా రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. 
(ఆది కాండము ; 2:7)

నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము (సామెతలు; 20:27)

మానవుడు జన్మతః పాపి అయితే సర్వ మానవులను (పాపులను) దేవుడు ఎందుకు ఆశిర్వదిస్తాడు?

దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించెను. (ఆది కాండము ; 1:28)

మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారిని ఆశీర్వదించెను. (ఆది కాండము ; 9:7)

కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్త్యము, గర్భ ఫలము ఆయన యిచ్చు బహుమానమే -- (కీర్తనలు; 127:3)

ఈ విధంగా దేవుడు తల్లిదండ్రులు కలయిక వల్ల ఏర్పడిన సంతానం నా ఆశీర్వాదము అని స్త్రీ యొక్క గర్భఫలము నేనిచ్చు బహుమానమని దేవుడు స్వయంగా అంటుంటే కాదు, కాదు గర్భఫలము శిక్ష, సంతానమేమో పాపాత్ములు అని క్రైస్తవుల వాదన మరి తల్లిదండ్రుల కలయిక వల్ల ఏర్పడిన సంతానం పాపి అయితే, తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టిన కన్య మరియ కూడా పాపియే కదా? మరి ఆ కన్య గర్భమున పుట్టిన యేసు కూడా పాపియే గదా? (అల్లాహ్ మనల్ని క్షమించు గాక) 


ఈ పై వచనాలను బట్టి క్రైస్తవుల కల్పిత సిద్ధాంతమైన "మానవుడు జన్మతః పాపి" 
అన్నవాదనను బైబిలు గ్రంధము ఖండించి ఎవరి పాపానికి వారే బాధ్యులు అని 
తెలియ పరుస్తుంది. 

















No comments:

Post a Comment