ఇస్లామిక్ ఆర్టికల్స్

సర్వ మానవాళికి సృష్టికర్త సందేశం !


సోదరులారా! సర్వ లోకాల సృష్టికర్త సర్వ మానవాళికి ఋజుమార్గం చూపడానికి ఈ ఖుర్'ఆన్ గ్రంధాన్ని అవతరింపజేశాడు. ఉదాహరణకు ఈ ఖుర్'ఆన్ వాక్యాలను పరిశీలించండి. 

"సర్వ మానవులకు ఇదొక సందేశం, అందరినీ హెచ్చరించాలని, అందరూ యదార్ధంగా దేవుడు ఒక్కడే అని తెలుసుకోవాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది (ఖుర్'ఆన్) పంపబడింది. (ఖుర్'ఆన్ 14:52).

"ఖుర్'ఆన్ మానవులందరికీ మార్గదర్శకం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు దీనిలో ఉన్నాయి ."     (ఖుర్'ఆన్ 2:185)

ఈ ఖుర్'ఆన్ గ్రంధానికి మరొక పేరు ఫుర్ఖాన్ (గీటురాయి). సాధారణంగా మనం గీతురాయిని ఏది మంచి బంగారం ఏది నకిలీ బంగారం అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. అలాగే ఖుర్'ఆన్ గ్రంధం కూడా ఏది సత్యం ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, నిజదేవుడెవరు?, కల్పిత దేవుళ్లెవరు? అనే విషయాలు వేరు చేసి చూపిస్తుంది. అందుకే దీన్ని సృష్టికర ఫుర్ఖాన్ (గీటురాయి) అని పిలిచాడు. 

ప్రియ సోదరులారా! సత్యాన్వేషకులారా! మన విశ్వాసాలు, నమ్మకాలు కాసేపు ప్రక్కన పెట్టి, నిష్కల్మషమైన మనసులతో మన నిజ సృష్టికర్త ఈ గీటురాయి (ఫుర్ఖాన్) ద్వారా తెలియజేసిన సందేశం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం రండి!

సర్వ మానవాళి ఒకే జంట సంతానం ! 

సర్వ మానవాళి, వారు ఏ కులానికి ఏ వర్గానికి, ఏ జాతికి చెందినా వారైనా మానవులందరూ ఒకే జంట సంతానం, పరస్పరం రక్తసంబంధీకులని, సర్వమానవాళి సృష్టికర్త 'ఖుర్'ఆన్' గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు. 'ఖుర్'ఆన్' వాక్యాన్ని పరిశీలించినట్లయితే "ఓ మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్ములను ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు. ఆ ప్రాణి ద్వారా దాని జంటను వేరు చేశాడు. ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను ఈ అవనిపై వ్యాపింపజేశాడు.

ఎవరి పేరు చెప్పుకొని పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ మీ దేవునికి భయపడండి. మీ మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ సంబంధాన్ని త్రేంపడం మానుకోండి! మీ దువుడు పరికిస్తున్నాడని తెలుసుకోండి. ఈ ఖుర్'ఆన్ వాక్యం ద్వారా సమస్త మానవులు ఒకే జంట ద్వారా పుట్టించ బడ్డారు అని, భూమిపై నివశించే మానవులందరూ ఒకే కుటుంబమని సర్వమానవాళికి సృష్టికర్త ప్రకటిస్తున్నాడు.

సత్యాన్వేషి ప్రశ్న: కుల, మత వ్యవస్థకు పునాదులు? 

వాస్తవానికి కులాలు, మతాలు మానవులు సృష్టించుకున్నవే. 

1) కుల వ్యవస్థ ఏర్పడడానికి కారణం ఏమిటంటే, ఒక ఊరిలో ఉన్నవారందరూ ఒకే విధమైన పని చేస్తే ఆ ఊరి అవసరాలు తీరవు కాబట్టి వారు శ్రమ విభజన సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. ఒక్కొక్క కుటుబం వారు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకున్నారు. ఆ విధంగా కుండలు తయారు చేసే వారిని కుమ్మరి అని, బట్టలు ఉతికే వారిని చాకలి అని, చెక్కల పని చేసే వారిని వడ్రంగి అని, బంగారాన్ని మలిచే వారిని కంసాలి అని పిలిచేవారు. ఇలా కొన్ని తరాల తర్వాత ఇవి కులవ్యవస్థలుగా పాతుకుపోయీ, ఎక్కువ జాతి, తక్కువ జాతి అనే అసమానతలకు గురి చేసింది. మానవులంతా ఒకే జంట సంతానమైనప్పుడు మనుషులందరూ వారు నల్లవారైనా, తెల్లవారినా ఒకే కుటుంబమవుతారు. కులాల పేర్లతో వేరు చేసుకోవడం అర్ధం లేని పని. 

2) సృష్టికర్త ప్రతి యుగంలో ప్రవక్తల ద్వారా గ్రంధాలను అవతరింపజేసి ధర్మాన్ని సంస్థాపించాడు. ప్రవక్తలు గతించిన తర్వాత ఆయా అనుచరులు వారి గ్రంధాలను, ధర్మాన్ని మనోవాంఛలకనుగుణంగా మార్చుకున్నారు. సృష్టికర్త ప్రజలను సంస్కరించడానికి మరొక ప్రవక్తను, గ్రంధాన్ని పంపేవాడు. ప్రజలలో కొందరు విశ్వసించి సన్మారగులుగా (ముస్లిం) గా మారేవారు. మిగిలిన వారు మతావలంబీకులు (కాఫిర్) గా స్థిరపడిపోయేవారు. 

వాస్తవానికి ప్రళయదినాన అల్లాహ్ ముందు రెండే వర్గాలుంటాయి

విశ్వాసులు (స్వర్గవాసులు)                       అవిశ్వాసులు (నరకవాసులు)

1. నిజదైవాన్ని ఆరాధించేవారు                     1. కల్పిత దైవాలను ఆరాధించేవారు 

2. ప్రవక్తల్ని అనుసరించేవారు                       2. మనోవాంఛలను అనుసరించేవారు 

3. సన్మార్గులు, మంచి నడవడిక                   3. దుర్మార్గులు, చెడ్డ నడవడిక 
    గలవారు. దైవ భీతి గలవారు,                       గలవారు. దైవభీతి లేనివారు 
    వీరినే దైవ విధేయులు లేక                           వీరిని ముష్రిక్ లు, కాఫిర్ లు 
    ముస్లింలు అని అంటారు.                             అని పిలుస్తారు. 

సత్యాన్వేషకులు తప్పనిసరిగా పరిశీలించాల్సిన విషయాలు 

ప్రతి సత్యశోధకుడు తప్పనిసరిగా ఈ క్రింది విషయాలను పరిశీలించాలి. ఈ విషయాలను పరిశీలించక పొతే మన శోధన అసంపూర్తిగా ముగుసినట్లే. ఎందుకంటే, ఈ విషయాల పట్ల ముస్లిమేతరులే కాకుండా అనేక ముస్లిం సోదరులు కూడా ఇంకా అపోహలకు, అపార్ధాలకు లోనయి ఉన్నారు. 

  1. అల్లాహ్ ముస్లింల దేవుడా
  2. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం ముస్లింలకే ప్రవక్తనా?
  3. ఇస్లాం కొత్త ధర్మమా? 
  4. ముస్లిం అంటే ఎవరు?
అల్లాహ్ ముస్లింలకు మాత్రమే దేవుడని ఖుర్'ఆన్ గ్రంధంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు

ఉదాహరణకు: ఖుర్'ఆన్ గ్రంధంలో "రబ్బిల్ ఆలమీన్" (1:1) రాబ్బిన్నాస్ "సమస్త మానవులకు ప్రభువు" (114:1) ఇలాహిన్నాస్ "సమస్త మానవులకు ఆరాధ్యుడు" (114:3) అని వ్రాయబడి ఉంది. కాని రబ్బిల్ ముస్లిమీన్ "ముస్లింల ప్రభువు" అని ఎక్కడా లేదు. కావున ఖుర్'ఆన్ ప్రకారం "అల్లాహ్" ముస్లింలకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి దేవుడని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 

హైందవ మత గ్రంధాలలో అగోచరుడుగా, అవ్యక్తుడుగా, అచిన్త్యుడుగా పరిచయమైనా దేవుడు. బైబిల్ గ్రంధంలో యహోవాగా పరిచయమైన దేవుణ్ణే  "అల్లాహ్"అని పిలుస్తారు. అల్లాహ్ అనిల్ పేరు నిజ దేవుడికి మాత్రమే ఉపయోగిస్తారు. కాని ఈ ప్రపంచంలో కనిపించే శృష్టిరాసులకు ఎంత మాత్రమూ ఉపయోగించరు.

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం ముస్లింలకు ప్రవక్తనా? 

ఈ రోజు సమాజంలో ముస్లిమేతర సోదరులలోనే కాకుండా ధార్మిక జ్ఞానంలేని ముస్లిం సోదరులలో కూడా ఈ అపోహ వుంది. వాస్తవానికి ఖుర్'ఆన్ గ్రంధంలో ఎక్కడ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లింలకు మాత్రమే ప్రవక్త అని చెప్పబడి లేదు. ఖుర్'ఆన్ గ్రంధంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కి ప్రవక్తగా పంపించబడ్డారు అని బోధించబడింది. ఉదాహరణకు ఖుర్'ఆన్ వాక్యాలను గమనించండి: 

"ఓ ప్రవక్తా! మేము ముంములను సర్వ మానవాళికి సందేశహరునిగా శుభవార్త ఇచ్చేవానిగా హెచ్చరించే వానిగా నియమించి పంపాము.  (ఖుర్'ఆన్ 34:28)

మానవులందరి సందేశహరునిగా పంపించాము :

"గత ప్రవక్తలు ఒక ప్రత్యెక జాతికో, ప్రత్యెక కాలానికో పంపబడ్డారు, కాని ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయం వరకు సర్వ మానవాళికి ప్రవక్తగా పంపబడ్డారు.  (ఖుర్'ఆన్ 4:79)

అందుకే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి యొక్క ప్రస్తావన హిందూ మరియు క్రైస్తవ మత గ్రంధాలలోనే కాకుండా జైన,బౌద్ధ మతగ్రందాలలో కూడా ముందుగానే ప్రస్తావించబడింది

మానవులకు చావు పుట్టుకలు ఎందుకు ఇవ్వబాడ్డాయి:

"మీలో సత్కర్మలు చేసే వారెవరో? దుష్కర్మలు చేసేవరెవరో పరీక్షించి చూడాలని మీకు జీవన్మరణాలు ప్రసాదించాడు"   (ఖుర్'ఆన్ 67:3)

"పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. నేను మిమ్మల్ని పరీక్షించడానికే సృష్టించాను. మీరంతా నావైపే మరల వలసి వుంది"  (ఖుర్'ఆన్ 21:35) 

"మీలో ఇసుమంత తప్పు చేసినా దాని ప్రతిఫలం పొందుతారు. ఇసుమంత మంచి చేసినా దాని ప్రతిఫలం పొందుతారు"  (ఖుర్'ఆన్ 99:7)

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వారు ఇహలోకం వాస్తవికత గురించి తన శిష్యులతో ఈ విధంగా బోధిస్తారు. మీరు సముద్రంలో మీ చిటికిన వ్రేలు ముంచినప్పుడు ఎన్ని నీళ్ళు అంటుకుంటాయో ఎయిడ్ ఇహ లోక జీవితం అయితే ఆ సముద్రం పరలోకంతో సమానమని బోధిస్తూ మీ సృష్టికర్త శాశ్వతమైన పరలోక (స్వర్గాన్ని) బహుమతిగా ఇవ్వడానికి తాత్కాలికమైన ఇహలోక జీవితాన్ని పరీక్షగా చేశాడు అని బోధించడం జరిగింది. 

మరణానంతర జీవితం వాస్తవికత ! 

సత్యాన్ని అన్వేషించే వారికి చిక్కు ప్రశ్న ఏమిటంటే మనిషి మరణించి మట్టిలో కలిసిపోయిన తర్వాత మరొక జీవితం ఉందా? ఇహలోకంలో చేసుకున్న కర్మలకు పరలోకంలో శిక్షలు ఉంటాయా?

సోదరులారా! ఒక్కసారి ఈ విషయాలపై పరిశీలన చేద్దాం రండి! 

1) ప్రకృతి ధర్మం (Nature Law) ఏమిటంటే ఏ విత్తు నాటితే అదే మొక్క మొలవాలి. మంచి మొక్క నాటితే మంచి పంట పండాలి. చెడ్డ మొక్క నాటితే చెడు పంట పండాలి. కాని ప్రపంచంలో అలా జరగటం లేదు. ఉదాహరణకు ఈ ప్రపంచంలో అనేక నేరాలు చేసేవారు హాయిగా జీవితం గడుపుతున్నారు. అమాయకులు, మంచివారు అనేక కష్టాలు కడగండ్లతో జీవితాన్ని గడుపుతున్నారు. ప్రకృతి ధర్మం ప్రకారం మంచి వారికి మంచి జరగాలి, చెడ్డవారికి చెడు జరగాలి. కాని, అలా జరగడంలేదు. అంటే అది ఇహలోకంలో జరగటంలేదు. కాబట్టి పరలోకంలో తప్పకుండా జరుగుతుంది అని విశ్వసించవచ్చు.

2)  ఈ ప్రపంచంలో సరైన న్యాయం జరగడం లేదు అనేది వాస్తవం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని హత్య చేసిన వాడికి ఒక ఉరి శిక్ష, లేదా ఒక జీవిత ఖైదు వేస్తె వంద మందిని చంపినవాడికి వంద ఉరిశిక్షలు లేదా వంద జీవిత ఖైడులు విధించాలి. కాని ఇది ఈ ప్రపంచంలో సాధ్యం కాదు. దీని కోసం ఖచ్చితంగా పరలోకం ఉండితీరాలి.

3) ఈ ప్రపంచంలో అనేక మంది అమాయకులు హత్య చేయబడుతున్నారు. అనేక మంది అత్యాచారాలకు గురౌతున్నారు. వీరికి సరైన న్యాయం జరగకుండానే, చెడ్డ వారికి శిక్ష పడకుండానే ఇహలోకం గడిచి పోతుంది. పరలోకం లేక పొతే మంచి, చెడు లకు ధర్మ, అధర్మాలకు అర్ధం ఉండదు.

మరణానంతర జీవితం గురించి ధార్మిక గ్రంధాలు ఏమి చెబుతున్నాయి?
    
"ఈ ప్రజలు ఇలా అంటారు. మేము మట్టిలో కలిసిపోయి నశించిపోయిన తర్వాత మళ్ళీ మేము సమాధులలో నుండి బ్రతికించి లేపబడతామా? అసలు విషయం ఏమిటంటే వారు తమ నిజదేవుణ్ణి కలుసుకోవడాన్ని తిరస్కరిస్తున్నారు. వారితో ఇలా అను 'మీపై నియమింపబడిన మృత్యు దూత మిమ్మల్ని పూర్తిగా కైవసం చేసుకుంటాడు'. తర్వాత మీరు మీ ప్రభువు వైపు మరలించబడతారు."  (ఖుర్'ఆన్ 32:10-11)

"ప్రళయం నాడు ఆయన మీ అందరినీ తప్పకుండా సమావేశ పరుస్తాడు. ఇది అనుమానానికి ఏ మాత్రం ఆస్కారంలేని యదార్ధం." (ఖుర్'ఆన్ 6:12) 

హైందవ గ్రంధం :

"ఓ అర్జునా! సమస్త ప్రాణికోట్లు ప్రళయదినమున నా ప్రకృతిని జేరి అందు అణిగియుండును. తిరిగి సృష్టికాలమున దానిని నేను మరల సృజించుచున్నాను." (గీత 9:7)

బైబిల్ గ్రంధం : 

"దీనికి ఆశ్చర్య పడకుడి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుద్దానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్దానమునకు బయటికి వచ్చుదురు.  (బైబిల్ యోహాను 5:28-29)

"అవిశ్వాసులు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పొవును." (బైబిల్ మత్తయి 25:46)


ఖుర్'ఆన్ వెలుగులో సత్య సందేశం!

దైవాలు ఎందరు?

మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. (ఖుర్'ఆన్ 2:163)

తానూ తప్ప మరొక దేవుడు లేడనే సత్యానికి స్వయంగా అల్లాహ్ యే సాక్ష్యమిచ్చాడు. దైవ దూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడు, ఆ మహాజ్ఞాని తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగానూ, న్యాయంగానూ సాక్ష్యమిస్తారు.  (ఖుర్'ఆన్ 3:18)

"వాస్తవమేమిటంటే, దేవుడు ఒక్కడే, మరొక దేవుడు లేడు".  (ఖుర్'ఆన్ 5:73)

"ఆకాశంలోనూ, భూమిలోనూ దేవుడు ఆయన ఒక్కడే".   (ఖుర్'ఆన్ 43:84)

మీ నిజ దైవం ఎవరు? 

"ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త
(ఖుర్'ఆన్ 6:102)

అల్లాహ్ - ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు.   (ఖుర్'ఆన్ 2:255)

"ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనకు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి".(ఖుర్'ఆన్ 20:8)

"అల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు. తరువాత మీకు ఉపాధిని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మీకు మరణం కలిగిస్తాడు. తరువాత ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు." (ఖుర్'ఆన్ 30:40)

"మూసా! నేనే ప్రభువును .... నేనే అల్లాహ్ ను, నేను తప్ప మరొక దేవుడు లేడు. కనుక నీవు నాకు దాస్యం చెయ్యి. నా జ్ఞాపకం కోసం నమాజ్ ను స్థాపించు" (ఖుర్ ఆన్ 20:1)

"మానవులారా! మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది." (ఖుర్'ఆన్ 2:21)

దేవునికి భాగాస్వాములున్నారా?

"ఒకవేళ భూమ్యాకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల) రెండింటింటి వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఉండేది." (ఖుర్'ఆన్ 21:22)

"అల్లాహ్ ఎవరినీ తన సంతానంగా చేసుకోలేదు మరియు మరొక దేవుడెవ్వరూ ఆయనతో పాటులేడు. ఒకవేళ అలా అయితే, ప్రతీ దేవుడు తన సృష్టిని తీసుకొని వేరుపడిపోయేవాడు. తరువాత వారు ఒకరిపై ఒకరు దండ యాత్రలు చేసి ఉండేవారు." (ఖుర్'ఆన్ 23:91) 

"అల్లాహ్ తో పాటు ఇతర దేవుణ్ణీ వేడుకోకు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడేవ్వడూ లేడు. ఒక్క అల్లాహ్ తప్ప ప్రతీది నశించేదే"..... (ఖుర్'ఆన్ 28:88)

అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు ఎందుకు ఆరాధ్యులు కారు?

"అల్లాహ్ ను వదిలి, ప్రజలు వేడుకుంటున్న ఇతర శక్తులు ఏ వస్తువుకూ సృష్టికర్తలు కారు. వారు స్వయంగా సృష్టింపబడినవారు. ... " (ఖుర్'ఆన్ 27:65) 

"అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదకు తొలగించే వారు ఎవ్వరూ లేరు. ఇంకా ఆయన గనుక నీవిషయంలో ఏదైనా మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు." (ఖుర్'ఆన్ 10:107)

"మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది; దానిని శ్రద్ధగా వినండి: అల్లాహ్ ను కాదని మీరు ఏ దేవుళ్ళను వేడుకుంటున్నారో, వారందరూ కలసి సమైక్యంగా ఒక్క ఈగను సృష్టించదలచినా, అలా చేయలేరు. అంతేకాదు, ఒకవేళ ఈగ వారినుండి ఏదైనా వస్తువు లాక్కు పోయినా వారు దానిని విడిపించుకు రానూ లేరు"
(ఖుర్'ఆన్ 22:73)

బహుదైవాలుగా ఆరాధించే వారి ప్రతిఫలం?

"అల్లాహ్ క్షమించనిది కేవలం (షిర్క్) బహుదైవారాధన మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తానూ ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్న మాట, ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడు అన్నమాట."(ఖుర్'ఆన్ 4:48,116)

"..... ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడెవ్వడూ లేడు."(ఖుర్'ఆన్ 5:72)

"నీ ప్రభువు ఇలా అంటున్నాడు. "నన్ను ప్రార్ధించండి, నేను మీ ప్రార్ధనలను అంగీకరిస్తాను. గర్వానికి లోనై నా ఆరాధనకు విముఖులయ్యే వారు తప్పని సరిగా అవమానానికి, పరాభావానికీ గురి అయి నరకంలో ప్రవేశిస్తారు." (ఖుర్'ఆన్ 40:60)

"ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయినట్లే. అతనిని, ఇక పక్షులైనా తన్నుకు పోతాయి లేదా గాలి అతనిని ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికి అయినా విసరివేస్తుంది."
(ఖుర్'ఆన్ 22:31)

"అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్యుడు గా చేసుకోకు. అలాచేస్తే నిందలపాలవుతావు. ప్రతీ మేలుకూ దూరమవుతావు. నకకంలో పడవెయ్య బడతావు." (ఖుర్'ఆన్ 17:39)

అల్లాహ్ గుణగనాలు!

"...... ఆయనే అల్లాహ్, అద్వితీయుడు, అల్లాహ్ నిరాపెక్షాపరుడు, ఎవరి ఆధారమూ, ఎవరి అక్కరా లేనివాడు; అందరూ ఆయన పై ఆధారపడే వారే, ఆయనకు సంతానం ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానం కాదు. ఆయనకు సరిసమానం ఎవరూ లేరు." (ఖుర్'ఆన్ 112:1-4) 

"ఆయనే అల్లాహ్; ఆయన తప్ప ఆరాధ్యుడేవ్వడూ లేడు. దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు. ఆయనే కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప అరాధ్య్డుడేవ్వడూ లేడు. ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు. సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తరువులను తిరుగులేని విధంగా అమలు పరచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడు గానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు అల్లాహ్. సృష్టివ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరచే వాడు. ఆపై దానిప్రకారం రూపకల్పన చేసేవాడు. ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతీ వస్తువూ ఆయనను స్మరిస్తుంది. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడూను." (ఖుర్'ఆన్ 59:22-24)

ప్రవక్తలుగా మానవులనే ఎందుకు ఎన్నుకున్నాడు?

"భూమిలో దైవదూతలు నిశ్చింతగా తిరుగుతూ ఉండివుంటే, మేము తప్పకుండ ఆకాశం నుండి దైవదూతలే వారికోసం ప్రవక్తలుగా పంపి ఉండేవారము." (ఖుర్'ఆన్ 17:95)

"ఓ ప్రవక్తా! నీకు పూర్వం కూడా మేము మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారికి మేము వహీని (దైవ వాణి)  అందజేశాము." (ఖుర్'ఆన్ 21:7)

సమస్త ప్రవక్తల సందేశం?

"మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా - "నేను తప్ప దేవుడు లేడు, కనుక మీరు నాకే దాస్యం చెయ్యండి" అనే విషయాన్ని తెలియజేశాము." (ఖుర్'ఆన్ 21:25)

"ప్రవక్తా! మేము నిన్ను సర్వ మానవులకు సుభవార్తను ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా నియమించి పంపాము" (ఖుర్'ఆన్ 34:28)

"ముహమ్మద్! మేము నిన్ను మానవ జాతికి సందేశ హరునిగా చేసి పంపాము ." (ఖుర్'ఆన్ 4:79)

"ముహమ్మద్! ఇలా ప్రకటించు: "మానవులారా! నును మీ అందరివైపునకు వచ్చిన అల్లాహ్ సందేశహరుణ్ణి." (ఖుర్'ఆన్ 7:158)

"ప్రవక్తా! ఇలా చెప్పు. నేను కేవలం ఒక మానవుణ్ణి. మీలాంటివాణ్ని. నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. మీ దైవం కేవలం ఒకే దైవం. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు ఎవరినీ చేర్చకూడదు." (ఖుర్'ఆన్ 18:110)

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నే ఎందుకు అనుసరించాలి?

"మానవులారా! ముహమ్మద్ (స) మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త. దైవ ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు." (ఖుర్'ఆన్ 33:40)

"ప్రవక్తకు విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాహ్ కు విధేయత చూపినట్లే." (ఖుర్'ఆన్ 4:80)

"అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకూ విధేయత చూపేవాణ్ణి అల్లాహ్, క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆ వనాలలో అతడు కలకాలం ఉంటాడు. అసలు ఇదే గొప్ప సాఫల్యం. అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతూ అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించే వాణ్ని అల్లాహ్ అగ్నిలో పడవేస్తాడు. అందులో అతడు సదా ఉంటాడు. అతనికి మిక్కిలి అవమానకరమైన శిక్ష పడుతుంది." (ఖుర్'ఆన్ 4 : 13,14)

"అల్లాహ్ ను ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారు, అల్లాహ్ ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపే వారు, "మేము కొందరిని విస్వసిస్తాము, మరికొందరిని విశ్వసించం" అని అనేవారూ, అవిశ్వాస విశ్వాసాలకు మధ్య ఒక (కొత్త) మార్గాన్ని కానీ పెట్టాలనే ఉద్దేశ్యం కలవారు - వారు అందరూ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము. దీనికి భిన్నంగా అల్లాహ్ ను, ఆయన ప్రవాక్తలందర్నీ విశ్వసించి, వారిమధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. అల్లాహ్ అధికంగా మన్నించేవాడూ, అనన్యంగా కరుణించేవాడూను." (ఖుర్'ఆన్ 4: 150-152)

"మానవులారా! ఈ ప్రవక్త మీవద్దకు మీ ప్రభువు తరపునుండి సత్యం తీసుకువచ్చాడు. అతన్ని విశ్వసించండి. మీకే మంచిది. కాని మీరు గనక తిరస్కరిస్తే, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే అనే విషయం తెలుసుకోండి. అల్లాహ్ అన్ని తెలిసినవాడూ, అత్యంత వివేకీనూ." (ఖుర్'ఆన్ 4:170)

"ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు. "మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడూను." (ఖుర్ 'ఆన్ 3 : 31,32)

దైవ సందేశాన్ని తిరస్కరించే వారి పర్యవసానం?

"అవిశ్వాసానికి పాల్పడినవారికి నరకాగ్ని ఉన్నది వారు చనిపోవాలనే తీర్పూ ఇవ్వబడదూ, వారి నరకయాతనను తగ్గించడమూ జరగదు." (ఖుర్'ఆన్ 35:36)

కాబట్టి సోదరులారా! మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించి, చిట్టచివరి దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిపై అవతరించిన ఖుర్'ఆన్ గ్రంధాన్ని అనుసరించడంలోనే మన ఇహ-పర లోకాల సాఫల్యమున్నది.

"ప్రవక్తా! "దేవుడు ఒక్కడు" అన్న సందేశాన్ని వారు తిరస్కరిస్తే ఇలా అను : "మేము దైవ విదేయులము, ఒకే దైవ దాస్యం చేసేవారము (ముస్లిములము) అన్నదానికి మీరు సాక్ష్యులుగా ఉండండి." (ఖుర్'ఆన్ 3 : 64)


ఇస్లాం గురించి
ప్రపంచ జనాభాలో  ముస్లింలు ఐదవ వంతు ఉన్నారు. అంతేకాక వారు ఇస్లాంను ఒక ప్రధాన ధర్మం. దేవుడు ఒక్కడే అని నమ్మడం, ఆయననే ఆరాధించడం అనేది ఇస్లాం జీవన సరళిలో ముఖ్యాంసం . అరబీ భాషలో 'ఇస్లాం' అనే పదానికి అర్థం ఒకే దేవుడి (అల్లాహ్)కి ‘విధేయత’ చూపడం . ఇస్లాం ద్వారానే ఇహలోకంలోనూ, మరణానంతరం పరలోకంలోనూ సాఫల్యం సాధించొచ్చు. ఎందుకంటే దేవుడు అమోదించిన ఒకే ఒక ధర్మం ఇస్లాం కనుక. ఇతర మతాల మాదిరి ఒక వ్యక్తి తెగ పేరిట వెలసిన ధర్మం కాదు ఇస్లాం. ఎవరైనా సరే స్వచ్ఛ౦ద౦గా అల్లాహ్ శరణుకోరితే అతడు ముస్లింగా పిలువబడతాడు. ఆ వ్యక్తి  ఏ జాతి, ఏ తెగకు చెందినవాడైనాసరే.
'ఇస్లాం ఒక స౦పూర్ణ జీవన విధానం' అనే అంశానికి సంబంధించిన సారా౦శాన్ని తెలియజేస్తున్నాము . సోదరభావం, సోదరీ భావం అన్ని జాతులకు, దేశాలకు వర్తిస్తు౦ది. ఇస్లాం సందేశ విశ్వజనీనత సర్వ కాలాల్లో, అన్ని దేశాల్లో పర్తిస్తుంది. అలా౦టి ఇస్లా౦ ధర్మానికి చెందిన ఆరు ప్రధాన అంశాలు, ఐదు ఆరాధన పద్ధాతులను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది 
విశ్వాసానికి సంబంధించిన 6 అంశాలు

ఒకే నిజ దైవానికి సంబంధించిన వ్యక్తిగత పేరు 'అల్లాహ్'    
అల్లాహ్ యందు నమ్మకం
ఒకే దేవుడి ప్రత్యేక అరబీ పేరు ' అల్లాహ్ ' ఆయనే ఆరాధనీయుడు, ఆయనకు భాగస్వాములు, ప్రత్యర్థులు, 
సమానులు అంటూ ఎవరూ లేరు. అల్లాహ్ తాను సృష్టించిన వాటిలా కాదు. ఆయన దైవత్వాన్ని దేనికి ఆపాదించలేము. అ౦టే – సృష్టికర్త, పోషకుడు, కరుణామయుడు, సర్వశక్తిమంతుడు, న్యాయమూర్తి. సమస్తమూ తెలిసినవాడు.
తన అధికారమూ, కార్యములరీత్యా అల్లాహ్ కు భాగస్వాములు లేరు. అల్లాహ్ ఆదేశం మేరకే జగత్తు సృష్టించబడింది. ఆయనే ఈ జగత్తులన్నింటినీ నడిపిస్తున్నదీ, నియంత్రిస్తున్నది. ఎంతో సమతుల్యమైస, 
సంక్లిష్టమైన ఈ సృష్టిని సృష్టిచడమన్నది ఆ సర్వక్తిమంతుడికీ తప్ప  మరొకరికి సాధ్యం  కాదు కనుక ఈ విశ్వం తనంతట తాను సృజించబడటమన్నది అహేతుకం. క్రమానుగత లేక యాదృచ్ఛిక సంఘటనల పల్ల ఈ సృష్టి సృజించబడిందన్నది కూడా నమ్మలేము.                             9296705388 సైఫుల్లాహ్ 
దైవదూతల య౦దు నమ్మకం
జ్యోతి ను౦చి దైవదూతలను అల్లాహ్ సృజించాడు. వారెన్నడూ ఆయన ఆదేశాలను ఉల్లంఘించలేదు. కొందరు 
దైపదూతల వివరాలు వెల్లడించబడ్డాయి, ప్రవక్తలకు దైవ సందేశాన్ని చేరవేసే దైవదూత జిబ్రాయీల్ అనీ, జనుల ప్రాణాలు తీసుకునేది మృత్యు దైవదూత అని తెలుపబడింది.
దైవ గ్ర౦థాలయ౦దు నమ్మకం
మానవాళికి మార్గదర్శకత్వం, కరుణ చూపేందుకుగాను అల్లాహ్  దైవగ్రంథాలను తన సందేశహరులపై అవతరింపజేశాడు. వాటిలో తౌరాతు (పాత నిబంధన) గ్రంథం, మూసా(అ). కీస్తు (అ)లకు ప్రకటితమైన ఇంజీలు సువార్త ప్రవక్త ముహమ్మద్(స.అ.సం) అవతరించిన దివ్యఖుర్ఆన్ ఉన్నాయి. అయితే వీటిలో దివ్యఖుర్ఆన్ తప్ప మిగిలిన గ్రంథాలు  యథాతథ మూల రూప౦లో లేపు. అవి చెరుపబడ్డాయో, మార్చబడ్డయో, పోగొట్టబడ్డయో జరిగాయి.
దైచాజ్ఞ అక్షర రూపమే దివ్యఖుర్ఆన్. అదే మానవాళికంతటీకీ చివరి దైవప్రకటన. అ౦దులో ప్రవక్త ముహమ్మద్ 
(స,అ.సం) సాధికారంగా చెప్పినవి. చేసినవి ఉన్నాయి. ఇస్లామీయ జ్ఞానానికి అదే ప్రాథమిక అధారం (వనరు).
ప్రవక్తలయందు నమ్మకం
అల్లాహ్ లక్షలాది ప్రవక్తలసు పంపించాడని ముస్లింలు విశ్వసిస్తారు. దైవ సందేశం తెలుపడానికి ప్రతీ జాతికి కనీసం ఒక ప్రవక్తనైనా పంపించాడని నమ్ముతారు. ఈ ప్రవక్తలలో (అ), నూహ్(అ), ఇబ్రాహీం(అ), దావూద్ (అ),యూసుఫ్(అ), మూసా(అ), ఈసా (అ) ముహమ్మద్(స.అ.సం) ఉన్నారు, ఒకే దేవుని ఆరాధించమని పిలవడానికి, దేవునికి విధేయులై ఎలా ఉండాలో క్రియాత్మకంగా చూపేందుకు, సాఫల్యమార్గం ప్రజలకు చూపేందుకు వారొచ్చారు. అదే మహత్కార్యానికి వారొచ్చారు మానవులుగా జన్మించిన వారిని ఆరాధి౦చడ౦, వారిని దేవుడికి  మధ్యవర్తిత్వంగా ఉపయోగించడం నిషిద్ధం. ఏ రీతిలోనైనా ప్రవక్తలను ఆరాధించడం వారి ద్వారా దేవుణ్ణి  ఆరాధించడ౦ పూర్తిగా నిషిద్ధం. పైగా అది దేపుడొక్కడే అనేదాన్ని ఉల్లంఘి౦చడమే అవుతుంది.
ప్రవక్త క్రీస్తు(అ)

దేవుని దైవత్వమందు ప్రవక్తలకు ఏమాత్రమూ భాగం లేదు

క్రీస్తు(అ) దేవుని ప్రవక్త అని ముస్లింలు విశ్వసిస్తారు. ఆయన కన్య మర్యముకు  జన్మించడమే ఓ అద్భుతం. దేవుని అనుజ్ఞతో ఆయన అనేక అద్భుతాలు చేశారు. అనారోగ్యులను స్వస్థపరిచారు, గుడ్డివానికి చూపును ప్రసాదించారు. తన తల్లిఫై పచ్చిన నిందను ఖ౦డి౦చే౦దుకుగాను అప్పుడే పుట్టిన శిశువుగా మాట్లాడారు. క్రీస్తు(అ)ను ముస్లింలు మన్నించి, గౌరవించినప్పటికీ ఆయనను ఆరాధించరు. ఆయనను దేవుని కుమారునిగా, ముగ్గురు దేవుళ్ళ భావన (ట్రినిటీ) ఒకరిగా అంగీకరించరు. ఆయనకు దైవత్వ గుణాలను ఆపాదించడాన్నీ అంగీకరించరు. దేవుడిలా అన్నాడు:"ఎవరినైనా తను కుమారుడుగా చేసుకోవడం అనేది అల్లాహ్ కు తగిన పద్ధతి కాదు. ఆయన పరమ 
పవిత్రు డు. ఏ విషయాన్ని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే, ' అయిపో ' అని ఆజ్ఞాపిస్తాడు.   అంతే అది అయిపోతుంది. " (దివ్యఖుర్ఆన్ – 19: 35)
ప్రవక్త ముహమ్మద్
మానవాళికి అ౦ది౦చబడిన చివరి ప్రవక్త ముహమ్మద్(స.అ.సం). దైవాదేశాలను ఎలా పాటిచాలన్నది ప్రయోగాత్మకంగా చూపేందుకు ఆయన 'దివ్యఖుర్ఆన్ ' అనే దైవగ్రంథంతో వచ్చారు. నిజాయితీకి, న్యయానికి, కరుణకు, ప్రేమానురాగాలకు, సత్యానికి, దైర్యానికి ఆయన ఆదర్శం. కీస్తు(అ)ను ఆరాధించని విధంగానే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)ని అరాధించరు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఇలా అన్నారు:మర్యం  కుమారుడు కీస్తు(అ)ను క్రెస్తపులు స్తుతి౦చినంతగా నన్ను స్తుతించడంలో పరిమితులు దాటకండి. నేను కేవలం దైవదాసుణ్ణి మాత్రమే కనుక నన్ను దైవదాసుని గా, ఆయన సందేశహరుడిగా మాత్రమే కీర్తించండి". 
తీర్పు దినమందు విశ్వాసం  
తీర్పు దినం అనే రోజున ప్రతి ఒక్కరూ సృష్టికర్త, ముందు నిలబడతారు. ఇహలోకంలో చేసిన వారి మంచి, చెడు కార్యములు ప్రశ్నించబడతాయి. వారి కర్మలు స్పష్టంగా చూపబడతాయి. వారి శరీరాకారాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విచారణకు గురపుతారు ఈ మహాదినాన న్యాయం  చేసే అల్లహ్ అన్నింటినీ న్యాయంగా విచారిస్తాడు. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగదు ప్రతి ఒక్కరి హక్కులు తిరిగి ఇవ్వబడతాయి. ప్రతి ఒక్కరికీ న్యాయం దక్కుతుంది. అది స్వర్గం లభించడమనే వరమే కావచ్చు లేక నరకాగ్ని అనే శిక్ష కావచ్చు.
దేవుని విధి యందు నమ్మకం
తీర్పు దినంలేకుంటే జీవితం అనుచితంగా గడుస్తుంది. ఎవరికీ ఈ ప్రపంచంలో న్యాయం లభించదు.
గతించిన, జరుగుతున్న, జరుగబోయె అన్నింటి గురించి అల్లాహ్ కు  తెలుసు. మంచి చెడులను ఎ౦చుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరిగింది, అలాగే వారి మంచి, చెడులు 
లెక్కించబడతాయి. అయితే లెక్కల ఘడియలో మాత్రం వారికీ స్వేచ్ఛ ఉ౦దదు. వారి వివేచనా శక్తి పోతంది. వాస్తవికతతో, స్వేచ్ఛకు విభేద౦ ఏర్పడదు. దేవునికి  తెలిసి, ఆయన అనుమతితోనే వాన్తవిక సంఘటనలు
తీర్పుదినాన పున:దర్శనమిస్తాయి. దేవుని శక్తి అన్ని౦టినీ ఆపేస్తుంది లేక జనుల స్వేచ్ఛను నిరోధిస్తుందని అర్థం కాదు జనుల నిర్ణాయక శక్తి నశించిపోతుంది అంటే దేవుడు బలవంతపెడతాడని కాదు. తాననుకున్నట్టే  జరగడం కూడా దేవునికి ఆన౦దకర౦ కాదు.
ఆరాధనకు సంబంధించిన
5 మూలస్తంభాలు ముస్లిం జీవితానికి పునాది
అల్లాహ్ కు అన్నింటి మీద అధికారం కలదు, ఆయన అనుమతి లేకుండా, ఆయనకు తెలియకుండా ఏది జరుగదు.
విశ్వాస ప్రకటన 
అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు. ప్రవక్త ముహమ్మద్(స.అ.సం) ఆయన సందేశహరుడు' అన్నవిశ్వాస ప్రకటన జరగాలి.  హృదయంలో దృఢ నిశ్చయ౦తో, విధేయపూర్వకంగా ఈ మాటలు పలకాలి. తదనంతరం దానిని ఆచరణలో పెట్టాలి. ఈ విశ్వాస ప్రకటనతో మిథ్యా దేపుళ్ళను తిరస్కరించడం  అల్లాహ్ఒక్కడే అరాధనీయుడని, ముహమ్మద్(స.అ.సం) ఆయన సందేశహరుడని చెప్పడం  ద్వారా ముస్లింగా మారడం జరుగుతుంది.
రోజుకు ఐదు నమాజులు
ఇస్లాం ఆరాధన మూలస్తంభాలలో రెండవది రోజుకు 5పూట్ల నమాజు చేయడం నమాజ. అన్నది సృష్టికర్తకు, మనిషికీ మధ్య వ్యక్తిగత, అధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. పైగా ఇది దేవుడికి ఎల్లప్పుడూ విధేయుడిగా ఉన్నానన్న గుర్తు చేస్తుంది. ఈ ఐదు నమాజులు, వేకువ మధ్యాహ్నం, నడీ మధ్యాహ్నం, సంధ్య, రాత్రి వేళల్లోఉంటాయి.నమాజుకు కొన్ని నిమిషాలు పడుతుంది. వాటిలో ఖుర్ఆన్ పఠించడం, దుఆలు, అల్లాహ్ ను స్తుతించడం వివిధ శరీర భంగిమలు ఉంటాయి. సమాజుకు ము౦దు ముస్లింలు తమ శరీరాలగాలు కొన్నింటిని కడుక్కుటారు. తద్వారా ఆధ్యాత్మిక. శారీరక పరిశుద్ధత కలిగేలా చూసుకుంటారు.
వార్షిక దాతృత్వం
వార్షిక దాతృత్వం అనేది గ్నప్రతి ముస్లిం విధి. (అనగా ఒక స్థాయి సంపద ఉన్నవారికి). పేదలకు, అగత్యపరులకు, అర్హులకు, ప్రయాణికులకు వార్షిక సంపదలో కేవలం 2.5 శాతం దానమివ్వడం విధి. ఇది (జకాత్) సందను పవిత్రం  చేస్తుంది. అది ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఆ ప్రయోజనాలలో ఒకటి. ధనవంతులు, పేదల నడుమ అ౦తరాన్ని తగ్గిస్తుంది. పైగా అందరి ఫ్రాథమిక అవసరాలు తీరేలా చూస్తుంది.
ఉపవాస దీక్ష పాటించడం  
ప్రతి సంవత్సరం రమజాన్ నెలలో ముస్లింలు సూర్యోదయం ను౦చి సూర్యాస్తమయం  వరకు ఉపవాసం పాటిప్తారు. ఆహార పానీయాలు తీసుకోరు. లై౦గిక స౦బంధాలకు దూరంగా ఉంటారు. ఉపవాసం అన్నది ఆధ్యత్మిక  పవిత్రతను పెంచుతుంది. సహనం అత్మ నియంత్రణను పెంచడమేకాక అనేక ఆరోగ్యప్రయోజనాలు కలిగిస్తు౦ది. శారీరకంగా, మానపీకంగా సమర్థులైన ప్రతి ముస్లింకు ఉపవాసం విధిగా చేయబడింది. రోగగ్రస్తులు, మానసికంగా స్వస్థతలేనివారు, వయోవృద్ధులు, రుతుస్రావంలో ఉన్న మహిళలు, ప్రయాళణికులకు ఉపవాస దీక్ష ను౦చి
మినహాయింపు ఇవ్వబడింది. గర్భస్త మహిళలు, శిశువులకు పాలుపట్టే మహిళలకూ మినహాయింపు ఇవాఅబడింది, ఎందుకంటే వారికి, లేక బిడ్డకు అది హానికరం కావొచ్చన్న ఉద్దేశంతో ఈ మినహాయింపు ఇవ్వబడి౦ది.
పవిత్ర యాత్ర
ఒకవేళ శారీరకంగా, ఆర్థికంగా బాగున్న పక్షంలో జీవితంలో ఒక్కసారైనా సౌదీ అరేబియాలో ఉన్న పవిత్ర నగరాలకు పవిత్రయాత్ర తప్పక చేయాలి. ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం సంవత్సరాని్కి ఒకసారి ఈ పవిత్రయాత్ర ఉంటుంది. ఈ హజ్ యాత్రలో ఆ దేవుడిని ఆరాధించేందుకు జాతి, రంగు, తెగ, హోదా, వయస్సు అనే భేదభావాలు లేకుండా ప్రపంచం నలుమూలల ను౦చి ముస్టీ౦లు వప్తారు. ఈ హజ్ యా్త్రలో త్యాగాలు, ప్రయాణం, వివిధ ప్రధేశాలలో ప్రార్థనలు ఉంటాయి. జీవితంలో లభించిన వరాలన్నింటికీ కృతజ్ఞతగా దేవుడికి మరింత విధేయులవ్వడానికి ఈ యాత్ర దోహదపడుతుంది.
ఆరాధన భావం
దేనివల్ల అల్లాహ్ ప్రతి చెందుతాడో అలా౦టి క్రియ. ఇస్లా౦ ధర్మంలో ఆరాధన అన్నది పైన పేర్కొన్న కృతు్వులకే పరిమితమైవది కాదు. ఆరాధన అంటే అల్తాహ్ ప్రీతి కోసం చేసే అన్ని పనులు అన్న విస్తృత అర్థం ఇమిడి ఉరిది. దేవుడి మార్గదర్శకం ప్రకారం ఉండే ఉద్దేశాలు, పనులు, దైనందిన కార్యకలాపాలన్నీ ఆరాధనలోకే వస్తాయి. ఉదాహరణకు చిరునవ్వు చి౦ది౦చడం, పొరుగువారితో మంచిగా ఉండడం, కుటుంబానికి మద్దతుగా ఉ౦డడ౦, నిజాయితీ, రోడ్డుపై ఉన్న చెత్త తొలగించడం వంటి  పనులన్నీ ఆరాధన కిందికే వస్తాయి. ఇక్కడ గనునించాల్సిన విషయమేమిటంటే అల్లాహ్ కు ఎవరి ఆరాధనల అవసరం లేదు. కానీ మనకే ఆయన అపసరల ఉ౦ది. మన ఆరాధనలు మన ప్రయోజనాల కోసమే.
ముగింపు
పైన పేర్కొన్న విశ్వాసం, ఆరాధన పద్దతులే ఇస్లాం సారం. వాటిని ఆచరిస్తే ఇస్లాం  ధర్మం ప్రజల ఆధ్యత్మిక, శారీరక, మానసిక, సామాజిక అవసరాలు తీరుస్తు౦ది. ఇంకా ఇస్లామీయ జీవన మార్గాన్నే సర్వశక్తిమంతుడైస అల్తాహ్ ఆమోదించాడు. స్వర్గానికి తీసుకెళ్ళే ఏకైక మార్గం ఇస్లాం  ధర్మమే.

ఇస్లాం సందేశము  ఏమిటి  ? 
----------------------------------------------------------------------------------

మానవులంతా ఒకే జంట సంతానం.అందరు పరస్పరం  సోదరులు 
మనవులందరి దేవుడు ఒక్కడే(అవ్యక్తుడు,అగోచరుడు,అచింత్యుడు)

ఆయన తప్ప మరో దేవుడు లేడు .

మీలో మంచి పనులు చేసేవారెవరో చెడ్డ పనులు చేసేవారెవరో 

పరిక్షించి చూద్దామని మీకు జీవితాన్ని ఇచ్చాము 

దేవుడు లెక్క తీసుకుంటాడు అన్న భయం తో 

మంచి జీవితాన్ని గడిపిన వాడికి శాశ్వత స్వర్గం వుంది

ఇష్టం వచ్చినట్లు జీవితాని గడిపిన వానికి శాశ్వతనరకం వుంది

(ఖుర్ ఆన్  67:3)

---------------------------------------------------------------------------------- 
ఇస్లాం  అంటే  ఏమిటి...?
----------------------------------------------------------------------------------
ఖుర్ఆన్ బోధనల ప్రకారం  ఇస్లాం కొత్త ధర్మం కాదు. ఇది సనాతన ధర్మము. ఇస్లాం అనే  పదము  'సలాo'  అనేటువంటి  మూలపదం  నుంచి  వచ్చింది. సలం  అంటే శాంతి . ఆది నుంచి ప్రతి జాతికి దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు. (10:47)
ఈ  ప్రవక్తలంతా  కూడా శాంతి మార్గం (ఏక దేవారాధన)  పైనే నడిచారు. ఈ  శాంతి మార్గమునే  అరబ్బీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. ఈ  ప్రవక్తల పరంపరలో చిట్టచివరగా వచిన వారే  ముహమ్మద్ ప్రవక్త (స.అ. సం ).  
-------------------------------------------------------------------------
ఖుర్ఆన్ ముస్లింల కోసం అవతరించిందా.....?
------------------------------------------------------------------------

ఖుర్ఆన్ ముస్లింల గ్రంథమని  ఎక్కడా  రాయబడి లేదు.

ఖుర్ఆన్  సర్వమానవాళి  కోసం  అవతరించింది అని

స్వయంగా  ఖుర్ఆన్ సాక్ష్యమిస్తుంది . ఉదా :-

సర్వ మానవులకు  ఇదొక (ఖుర్ఆన్)  సందేశం. అందరినీ హెచ్చరించాలని

అందరూ  యధార్ధదంగా దేవుడు ఒక్కడే  అని తెలుసుకోవాలని ,బుద్ది

వున్నవాడు  గ్రహించాలని  ఇది  పంప బడింది. దివ్యఖుర్ఆన్(14:52);

ఖుర్ఆన్ మానవులందరికీ  మార్గదర్శకం. ఋజుమార్గం  చూపే

సత్యాఅసత్యను  వేరుపరిచే  స్పష్టమైన ఉపదేశాలు  దీనిలో వున్నాయి.

                                           దివ్యఖుర్ఆన్ (2:185)

----------------------------------------------------------------------------------
మహమ్మద్(స. అ. సం) ముస్లింలకు  మాత్రమే  ప్రవక్తా......? 
----------------------------------------------------------------------------------
మహమ్మద్(స. అ. సం )  సర్వమానవాళికి ప్రవక్తగా  పంపించబడ్డారు. కానీ కేవలం  ముస్లింల కోసం ఏంత మాత్రం కాదు. 
ఉదా :- ఖుర్ ఆన్  వాఖ్యాన్ని గమనించండి. ఓ  ప్రవక్తా !  మేము  మిమ్మల్ని  సర్వమానవాళికి సందేశహరునిగా  శుభావార్తను  ఇచ్చేవనిగా  హెచ్చరిక చేసేవానిగా  నియమించి  పంపాము. (34:28); ఓ ప్రవక్తా!  మేము  మిమ్మల్నిమానవులందరికీ   సందేశహరునిగా పంపించాము.    (4:79)

ముస్లిం అంటే  ఏవరు....?
----------------------------------------------------------------------------------
దేవుడు (నిజ  ఆరాధ్యుడు) ఒక్కడు  అని  విశ్వసించి  ఆయన ప్రవక్తలను  మరియు గ్రంథాలను  అనుసరించే వాడిని  అరబ్బీ భాషలో  ముస్లిం (దైవ విధేయుడు ) అని అంటారు. ముస్లిం అంటే విశ్వాసానికి సంబందించిన పదం.  కానీ, ఇది  వంశపారంపర్యంగా  వచ్చేది కాదు. ఖుర్ ఆన్ ప్రకారం అగోచరుదు అయిన  అల్లాహ్ ను  మాత్రమే అరాదించేవాడిని ముస్లిం (దైవ విధేయుడు ) అంటారు.  కానీ దర్గాలను, పీర్లను, మనుష్యుల  లేదా  జంతువుల ప్రతిరుపాలను  ఆరాధించేవాడిని ముష్రిక్ (బహుదేవారాధకుడు) అంటారు. ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ బహుదేవారాధన  చేస్తే  అతను  అల్లాహ్ దృష్టిలో  ముస్లిం  (దైవ విధేయుడు )గా  పరిగణిoచబడడు.


Introduction to Islam
----------------------------------------------------------------------------------
The supreme creator who was introduced in Upanishaths, Vedas, Bhagavad Geetha and Bible, is introducing Himself

సర్వ శ్రేష్థమైన సృష్టి కర్త వేదాలు,ఉపనిషత్తులు,గీతా, బైబిల్ మరియు ఖుర్ ఆన్ లో తన గురించి ఈ విధంగా పరిచయం చేసుకున్నాడు.

పవిత్ర ఖుర్ ఆన్ లో అల్లాహ్ అంటే అల్ + ఇలాహ్ = అల్లాహ్ 

అరబ్బీ భాషలో అల్లాహ్ అంటే ఆరాధనకు అర్హుడు అని అర్ధం 

పురాతన గ్రందాలు అరబ్బీ భాషలో ఉన్న  ఇస్లాం గురించి వివరిస్తున్నాయి 
in the Holy Quran with thename “ALLAH”.
Al + Ilaah = Allah
“Allah” in Arabic language means “the one who is eligible to be worshipped”
which was taught in the ancient scriptures is called “Islam” in Arabic Language.

ఇస్లాం అనేది సలం మరియు సిల్మ్ అనే పదాలనుండి వచ్చింది. దీని అర్ధం శాంతియుతంగా తనను తానూ అల్లాహ్ కు సమర్పించు కోవడం. 

Islam comes from the word“Salm” which means peace & from “silm” which means “submitting your will to Allah”.
అందువలన ఇస్లాం అంటే తనను తాను శాంతియుతంగా అల్లాహ్ ఆజ్ఞలకు, విధులకు అనుగుణంగా సమర్పించుకోవడం అవుతుంది. ఇలా సమర్పించుకున్నవాడే ముస్లిం అనబడతాడు. 

Therefore, Islam means spending life peacefully in accordance with the divine laws and the commandments of Allah (the God),A person being obedient and dedicated to Allah, is called “Muslim”.

ముహమ్మద్ (స. అ. సం) ఇస్లాం ధర్మ స్థాపకులు కారు. ఇస్లాం అనేది ఆది నుండి వివిధ ధార్మిక గ్రందాల, ప్రవక్తల ద్వారా బోధించిన సహజమైన ధర్మం. 

Muhammed (Peace by upon him) is not the founder of Islam. ‘Islam’ is the natural religion which was taught by God through various scriptures and prophets from the beginning.

దేవుడు ధర్మాన్ని (ఇస్లాం) తన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం)  ద్వారా పరిపూర్ణం చేశాడు. 
God has completed religion (Islam) through His last prophet, Muhammed (PBUH).

ఆది నుండి దాదాపు 1,24,000 మంది వివిధ కాలాలలో, వివిధ ప్రదేశాలలో ప్రవక్తలందరూ దేవుడు ఒక్కడే అనే సందేశాన్ని ఇచ్చారు. ఆ పరంపరలో చివరి వారే అందరికీ ప్రవక్త అయిన మహనీయ ముహమ్మద్ (స. అ. సం). ఖుర్ ఆన్ దేవునిచే పంపబడ్డ అంతిమ దైవ ధర్మ శాస్త్రం (చట్టం). 

From the beginning of man to the present age, approximately 1,24,000 prophets gave the message “GOD IS ONE” in various ages to various nations, Muhammed (PBUH) is the last prophet among them “Quran” is the ultimate divine law which has been given by God by through him.
Prophet Muhammed (PBUH) the messenger of all. 

ప్రవక్తలందరూ ప్రత్యేకంగా వివిధ కాలాలకు, వివిధ జాతులకు, పంబడ్డారు. కాని సర్వ మానవాళి కోసం పంపబడ్డ ప్రవక్త, ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) . 

All the ancient prophets were sent for some separate nations & ages. But Muhammed (PBUH) was sent as a prophet from the entire mankind.

మేము నిన్ను (ముహమ్మద్ స. అ. సం) సమస్త జనులకు సందేశం అందజేసే వానిగా జేసే పంపాము. 
“And we have sent thee as a messenger to (instruct) mankind. And enough is Allah for a witness”.  (ఖుర్ ఆన్  4:79)

ముహమ్మద్ (స. అ. సామ్) కేవలం ముస్లిములకు మాత్రమే ప్రవక్త కాదు. ఆయన సర్వ మానవాళికి సత్యమైన సందేశాన్ని అందజేయడానికి వచ్చిన ప్రవక్త. 
Muhammed (PBUH) is not the prophet of Muslims alone, but he is our prophet who brought the divine message for us, the whole of mankind.

QURAN is not the writing of a human being:
ఖుర్ ఆన్ మానవ రచన ఎంత మాత్రం కాదు 
-----------------------------------------------------------------------------------
మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానం ఉంటే, అటువంటిదే ఒక్క సూరానైన (రచించి) తీసుకు రండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్ ను తప్ప మీ సహాయకులను తీసుకోండి. 

And if ye are in doubt as to what we have revealed from time to time to our servent, then produce a sura like thereunto; and call your witnessesor helpers (if there are any) besides Allah, if you are truthful.
(ఖుర్ ఆన్  2:23)
-------------------------------------------------------------------------------
ఖుర్ ఆన్ ముస్లింల గ్రంథం కాదు  ? సర్వమానవాళి గ్రంథం 
---------------------------------------------------------------------------------
ఖుర్ ఆన్ సర్వమానవాళి కోసం  తన చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ (స అ సం) ద్వారా అంతిమంగా పంపించబడిన గ్రంధం. 
---------------------------------------------------------------------------------
QURAN, THE LAST DIVINE BOOK
----------------------------------------------------------------------------------
1500 years ago, 
God, the almighty revealed the Holy quran to His last prophet through His Angel in 23 years gradually. The Angel (Gabriel) had brought the divine message of God to every prophet in every age. The Angel would appear in human form to the Prophets. Some people mistakenly considered the Angel to be God in human form. Muhammed (peace be upon him) was illiterate. He memorized the holy Quran by the help of God, made his disciples memoriez it and provided it to mankind. Quran is the only book which has not been changed since 1500 years (since it was revealed). God gave a separate law for every age. Quran is the ultimate divine law for this age. God himself has taken the responsibility protecting it. So this divine law (Quran) will be the guidance for all generations of mankind till Doomsday as it is the last Divine Scripture of God and Muhammed (PBUH) is the last prophet of God.
1500 వందల సంవత్సరాలకు పూర్వం సర్వ శక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ తన దూత ద్వారా చివరి ప్రవక్త పై క్రమ క్రమంగా 23 సంవత్సరాలలో పవిత్ర ఖుర్ ఆన్ ను అవతరింపజేశాడు. జిబ్రయీల్ (గాబ్రేయిల్) దూత దైవ సందేశాన్ని ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలకు అందజేశాడు. ఆ దూత ప్రవక్తలకు మానవ రూపంలో అవతరించేవాడు. కొంత మంది ప్రజలు మానవ రూపంలో ఉన్న ఆ దూతను దేవునిగా భావించసాగారు. ముహమ్మద్ (స. అ. సం) నిరక్షరాస్యులు. ఆయన పవిత్ర ఖుర్ ఆన్ ను దేవుని సహాయం తో జ్ఞాపకం చేసుకొని తన శిష్యులకు బోధించి తద్వారా ప్రజలందరికీ చేరవేశారు. ఖుర్ ఆన్ అవతరిచిన నాటి నుండి 1500 ల సంవత్సరాలుగా  ఎటువంటి మార్పులు చేర్పులకు గురికాని ఏకైక గ్రంధం. దానిని రక్షించే బాధ్యత దేవుడు స్వయంగా తీసుకున్నాడు. ఈ ఖుర్ ఆన్ గ్రంధం ప్రతి తరం వారికి యుగాంతం వరకు మార్గదర్శకం. మరియు ముహమ్మద్ (స. అ. సం) చిట్ట చివరి దైవ ప్రవక్త.  




















No comments:

Post a Comment