చిట్ట చివరి దైవ గ్రంధం దివ్యఖుర్ఆన్
(THE LAST DIVINE BOOK)
(THE LAST DIVINE BOOK)
1500 వందల సంవత్సరాలకు పూర్వం సర్వ శక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ తన దూత (గాబ్రేయిల్) ద్వారా చివరి ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) పై క్రమ క్రమంగా 23 సంవత్సరాలలో పవిత్ర ఖుర్ ఆన్ ను అవతరింపజేశాడు. జిబ్రయీల్ (గాబ్రేయిల్) దూత దైవ సందేశాన్ని ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలకు అందజేశాడు. ఆ దూత ప్రవక్తలకు మానవ రూపంలో అవతరించేవాడు. కొంత మంది ప్రజలు మానవ రూపంలో ఉన్న ఆ దూతను దేవునిగా భావించసాగారు.
ముహమ్మద్ (స. అ. సం) నిరక్షరాస్యులు. ఆయన పవిత్ర ఖుర్ ఆన్ ను దేవుని సహాయం తో జ్ఞాపకం చేసుకొని తన శిష్యులకు బోధించి తద్వారా ప్రజలందరికీ చేరవేశారు.
ఖుర్ ఆన్ అవతరిచిన నాటి నుండి 1500 ల సంవత్సరాలుగా ఎటువంటి మార్పులు చేర్పులకు గురికాని ఏకైక గ్రంధం. దానిని రక్షించే బాధ్యత దేవుడు స్వయంగా తీసుకున్నాడు. ఈ ఖుర్ ఆన్ గ్రంధం ప్రతి తరం వారికి యుగాంతం వరకు మార్గదర్శకం. మరియు ముహమ్మద్ (స. అ. సం) చిట్ట చివరి దైవ ప్రవక్త.
ఖుర్ఆన్ అనగా ఏమిటి ?
దైవ వచనం! దైవ వచన లిఖిత రూపమే ఖుర్ఆన్. సృష్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ముహమ్మద్(స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు.
ఖుర్ఆన్, సృస్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు.
(దివ్యఖుర్ఆన్ – 39 : 1) " ఈగ్రంథం (దివ్యఖుర్ఆన్) మహాశక్తి సంపన్నుడూ, మహా వివేకవంతుడూ అయిన అల్లాహ్ తరపు ను౦డి అవతరించింది. "
దివ్యఖుర్ఆన్ మానవాళికి మార్గదర్శకత్వం
(దివ్యఖుర్ఆన్ – 2: 185) మానవులందరికీ (ఖుర్ఆన్ గ్రంథం) మర్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అ౦దులో ఉన్నాయి మంచి, చెడులను బేరీజు వేసుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు ఖుర్ఆన్ మార్గదర్శకం అవుతుంది. ఈ మార్గదర్శకమే లేకుంటే మానవాళి తీరని నష్టానికి గురవుతుంది.
చివరి దివ్యవార్త!
మహాశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ చిట్ట చివరి గ్రంథమే ఖుర్ఆన్. ఇది పూర్వపు దైవగ్రంథాలను ధ్రువపరుస్తుంది. పూర్వ గ్రంథాలలోని కల్పితాలు , అస౦గతులను ఖండించిన, సరిచేసిన పరిశుద్ధ దైవగ్రంధం.
(దివ్యఖుర్ఆన్ – 4: 47)“గ్రంథ ప్రజలారా! మేము ఇప్పుడు అవతరింపజేసిస గ్రంథాన్ని విశ్వసించండి. అది, మీ వద్ద పూర్వం నుండే ఉన్న గ్రంథాన్ని ధ్రువపరుస్తుంది, సమర్ధిస్తుంది."
ఖుర్ఆన్ ఎలా అవతరించింది ?
ఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై అవతరించింది. అది ప్రకటితమైనది అరబీ భాషలోనే. అయితే ఖుర్ఆన్ భావానువాదాలు ప్రపంచంలోని అనేక భాషలలో లభిస్తున్నాయి.
ఒకే ఒక్క దైవవాణిలో మొత్తం ఖుర్ఆన్ గ్రంధం అవతరించలేదు. 23 ఏళ్ళపాటు ప్రకటితమైన దైవాజ్ఞల సంకలనమే ఖుర్ఆన్.
ఈ కారణంగానే, ఖుర్ఆన్ వచనాలు (ఆయతులు) ఏయే సందర్భాలలో ప్రకటితమయ్యాయో అర్ధం చేసుకోవడం అత్య౦త అవశ్యకం, లేదంటే ఖుర్ఆన్ బోధనలను అపార్ధం చేసుకునే అవకాశం ఉంది.
సంరక్షణ ప్రకటితమైన నాటి ను౦చి ఎలాంటి మార్పులు, చేర్పులు, సవరణలకు గురికాకుండా యథాతథ రూపంలో సుదీర్ఘకాలం చెలామణిలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథం ఖుర్ఆన్. 1400 ఏళ్ళుగా యథా రూపంలో సురక్షిత౦గా ఉనంగ్రంథం.
దివ్య ఖుర్ఆన్ కేవలం లిఖిత రూపంలోనే సంరక్షిపబడి లేదు. స్త్రీ, పురుషులు, పిల్లల హృధయాల్లో సయితం సంరక్షింపబడి ఉ౦ది. నేడు లక్షలాది మ౦ది ఖుర్ఆన్ ని ఆద్యంతం కంఠస్తం చేశారు.
శాస్త్రీయ అద్భుతం
అధునిక విజ్ఞాన శాస్త్రం తో ఖుర్ఆన్ విభేదించలేదు. పైగా దానిని సమర్థించింది. ఖుర్ఆన్ విశిష్ఠత ఏమిటంటే అది పిండోత్పత్తి శాస్త్రం (embriyology), వాతావరణశాస్త్రం (meteorology), ఖగోళ శాస్త్రం (astronomy), భౌగోళిక శాస్త్రం (geology), సాగర శాస్త్రం (oceanography) వ౦టి వివిధ రంగాలకు చెందిన ప్రాకృతిక దృగ్విషయాలను ఖుర్ఆన్ ని అనేక ఆయతులు స్పష్టంగా వివరించాయి. 7వ శతాబ్దంనే ఈగ్రంథం అనేక శాస్త్రీయ విషయాలను వివరించిందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వాస్తవానికి ఖుర్ఆన్ గ్రంథం పేర్కొన్న అనేక శాస్త్రీయ అద్భుతాలను ఇటీవలి కాలంలోనే ఆధునిక సాంకేతిక పరికరాల ప్రగతి కారణంగా కనుగొన్నారు. ఈ క్రింది అంశాలని పరిశీలించండి :
- మానవ పీండోత్పత్తి అభివృద్ధిని గురించి ఖుర్ఆన్ వివరించింది. నిజానికి ఈ వివరాలు ఇటీవలి కాలం వరకు శాస్త్రజ్ఞులకు తెలియవు.
- రోదసి పదార్థాలు (నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుళ్ళూ వగైరా…) మేఘాల ధూళితో ఏర్పడ్డాయని, ఖుర్ఆన్ స్పష్టీకరించి౦ది. ఇదివరలో ఈ విషయం తెలియదు. కానీ ఆధునిక ఖగోళశాస్త్రంలో ఇదో నిర్వివాద వాస్తవంగా ఇప్పుడు మారింది. రెండు సముద్రాలు కలిసినప్పటికీ అవి తమ ఉష్ణోగ్రతను, సాంద్రతను, లవణీయతను కలిగి ఉంటాయన్న విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇటీవల కనుగొన్నది.
- (దివ్యఖుర్ఆన్ – 15: 09) " ఇక ఈ జ్ఞాపిక, దానిని మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము."
ఈ దైవ సూచనలను 1400 ఏళ్ళకు పూర్వమే ఖుర్ఆన్ తెలిపింది.
అద్వితీయమైనది
ఖుర్ఆన్ అవతరించినప్పటి నుంచి ఎవరూ అలాంటి గ్రంథాన్ని రూపొందిచలేదు. కనీసం అందులోని ఒక అధ్యయనాన్ని (సూరా) అయినా రూపొందించలేదు. సుధరం, స్పష్టత, శోభ, విజ్ఞానం, భవిష్య సూచనలు, తదితర అ౦శాలన్నీ ఖుర్ఆన్ లో ఉన్నట్లు మళ్ళీ ఎవరూ చెప్పలేదు. ఖుర్ఆన్ ఆవిర్భవించిన భాష అరబీలో ప్రవీణులై ఉండి, ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) ని తిరస్కరించిన వారు సయితం అలాంటి మరో గ్రంథం సృష్టించి చూపమన్న సవాలుసు ఎదుర్కోలేకపోయారు. ఈ నాటికి ఖుర్ఆన్ వంటి గ్రంధాన్నొక్కటి సృష్టించి చూపమన్న సవాలు అలాగే ఉండిపోయింది.
(దివ్యఖుర్ఆన్ – 41: 53) " మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖుర్ఆన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. "
వైరుధ్యాలు లేవు
జనులు వ్రాసేటప్పుడు తప్పులు చేస్తుంటారు. అంటే అక్షరదోషాలు, వ్యాకరణం, వైరుధ్య ప్రకటనలు, అవాస్తవికతలు, తప్పుడు సమాచారం, తదితరములైన తప్పులు చేస్తుంటారు.
" మేము మా దాసుని పై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్నయినా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. "
ఖుర్ఆన్ పేర్కోన్న అంశాలలో మీకలాంటి వైరుధ్యాలు ఎక్కడా కనబడవు. అది శాస్త్రీయ వివరణల్లోనైనా సరే. అంటే నీటి వలయం, పిండోత్పత్తి, భౌగోలిక, ఖగోళ, చారిత్రక, భవిష్య సూచనలు వంటి ఏవిషయాలలోనూ మీకు ఆ వైరుధ్యాలు కానరావు.
ముహమ్మద్ (స.స౦) రచన కాదు ?
ప్రవక్త ముహమ్మద్(స.అ.స౦) నిరక్షరాస్యులని చరిత్ర వల్ల తెలుస్తోంది. ఆయనకు చదువను, రాయను రాదు. శాస్త్రీయంగా, చారిత్రకంగా ఖచ్చితంగా విషయాలు చెప్పగలిగే రీతిలో ఆయన ఏ రంగంలోనూ చదువుకోలేదు. ఓ మహత్తరమైన గ్రంథాన్ని రూపొందించేంత సాహిత్యమూ ఆయనకు లేదు. ఖుర్ఆన్ లో పేర్కొన్న పూర్వ జనులు, నాగరికతలు ఏ మనిషి సాధికారంగా చెప్పలేనట్టివి.
(దివ్యఖుర్ఆన్ – 4: 82) “ఇది (ఖుర్ఆన్) అల్లాహ్ తరపు నుండి కాక వేరొకరి తరపు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలు ఉండేవి. "
(దివ్యఖుర్ఆన్ – 2: 163) దివ్యవార్త ఉద్దేశ్యమ నిజమైన ఒకే ఒక్కదేవుణ్ణి నమ్మడం కోసం " మీ దేవుడు, ఆ కృపాకరుడు తప్పమరొక దేవుడు లేడు.”
(దివ్యఖుర్ఆన్ – 10: 7) “అల్లాహ్ పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే గ్రంథము కాదు ఈ ఖుర్ఆన్. "
దిన్య ఖుర్ఆన్ గ్రంథమంతటా అసలైన ఒకే దేవుడిని నమ్మమనే ముఖ్యాంసం పేర్కొనబడింది, తనకు భాగస్వాములు, కుమారుడు, సమానులు లేరని, తను తప్ప వేరెవరూ అరాధనీయులు కాదని దేవుడు చెప్పాడు. దేవుడితో పోల్చదగినది ఏది లేదు. ఆయన సృస్టీంచినవి ఏవి ఆయనను పోలి ఉండవు, మానవ గుణాలు, పరిమితులు దేవుడికి ఆపాదించడాన్ని దివ్యఖుర్ఆన్ ఖండిస్తుంది.
ఖుర్ఆన్ మిధ్యా దేవుళ్ళందరినీ తిరస్కరిస్తుంది
(దివ్యఖుర్ఆన్ – 4: 36)" మీరంతా అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు.
అల్లాహ్ ఒక్కడే ఆరాధనీయుడు. కనుక మిథ్యా రేవుళ్ళందరినీ తిరస్కరించాలి. దైవిక గుణాలను అల్లాహ్ కు తప్ప ఇతరులకు ఆపాదించడాన్ని దివ్యఖుర్ఆన్ తిరస్కరిస్తుంది.
పూర్వగాథలు తెలిపేందుకు
పూర్వపు ప్రవక్తలైన ఆదమ్ అ ), నూహ్(అ), ఇబ్రాహీం (అ), ఈసా(అ), మూసా(అ) వంటి మహాత్ముల గాథలతో సహా ఉపయోగకరమైన గుణపాఠాలను, గతి౦చిన విషయాలను ఖుర్ఆన్ వివరించింది.
(దివ్యఖుర్ఆన్ – 12: 111) "పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధీ, స్పృహ ఉన్నవారికి ఒక గుణపాఠం ఉన్నది.”
తీర్పుదినాని మనకు గుర్తు చేసేంపెదుకు
ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, పైగా తీర్పుదినాన చేసిన కర్మల లెక్కలు దేవుడుకి చెప్పుకోవలసిందే.
(దివ్యఖుర్ఆన్ – 21: 47) "కచ్చితంగా తూచేటటువంటి తరాజులను మేము ప్రళయం నాడు ఏర్పాటు చేస్తాము ఏ వ్యక్తికైనా రవ్వంత అన్యాయం కూడ జరగదు.” నిర్దేశించిన మార్గంలోనే జీవించమంటుంది
ఒకే దేవుడిని ఆరాధించమని, మనిషికి నిర్దేషించిన మార్గంలోనే అతడు జీవించాలని దివ్యఖుర్ఆన్ ఉద్భోదిస్తుంది. ఇస్లాంలో ఆరాధన అన్నది సమగ్రమైనది. అంటే అల్లాహ్ కు ప్రీతికరమైస రీతిలో, ఆయన కోరుకునే రీతిలో మాటలు చేతలు (ప్రైవేట్ గా లేక పబ్లిక్ గా) ఉండాలని అంటుంది. అలదుకే అల్లాహ్ ఆదేశాల మేరకు ముస్లింలు దైవారాధన చేస్తారు. ఆయన నిర్దేశించిన మార్గంలోనే జీవించే ప్రయత్నం చేస్తారు.
ఆరాధన ఎలా ఉండాలన్నది ఖుర్ఆన్ తెలిపింది. ఆ ఉదాహరణలే ఇవి:
ప్రార్థించండి :
(దివ్యఖుర్ఆన్ – 22: 77) “విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయ్యండి. మీ ప్రభుపుకు దాస్యం చెయ్యండి, మంచి పనులు చెయ్యండి. దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుంఎదని అశించవచ్చు. "
దాతృత్వం పాటించండి :
(దివ్యఖుర్ఆన్ – 64: 16) “మీ సంపదను ఖర్చు పెట్టండి. ఇది మీకే శ్రేయస్కరం. తమ హృదయ లోభత్వం నుండి రక్షణపొందినవారే సాఫల్యం పొందేవారు. “నిజాయితీగా ఊండండి
(దివ్య ఖుర్ఆన్ – 2: 42) "సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగాపులగం చెయ్యకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యకండి. “శీలవంతులుగాఉండండి
(దివ్యఖుర్ఆన్ - 24: 30) “ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని చెప్పు. "
(దివ్యఖుర్ఆన్ – 24: 31) "…. ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అనీ, తమ మర్మాంగాలను రక్షించుకోండి తన అలంకరణను ప్రదర్శించ వలదని దానంతట అదే కనిపించేది తప్ప.
(దివ్యఖుర్ఆన్ – 16: 78) "అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృగర్భాల నుండి మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా బయటకు తీశాడు. ఆయన మీకు చెవులు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు. ఆలోచించే మనస్సూ ఇచ్చాడు. మీరు కృతజ్ఞులు కావాలని.
న్యాయంగా ఉండండి:
“విశ్వసించిన ప్రజలారా! న్యాయ ధ్వజవాహకులుగా నిలబడండి. అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్షులుగా ఉండండి మీ న్యాయం, మీ సాక్ష్యం మీకూ, మీ తల్లిదండ్రులకూ, మీ బంధుపులకూ ఎంత హాని కలిగించినా సరే. కక్షిదారులు భాగ్యవంతులయినా, నిరుపేదలయినా అల్లాహ్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు…."
(దివ్యఖుర్ఆన్ – 4: 135)
సహనం వహించండి :
(దివ్వఖుర్ఆన్ – 11: 115) "ఓర్పు కలిగి ఉండు అల్లాహ్ మంచి చేసేవారి ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా చెయ్యడు.”
ముగింపు :
సారాంశం ఏమిటంటే, ఒకే దేవుడిని ఎలా అరాధించాలి, జీవితాన్ని ఎలా గడపాలి, ఇహపర లోకాలలో సాఫల్యం ఎలా పొందాలి అనే విషయాలను ఖుర్ఆన్ బోధిస్తుంది.
(దివ్యఖుర్ఆన్ – 39: 41)" (ఓ ప్రవక్తా!) మేము మానవులందరి కోసం ఈ సత్యగ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఇక ఎవడు రుజుమార్గాన్ని అవలంబిస్తాడో, అతడు తనమేలు కోసమే అలా చేప్తాడు. ఎవడు మార్గం తప్పుతాడో, ఆమార్గం తప్పటమనే కీడుకు అతడే బాధ్యుడు అవుతాడు."
దివ్య ఖుర్'ఆన్ వెలుగులో సత్య సందేశం
ఎందరు దైవాలు?
మీ దేవుడు ఒక్కడే. ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. (ఖుర్'ఆన్ ; 2:163)
తాను తప్పమరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహ్ యే సాక్ష్యమిచ్చాడు. దైవ దూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తి మంతుడు, ఆ మహాజ్ఞాని తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగాను, న్యాయంగానూ సాక్ష్యమిస్తారు. (ఖుర్'ఆన్; 3:18)
వాస్తవమేమిటంటే, దేవుడు ఒక్కడే. మరొక దేవుడు లేడు. (ఖుర్'ఆన్ ; 5:73)
ఆకాశంలోనూ, భూమిలోనూ దేవుడు ఆయన ఒక్కడే. (ఖుర్'ఆన్ ; 43:84)
మీ నిజదైవం ఎవరు?
ఆయనే అలాహ్. మీ ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయన సర్వానికి సృష్టికర్త. (ఖుర్'ఆన్; 6:102)
అల్లాహ్ - ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. (ఖుర్'ఆన్ ; 2:255)
ఆయనే అల్లాహ్ ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనకు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి.
(ఖుర్'ఆన్ ; 20:8)
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
*ఆ అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని మరణాన్ని ఇస్తాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయ గలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు. (ఖుర్'ఆన్ ; 30:40)
మూసా! నేనే నీ ప్రభువును ...... నేనే అల్లాహ్ ను, నేను తప్ప మరొక దేవుడు లేడు. కనుక నీవు నాకు దాస్యం చెయ్యి, నా జ్ఞాపకం కోసం నమాజ్ ను స్థాపించు (ఖుర్;ఆన్ ; 20:14)
మానవులారా! మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. (ఖుర్'ఆన్ ; 2:21)
దైవానికి భగ్యస్వాములు ఉన్నారా? (బహుదైవారాధకులు ఉన్నారా?)
ఒక వేళ ఆకాశంలో, భూమిలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల) రెండింటి వ్యవస్థ చిన్నా భిన్నమై ఉండేది. (ఖుర్'ఆన్ ; 21:22)
అల్లాహ్ ఎవరిని తన సంతానం చేసుకోలేదు మరియు మరొక దేవుదేవ్వడూ ఆయనతో పాటు లేడు. ఒక వేళ అలా అయితే,ప్రతీ దేవుడూ తన సృష్టిని తీసుకొని వేరుపడి పోయేవాడు, తరువాత వారు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసి ఉండేవారు. (ఖుర్'ఆన్; 23:91)
అల్లాహ్ తో పాటు ఇతర ఏ దేవుణ్ణీ వేడుకోకు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఒక్క ఆయన ఉనికి తప్ప ప్రతీది నశించేదే. .....(ఖుర్'ఆన్ ; 28:88)
అల్లాహ్ తప్ప ఇత్రరులు ఎందుకు ఆరాధ్యులు కారు?
అల్లాహ్ ను వదలి, ప్రజలు వేడుకుంటున్న ఇతర శక్తులు ఏ వస్తువుకూ సృష్టికర్తలు కారు. వారు స్వయంగా సృష్టింపబడినవారు. (ఖుర్'ఆన్ ; 16:20)
"ఆకాశాలలోనూ, భూమిలోనూ ఒక అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వడూ లేడు. (ఖుర్'ఆన్'27:65)
అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించే వారు ఎవ్వరూ లేరు. ఇంకా ఆయన గనుక నీవిషయంలో ఏదైనా మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు. (ఖుర్'ఆన్ ; 10:107)
ఆకాశాలాలో ఉన్నదీ, భూమిపై ఉన్నదీ అంటా ఆయనదే, నిస్సందేహంగా ఆయనే నిరాపేక్షాపరుడు,స్తుతింప బడేవాడు. (ఖుర్'ఆన్ ; 22:64)
మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది: దానిని శ్రద్ధగా వినండి: అల్లాహ్ ను కాదని మీరు ఏ దేవుళ్ళను వేడు కొంటున్నారో, వారందరూ కలసి సమైక్యంగా ఒక్క ఈగను సృష్టించ దలచినా అలా చేయలేరు. అంతేకాదు, ఒకవేళ ఈగ వారినుండి ఏదైనా వస్తువును లాక్కు పోయినా, వారు దానిని విడిపించుకు రానూలేరు. (ఖుర్'ఆన్ ; 22:73)
బహుదైవాలుగా భావించి వారిని ఆరాధిస్తే ఆరాధకుల ప్రతిఫలం?
అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ (బహుదైవారాధన) మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తానూ ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట. ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడు అన్నమాట. (ఖుర్'ఆన్; 4:48 & 116)
.... ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడెవ్వడూ లేడు. (ఖుర్'ఆన్ ; 5:72)
నీ ప్రభువు ఇలా అంటున్నాడు; "నన్ను ప్రార్ధించండి, నేను మీ ప్రార్ధనలను అంగీకరిస్తాను. గర్వానికి లోని నా ఆరాధనకు విముఖులయ్యేవారు తప్పని సరిగా ఆవమానానికి, పరాభావానికీ గురి అయి నరకంలో ప్రవేశిస్తారు. (ఖుర్'ఆన్ ; 40:60)
ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయినట్లే. అతనిని ఇక పక్షులైనా తన్నుకు పోతాయి లేదా గాలి అతనిని ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికైనా విసరివేస్తుంది. (ఖుర్'ఆన్; 22:31)
అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్యుడుగా చేసుకోకు. అలా చేస్తే నిందల పాలవుతావు. ప్రతీ మేలుకూ దూరమౌతావు. నరకంలో పడవెయ్యబడతావు. (ఖుర్'ఆన్; 17:39)
అల్లాహ్ గుణ గణాలు:
.... ఆయనే అల్లాహ్, అద్వితీయుడు, అల్లాహ్ నిరాపేక్షాపరుడు. ఎవరి ఆధారము, ఎవరి అక్కరా లేనివాడు; అందరూ ఆయనపై ఆధారపడే వారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా మరి ఎవరి సంతానము కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూలేరు. (ఖుర్'ఆన్ ; 112:1-4)
ఆయనే అల్లాహ్ ! ఆయన తప్ప ఆరాధ్యుడేవ్వడూ లేడు. దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు. ఆయనే కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తరువులను తిరుగులేని విధంగా అమలు పరచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు అల్లాహ్, సృష్టి వ్యూహాన్ని రచించే వాడు, దానిని అమలు పరచే వాడు. ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. ఆయనకు మంచిపేర్లు ఉన్నాయి. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతివస్తువు ఆయనను స్మరిస్తోంది. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను. (ఖుర్'ఆన్ ; 59:22-24)
ప్రవక్తలను మానవులనే ఎందుకు ఎన్నుకున్నాడు?
"భువిలో దైవదూతలు నిశ్చంతగా తిరుగుతూ ఉండివుంటే, మేము తప్పకుండా ఆకాశం నుండి దైవదూతలే వారి కోసం ప్రవక్తలుగా పంపి ఉండేవారము." (ఖుర్'ఆన్; 17:95)
" ఓ ప్రవక్తా! నీకు పూర్వం కూడా మేము మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారికి మేము వహీని (దైవ వాణి) అందజేశాము." (ఖుర్'ఆన్ ; 21:7)
సమస్త ప్రవక్తల సందేశం?
మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా - "నేను తప్ప దేవుడు లేడు. కనుక మీరు నాకే దాస్యం చేయండి." అనే విషయాన్నే తెలియజేశాము. (ఖుర్'ఆన్ ; 21:25)
ముహమ్మద్ (స.అ.సం) ఎవరు?
(ప్రవక్తా!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తను ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా నియమించి పంపాము. (ఖుర్'ఆన్ ; 34:28)
ముహమ్మద్ (స)! మేము నిన్ను మానవజాతికి సందేశహరుడుగా చేసి పంపాము. (ఖుర్'ఆన్; 4:79)
ముహమ్మద్ (స) ! ఇలా ప్రకటించు : " మానవులారా! నేను మీ అందరివైపుకు వచ్చిన అల్లాహ్ సందేశహరుణ్ణి. (ఖుర్'ఆన్ ; 7:158)
ప్రవక్తా! ఇలా చెప్పు "నేను కేవలం ఒక మానవుణ్ణి, మీలాంటి వాణ్ని, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. మీ దైవం కేవలం ఒకే దైవం. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు."(ఖుర్'ఆన్; 18:110)
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) నే ఎందుకు అనుసరించాలి?
మానవులారా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు. (ఖుర్'ఆన్; 33:40)
ప్రవక్తకు విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాహ్ కు విధేయత చూపినట్లే. (ఖుర్'ఆన్ ; 4:80)
అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపేవాణ్ణి అల్లాహ్ క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేసింపజేస్తాడు. ఆ వనాలలో అతడు కలకాలం ఉంటాడు. అసలు ఇదే గొప్ప సాఫల్యం. అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ అవిధేయత చూపుతూ అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించే వాణ్ని అల్లాహ్ అగ్నిలో పడవేస్తాడు. అందులో అతడు సదా ఉంటాడు.అతనికి మిక్కిలి అవమానకరమైన శిక్షా పడుతుంది (4:13,14)అల్లాహ్ ను ,అయన ప్రవక్తలను తిరస్కరించేవారూ ,అల్లాహ్ అయన ప్రవక్తల మధ్య బెధాభవం చూపేవారు,"మేము కొందరిని విశ్వసిస్తాము, మరికొందరిని విశ్వసించము "అని అనేవారు,అవిశ్వాస విశ్వాసాలకు మధ్య ఒక (కొత్త) మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశ్యం కలవారు - వారు అందరు పరమ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము - దీనికి భిన్నంగా అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి, వారిమధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్ప ప్రసాదిస్తాము. అల్లాహ్ అధికంగా మన్నించేవాడు, అనన్యంగా కరుణించేవాడూను. (ఖుర్'ఆన్ ; 4:150-152
మానవులారా! ఈ ప్రవక్త మీవద్దకు మీ ప్రభువు తరపునుండి సత్యం తీసుకు వచ్చాడు. అతన్ని విశ్వసించండి, మీకే మంచిది. కాని మీరు గనక తిరస్కరిస్తే, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే అనే విషయం తెలుసుకోండి. అల్లాహ్ అన్ని తెలిసినవాడూ, అత్యంత వివేకీనూ (ఖుర్'ఆన్; 4:170)
ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు; "మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటె నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడూను. (ఖుర్'ఆన్; 3:31,32)
దైవ సందేశాన్ని తిరస్కరించేవారికి నరకాగ్ని ఉన్నది వారు చనిపోవాలనే తీర్పూ ఇవ్వబడదు, వారి నరకయాతనను తగ్గించడమూ జరగదు. (ఖుర్'ఆన్; 35:36)
కాబట్టి సోదరులారా!
మనందరి సృష్టికర్త అయిన అల్లహ్ ను విశ్వసించి చిట్టచివరి దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ (స.అ.సం) వారిపై అవతరించిన ఖుర్'ఆన్ గ్రంధాన్ని అనుసరించడంలోనే మన ఇహ - పర లోకాల సాఫల్యముంది.
ప్రవక్తా! "దేవుడు ఒక్కడు" అన్న సందేశాన్ని వారు తిరస్కరిస్తే ఇలా అను ; "మేము దైవ విధేయులం, ఒకే దైవ దాస్యం చేసే వారము (ముస్లిములము) అన్నదానికి మీరు సాక్ష్యులుగా ఉండండి.
(ఖుర్'ఆన్ ; 3:64)
మన సకల ఆరాధనలకు కేవలం ప్రవక్త(స ) చూపిన మార్గం లోనే పూర్తి చేయాలి. దానినే "సున్నత్" (ప్రవక్త సంప్రదాయం) అంటారు.
The message of Qur'an – Who is Allah?
మానవులారా! మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్) ను మాత్రమె ఆరాధించండి. దీని ద్వారా నే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది.
(Quran 2:21)
అల్లాహ్ తో పాటు ఏ దేవుణ్ణి మోర పెట్టుకోకు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడు. ఆయన అస్తిత్వం తప్ప ప్రతీది నశించి పోయేదే. ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు.
(Quran 28:88)
మేము వారికి సత్యాన్ని అందజేశాము. వారే ముమ్మాటికి అబద్ధకొరులు.
(Quran 23:90)
ప్రకటించండి! అల్లాహ్ ఒక్కడూ, అద్వితీయుడు అని.
అల్లాహ్ నిరాపేక్షాపరుడు.
ఆయన ఎవరినీ కనలేదు. ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాడు.
ఆయనకు సరిసమానము (పోల్చదగినవాడు) ఎవడూ లేడు.
(Quran 112:1-4)
ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు ఉండి ఉన్నట్లయితే ఈ రెండిటి వ్యవస్థ చినాభిన్నమైపోతుంది. కారణం దేవుళ్ళ మద్య పోటీ పెరిగి పోతుంది. అందువల్ల దేవుడు ఒక్కడే తప్ప ఆయనకు భాగస్వాములు లేరని తేట తెల్లమైపోయింది.
Mankind has descended from a single man and women
ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్ధానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు కలవాడే ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయముగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, ఆప్రమత్తుడు.
(ఖుర్ ఆన్ 49:13)
ఇస్లాం ధర్మం పేద, ధనిక,నల్లవారు, తెల్లవారు తేడా లేకుండా అందరికీ ఒకే సందేశాన్ని వ్యాపింపజేసింది. వారు పరస్పరం సోదరులు, ఒకే తల్లిదండ్రుల సంతానం. మరియు అల్లాహ్ వారి ప్రదర్సనాబుద్దిని, వారి కీర్తిని చూసి తీర్పు చెప్పడు. కాని వారిలోని భయభక్తులను,ఉత్తమమైన విధేయతను చూసి తీర్పు చెబుతాడు. ఇదియే ప్రవక్తలందరి సందేశం.
నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి. అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము. (ఖుర్ ఆన్ 21:25)
నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారి వద్దకు మేము మా సందేశాన్ని (వహీని) పంపేవాళ్ళం.(ఖుర్ఆన్ 21:7)
The reason for choosing human being as prophets:
ఓ ప్రవక్తా! వారికి చెప్పు : " ఒక వేళ దైవదూతలు భూ మండలం మీద తిరుగుతూ, నివాసమేర్పరుచుకుంటూ ఉన్నట్లయితే, మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దావా దూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం." (ఖుర్ ఆన్ 17:95)
There is no compulsion:
-----------------------------------------------------------------
Say, The truth is from your Lord, Let him who will, believe, and let him who will, reject (it) for the wrong – doors we have prepared a fire whose (smoke and flames), like the walls and roof of a tent will hem them in : if they implore relief they will be granted water like metted brass, that will scald their faces, how dreadful the drink How uncomfortable a couch to recline on! (ఖుర్ ఆన్ 18:29)
It is beneficial for the people who follow it:
నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరపునుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీ పై రాక్షకుణ్నికాను (అని ఓ ప్రవక్తా! చెప్పు). (ఖుర్ ఆన్ 6:104)
The result of rejection:
తిరస్కరించి చెడ్డ పనులు చేసేవారికి శాశ్వత నరకము
నరకవాసులకు ఇదొక వ్యధబహరితమైన శిక్ష. దైవదూతలకు ఇలా ఆదేశించడం జరుగుతున్ద్. వారిని పట్టుకోండి. ఈడ్చుకుంటూ నరకం మధ్య భాగంలోనికి తీసుకుపోండి. వాడి తలపైన మరుగుతున్న నీటిని పోయండి.(44:47). అప్పుడు వారి చర్మమే కాదు శరీర భాగాలన్నీ కరిగిపోతాయి. వారి శరీరం, చర్మం కాలిపోఇ నా ప్రతీసారి వారికి కొత్తశరీరం తోడిగించండo జరుగుతుంది.(ఈ ప్రపంచంలో ఒక హత్యకు వందహత్యలకు ఒకే శిక్ష పడుతుంది కాని పరలోకంలో మనషి చేసిన ప్రతీ దుష్కర్మకు శిక్ష పడుతుంది.)(4:56).
హాజిహీనారుల్లతి కున్తుమ్ బిహా తుకజ్జిబూన్
మీరు తిరస్కరిస్తున్న ఆ అగ్ని ఇదే.
నరకమనేది పాపులకు, వారి కర్మానుసారం శిక్షల్ని అమలు చేసే భయంకర లోకం. దీన్ని అల్లాహ్ అవిశ్వాసుల కొరకు, విగ్రహాలను ఆరాధించే వారి కొరకు, పాపాత్ముల కొరకు, అత్యచారుల కొరకు సిద్దపరిచి ఉంచాడు.
(ఖుర్ ఆన్ : 25:13) నరకవాసులు శిక్షను భరించలేక చావును కోరుతారు. కాని వారికి చావు రాదు. (ఖుర్ ఆన్ 23:104) నరకాగ్ని నరకవాసుల ముఖాల మాంసాన్ని కాల్చివేస్తుంది. తద్వారా వారి దవడలు బయట పడతాయి.
(ఖుర్ ఆన్ 14: 16,17) నరకవాసుల గాయాల నుండి ప్రవహించే చీము, నెత్తురు, మరిగే నీరు నరకవాసులకు త్రాగటానికి ఇవ్వబడతాయి .
(Brihadaranyaka Upanishath 3:2:10) ఎవరైతే శాశ్వతకీర్తి కలిగినటువంటి దేవుణ్ణి గుర్తించడో అట్టివారు ఎన్ని హోమాలు,యజ్ఞాలు, యాగాలు, తపస్యలు చేసినా ఉత్తమ స్థానాన్ని పొందలేరు.
See how Quran festilies the above poem:
పై వాక్యాన్ని ఖుర్ ఆన్ ఏవిధంగా వివరిస్తుందో చూడండి.
విశ్వాసాన్ని తిరస్కరించినవారి కర్మలు వృధా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేర్తారు. (ఖుర్ ఆన్ 5:5)
అందువలన ఖుర్ ఆన్ దేవుని ఏకత్వం గురించి తెలుసుకోవడానికి, మరియు ఏవిధంగానైతే పురాతన గ్రంధాలు ఆయన ఏకత్వం గురించి ప్రబోదిస్తున్నాయో తెలియజేయడానికి దేవుడు పంపించిన అంతిమ తీర్మానం. వేదాలు, పురాతన గ్రంధాలు దేవుని ఏకత్వం మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) గురించి తెలియజేస్తున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు చదివిన పండితులు మాకు చెప్పలేదని తప్పించుకోవడానికి వీలు లేదు. దేవుడు ప్రతి మనిషి కి వివేకాన్ని, ఆలోచించే శక్తిని ప్రసాదించాడు కాబట్టి సృష్టి కర్తను గుర్తించడం మన బాధ్యత.
సోదరులారా ! పురాతన గ్రంధాలన్నీ కూడా దేవుడు ఒక్కడే అని తెలియజేశాయి. రండి! ఎవరైతే మనల్ని సృష్టించాడో ఏ తారతమ్యం, కల్మషం లేకుండా ఆ ఒక్క సృష్టి కర్త అయిన అల్లాహ్ ను మాత్రమె ఆరాధించుదాము. సర్వ మానవుల కొరకు పంప బడ్డ, దేవునికి సాటిని నిలబెట్టని అంతిమ దైవ గ్రంధమైన ఖుర్ ఆన్ ద్వారా శాంతియుతమైన, విధేయతా పరమైన సమాజాన్ని స్థాపిద్దాము.
సర్వ శక్తి సంపన్నుడైన అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు మన పై కురవాలని, మాకు రూజుమార్గం చూపించాలని కొరుదాము. (ఆమీన్)
ఈ ప్రతిపాదన పట్ల వారు విముఖత చూపినట్లైతే, మేము ముస్లిములము (దైవవిదేయులము) అన్న విషయానికి సాక్ష్యులుగా ఉండండి. అని వారికి చెప్పెయ్యండి. (ఖుర్ ఆన్ 3:64)
The God of entire mankind is one.
సర్వ మనవ జాతికి దేవుడు ఒక్కడే .
ఖుర్ ఆన్ అంతిమ సందేశం:-
సర్వలోకాలకు సృష్టికర్త ఒక్కడే అని విశ్వసించి,
ఆయన అంతిమ దైవప్రవక్తగా మహమ్మద్(స) వారిని స్వీకరించి,
ఆయనపై అవతరింపచేసిన ఖుర్ఆన్ గ్రంధాన్ని అనుసరిస్తూ
మంచిజీవితం గడిపే వారికి శాశ్వత స్వర్గాశుభాలు వున్నాయి.
దైవాన్ని, దైవప్రవక్తలను, దైవగ్రంధాన్ని తిరస్కరించి
తమ మనోవాంఛలను అనుసరించే వారికి వ్యధాభరిత మైన శాశ్వత నరక శిక్షలు సిద్ధం చేయబడి ఉన్నాయి .
నా ధార్మిక సోదరులారా...! మనమంతా ఏదో ఓరోజు మృత్యువు ఒడిని చేరవలిసిందే, మరి ఆ మరణం తరువాత మీరు శాశ్వత నరకo నుండి రక్షించబడి స్వర్గ శుభాలను పోoదాలనుకుంటే, ఇకపై మీ జీవితాన్ని దైవవిధేయుడిగా (ముస్లింగా) గడపాలనుకుంటే, మనస్పూర్తిగా ఇలా సాక్ష్యం పలకండి... "అష్ హదు అల్లాహ్ ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహూ". నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ ఒక్కడే అని ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడని,
ముహమ్మద్(స.అ. సం) ఆయన ప్రవక్త మరియు దాసుడు అని . చివరగా ఈ ఖుర్ ఆన్ వాక్యాలను గమనించండి.
మీ ప్రభువు వద్దనుండి సత్యం (ఖుర్ ఆన్) వచ్చేసింది. ఇష్టమైన వారు దీన్ని స్వీకరించంవచ్చు. ఇష్టంలేని వారు దీన్ని తిరస్కరించవచ్చు మేము దుర్మార్గులకోసం శాశ్వత నరకాన్ని సిద్దపరచి వుంచాం.(18:27)
ఎవర్తితే సత్యాన్ని తిరస్కరిస్తారో వారికి కటినమైన శిక్షపడుతుంది. ఎవర్తితే విశ్వసించి సత్యర్మలు చేస్తారో వారికి క్షమాపణ, గోప్ప ప్రతిఫలం (శాశ్వత స్వర్గం) దొరుకుతుంది. దివ్యఖుర్ఆన్ (35:7)
ధర్మం విషయంలో నిర్బంధంకాని, బలవంతంకాని లేదు. (ఖుర్ ఆన్ 2:256)
దివ్య ఖుర్'ఆన్ అల్లాహ్ తరపునుండి వచ్చిందని
విశ్వసించడం
దివ్య ఖుర్'ఆన్ ను చదవటం . (పారాయణం)
దివ్య ఖుర్'ఆన్ ను అర్ధం చేసుకోవడం.
దివ్య ఖుర్'ఆన్ పై అమలు జరపటం.
దివ్య ఖుర్'ఆన్ సందేశాన్ని
ఇతరులకు అందజేయటం.
దివ్య ఖుర్'ఆన్ అల్లాహ్తరపునుండి వచ్చిన చివరి పవిత్ర గ్రంధం:
(ఖుర్'ఆన్ 14:15) "సర్వమానవులకు ఇదొక సందేశం, వారిని హెచ్చరించాలని యదార్ధంగా దేవుడు కేవలం ఒక్కడేనని వారు తెలుసుకోవాలని బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది పంపబడింది ........
దివ్య ఖుర్'ఆన్ సమస్త మానవ సమస్యలకు పరిష్కారం ఇది ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన గ్రంధం సర్వ మానవులకు ఇదొక సందేశం కారుణ్యం మరియు వివేకంతో నిండి ఉన్న గ్రంధం ఈ గ్రంధం అవిశ్వాసులకు ఒక హెచ్చరిక. ఋజుమార్గం తప్పిన వారికి మార్గ దర్శకం. సత్యాసత్యాలను వెరుపరచే ఆదేశాలు ఇందులో ఉన్నాయి.
అల్లాహ్ ఆదమ్ (అ.స) కు ఇలా ఆజ్ఞాపించాడు:
(అల్ బఖర 2:36-38) "ఇక మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి మీరు ఒకరికొకరు శత్రువులు ఒక పరిమిత కాలం వరకు భూలోకంలో ఉంది అక్కడే జీవితం గడపవలసి ఉంది ...... మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. ఇకపై నాతరపునుండి ఏదైనా ఉపదేశం (సందేశం, గ్రంధం) మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏవిధమైన భయంకాని విచారం కాని కలిగే అవకాసం ఉండదు....."
(అర్రాద్; 13:38) "ఇలా ఈ విశ్వం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అల్లాహ్ఎన్నో గ్రంధాలను పంపాడు" ప్రతీ యుగానికి ఒక గ్రంధం ఉన్నది .....
(ఖుర్'ఆన్ 10:57) "మానవులారా! మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి హితోపదేశం వచ్చేసింది. అది హృదయాల వ్యాధులకు స్వస్థత.దానిని స్వీకరించేవారికి అది మార్గ దర్శకత్వం, కారుణ్యం ......."
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) కాలంలో చాలా మంది అవిశ్వాసులు అరబ్బు ముష్రికులు ఖుర్'ఆను అబద్ధమని తిరస్కరించారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) స్వయంగా కల్పించి చెబుతున్నాడని అనేవారు.
అల్లహ్ వారితో అన్నాడు:
(ఖుర్'ఆన్ ; 17:88) "ఒకవేళ మానవులూ, జిన్నాతులు అందరూ కలిసి ఈ ఖుర్'ఆను వంటి దానిని దేనినైనా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయులైనప్పటికి ...."
(హూద్; 11:13) "ప్రవక్తయే దానిని స్వయంగా ఈ గ్రంధాన్ని కల్పించాడని వారు అంటున్నారా? అయితే ఇలా అను " సరే విషయం గనుక ఇదే అయితే ఇటువంటి కల్పించబడిన పది సూరాలను మీరు రచించి తీసుకురండి. అల్లాహ్ ను తప్ప (మీ ఆరాధ్య దైవాలలొ) ఎవరినైనా సహాయం కొరకు పిలువగలిగితే పిలుచుకోండి మీరే గనుక (ఆరాధ్య దైవాలుగా భావించడంలో) సత్యవంతులే అయితే...."
ఇప్పుడు కూడా ఈ పని ఏ ఒక్కరూ చేయలేక పోయారు. ఇప్పుడు అల్లహ్ వారికి ఇంకా సులభతరం చేశాడు.
(ఖుర్'ఆన్ 10:38) "ప్రవక్తయే దీనిని స్వయంగా కల్పించి రచించాడని ఈ ప్రజలు అంటున్నారా ఏమిటి? ఇలా అను "మీరు గనుక మీ ఆరోపణలో సత్యవంతులే అయితే ఇటువంటి సూరా ఒకదానిని రచించి తీసుకురండి. ఒక్క అల్లహ్ తప్ప ఎవరెవరిని పిలువగలరో సహాయం కొరకు పిలుచుకోండి".
(ఖరు'ఆన్ 2: 23-24) "మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంధం గురించి, అది మా గ్రంధం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లు అయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి, మీ సహచరులందరినీ పిలుచుకోండి ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్ని అయినా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి, కాని మీరు అలా చేయకపోతే "నిశ్చయంగా ఎన్నటికి చేయలేరు. భయపడండి, మానవులు, రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి అది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది."
ఈ ఖుర్'ఆన్ సర్వ మానవుల కొరకు అవతరించింది:
(ఖుర్'ఆన్ 2:185) "పవిత్ర ఖుర్'ఆన్ అవతరించిన నెల రామజాను నెల. మానవులందరికీ (ఈ గ్రంధం) మార్గదర్శకం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి....."
(ఖుర్'ఆన్ ; 14:52) "సర్వమానవులకు ఇదొక సందేశం వారిని హెచ్చరించాలని, యదార్ధంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది పంపబడింది...."
దివ్య ఖుర్'ఆన్ చదవడం (పారాయణం) :-
(ఖుర్'ఆన్ ; 96:1) "నమాజు, జకాటు, ఉపవాసం, హజ్ కంటే ముందు అల్లహ్ అవతరింపజేసిన మొదటి ఆయాతు 'పఠించు' "ఇఖ్రా" చదువు సర్వాన్ని సృష్టించిన నే ప్రభువు పేరుతో ...."
అందుకని అల్లాహ్ అవతరింపజేసిన ఆయతులను చదవటం తప్పనిసరి. మనం ప్రతీ రోజు ఖుర్'ఆన్ చదవాలి. జ్ఞాపకం చేసుకోవాలి మరియు నమాజులో ఉత్తమమైన రీతిలో పారాయణం చేయాలి.
(ఖుర్'ఆన్ 29:45) "వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంధాన్ని పారాయణం చేయి ...."
(తిర్మిజీ; హదీసు 1003) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఎవరైతే ఖుర్'ఆన్ పారాయణం చేస్తారో వారు దాని ప్రతిఫలం వారి ప్రభువు వద్ద పొందుతారు.
ఎవరైతే అరబ్బీ అర్ధం చేసుకోలేరో వారు కేవలం ఖుర్'ఆన్ పారాయణం చేసినా వారికి ప్రతిఫలం ఉన్నది.
ఖుర్'ఆన్ ను అర్ధం చేసుకోవటం:
చాలా మంది ఖుర్'ఆన్ ను చదువుతారు కాని దాని నుండి సరియైన మార్గం పొందరు, ఋజుమార్గం పొందరు. ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ చదివే పుస్తకం ఖుర్'ఆన్ మరియు అన్నింటికంటే ఎక్కువ అర్ధం ఎక్కువ అర్ధం చేసుకోకుండా చదివే పుస్తకం కూడా ఖుర్'ఆనే. దీనికి కారణం ఒక్కటే మాకు అరబ్బీ భాష రాదు.
అల్లాహ్ పంపిన గ్రంధం గురించి తెలుసుకోవటానికి దానిని సరిగా అర్ధం చేసుకోవటానికి మనము తప్పకుండ అరబీ భాష నేర్చుకోవాలి. ఇదే సరైన మార్గం. అర్ధం చేసుకోవటానికి మరియు ఇద మన ధర్మం. అరబీ నేర్చుకోవడం చాలా తేలిక కాని ఒకవేళ ఎవరైతే అరబీ భాష నెర్చుకొలెరొ వారు తప్పకుండ ఖుర్'ఆన్ అనువాదం చదవాలి. వారు ఏ భాషలోనైతే బాగా అర్ధం చేసుకోగలరో ఆ భాషలోఖుర్'ఆన్ అనువాదం మార్కెట్ లో లభిస్తుంది. ఖుర్'ఆన్ ను అర్ధం చేసుకొని చదవటం వల్లనే మనలో భయభక్తులు జనిస్తాయి మరియు అల్లహ్ విధులు మనకు తెలుస్తాయి.
(ఖుర్'ఆన్ 25:72,73) "ఇంకా కరుణామయుని దాసులు ఎలాంటి వారంటే అబద్ధానికి సాక్ష్యులు కానివారు. వ్యర్ధమైన వాటి వైపుగా పోవటం జరిగితే సంస్కార వంతులు మాదిరిగా దాటి పోతారు. వారికి తమ ప్రభువు ఆయతులను వినిపించి హితబోధ చేయడం జరిగితే వారు దానిని గురించి అంధులుగా, చెవిటివారుగా ఉండిపోతారు."
(ఖుర్'ఆన్ ; 47:24) "అల్లాహ్ శపించిన వారూ అందులుగానూ, బదీరులుగాను, చేసిన వారు వీరే వారు ఖుర్'ఆన్ గురించి ఆలోచించ లేదా? లేక వారి హృదయాలకు తాళాలు పడి ఉన్నాయా?"
(ఖుర్'ఆన్ 2:242) "ఈ విధంగా అల్లహ్ ఆజ్ఞలను మీకు స్పష్టంగా తెలుపుతాడు. మీరు అర్ధం చేసుకుని ప్రవర్తిస్తారని ఆశించబడుతుంది ....."
(ఖుర్'ఆన్ 24:1-3) "ఇది మేము అవతరింపజేసిన ఒక సూరా (అధ్యాయము) మేము దానిని విధిగా చేశాము. మీరు గుణపాఠం నేర్చుకుంటారేమో అని అందులో మేము స్పష్టమైన ఉపదేశాలను అవతరింపజేశామ..."
(సునన్ ఇబ్నె మా'జా 1అ. 16, హదీస్; 219) ఎవరైనా ఖుర్'ఆన్ యొక్క ఆయాతు అర్ధం చేసుకొని (దాని ప్రకారం నడుచుకుంటాడో) చదువుతాడో వారికి 100 నఫిల్ నమాజుల ప్రతిఫలం లభిస్తుంది.....
దీని తర్వాత ఎక్కడైనా అర్ధం కాక పొతే మీకు తెలియక పొతే అల్లహ్ ఇలా ఆదేశిస్తున్నాడు:
(ఖుర్'ఆన్ ; 16:43) "మీకు తెలియక పొతే జ్ఞాపిక (గ్రంధ జ్ఞానం) కలవారిని అడగండి"
ఖుర్'ఆన్ ఆదేశాలు అమలు జరపడం:
(ఖుర్'ఆన్ 39:53-58) "ఓ ప్రవక్తా! ఇలా అను మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. మీమీడకు శిక్ష రాకమునుపే మీకు ఎవరినుండి సహాయం లభించని పరిస్థితి ఏర్పడక మునుపే మీరు మీ ప్రభువు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి. మీకు తెలియకుండానే మీ మీదకు అకస్మాత్తుగా శిక్ష రాకముందే మీ ప్రభువు పంపిన గ్రంధంలోని ఉత్తమమైన విషయాలను అనుసరించండి...."
ముస్లిం అనే అరబీ పదం "స్లిమ్" మరియు "స్లం" నుండి వస్తుంది. దీని అర్ధం తన ఇష్టా ఇష్టాలను వదిలి అల్లహ్ ఆదేశాల ప్రకారం జీవనం కొనసాగించే వాడు ముస్లిం. అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఖుర్'ఆన్ మరియు హదీసు ప్రకారం నడిచేవాడు.
మనకు మనం ముస్లిం అని అంటాము. కాని దాని ప్రకారం నడుచుకోము ; ఎందుకు?
ప్రతి ముస్లిం ఎవరైతే నేను ముస్లిం అని అంటాడో వారు ఖుర్'ఆన్ ఆదేశాలు, ఆజ్ఞలను పూర్తి చేయాలని హదీసు ప్రకారం, అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ప్రకారం నడుచుకోవాలి.
(ఖుర్'ఆన్ ; 61:2-4) "విశ్వాసులారా! మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చేబుతారెందుకు? మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లాహ్ దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం. అసలు అల్లహ్ కు ఆయన మార్గంలో శీసంతో పోసిన గోడవలే దృఢమైన బారులు తీసి నిలబడి పోరాడే వారంటేనే ఇష్టం...."
(ఖుర్'ఆన్ 2:208) "మీరు ఇస్లాములో పూర్తిగా ప్రవేశించండి. షైతాను అడుగుజాడలు త్రోక్కకండి."
మనం ఇస్లాం మరియు ఖుర్'ఆన్ కట్టుబాట్లను పూర్తిగా నిర్వహించాలి సగం విధేయత చూపడం సున్నా "O" తో సమానం.
(ఖుర్'ఆన్; 3:103) "అందరూ కలసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి మరియు విభేదాలలో పడకండి...."
అల్లాహ్ త్రాడు అంటే దివ్య ఖుర్'ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) యొక్క (సహీ హదీస్) ప్రామాణికమైన హదీసుల ప్రకారం నడుచుకోవడం అవుతుంది. కేవలం ఖుర్'ఆన్ పారాయణం వల్ల స్వర్గ ప్రవేశం దొరకదు. ఖుర్'ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఆదేశాల కనుగుణంగా తమ జీవన విధానం కొనసాగిస్తేనే స్వర్గ ప్రాప్తి జరుగుతుంది.
ఖుర్'ఆన్ సందేశం ఇతరులకు అందజేయడం:
(ఖుర్'ఆన్ ; 2:159) "మేము అవతరింప జేసినా స్పష్టమైన జ్ఞానబోధలు ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరికీ మార్గ దర్శకత్వం కోసం అని మేము మా గ్రంధంలో విశతం చేసిన తర్వాత కూడా వాటిని దాచేవారిని అల్లహ్ తప్పకుండా శపిస్తాడు ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు."
(ఖుర్'ఆన్ 3:110) "ఇకనుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే ఎందుకంటే, మీరు మంచిని చేయండి అని ఆగ్నాపిస్తారు, చెడునుండి ఆపుతారు. మరియు అల్లహ్ ను విశ్వసిస్తారు."
అల్లహ్ ముస్లిములను ఉత్తమ సమాజంగా బిరుదు ఇచ్చాడు. ఎందుకంటే, మీరు మంచి వైపు పిలుస్తారు. చెడునుండి ఆపుతారు. ఒకవేళ మనం మంచి వైపుకు ఇస్లాం వైపుకు ఒకే దైవం వైపుకు ఆహ్వానించక పొతే మరియు చెడునుండి అంటే బహుదైవారాధన, విగ్రహారాధన మొదలైన వాటి నుండి ఆపక పొతే ఉత్తమమైన సమాజం ఎలా అవుతాము?
(ఖుర్'ఆన్ 3:104) "మీలో మంచి వైపుకు పిలిచే వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించే వారు కొందరు తప్పకుండ ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు."
(ఖుర్'ఆన్ 41:33) "అల్లహ్ వైపుకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లింను అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు...."
ఇస్లాం వైపునకు ఆహ్వానించడం, ఖుర్'ఆన్ సందేశాన్ని ఇతరులకు అందజేయడం ప్రతి ముస్లిం యొక్క విధి. వారు విశ్వసించిన లేక తిరస్కరించినా మన ధర్మం సత్యాన్ని అందజేయటం ఋజుమార్గం చూపటం అల్లహ్ బాధ్యత.
(ఖుర్'ఆన్ ; 2:272) "ప్రవక్తా! ప్రజలను సత్య మార్గంలో నడిపించే బాధ్యత నీపై లేదు. తానూ కోరిన వారిని అల్లహ్ యే సత్య మార్గంతో నడుపుతాడు...."
(ఖుర్'ఆన్;88:21-22) "సరే అయితే ప్రవక్తా హితబోధ చేస్తూ ఉండు. నీవు కేవలం హితబోధ చేసేవాడవు మాత్రమే.."
(సహీ బుఖారి; 4, హదీస్; 3461) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) : ఒకవేళ మీకు ఖుర్'ఆన్ యొక్క ఒక్క ఆయత్ సరిగా తెలిస్తే దానిని ఇతరులకు అందజేయడం మీ కర్తవ్యం
(బుఖారి; 7: 5027) మీలో ఉత్తమమైన వ్యక్తి ఎవరంటే ఖుర్'ఆన్ అర్ధం చేసుకుని ఇతరులకు బోధించేవాడు.
అల్లాహ్ ప్రవక్తలను పంపేది శుభవార్తను ఇచ్చేందుకు మరియు హెచ్చరిక చేసేందుకు. ఈ క్రింది ఆయతుల ద్వారా తెలిసేదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) అల్లహ్ తరపు నుండి పంప బడిన చిట్ట చివరి ప్రవక్త. విశ్వాసులకు సుభవార్త ఇచ్చేందుకు మరియు అవిశ్వాసులకు హెచ్చరించేందుకు పంపబడ్డారు. ఋజుమార్గం పై తీసుకురావడం ఆయన బాధ్యత కాదు కాని అల్లహ్ ఆయతులను చదివి వినిపించడం మాత్రమే.
(ఖుర్'ఆన్;41:53) "మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము. వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖుర్'ఆన్ నిస్సందేహంగా సత్యమేనని వారికి విశదమయి పోతుంది"
అంటే ప్రళయం వరకు అల్లహ్ ప్రతి మనిషికి తన సూచనలను చూపిస్తాడు. స్వయంగానైనా కావచ్చు. ఎవరిద్వారానైనా కావచ్చు.
(ఖుర్'ఆన్ 18:1-5) "అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. అందులో ఏ విధమైన వకృత్వాన్ని ఉంచలేదు. అది సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంధం, దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించాలని, విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది అనే శుభవార్తను అందులోనే కలకాలం ఉంటారు అనే శుభవార్తను అందజేయాలని ఇంకా అల్లహ్ ఎవరినో కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టాలని......"
మనలో ఎంతమంది ఈ పని చేస్తున్నారు? అల్లాహ్ హ్ మనకు ఆదేశించిన పని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) చేసిన పని. మనలో ఎంత మంది చేస్తున్నారు? వేళ్ళలో లెక్క పెట్ట వచ్చు. మనం ఒకవేళ ఈ పని చేయటంలో విఫలం అయిపోతే.
(ఖుర్'ఆన్ ; 47:38) "ఒకవేళ మీరు విముఖులైతే అల్లహ్ మీ స్థానంలో మరో జాతిని దేన్నయినా తీసుకువస్తాడు. వారు మీ వంటి వారై ఉండరు....."
(ఖుర్'ఆన్ ; 103:1-3) "కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురి అయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండే వారు ఒకరికొకరు సత్యొపదేశం, సహన బోధ చేసుకునేవారు తప్ప....."
No comments:
Post a Comment