ఖుర్ఆన్ మరియు సైన్స్

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ 


పరిచయం

ఈ భూగ్రహంపై మానవ జీవితం ఆరంభమైనప్పటి నుండి, మనిషి అనునిత్యం తమ చుట్టూ ఉన్న ప్రకృతిని, అలాగే ఈ విశ్వంలో తన స్థానం గురించి, జీవిత పరమార్ధం గురించి అర్ధం చేసుకోవడానికి శోధన చేస్తూనే ఉన్నాడు. శతాబ్దాల కాలంగా, విభిన్న నాగరికతలలో జరిగిన ఈ సత్యశోధనలో మత వ్యవస్థ మానవ జీవితానికి ఓ రూపాన్నిచ్చి, చారిత్రిక దిశను చాలా మేరకు నిర్ధారించింది, దివ్య గ్రంధాలుగా ప్రకటించబడిన వాటిపై కొన్ని మతాలు ఆధారపడగా, మిగిలినవి మానవుని అనుభావంపై ఆధారపడినవి. 

ఇస్లామీయ విశ్వాసానికి ముఖ్యమైన మూలం 'ఖుర్'ఆన్' గ్రంధం. ముస్లిముల విశ్వాసం ప్రకారం ఈ గ్రంధం పూర్తిగా దివ్య సందేశమే. అంతేకాకుండా ఈ గ్రంధం మానవజాతినంతటికి మార్గదర్శకత్వాన్ని చూపుతుందని విశ్వసిస్తున్నారు. ఖర'ఆన్ యొక్క సందేశం  అన్ని కాలాలకు వర్తిస్తుందని వీరు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ గ్రంధం అన్ని కాలాలకు సరిపోయే విధంగా ఉండవలసి ఉంది. దివ్యకుర్'ఆన్ ఈ పరీక్షను దాటగలిగిందా? ఈ చిరుపుస్తకంలో సైన్స్ ద్వారా కనుగొనబడి నిర్ధారణ కాబడిన శాస్త్రీయ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని, ఖుర్'ఆన్ దైవ సందేశమని భావించే ముస్లిముల యొక్క విశ్వసనీయతను ఉన్నదున్నట్లుగా విసలెసించాదలిచాను. 

ప్రపంచ నాగరిక చరిత్రలోని ఓ కాలంలో మానవుని యొక్క జ్ఞానానికి, తర్కానికి కాకుండా అద్భుతాలకు లేదా అద్భుతాలుగా తెలుసుకున్న విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడేది. అద్భుతం అంటే సాధారణంగా మనిషి వివరించ సాధ్యం కానటువంటిది ఏదైనా కావచ్చు. అయినప్పటికీ మనం ఈ విషయంలో అంటే ఒక విషయం అద్భుతం అని అంగీకరించడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముంబాయినుండి వెలువడే 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' న్యూస్ పేపర్ 1993లో ఒక వార్త వచ్చింది. 'బాబా పైలట్' అనే ఓ సాధువు వరుసగా 3 పగళ్ళు మరియు రాత్రుళ్ళు ఓ నీటి ట్యాంక్లో మునిగి ఉన్నట్లుగా ప్రకటించడం జరిగిందని. 

అయితే విలేఖరులు అయన కూర్చున్న నీటిట్యాంక్ అడుగు భాగాన్ని పరిశీలించాలని కోరినప్పుడు, ఆతను నిరాకరించడం జరిగింది. అతడు వాళ్ళతో శిశువును ప్రసవించే ఓ స్త్రీ యొక్క గర్భాశయాన్ని ఎలా పరీక్షించగలరు? అని వాదనకు దిగాడు. ఇది పబ్లిసిటీ కోసం చేసిన ఓ గిమ్మిక్, అంతే. కాస్త వివేకంతో ఆలోచించగలిగే ఈనాటి ఆధునిక మానవుడు ఇలాంటి అద్భుతాలను అంగీకరించడు. ఇలాంటి తప్పుడు అద్భుతాలే గనుక 'దివ్యత్వాన్ని' పొందినట్లు తెలియజేసే పరీక్షలే అయితే, ప్రపంచంలో ప్రముఖ ఇంద్రజాలికుడుగా పేరుగాంచిన పి. సి. సర్కార్ గారిని, ఆయన యొక్క మేజికల్ ట్రిక్స్ ను చూసినవారు, ఆయనను దివ్యత్వం పొందిన వ్యక్తులలో గొప్పవారిగా అంగీకరించవలసి వస్తుంది. 

ఈ  గ్రంధం మానవరచన ఎంత మాత్రం కాదని అది దివ్యసందేశంగా ప్రకటించబడినదంటే, నిజానికి ఓ అద్భుతాన్ని ప్రకటించినట్లే, ఇటువంటి ప్రకటన ఏ కాలంలో అయినా సరే, ఆ కాలానికి సంబంధించిన ప్రామాణికతలద్వారా సులభంగా, ఖచ్చితంగా పరీక్షించబడగలగాలి. అద్భుతాలకే అద్భుతమైన ఖుర్'ఆన్ చిట్టచివరి దైవసందేశంగానే కాకుండా, మానవజాతిపై దైవం యొక్క కారుణ్యంగా ముస్లింలు విశ్వసిస్తారు. కాబట్టి మనం వారి యొక్క విశ్వాసం యదార్ధమా? కాదా? అనే విషయాన్ని పరిశోధిద్ధాం. 


దివ్య ఖుర్'ఆన్

ఖుర్'ఆన్ యొక్క ఛాలెంజ్ 

     సాహిత్యం కవిత్వాలు అనేవి అన్ని సంస్కృతంలోనూ మనిషి యొక్క భావవ్యక్తీకరణకు మరియు అతనిలోని సృజనాత్మకతను తెలియజేసే సాధనాలు. సాహిత్యానికి, కవివానికి మాత్రమె సమాజంలో ఉన్నత స్థానమిచ్చిన కాలాన్ని కూడా ప్రపంచం చూసింది. నేడు అదే స్థానంలో సైన్స్ మరియు టెక్నాలజీ ఆసీనమై ఉన్నాయి. 

     అరబీ భాషా సాహిత్యానికి సంబంధించినంత వరకు, ఈ భూమిపై అరబీలోని అత్యన్నత సాహిత్యం మరేమిటో కాదు 'దివ్య ఖుర్'ఆన్' అనే విషయాన్ని ముస్లిములే కాకుండా, ముస్లిమేతరులు కూడా అంగీకరిస్తారు. ఈ విషయమై ఖుర్'ఆన్ మానవజాతిపై విసిరిన సవాల్ క్రింది ఆయత్లలో ఇవ్వబడింది. 

و إن كنتم في ريب مما نزلنا على عبدنا فا توو
كم بيسوو رتن ممثليه واد عو شو هداء 
 من دوو ن الله إن كن تم صاء د قيين . فا  إن ل تفعلهو لن تف علو
فاتقوا ناء رالتى و قوو د ها أناسوالحجارة أعدت ليل كافرين

"మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంధం గురించి, అది మా గ్రంధం ఆవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్నయినా పొందండి. మీరు అలా చెయ్యకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చెయ్యలేరు - భయపడకండి, మానవులు, రాళ్ళు ఇంధనంకాగల ఆ అగ్నికి. అది సత్యతిరస్కారులకొరకు తయారు చెయ్యబడింది"
(దివ్య ఖుర్'ఆన్ 2 : 23-24)

ఈ సవాల్ ఏమిటంటే, దివ్య ఖుర్'ఆన్లో ఉన్న అధ్యాయంలాంటి ఏదైనా ఓ అధ్యాయాన్ని (సూరాను) తయారు చేయమని. ఇటువంటి సవాల్ ఖుర్'ఆన్ లో చాలా చోట్ల పునరావృతం అయింది. కాని ఈ సవాల్కు దీటుగా, ఝుర్'ఆన్ అధ్యాయానికి ఉండే సుందరత, వాక్పటుత్వం, గంభీరత, అర్ధాన్ని పోలిన అధ్యాయాన్ని ఈ రోజువరకు కూడా ఎవరూ రచించలేక పోయారు. 
________________________________________________________________________________
1. దివ్య ఖుర్'ఆన్ 2:23-24 అంటే 2 అనేది ఆదాయం (సూరా) నంబర్ను సూచిస్తే 23-24 అనేది 23 నుండి 24 వరకు ఉన్న వాక్యాలు (ఆయత్లుగా) సూచిస్తుంది. 

తనకు అందుబాటులో ఉన్న ఏదైనా ఉత్తమ కవిత్వపు గ్రంధంలో 'భూమి చదునుగా బల్లపరుపుగా ఉందని' చెబితే వివేకమున్న ఏ ఆధునిక మానవుడు కూడా విశ్వసించడు. ఎందుకంటే ఇప్పుడు మనం జ్ఞానానికి, తర్కానికి, సైన్స్ కి ప్రాముఖ్యతనిచ్చే కాలంలో ఉన్నాము కాబట్టి. ఖుర్'ఆన్ యొక్క సాటిలేని అందమైన భాషనే ప్రామాణి కంగా తీసుకొని, ఖుర్'ఆన్ దివ్యసందేశమని ప్రకటించబడింది. అంటే, ఆ గ్రంధంలోని తర్కం, వివేకాలయొక్క బలాన్ని బట్టి కూడా అది అంగీకరించబడ గలగాలి. 

ప్రముఖ భౌతికశాస్త్రవేత్త మరియు నోబెల్ ప్రైజ్ గ్రహీత అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం 'మతం లేని సైన్స్ కుంటిది. అలాగే సైన్స్ లేని మతం గుడ్డిది'.  కాబట్టి మనం ఖుర్'ఆన్ ని అధ్యయనం చేద్దాం మరియు ఖుర్'ఆన్ కి, ఆధునిక శాస్త్రవిజ్ఞానానికి సంబంధం ఉందా? లేదా? అన్న విషయాన్ని విశ్లేషిద్దాం. 

ఖుర్'ఆన్ సైన్స్ (Science) పుస్తకం కాదు. కాని సైన్స్ (signs) అంటే సూచనలున్న పుస్తకం. సూచనలు అంటే ఆయత్ లు లేదా వాక్యాలు, 6 వేలకు పైగా సూచనలున్న ఖుర్'ఆన్లో వెయ్యికి పైగా సూచనలు science సంబంధించినవే. 

చాల సార్లు సైన్స్ యు - టర్న్ తీసుకుందని మనకందరికీ తెలుసు. ఈ పుస్తకంలో ప్రామాణికత లేని ఊహలను, సిద్ధాంతాలను కాకుండా, నిర్ధారణ గావించబడిన సైంటిఫిక్ (శాస్త్రీయ) వాస్తవాలను మాత్రమే పరిసీలనలోనికి తీసుకోవడం జరిగింది. 

ఈ ఖుర్'ఆన్ గ్రంధంలో ఎన్నో వైజ్ఞానిక విషయాలు, ఆర్ధిక పరమైన విషయాలు, రాజకీయ అంశాలు, బాధ్యతలు, హక్కులు,స్త్రీపురుషుల సంబంధాలు, బాంధవ్యాలు, జరగబోవు సంఘటనలు, గడిచిన వృత్తాంతములు, ప్రళయదినం నాడు సంభవించే విషయాలు, తీర్పు దినం నాడు ఎదుర్కోబొవు విషయాలు, ప్రళయదినానికి ముందు జరిగే విషయాలు, హెచ్చరికలు,  స్వర్గం,నరకం యొక్క విశ్లేషణలు ఇలాంటి మరెన్నో విషయాలతో కూడిన మహోత్తర గ్రంధమే ఈ దివ్యఖుర్'ఆన్. 

నేడు ఎందరో శాస్త్రవేత్తలు మరెందరో ఆధునిక పరికరాలను ఉపయోగించి తెలుసుకున్న విషయాలను ఓ అక్షరజ్ఞానం లేని నిరక్షరాసి అయిన ముహమ్మద్ (స. అ. సం) వారు 1400 సంవత్సరాలకు ముందే తెలియజేసారు. దీన్ని బట్టి ఖుర్'ఆన్ మానవ కల్పితం కాదని, ఊహించి వ్రాయబడిన గ్రంధం కాదని, ముమ్మాటికీ ఇది దైవ గ్రధమని తెలియుచున్నది. మచ్చునకు ఖుర్ ఆన్ లో చెప్పబడిన వైజ్ఞాకికపరమైన కొన్ని విషయాలను చూద్దాం. 

స్త్రీ గర్భంలో పిండం ఎలా ఏర్పడుతుంది? ఆ తరువాత దశలదశలుగా ఎలా మార్పు చెందుతూ వృద్ధి చెందుతుంది. అనే విషయాల గురించి ఖుర్ ఆన్ లో చెప్పబడిన విషయాలను నేటి ఆధునిక వైద్యవిజ్ఞానము ద్వారా తెలుసుకున్న విషయాలను పోల్చి చూద్దాం.

ఖుర్'ఆన్ లో మానవసృష్టి గురించి ... 


إقراء بسم ربك الذي خلق  خلقل إنسان من علق 

"ఓ ప్రవక్తా! పఠించు సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి శ్రుజించాడు" (దివ్య ఖుర్'ఆన్ 96:1-2) 

వెన్నెముక ప్రక్కటెముకలనుండి దూకుడుగా వెలువడిన ఓ ద్రవబిండువు ద్వారా మనిషి సృష్టింపబడ్డాడు 

فليظ رل إنسان مما خليق  خليق من ماين دافق يقرج من بين صلب وترايب 

"కనుక మానవుడు తానూ ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడు  కొంచెం ఆలోచించాలి. వెన్నెముకకు, ప్రక్కటెముకలకు మధ్యనుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవపదార్ధంతో అతడు పుట్టించబాడ్డాడు." 
(దివ్య ఖుర్'ఆన్ 86:5-7)

"మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తర్వాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మారచాము, ఆ తరువాత ఈ బిందువుకు ముద్దా ఆకారాన్ని ఇచ్చాము, ఆ పైన ముద్దను కండగా చేశాము. తర్వాత మాంసపు కండను ఎముకలుగా చేశాము, ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము, ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. (ఖుర్'ఆన్ 23:12-14)

పై ఖుర్'ఆన్ వాక్యాలు  1) బిందువు 2) ముద్ద ఆకారము 3) కండ 4) ఎముకలు 5) ఎముకలపై మాంసము 6) ఆ తరువాత ఓ రూపంగా మారుతుందని మానవ సృష్టి గురించి వివరించాయి. ఇలా ఒక్కో దశ ఒక్కోలా ఉంటుందని ఖుర్'ఆన్ తెలియజేసింది. మొదటి దశలోని బిందువు - పురుషుని జననేంద్రియము నుండి వెలువడే బిందువు. అది స్త్రీ పురుషుల కలయిక వలన పుర్షుని నుండి వెలువడి స్త్రీ గర్భాశయంలో చేరుతుంది. ఆ తరువాత అది ముద్దగా మారుతుంది. 

మొదటి దశను సూచించటానికి, ఖుర్'ఆన్ లో అలక అనే అరబీ పదము వాడబడింది. అలక అనే పదానికి అరబీ భాషలో మూడు అర్ధాలు ఉన్నాయి. వాటిలో ఒక అర్ధం జలగ, మరో అర్ధం వ్రేలాడుతున్న మరియు మూడవ అర్ధం గడ్డకట్టిన. కాబట్టి ఆ బిందువు పిండంగా మారి క్రమంగా వృద్ధి చెందే విధానాన్ని గనుక జాగ్రత్తగా గమనిస్తే ఓ జలగను పోలినట్లు, అది వ్రేలాడుతున్నట్లు మరియు గడ్డకట్టిన రక్తపు ముద్దలా కనబడును. 

వీటి చిత్ర పటాలను The Developing Human - More and Persaud అను వైద్యవిజ్ఞానానికి సంబంధించిన పుస్తకంలో చూడవచ్చు. 

స్త్రీ గర్భంలో పిండం 'జలగ మాదిరిగానే రక్తాన్ని పీల్చుతూ వృద్ధి చెందుతుంది' అని, 'ఓ అంచుకు మాత్రమే అతుక్కుని మిగిలిన భాగం వ్రేలాడుతూ ఉంటుంది' అని వైద్యశాస్త్రం కనిపెట్టిన విషయాలు ఖుర్'ఆన్ లో తెలుపబడిన వాటితో ఎంత ఖచ్చితంగా సరి పోతున్నాయో మీరే గమనించండి.

రెండవ దశ: ఖుర్'ఆన్ రెండవ దశకు ముదగ అనే పేరు ఇచ్చినది. ముదగ అంటే అరబీ భాషలో మెత్తటి కండ అని అర్ధం. బబుల్ గమ్ ను కాసేపు నమిలి దానిని దవడ పళ్ళ మధ్యన అదిమి ఆ తరువాత బయటకు తీసి చూస్తె అది కనిపించే మెత్తటి కండ ఆకారాన్ని పోలి ఉంటుందని వైద్య శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది. ద్రవంలా కాకుండా మాంసపు కండలా ఉంటుంది.

క్రీ.శ; 1677 సంవత్సరంలో Hamm and Leevewnhock అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా పురుషుని ఇంద్రియముపై పరిశోధనలు జరిపి "పురుషుని నుండి వెలువడే వీర్యబిందువులో మనిషిని పోలిన సూక్ష్మరూపం దాగి ఉంటుందని, అది స్త్రీగార్భాశయంలో చేరిన తర్వాత క్రమంగా వృద్ధి చెంది శిశువు రూపం దాల్చుతుంది" అనే తప్పుడు సమాచారాన్ని అందించారు. ఇది నిజం కాలేదు. వీరి కంటే 1000 సంవత్సరములకు పూర్వమే ఎలాంటి పరిశోధనలు చేయకుండానే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవసృష్టి గురించి ఖచ్చితమైన విషయాలు తెలియజేశారంటే, అది కేవలం దైవానుగ్రహం మాత్రమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందరో ప్రముఖులు దీనిని స్వయంగా ఒప్పుకున్నారు.

     Professor Emeritus Keith L.More Embryology ఒక ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఆయన Anatomy Embryology (పిండోత్పత్తి మరియు శరీర నిర్మాణ శాస్త్రము) లలో పరిశోధనలు చేశారు. ఆయన The Developing Human అను గ్రంధమును రచించారు. ఈ గ్రంధం 8 భాషలలో అనువదించబడింది. దీనిపై ఆధారపడి మరెన్నో పరిశోధనలు జరిగాయి. అమెరికాలోని ఓ ప్రత్యెక కమిటీ వారు ఈ పుస్తకానికి వైద్య విద్యా రంగములో మొట్టమదటి స్థానాన్ని కల్పించారు. అంతేకాదు Professor Emeritus Keith L.More కెనడాలోని టొరంటో అను పట్నంలో University of Toronto లో Anatomy Professor గా కూడా పనిచేశారు. అంతే గాక Anatomy విభాగమునకు ఛైర్మన్ గా 8 సంవత్సరముల పాటు తన సేవలను అందించారు మరియు అమెరికా, కెనడాకు చెందినా Association of Anatomists and the council of the union of Biological Sciences కు ముఖ్య సలహాదారునిగా కూడా ఆయన తన సేవలను అందించారు.

1981 సంవత్సరములో సౌది అరేబియాలోని దమ్మామ్ లో జరిగిన 7వ Medical Conference లో Dr.Keith L.Moore గారు ఇలా వ్యాఖ్యానించారు. "మానవ శరీర నిర్మాణం, అది ఏర్పడే విధానం, అది స్త్రీ గర్భంలో వృద్ధి చెందే విధానం గురించి ఖుర్'ఆన్ లో చెప్పిన విషయాలు నేడు అభివృద్ధి చెందినా వైద్య విజ్ఞానం పరిశోధనలు చేసి చెప్పిన విషయాలలో ఎలాంటి వ్యత్యాసం లేదని చెప్పటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఎలాంటి పరిశోధనలు చేయకుండా ఇలాంటి విషయాలను ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) చెప్పగాలిగారంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన ఖచ్చితంగా సృష్టికర్తయగు అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్తయే మరియు ఖుర్'ఆన్ దైవ గ్రంధమే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు." దీనితో అక్కడి సభికులు Dr. Moore ని ఇలా ప్రశంసించారు. "ఏమి, మీరు ఖుర్'ఆన్ ను దైవగ్రంధంగా నమ్ముతున్నారా?" అప్పుడు Dr. Moore ఇంకా ఇదే  సభలో - పిండోత్పత్తి, దాని దసలు తెలియజేసే విధానము గురించి ఖుర్'ఆన్ లో మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ఉపదేశాలలో తెలియజేసిన పద్ధతే సరయినది. నేను ఖుర్'ఆన్ ను మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ఉపదేశాలను (హదీథ్ లను) ఆయన (సల్లల్లాహు అలిహివ సల్లం) సహచరులను (సహాబీలు) తెలియజేసిన విషయాలను నేను 4 సంవత్సరాల పాటు చదివాను. వాటిలో నాకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. క్రీ. శ; 6వ శతాబ్దంలోనే పిండోత్పత్తి గురించి ఏంటో ఖచ్చితమైన వివరాలు తెలియజేయబడ్డాయి. 

క్రీ. పూ. 4వ శతాబ్దంలో అరిస్టాటిల్ అను శాస్త్రవేత్త కోడిగ్రుడ్డుపై పరిశోధనలు చేసి తెలియజేసిన విషయాలు కూడా అంతంత మాత్రమే. 20వ శతాబ్దం వరకు మానవుని పిండోత్పత్తి గురించి కనిపెట్టినది చాలా తక్కువే అని చెప్పాలి. కాని 6వ శతాబ్దములోనే ఎలాంటి పరిశోధనలు జరపకుండానే సైన్స్ పై ఆధారపడకుండా చెప్పిన విషయాలు గమనించినట్లైతే ఖచ్చితంగా ఖుర్'ఆన్ దైవగ్రంధమే. ఎందుకంటే ఈ విషయాలు తెలియజేసిన ముహమ్మద్  (సల్లల్లాహు అలిహివ సల్లం) నిరక్షరాస్యుడు, శాస్త్రీయ పరిజ్ఞానము అంతకంటే లేనివారు. కాబట్టి ఖుర్'ఆన్ ఖచ్చితంగా దైవగ్రంధమే" అని ప్రకటించారు.


సత్ ఫా (చాలా చిన్న పరిమానంలోని ద్రవం) నుండి మానవులు సృష్టింపబడ్డారు 

ఘనతగలఖుర్'ఆన్ 11 సార్లకు తక్కువ కాకుండా మనిషి సత్ ఫా నుండి సృష్టింపబదినట్లుగా చెబుతుంది. ఈ సత్ ఫా అంటే చాలా చిన్న పరిమానంలోని ద్రవం లేదా ఓ కప్ ను ఖాళీ చేసేసిన తర్వాత కప్ లో ఉండే ద్రవం యొక్క బొట్టు. ఖుర్'ఆన్ లోని 22:5 మరియు 23:131 వాక్యాలతో కలిపి, ఈ విషయం ఖుర్'ఆన్ లోని చాలా వాక్యాలలో చెప్పబడింది. 

సైన్స్ ఇటీవలకాలంలో ధృవీకరించినదేమిటంటే విడుదలైన సుమారు 30 లక్షల వీర్య కనాలకి గాను ఒక కణమే ఓవమ్ (అంటే స్త్రీ బీజ కణం) ని గర్భోపత్తి చేయడానికి అవసరమౌతుంది. దీని అర్ధం 1/30,00,000 భాగం మాత్రమే లేదా వెలువడిన వీర్యకణాలపరిమాణంలో 0.00003 శాతం గర్భోత్పత్తికి అవసరమౌతుంది. 
_________________________________________________________________
ఇదే విషయం ఖర్'ఆన్ లోని 16:4,18:37,35:11,36:77,40:67,53:46,75:37 మరియు 80:19లలో కూడా చెప్పబడింది. 

మానవులు 'సులాల' (ద్రవపదార్ధం యొక్క సారం) నుండి సృష్టింపబడ్డారు 

ثم جعا ل  نسله من سلالاتنمن ماء ين مهين

"తరువాత అతని సంతతిని తుచ్చమైన ద్రవపదార్ధం వంటి ఒక సారంతో కొనసాగించాడు"(ఖుర్'ఆన్ 32:8)

అరబీ పదం సులాల అంటే, సారం లేదా మొత్తంలోని ఉత్తమ భాగం. చాలా లక్షలలో మగవాడు విడుదల చేసిన వీర్యకణాలలో ఒకే ఒకటి స్త్రీ బీజ కణములోనికి చొచ్చుకుపోవడం గర్భోత్పత్తికి అవసరమని మనకిప్పుడు తెలుసు. లక్షల సంఖ్యలలో ఉన్న వీర్యకణాలలోని ఒకే ఒక కణాన్ని 'ఖుర్'ఆన్' లో 'సులాల'గా చెప్పబడింది. స్వేచ్చగా చలించే కణాలు గల ద్రవపదార్ధాన్ని ఫ్లుయిడ్ అంటారు. సులాల అంటే ఇలాంటి ప్లూయిడ్ నుండి సుకుమారంగా సారాన్ని తీయడం అనే అర్ధాన్ని కూడా కలిగి ఉంది. ఇక్కడ ఉపయోగించిన 'ప్లూయిడ్' అనే పదం మగ మరియు ఆడ ఇరువురి యొక్క ప్రత్యుత్పత్తి జనకమయే సంయోగబీజమైన లైంగిక జీవకణ రసభాగాన్ని కలిగిన జెర్మినల్ ప్లూయిడ్ కి సంబంధించినది. (జెర్మినల్ అంటే తోలి పరిణామ అవస్తలో ఉన్న). గర్భోత్పత్తి ప్రక్రియలో స్త్రీ బీజకణము, వీర్యకణము రెండూ కూడా తమ పరిసరాలనుండి 'సారం'గా తీయబదినవే.

సత్ ఫతున్ అమ్ షాజ్ (ద్రవ మిశ్రమం) నుండి మనిషి సృష్టింపబడ్డాడు  

ఈ క్రింది ఖుర్'ఆన్ వాక్యాన్ని గమనించండి:  

إنا خالاقنالينسآن من نطفة أمشاج

"అతనిని ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము" (దివ్య ఖుర్'ఆన్ 76:2)

సత్ ఫతున్ అమ్ షాజిన్ అనే అరబీ పదానికి అర్ధం మిశ్రమ ద్రవాలు (కలిసిన ద్రవాలు) ఖుర్'ఆన్ వ్యాఖ్యాతలలో కొంతమంది వీటిని మగ లేక ఆడ ఏజెంట్లు లేదా ద్రవాలుగా వివరించారు. స్త్రీ మరియు పురుష సంయోగబీజమైన లైంగిక జీవకణ రస భాగాలు మిశ్రమం కాబడిన తర్వాత, జైగోట్ (రెండు యుగ్మకాలసంయోగం వాళ్ళ కలిగే జీవాణువు) ఇంకనూ సత్ ఫాను మిగిలి ఉంచుతుంది. మిశ్రమ ద్రవాలను - వివిధ గ్రంధుల నుండి వెలువడిన వివిధ స్రావాలనుండి తయారైన స్పెర్మాటిక్ ప్లూయిడ్ గా కూడా వివరించ సాధ్యమవుతుంది. 

కాబట్టి సత్ ఫతున్ మ షాజ్ అంటే - స్త్రీ, పురుష ప్రత్య్త్పత్తి జనకమయ్యే సంయోగ బీజకణమైన లైంగిక జీవకణరస భాగాలు (జెర్మినల్ ప్లూయిడ్స్ లేదా కణాలు) మరియు చుట్తో ఉన్న ద్రవాలలోని భాగాంకి సంబంధించిన అతి చిన్న పరిమాణంలోని మిశ్రమ ద్రవాలు. 


    లింగబేధాన్ని నిర్ణయించడం 

పూర్తిగా పరిణతి పొందిన గర్భస్థ పిండం యొక్క లింగబెధాన్ని అంటే 'ఆడ'లేదా 'మగ' అని నిర్ణయించేది. వీర్యం యొక్క స్వభావాన్ని బట్టేగాని స్త్రీ బీజ కణాన్ని బట్టి కాదు. బిడ్డ యొక్క లింగ బేధం, ఆడ లేక మగ అనే విషయం 23 వ క్రోమోజోములజత 'XX' లేదా 'XY' అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 

ప్రాధమికంగా గర్భోత్పత్తి సమయంలోనే  లింగబేధ నిర్ణయం జరుగుతుంది మరియు స్త్రీ బీజకణాన్నిగర్భోత్పత్తి చేసే వీర్యంలోని క్రోమోజోములయొక్క లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. 'X' ను  కలిగి ఉన్న వీర్యకణం స్త్రీ బీజకణాన్ని గర్భోత్పత్తి చేస్తే, గర్భస్థపిండం  'ఆడపిల్ల' ఒకవేళ'Y' ను కలిగి ఉన్న వీర్యకణం అయితే అప్పుడు ఆ గర్బస్థ పిండం 'మగ' అవుతుంది. 'XX' -ఆడ, 'XY' - మగ. 


و أنه خلق زوجين أذكر والأنثى  من نطفة إزاء تمنى 

"విడిచే ఒక బిందువు ద్వారా ఆడా మగలజంటను ఆయనే సృష్టించాడు" (దివ్య ఖుర్'ఆన్ 53:45-46)

'సత్ ఫా' అనే అరబీపదం అర్ధం - చిన్న పరిమాణంలో ద్రవం మరియు 'తమ్ నా' అంటే 'బయటకు విడుదలైనది లేదా నాటినది'. కాబట్టి సత్ ఫా ప్రత్యేకంగా 'వీర్యం'గా వివరించబడింది. ఎందుకంటే (దేహం నుండి) బయటకు వేలువడేది కాబట్టి. 

దివ్య ఖుర్'ఆన్ చెబుతుంది.   

ألم يك نطفة من مني يمنى  ثم كان علقة فخلق فسوى  
فجعل منه الزوجين أذكر والأنثى 

"అతడు (తల్లి గర్భంలో) కార్చబడిన నీచమైన ఒక నీటి బిందువు కాడా? తరువాత అతడు ఒక నెత్తుటి ముద్దగా మారాడు. ఆ తర్వాత అల్లాహ్ అతని శరీరాన్ని తయారు చేశాడు. ఆపై అతని అవయవాలను రూపొందించాడు. అటుపై దానినుండి స్త్రీ పురుషుల రెండు రకాల (జాతుల)ను సృష్టించాడు." (దివ్య ఖుర్'ఆన్ 75:37-39)

మరలా ఇక్కడ చిన్న పరిమాణం (బిందువు) లోని వీర్యం గురించే చెప్పబడింది (సత్ ఫతున్ మైన మనియ్యిన్ అనే పదం సూచిస్తున్నట్లుగా) మగవాడి నుండి వచ్చే వీర్యమే గర్భస్థ పిండం యొక్క లింగ బేధానికి (ఆడ లేదా మగ అనే నిర్ధారణకి) కారణమవుతుంది. 

భారత ఉపఖండంలోని అత్తా గార్లలొ ఎక్కువ మంది తమకు మనవడు (లేదా మనవళ్ళు) పుట్టాలని కోరుకుంటారు. తాము కోరుకున్న మనుమదిని కాఉన్దా మనుమరాలిని ప్రసవిస్తే, తరచుగా అత్తలు కోడళ్ళను నిందిస్తారు. మగ లేదా ఆడ పిల్లను ప్రసవించడానికి కారణం మగవాని వీర్యమే కాని, స్త్రీ బీజకణం కాదేనన్న విషయం వారికి తెలియదు. ఒకవేళ వారు నిందించాలనుకుంటే తమ కొడుకులను మాత్రమే నిందించాలి గాని, తమ కోడళ్ళను కాదు. ఎందుకంటే ఖుర్'ఆన్ మరియు సైన్స్ బిడ్డ యొక్క లింగబేధానికి కారణం పురుషుని ప్లూయిడ్సేనని నిర్ణయించాయి కాబట్టి.  

             الذي خلقك فسواك فعد لك  في أي صو رة ماشاء ركبك

"ఆయనే నిన్ను సృష్టించాడు. ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు. తానూ తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు." (ఖుర్'ఆన్ 82:7-8) 


                             గర్భస్థ పిండం మూడు చీకటి పోరాలచే రక్షింపబడుతుంది 

يخل قكم في بطني أمهاتكم خالقا من بعدي خلقن في ظلماتن ثلاثا 
"ఆయన మీ తల్లులగర్భాలలొ మూడేసి చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు" (దివ్య ఖుర్'ఆన్ 38:6)

 Professor Emeritus Keith L.More ఖుర్'ఆన్ లో చెప్పిన ఈ మూడు చీకటి పొరలను ఇలా వివరించారు 

1. Anterior abdominal wall of the mother (తల్లి యొక్క ఉదరపు గోడ ముందరి భాగం

2. the uterine wall (గర్భాశయ గోడ) 

3. the amino-chorionic membrane (గర్భస్థ పిండంపై పొర) 

و لقد خلقنا الإنسان من سلالة من طين  ثم جعلناه نطفة في قرار كين  ثم خلقنا النطفة علاقة فخلقنا العلاقة   

"మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తర్వాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మారచాము, ఆ తరువాత ఈ బిందువుకు ముద్దా ఆకారాన్ని ఇచ్చాము, ఆ పైన ముద్దను కండగా చేశాము. తర్వాత మాంసపు కండను ఎముకలుగా చేశాము, ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము, ఆ పైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము.(ఖుర్'ఆన్ 23:12-14)

ఈ పై వాక్యంలో 'అతనిని ఒక సురక్షితమైన స్థానంలో బిందువుగా మార్చాము' అని అల్లాహ్ చెప్పడం జరిగింది. దీనికోసం వాడిన అరబీ పదం 'ఖరారిన్ మకీన్'. దృడంగా వీపు కండరాలచే పట్టిఉంచిన వెన్నెముకచే, గర్భాశయం వెనుకభాగం నుండి రక్షింపబడుతుంది. తదుపరి ఆమినోయిటిక్ ప్లూయిడ్ ను కలిగి ఉన్న ఆమినోయిటిక్ సేక్ (అంటే సంచీలాంటి, పొరతో కప్పబడిన ఆమినోయిటిక్ ప్లూయిడ్సున్న ప్రదేశం) లో పిండం రక్షింపబడుతుంది. ఆవిధంగా గర్భస్థ పిండం సురక్షితమైన నివాసస్థానాన్ని కలిగి ఉంది. 

ఈ చిన్ని పరిమాణంలోని ప్లూయిడ్ 'అలఖ్' (దీని అర్ధం ఏదైనా అంటిపెట్టుకొని ఉండేదని)గా తయారవుతుంది. దీనికి జలగాలాంటిదనే అర్ధం కూడా ఉంది. ఈ రెండు వర్ణనలు కూడా శాస్త్రీయంగా ఒప్పుకోబడినవే. ఎలా అంటే మొట్టమొదటి దశలలో గర్భస్థ శిశువు గర్భాశయగోడకు అంటిపెట్టుకొని ఉండి, తను ఆకారంలో జలగాను పోలి కన్పిస్తుంది. అంతేకాదు జలగలాగే (రక్తాన్ని పీల్చేదిగా) ప్రవర్తిస్తుంది. దానికి కావలసిన రక్త సరఫరాని  తల్లి యొక్క మావి నుండి పొందుతుంది. 

అలఖ్ యొక్క మూడవ అర్ధం రక్తపు ముద్ద. మూడవ మరియు నాల్గవ వారపు గర్భంలో 'అలఖ్' దశలో ఉన్నప్పుడు, మూసి ఉన్న రక్తనాళాలలో రక్తం ముద్దగా ఉంటుంది. కనుక పిండం రక్తపు ముద్దలాగా మరియు దీనికి తోడూ జలగలాంటి ఆకారంలో కూడా కన్పిస్తుంది.

పిండం కొంతమటుకు రూపొంది మరియు కొంతమటుకు రూపొందనిదిగా ఉంటుంది 

'ముద్ఘా' దశలో పిండాన్ని కొస్తే మరియు లోపలి అంగాన్ని కోసి వాటి నిర్మాణాన్ని పరిశీలిస్తే, చాలా ఫరకూ అంగాలు రూపొంది ఉంటాయి, అలాగే చాలా అంగాలు ఇంకనూ రూపొందవలసి ఉంటాయి. 

ప్రొఫెసర్ జాన్సన్ ప్రకారం, ఒకవేళ పిండాన్ని సంపూర్ణ సృష్టిగా గనుక వివరిస్తే మనం అప్పటికి పూర్తి అయిన దానిని మాత్రమే వివరించినట్లు అవుతుంది. అలాగే పూర్తిగా తయారుకాని పిండాన్ని గురించి వర్ణిస్తే, మనం అప్పటికి ఇంకా పూర్తికాని దానిని మాత్రమె వివరించినట్లు అవుతుంది. కాబట్టి అది పూర్తిగా రూపొందిందా లేక పూర్తిగా రూపొందలేదా? పిండోత్పత్తి యొక్క ఈ దశను వర్ణించడానికి ఖుర్'ఆన్ వర్ణన తప్పితే మరో సరియైన వర్ణన లేదు. ఖుర్'ఆన్ 'రూపం కలదిగానూ' రూపం లేనిదిగానూ ఈ క్రింది వాక్యంలో చెబుతుంది. 

خالقناكم من تراب ثم من نطفة ثم من علقة ثم 
من مصغ ة مخلقة و غير مخلقة لنبين لكم 

"మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తర్వాత వీర్య బిందువుతో, ఆ తరువాత నెత్తుటి గడ్డతో, ఆపై మాంసపు కాండతో, అది రూపం కలదిగానూ, రూపం లేనిదిగానూ ఉంటుంది"  (దివ్య ఖుర్'ఆన్ 22:5) 

సైన్స్ ప్రకారం ఈ అభివృద్ధికి సంబంధించిన దశలో కొన్ని కణాలుంటాయి. వాటిలోని తారతమ్యాలను గుర్తించలేము. అంటే కొన్ని అంగాలు రూపు దిద్దుకున్నాయి, మరికొన్ని రూపుదిద్దుకోలేదు అని తెలుస్తుంది. 

చూపు మరియు వినికిడి జ్ఞానము

అభివృద్ధి జరుగుతున్న మానవ పిండంలో, మొదటగా అభివృద్ధి అయ్యే ఇంద్రియ జ్ఞానం 'వినడం'. 24వ వారం తర్వాత గర్భస్థ శిశువు ధ్వనులను (చప్పుళ్ళను) వినగలదు. దాని తర్వాత 'చూపు'కు సంబంధించిన ఇంద్రియ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. 28వ వారానికి, కంటిలోని రెటీనా కాంతిని తెలుసుకోగలుగుతుంది. 

పిండం యొక్క ఇంద్రియ జ్ఞానాలఅభివృద్ధికి సంబంధించి క్రింద ఇచ్చిన ఖుర్'ఆన్ వాక్యాలను గమనించండి. 

و جعل لكم أسمع و الأبصار و الأفئدة 

"మీకు చెవులిచ్చాడు, కళ్లిచ్చాడు, హృదయాలిచ్చాడు"  (దివ్య ఖుర్'ఆన్ 32:9)

إنا خلقنا الإنسان من نطفة أمشاج نابتالييه فجعلناه سمعيا  بصيرا 
"మేము మానవుణ్ణి పరీక్షించడానికి అతనిని ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశామ."  (దివ్య ఖుర్'ఆన్  76:2)

و هو الذي أنشا لكم السمع والابصار والأفئدة قالييلا ما تشكرون 

"మీకు వినేశక్తినీ చూసే శక్తినీ ఇచ్చినవాడు, ఆలోచించడానికి హృదయం ఇచ్చినవాడూ అల్లాహ్ యే. కాని మీరు కృతజ్ఞత చూపటం అనేది చాల అరుదు." (దివ్య ఖుర్'ఆన్ 23:788)

ఈ పై అన్ని వాక్యాలలో చూసే శక్తి కంటే ముందు వినే శక్తిని గురించి ముందుగ చెప్పటం జరిగింది. ఆ విధంగా ఆధునిక పిండోత్పత్తి శాస్త్రంలో కనుగొన్న వాటితో ఖుర్'ఆన్ వర్ణన సరిపోతుంది.

ఖుర్'ఆన్ లో మెదడు గురించి

దివ్య ఖుర్'ఆన్ లో సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ఓ దుష్టుడిని ఉద్దేశించి ఈ విధంగా ప్రకటించెను: 
"అతడు గనక మానకపోతే మేము అతన్ని అతని నుదుటి వెంట్రుకలు పట్టుకొని ఈదుస్తాము, అబద్ధానికి, ఘోరపాపానికి పాల్పడిన నుదురు అది" (ఖుర్'ఆన్ 96:15-16)

పైన ఖుర్'ఆన్ లో చెప్పబడిన  అబద్ధానికి, ఘోరపాపానికి పాల్పడిన నుదురు అది అన్నమాటలు నేడు వైద్య విజ్ఞానము ద్వారా తెలిసిన విషయాలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి. 

Essential of Anatomy & Physiology అను పుస్తకంలో ఈ విధముగా వ్రాయబడింది. నుదురు వైపు ఉన్న మెదడు భాగాన్ని Pre Frontal Area అంటారు. మెదడులోని ఈ భాగమే మనిషి ఏదైనా మంచి చెడు పనులు చెయ్యాలనే ఆలోచన కలుగజేస్తుందని వాటిని ఆచరించే వైపునకు పురిగోల్పుతుందని, ఉద్రేకాన్ని కల్గించే కేంద్రం కూడా ఇదే. సత్యం లేదా అసత్యపు మాటలనడానికి వాటిని ఆచరణలో పెట్టే విధంగా శరీరంలో కిగాతా భాగాలను పురుగొల్పుతుంది అని ఈ Pre Frontal Area పనిచేసే విధానమును ఇటీవలనే Professor Keith L. Moore అనే శాస్త్రవేత్త కనిపెట్టెను.  

ఒక దుష్టుడైన అవిశ్వాసి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ను తరుచూ ఇబ్బందులకు గురిచేసేవాడు. వాడి బుర్రలో ఎప్పుడూ ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ను ఎలా కించపరచాలి, ఆయన సత్యధర్మప్రచారాన్ని ఎలా ఆటంకపరచాలి అనే ఆలోచన తప్ప మరొకటి ఉండేది కాదు. ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం)  వారు మస్జిదుకు వెళ్ళే త్రోవలో ముళ్ళకంపలు పరిచేవాడు. ఆయన ప్రార్ధిస్తూ ఉండగా వీపుపై ఒంటె బోటి ప్రేగులు వేసేవాడు. ఇసుకను గుమ్మరించేవాడు. ఇలాంటి వాడి గురించే ఖుర్'ఆన్ అబద్ధానికి, ఘోరపాపానికి పాల్పడిన నుదురు  వాడిది అందుచేతనే నుదుటి వెంట్రుకలను పట్టి ఈడ్చుకుంటూ పోయి నరకంలో వేస్తానని హెచ్చరించడం జరిగింది. అంటే వీరికి అలాంటి చెడు ఆలోచనలు, ప్రణాలికలు కల్గించేది ఈ స్థానమే అని ఖుర్'ఆన్ చెబుతుంది. నేడు వైద్య విజ్ఞానము ఈ స్తానమె ఇలాంటి వాటికి కేంద్రబిందువు అని చెబుతుంది. 

ఖుర్'ఆన్ లో పర్వతాల గురించి (భూవిజ్ఞాన శాస్త్రం)


భూవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 'ఫోల్డింగ్' (అంటే భూగర్భ పొరలలో మడుపు) దృగ్విషయం ఇటీవలకాలంలో కనుగొన్నదే. పర్వతశ్రేణులు ఏర్పడటానికి ఈ ఫోల్డింగ్ ప్రక్రియే కారణం. మనం నివశిస్తున్న భూమి యొక్క బాహ్య (బయటి) పొర ఓ గట్టి పున్కును పోలి ఉంటుంది. బాగా లోపలగా ఉన్న భూమి యొక్క పొరలు వేడిగా ద్రరూపంలో ఉండటం వలన అవి ఏరకమైన జీవాలకీ కూడా నివాసయోగ్యం కాదు. పర్వతాల యొక్క స్థిరత్వానికి, ఫొల్దింగ్ ప్రక్రియకు మధ్య సంబంధం ఉన్న విషయం కూడా తెలిసినదే. ఎత్తుపల్లాలకు పునాది వేసేది ఈ ఫోల్డులే. ఆ విధంగా పర్వతాలు స్థాపించబడతాయి. 

మన భూమి యొక్క వ్యాసార్ధం 3,750 మైళ్ళు అని, అలాగే మనం నివశించే భూమి పొర (క్రస్ట్) చాలా సన్నగా 1 మైలు నుండి 30 మైళ్ళ వరకు ఉంటుందని భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చెబుతారు. భూమి పై పొర చాలా సన్నగా ఉండటం వలన, ఆ పొర ప్రకంపనాలకు లోనయ్యే అవకాశం చాల ఎక్కువ ఉంది. పర్వతాలు కొయ్యాల లాగ లేదా టెంట్ కోసం వేసిన మేకులలాగా పనిచేసి భూమి యొక్క పై పొరను పట్టి ఉంచి, ఆ పొరకు స్థిరత్వాన్ని కలుగజేస్తాయి. ఈ క్రింది వాక్యంలో ఖుర్'ఆన్ ఇదే విషయాన్ని చాల ఖచ్చితంగా వర్ణిస్తుంది. 

ألم يجعلل الار ض مهادا  والجبال او تآدا 


దివ్య ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఇలా తెలియజేయుచున్నాడు:  "మేము భూమిని పాన్పుగ చేశాము. అందులో పర్వతాలను ముకులుగా పాతాము"  (ఖుర్'ఆన్ 78:6-7)

'అవ్ తద్' అనే అరబీ పదానికి అర్ధం 'కొయ్యలు' లేదా 'మేకులు' (అంటే టెంట్ ను నిలబెట్టటానికి వాడే మేకులు) ఇవి ఫోల్డులకు సంబంధించిన లోతైన భూగర్భ పునాదులు. 

ఖుర్ ఆన్ లో మరో చోట ఇలా తెలుపబడింది:  "ఆయన భూమిలో పర్వతాలను మేకులుగా పాతాడు. భూమిపై ఉండే సమస్త జీవకోటి దోర్లిపోకుండా ఉండాలని"   (ఖుర్'ఆన్ 16.:15)

ఆధునిక భౌగోళికశాస్త్రం తెలుయజేస్తున్నది ఏమిటంటే "పర్వతాలు ఎంత ఎత్తుగా ఉంటాయో అంతకంటే ఎక్కువ రెట్లు భూమిలోనికి దిగబడియుంటాయి" అని తెలియజేస్తుంది. 

దీన్ని బట్టి చూస్తె ఖుర్'ఆన్ లో "పర్వతాలను మేకుల వలె పాతాను" అనే అల్లాహ్ యొక్క ప్రకటన ఏంటో ఖచ్చితంగా సరిపోతుందో గమనించండి. 

1865 సంవత్సరంలో రాయల్ సర్ జార్జ్ ఎయిరీ అను శాస్త్రవేత్త తన పరిశోధనలతో తెలిసిన విషయాలను తెలియజేస్తూ ఇలా అన్నాడు - "భూమి యొక్క పై పోర కంపించకుండా ఉండడానికి పర్వతాలు చాలా వరకు సయాపడతాయి." 

ఇదే విషయం ఖుర్'ఆన్ లో కూడా చెప్పబడింది. "ఆయన భూమిలో పరవతాలను మేకులుగా పాతాడు. భూమిపై ఎండే సమస్త జీవకోటి దోర్లిపోకుండా ఉండాలని" ఖుర్'ఆన్ 16:15. 

కొందరు భౌగోళిక శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి వారు తెలుసుకున్న విషయాలను ఓ పుస్తకంగా వ్రాసారు. దాని పేరు 'ఎర్త్'. ఈ పుస్తకాన్ని రచించిన వారిలో ఒకాయన పేరు prof . Emerities Frank Press ఈయన ఒకనాటి అమెరికా అధ్యక్షుడైన జిమ్మికాటర్ యొక్క సైన్స్ సలహాదారుడిగా పనిచేశారు. తర్వాత 12 సంవత్సరముల పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వాషింగ్టన్ DC కి అధ్యక్షుడిగా కూడా తన సేవలను అందించారు.prof . Emerities Frank Press ప్రకారం పర్వతాలు అనేవి భూమి పైపొరను స్థిరంగా ఉంచడంలో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి. భూమిని ప్రకంపనాల నుండి ఆపడంలో పర్వతాలయోక్క పనితీరును ఖుర్'ఆన్ చాలా స్పష్టంగా వివరిస్తుంది. 


و جعلنا في الأر ضٍ رواسي أن تميد بهم 

"మేము భూమిపై పర్వతాలను పటిష్టముగా నిలబెట్టాము" (దివ్య ఖుర్'ఆన్ 31:31) 

ఆ పుస్తకంలో ఇలా వ్రాయబడి ఉంది - "పర్వతాలు భూమిలోకి చాలా వరకు వేర్లవలే చొచ్చుకొనిపోయి, భూమిలో మేకులు పాతినట్లుగా క్రిందకు దిగబడియున్నాయి." 

Modern Theory of Plate ఏమని తెలియజేస్తునాడంటే పర్వతాలు భూమి కంపించకుండా ఉండేందుకు సహకరిస్తూ ఉంటాయి అని. ఈ విషయాలు 1960 సంవత్సరం వరకు ఎవరికీ తెలియవు. 

మరి ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) 1400 సంవత్సరాలకు పూర్వమే ఖుర్'ఆన్ లో ఇలాంటి విషయాలు తెలియజేసారంటే ఇది ఆయన ద్వారా సర్వలోక సృష్టికర్త తెలిపిన దివ్యజ్ఞానం కాక మరొకటి ఎలా అవుతుందో మీరే నిస్పక్షపాతంగా ఆలోచించండి. పోనీ ఎవరి నుండో విని చెప్పారంటే ఆ కాలంలో నేతిల ఆధునిక పరికరాలు, ఆధునిక పరిజ్ఞానము అందుబాటులో లేదు అన్నది మనకు తెలుసు. అయిన కొండలు, పర్వతాల అడుగున ఉన్న విషయాలు కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) తెలిపారంటే ఇది కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క కృపయే. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. ఆయన దైవం పంపిన చిట్టచివరి ప్రవక్త అని నమ్మకుండా ఉండటానికి మన ముందు ఇంకే కారణమూ మిగలలేదు. 


పర్వతాలు ధృడంగా స్థాపించబడ్డాయి

భూమి యొక్క ఉపరితలం ఎన్నో గట్టి 'ప్లేటు'లుగా బ్రద్దలైంది. ఈ ప్లేట్లు పాక్షికంగా అస్తనోస్ఫియర్ పైన తేలుతున్నాయి.  అస్తనోస్ఫియర్ అంటే భూకేంద్రం (కోర్)లోని తీవ్రమైన వేడివలన పాక్షికంగా కరిగిన భూమియొక్క రెండవపోర. 

ఈ ప్లేట్ల సరిహద్దులలో పర్వతాలు వరుసలో ఏర్పడ్డాయి. భూమి యొక్క పై పొర అయిన క్రస్ట్ యొక్క మందం మహాసముద్రాలక్రింద 5 కి.మీ.దాదాపు చదునుగా ఉండే ఖండాల ఉపరితలాల క్రింద 35 కి మీ, మరియు మహాపర్వత శ్రేణులక్రింద 80 కి.మీ. ఉంటుంది. ఇవి గట్టి పునాదులు. వీటిపైనే పర్వతాలు నిలబడ్డాయి. దృడమైన పర్వత పునాదుల గురించి ఖుర్'ఆన్ కూడా ఈ క్రింది వాక్యంలో చెబుతుంది. 

والجبال أرساها 
"పర్వతాలను అందులో పాతాడు......" (దివ్య ఖుర్'ఆన్ 79:32)

ఖుర్'ఆన్ లో విశ్వసృష్టి గురించి

ఆధునిక విస్వవిజ్ఞాన శాస్త్రపు పరిశోధనల ప్రకారం ప్రారంభంలో విశ్వమంతా అత్యధిక సాంద్రత మరియు అత్యధిక ఉష్ణోగ్రతతో, పొగ రూపంలోని ఓ మబ్బువలే ఉండేది. 

ఈ అభిప్రాయం పై శాస్త్రవేత్తల మధ్య ఎలాంటి అభిప్రాయ బేధం లేదు. మరెన్నో కొత్త కొత్త నక్షత్రాలు ఈ మబ్బు నుండ పుట్టుకు రావడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న మెరిసే నక్షత్రాలు ఈ మబ్బు నుండే పుట్టుకు వచ్చినవే. శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిపిన విషయాలు ఖుర్'ఆన్ లో చెప్పబడిన విషయాలు ఎంత ఖచ్చితంగా సరిపోతున్నాయో చూడండి. 


ثم استوى الأسماء واهي دخان فقال لها وللأر ضٍ أتينا 
طو عا او كرها  قالتا أتينا طاء يعين 

"కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు. ఆయన ఆకాశాన్ని, భూమినీ ఉద్దేశించి ఇలా అన్నాడు. 'ఉనికిలోనికి రండి', మీకు ఇష్టమైనా, ఇష్టం లేకపోయినా, అవి రెండూ మేము వచ్చేశాము, విధేయులు మాదిరిగా అని అన్నాయి". (ఖుర్'ఆన్ 41:11) 


అలా సైన్సు ద్వారా మనకు తెలిసినదేమంటే ఆకాశము, భూమి మొత్తం (సూర్యుడు, నక్షత్రాలు,గ్రహాలూ, పాలపుంతలు) అనీ ఒకేచోట ఉండేవని మరియు సర్వ రసాయనాలు అన్ని మిళితమై ఉండేవని ఓ విస్పోటం ద్వారా అవి వేరు వేరు అయినాయని సైన్స్ చెబుతుంది

మరి ఖుర్'ఆన్ ఏమి చెబుతుందో చూదాం:


أولم يرلزنا كفرو أن أ سماوات والار ض  كانتا رتقا فقطقنهما 

"తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించరా? ఆకాశాలు, భూమీ పరస్పరం కలిసి ఉండేవనీ, తర్వాత మేము వాటిని వేరు చేశామనీ"  (ఖుర్'ఆన్ 31:30)  

Dr. Alfred Kroner ఈయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన Geology శాస్త్రవేత్త. ఈయన Institute Of Geosciencesలో ప్రధాన అధికారిగా, ప్రొఫెస్సర్ గ తన సేవలను అందించారు. ఈయన ఒక సందర్భంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) వారి గరించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

"ముహమ్మద్ (స.అ.సం) ఎవరు? ఈయన ఎక్కడి నుండి వచ్చారు. ఇంత పరిజ్ఞానం ఈయనకు ఎక్కడిది, ఎందఱో శాస్త్రవేత్తలు, మరెన్నో ఆధునిక పరికరాలు ఉపయోగించి, శ్రమించి తెలుసుకున్న విషయాలను ఎలాంటి పరికరాలు అందుబాటులో లేని సమయంలో ఎలాంటి పరికరాలను వినియోగించకుండా 1400 సంవత్సరాలకు పూర్వం ఓ అక్షరజ్ఞానం లేని వ్యక్తి ఎలా చెప్పగలిగారు. ఇలాంటి విషయాలు అణు పరిజ్ఞానము ఉన్నవారే చెప్పగలరు, మరి ఈయన ఎలా చెప్పగలిగారు?"

విస్తరిస్తున్న విశ్వం

ఎడ్విన్ హబుల్ అనే అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు 1925లో గేలాక్సీలు ఒకదానినుండి ఒకటి దూరంగా పోతున్నట్లు ఖగోళ పరిశీలనలద్వారా లభ్యమైన సాక్ష్యాలను ముందుంచారు. ఇవి విశ్వం విస్తరించడాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు విశ్వం విస్తరిస్తున్నదన్న విషయం నిర్ధారణ గావించబడిన శాస్త్రీయ వాస్తవం. విశ్వానికి సంబంధించిన ఇదే విషయాన్ని ఖుర్'ఆన్ చెబుతుంది. 

وأسماء بنيناها بآ ييد وانا لموسعون 

"మేము ఆకాశాన్ని స్వశక్తితో నిర్మించాము. మేము అలా చేసే సామర్ధ్యము కలిగి యున్నాము"(ఖుర్'ఆన్ 51:47)

అరబీ పదం 'మూసిఊన్'లో మూసి అంటే శక్తి సామర్ధ్యాలు కలవాడు అనీ, విస్తరింపజేసేవాడు అనీ అర్ధం. ఇది విస్తరిస్తున్న విశ్వం యొక్క సృష్టి గురించి వివరిస్తుంది. 

స్టీఫెన్ హాకింగ్ తన పుస్తకం 'ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం'లో విశ్వం విస్తరిస్తునదని కనుగొనడం 20వ శతాబ్దములోని గొప్ప వైజ్ఞానిక విప్లవంగా చెప్పాడు. మనిషికి కనీసం టెలిస్కోప్ ను తయారుచేయడం తెలియకముందే ఖరు'ఆన్ విశ్వం యొక్క విస్తరణ గురించి చెప్పడం జరిగింది. కొంతమంది ఏమంటారంటే ఖుర్'ఆన్ లోని ఖగోళవాస్తవాలుండటం ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే అరబ్బులు ఈ ఖగోళశాస్త్రములో ఉన్నత స్థితిలో ఉన్నారు. కాబట్టి. నిజమే, ఖగోళశాస్త్రములో అరబ్బులు అభివృద్ధి సాధించారన్న మాట వాస్తవమే. 

అయితే అరబ్బులు ఖగోళశాస్త్రములో ఉన్నతస్థితికి చేరుకోవడానికి శతాబ్దాలముందే ఖుర్'ఆన్ సందేశం అందింది అనే వాస్తవాన్ని వీరు గ్రహించలేకపోయారు. అంతేకాకుండా, ఖగోళశాస్త్రానికి సంబంధించిన శాస్త్రీయ వాస్తవాలైన బిగ్బాంగ్ వలన విశ్వం పుట్టుకలాంటి మొదలగు విషయాలు, అరబ్బులకు తాము సైన్స్ లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో కూడా తెలియలేదు. కాబట్టి ఖుర్'ఆన్ లోని శాస్త్రీయ వాస్తవాలు, అరబ్బులకు ఖగోళశాస్త్రంలో ప్రావీణ్యం వలన అరబ్బులు ఖగోళశాస్త్రం ఓ స్థానాన్ని పొందటం వలన అరబ్బులు ఖగోళశాస్త్రంలో అభివృద్ధి సాధించారు.

ఖుర్ ఆన్ లో సముద్రాలు నదుల సంగమం గురించి

     రెండు సముద్రాలు కలిసే చోట వాటి మధ్య ఓ తెర ఏర్పడుతుంది. ఈ తెర రెండు సముద్రాల నీరు ఒకదానిలో మరొకదాని నీరు కలవకుండా ఆదుకుంటుంది. ఇది ఎలా తెలుస్తుందంటే, ఓ సముద్రపునీటిలో ఉండే రుచి (ఉప్పదనం) గాని సాద్రత గాని ఉష్ణోగ్రతలో గాని మరో సముద్రపు నీటిని పోలిఉండదు. దీన్ని బట్టి రెండు సముద్రాల నీరు ఒకదానిలో మరొకటి కలుస్తున్నాయో లేదో అన్నది తెలుస్తుంది. రెండు సముద్రాలు కలిసే ప్రదేశములో జరిపిన పరిశోధనల ఆధారంగా రెండు సముద్రాల నీరు కలవవని వాటి మధ్యలో ఒక తెర ఉంటుందని ఆధునిక విజ్ఞానము తెలియజేస్తుంది. 

     ఉదా: మెడిటేరియన్ సముద్రం యొక్క నీరు అట్లాంటిక్ మహా సముద్రపు నీటి కంటే సాంద్రత, ఉప్పదనం, ఉష్ణోగ్రత ఎక్కువ. మెడిటరేనియన్ సముద్రం Gibralter ప్రాంతంలో అట్లాంటిక్ బాహా సముద్రంలో కలుస్తుంది. అలా కలిసి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రవహిస్తుంది. ఇది దాదాపు 1000 మీటర్ల లోటు వరకు వెళుతుంది. అయినా మెడిటేరియన్ సముద్రపు నీటి యొక్క ఉష్నోగ్రటలలో గాని, రుచిలో గాన, సాంద్రతలో గాని ఎలాంటి మార్పు కలగదు. సముద్రపు ఆటుపోట్లు వలన గాని పెద్ద పెద్ద కెరటాల వలన గాని సముద్రపు లోతులలో ఏర్పడే కరెంటు వలన గాని ఈ తెర చెక్కు చెదరదు. 

ఇదే విషయం ఖుర్' సార్లు చెప్పబడింది:


مرج البحرين يلتقيان 
 بانهما برزخ لا يبغيان 

"రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసి పోయేటందుకు ఆయన (అల్లాహ్) వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు" (ఖుర్'ఆన్ 55:19-20)

అలాగే నదులు సముద్రంలో కలిసే చోట కూడా ఒకదానిలో మరొకటి కలువవు. దాని గురించి కూడా ఖుర్'ఆన్ లో చెప్పబడింది. 


و هوالذي مرج البحرين هاذا عذاب فورت وهاذا ملح أجاج 
و جعل بينهما برزخا وحجرأ مهجورا 

"రెండు సముద్రాలనూ కలిపి ఉంచినవాడు ఆయనే. ఒకటేమో రుచికరమైనది, మధురమైనదీను. రెండోది చేదైనది, ఉప్పైనదీను. ఆ రెంటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని కలసిపోకుండా ఆపి ఉంచే అవరోధం
(ఖుర్'ఆన్ 23:53) 

ఖుర్'ఆన్ లో ఒక సముద్రపు నీరు మరో సముద్రపు నీటిలో కలుపకుండా ఓ రేరా అడ్డంగా ఉన్నది అని తెలియజేయబడినది. అదే విషయాన్ని ఆధునిక విజ్ఞానము ధృవపరుస్తుంది. 


ఖుర్'ఆన్ లో లోతైన సముద్రపు పరిస్థితి & అలల గురించి

او كظلمات في بحر لخي يغشاه موج من فوقه مو خ من فوقه
سحاب  ظلمات بعضها فوق بأعض 

"లేదా వారి కర్మలకు ఒక లోతైన సముద్రంలోని చీకటిని ఉపమానంగా చెప్పవచ్చు. దాని (ఆ చీకటి) పై ఒక అల వ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల, దానిపై మేఘం, చీకటి పై చీకటి. మనిషి తన చేతిని బయటకు చాచితే, దానిని కూడా చూడలేడు. ఎవరికీ అల్లాహ్ తన వెలుగును ప్రసాదించడో, అతనికి మరే వెలుగూ లేదు"(ఖుర్'ఆన్ 24:40

ఆధునిక విజ్ఞానం తెలియజేస్తున్నది ఏమిటంటే సముద్రపు లోతులలో 200 మీటర్ల తర్వాత చిమ్మచీకటిగా ఉంటుందని అదే 1000 మీటర్ల లోతులో అయితే అసలు వెలుగు చాయలు కూడా ఉండవని తేలింది. మానవమాత్రులు కేవలం 40 మీటర్ల వరకే ఏ పరికరాల సహాయం లేకుండా వెళ్ళగలడు. అంతకు మించి లోతులో వెళ్ళాలంటే దానికి సంబంధించిన పరికరాల సహాయంతో వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా 40 మీటర్లకు మించి లోతులోకి పరికరాలు లేకుండా వెళ్ళినా బ్రతికి బయటకు రాలేడు. అల్లానే బయట మనకు కనిపించే కెరటాల వాలే అడుగున కూడా కెరటాలు వస్తాయని కనుగొన్నారు. నేడు మానవుడు జలాంతర్గాముల సహాయముతో సముద్రపు లోతులలో ప్రయాణిస్తున్నాడు. దేశ రక్షణలో ఇవి ఎంతో కీలకపాత్రను పోషిస్తున్నాయి. అలా మానవుడు సముద్రపు లోతులలోనికి వెళ్లబట్టి ఈ విషయాలను కూడా తెలుసుకోగలిగాడు. మరి 1400 సంవత్సరాలకు పూర్వం ఎలాంటి పరికరాలు లేకపోయినా సముద్రపు లోతులోనికి వెళ్ళకుండా లోపల చీకటిగా ఉంటుందని, తన స్వంత చేయి తనకే కనబడనంత చీకటిగా ఉంటుందని సముద్రపు లోతులలో కూడా అలలు వస్తాయని అవి మేఘం వలె కమ్ముకొని ఉంటాయని ఎలా తెలియజేయగాలిగారు అనే విషయం ఒక్కసారి ఆలోచించండి

దీన్ని బట్టి ఖుర్'ఆన్ అల్లాహ్ యొక్క గ్రంథమని, ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త, కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పగలిగారని ఋజువగుచున్నది. ఏమి ఇప్పటికైనా సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే దేవుడని ఖుర్'ఆన్ ఆయన పంపిన గ్రంథమని ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ఆయన ప్రవక్త అనే విషయాన్ని విశ్వసించడానికి మిమ్ములను ఏ విషయం ఆపివేసింది?

ఖుర్'ఆన్ లో వర్షపు మబ్బుల గురించి

     మనకు కనిపించే మబ్బులన్నీ వర్షపు మబ్బులు కావు. అవి ఒక పధ్ధతి ప్రకారం దశలవారిగా ఒక ఆకారంగా ఏర్పడతాయి. 

ఈ రకమైన మబ్బులను శాస్త్రవేత్తలు Cumulonimbus clouds అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు ఈ cumulonimbus మేఘాలు ఎలా ఏర్పడతాయో అన్న విషయంపై పరిశోధించి తెలుసుకున్నవిషయాలు ఏమిటంటే ఈ మబ్బులు మూడు దశలుగా పరివర్తనం చెందిన తరువాత వర్షం పడుతుందని తెలుసుకున్నారు. 

మొదటి దశ: చిన్న చిన్న మబ్బు తునకలు గాలికి నవైపుల నుండి కొట్టుకుంటూ వచ్చి ఒకచోట చేరతాయి. 

రెండవ దశ : ఇలా కొట్టుకుంటూ వచ్చిన మబ్బుతునకలు ఒక పెద్ద మబ్బుగా ఏర్పడుతుంది. 

మూడా దశ :  అలా ఏర్పడిన మబ్బు పెద్ద దిబ్బ (పుట్ట) వలే పైకి పైకి ఎదుగుతుంది. ఇలా పైకి ఎదిగిన మబ్బులోని నీటి బందువులు వాడగుండ్లుగా మారును. ఇలా ఏర్పడిన వడగండ్లు నీటి బిందువు బరువెక్కి ఆ మబ్బు మరీ పైకి వెళ్ళలేక అందులో ఉన్న నీరు వాడగుండ్లు క్రిందికి రాలిపోతాయి. ఇలా వర్షం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తెలుసుకున్నారు. మరి ఎలాంటి పరిశోధనలు చేయకుండా ఖుర్'ఆన్ లో చెప్పబడిన విషయాలను ఒకసారి చూడండి. 

"అల్లాహ్ మేఘాన్ని మెల్లమెల్లగా నడపటాన్ని దాని తునకలను ఒకదానితో ఒకటి కాలపటాన్ని, తర్వాత దానిని పోగుచేసి ఒక దట్టమైన మబ్బుగా మలవటాన్నీ నీవు చూడవా? తరువాత దానిపై పొర నుండి వర్షపు చినుకులు రాలుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆయన ఆకాశం నుండి దానిలోని ఎత్తైన పర్వతాలు కారణంగా వదగండ్లను కురిపిస్తాడు" (ఖుర్'ఆన్ 24:43-44)

పైన చెప్పబడిన ఖుర్'ఆన్ లోని విషయాలు మరియు శాస్త్రవేత్తలు పరిశోధించి తెలియజేసిన విషయాలు ఒకేలా ఉన్నాయి. మేఘాలను నడవటం, ఒక దగ్గర పోగావటం, దట్టమైన మబ్బుగా మారటం ఇలా ఖుర్'ఆన్ లోని విషయాలు మరియు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించండి. బెలూన్లు, విమానాలు, శాటిలైట్లు, ఇంకా మరెన్నో వాతావరణంలో తేమ, దాని హెచ్చుతగ్గులు కొలిచే పరికరాలు మరియు వాతావరణం లోని పీడనం గురించి తెలుసుకొనే పరికరాలు ఉపయోగించి శాస్త్రవేత్తలు తెలియజేశారు. మరి ఎలాంటి పరిశోధనలు చేయకుండా ఓ అక్షరజ్ఞానం లేని వ్యక్తి ఇలాంటి విషయాలు చెప్పారంటే ఈయన దైవప్రవక్తని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

ఇక వదగండ్లను గురించి ఉరుములు, మెరుపులు, పిడుగులు గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూసే ముందు ఖుర్'ఆన్ ఏముంటుందో చూద్దాం.


ألم تر أن الله يز جي سحابا ثم يوليف بينه ثم يجعله 
ركاما فترى الودق يخرج من خلاله وينز ل  من أسماء 
من جبال فيها من برد فيصيب به من يشاء و يصرفه 
عن من يشاء 


"ఆయన ఆకాశం నుండి, దానిలోని ఎత్తైన పర్వతాలు కారణంగా, వదగండ్లను కురిపిస్తాడు. తాను తలచిన వారికి వాటి ద్వారా నష్టం కలిగిస్తాడు. తానూ తలచిన వారిని వాటి నుండి రక్షిస్తాడు. దాని పిడుగు యొక్క మెరుపు చూపులను చెదరగొడుతుంది" 
(ఖుర్'ఆన్ 24:43-44). 

శాస్త్రవేత్తలు తెలుకున్నది ఏమిటంటే cumulonimbus clouds (మబ్బులు) 25,000 నుండి 30,000 అడుగుల ఎత్తు ఎదిగి, పెద్ద శిఖరాల వలే ఏర్పడతాయని ఇలా ఏర్పడిన మబ్బు లోనే వడగండ్లు కురుస్తాయి. ఇదే విషయాన్ని ఖుర్'ఆన్ ఇలా తెలియజేసింది. "ఎత్తైన పర్వతాలు కారణంగా అంటే పర్వతాల్లాంటి మేఘాల నుండి వడగండ్లు కురుస్తాయి." Meteorology Today అనే పుస్తకంలో ఇలా వ్రాయబడింది. "మబ్బులోని అతి శీతల ద్రవ బిందువులు, వడగండ్ల తునకలు ఒకదానితో ఒకటి గుద్దుకున్న సమయంలో అవి ఒక్కసారి గడ్డకడతాయి. ఈ చర్య వలన వాటిలో తీవ్రమైన వేడి పుడుతుంది. ఇలా వేడెక్కిన బిందువులు క్రిందకు జారతాయి. ఇలా జారిపడే బిందువు మబ్బు క్రింద భాగంలో ఉన్న మంచు తునకలతో కలుస్తాయి. మబ్బు పై భాగంలో వేడెక్కిన వడగండ్లు మబ్బు క్రింద భాగములో మంచు తునక కలిసినప్పుడు వదగండ్లలో రుణ విద్యుత్ (negative) జనిస్తుంది. అలా వేడెక్కిన వడగండ్లతో మంచు కణాలు కలిసినప్పుడు మంచుకనాలలో ధన విద్యుత్ (positive) ఏర్పడుతుంది. ఇలా జనించిన Positive మరియు Negative విద్యుత్ కలయిక వలెనే మెరుపులు ఉరుములు ఏర్పడతాయి". 

ఆధునిక విజ్ఞానశాస్త్రం తెలియజేస్తున్న ఈ విషయాలతో 1400 సంవత్సరముల పోర్వమే పర్వతాలాంటి మబ్బులలో నుండి వదగండ్లను కురిపిస్తాడని, అందులో నుండి పిడుగులు కురిపిస్తాడని ఖుర్'ఆన్ లో చెప్పబడిన విషయాలు ఎంత సరిగ్గా సరిపోతున్నాయో చూడండి. ఖుర్'ఆన్ ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందించిందో వీటిని బట్టి అర్ధం అవుతుంది. కాబట్టి ఇది నూటికి నూరుపాళ్ళు దైవగ్రన్ధమే అనటంలో ఇక ఎలాంటి సందేహానికీ తావులేదు. 


ఖుర్'ఆన్ లో మేఘాలను నింపే పవనాల గురించి

وار سالنا أريح لواقح فأنزلنا مننسماء ماء 

فاسقينكمه 


"ఉత్పత్తి కారకాలైన గాలులను మేమే పంపుతున్నాము. ఆ తర్వాత ఆకాశం నుండి నీళ్ళను వర్షింపజేస్తున్నాము. ఆ నీళ్ళను మీకు తనివితీరా త్రాగటానికి ఇస్తున్నాము". (ఖుర్'ఆన్ 15:22)

ఇక్కడ ఉపయోగించిన 'లవాఖీ' అనే అరబీ పదం 'లఖీ' అనే పదానికి బహువచనం ఈ లఖి 'లఖహ' నుండి వచ్చింది. దీని అర్ధం నింపడం లేదా ఫలవంతం చేయడం. ఈ సందర్భంలో నింపడం అంటే వాయు పవనాలు మేఘాలను నొక్కడం వలన ద్రవీభవనం వెరిగి, తద్వారా మెరుపులు, అలాగే వర్షానికి కారణమవుతున్నాయి. ఇటువంటి వర్ణన ఖుర్'ఆన్ లో కనిపిస్తుంది. 

"అల్లాహ్ యే గాలులను పంపేవాడు. అవి మేఘాలను లేపుతాయి. తర్వాత ఆయన ఆ మేఘాలను తన ఇష్ట ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. వాటిని ఖండికలుగా విభజిస్తాడు. తర్వాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నీవు చూస్తావు. ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే, వారు ఆనందంతో పొంగిపోతారు". (ఖుర్'ఆన్ 30:48)


హైడ్రాలజి (జలవిజ్ఞాన శాస్త్రం) కి సంబంధించిన ఆధునిక వివరాలతో సరిపోయేలా చాలా ఖచ్చితంగా ఖుర్'ఆన్ వర్ణించడం జరిగింది. ఖుర్'ఆన్ లో వాటర్ సైకిల్ గురించి చాలా వాక్యాలున్నాయి. ఉదా: 2:19,7:57,13:17,25:48-49,36:34,50:9-11, 56:68-70, 67:30 మరియు 86: 11.


ఖుర్'ఆన్ లో సాగర విజ్ఞాన శాస్త్రం

తియ్యటి మరియు ఉప్పునీళ్ళను వేరు చేసే అవరోధం 

క్రింద యిచ్చిన ఖరు'ఆన్ వాక్యాలను పరిశీలించండి : 

مرج البحرين يلتقيان  بينهما برزخ لآ يبغيان 


"రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డుగా వున్నది. అవి దానిని అతిక్రమించవు" (ఖుర్'ఆన్ 55:19-20)

అరబీ పదం 'బర్జక్' అంటే విభజన లేదా రెండింటినీ వేరు చేసే ఓ హద్దు అంటే ఓ ఫెన్సింగ్ లేదా కన్చేలాగా భౌతికంగా విభజన కాదు. మరో అరబీపదం 'మరజ'కు భాషా పమైన అర్ధం ఏమిటంటే రెండూ కలవడం మరియు ఒకదానితో ఒకటి మిశ్రమం కావడం. ఈ రెండు రకాల నీటి గురించి వాడిన రెండు వ్యతిరేకమైన అర్ధాలను, ఖుర్'ఆన్ వాఖ్యాతలు మొదట్లో వివరించలేకపోయారు. అంటే అవి కలుస్తాయి మరియు మిశ్రమమవుతాయి. మరలా అదే సమయంలో ఆ రెండింటి మధ్య అడ్డు ఉంది. ఎలా?  ఆధునిక సైన్స్ కనుగోన్నదేమిటంటే రెండు సముద్రాలు కలిసిన ప్రదేశాలలో వాటి మధ్య తెర ఉందని, ఈ తెర ఆ రెండింటినీ ఎలా విభజిస్తుందంటే తనకు ఇరువైపులా ఉన్న సముద్రాలలో ప్రతీదానికి దానికంటూ ఒక స్వంత ఉష్ణోగ్రత, ఉప్పదనం మరియు సాంద్రత ఉంటాయి. అంటే వాటి గుణాలలో మాత్రం తేడా అలాగే ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే సముద్రాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు పై ఖుర్'ఆన్ వాక్యాన్ని బాగా వివరించగలరు. కనిపించని ఓ ఏటవాలు నీటి తెర రెండు సముద్రాలమధ్య ఉంది, దాని గుండా నీరు ఒక వైపునుండి మరో వైపుకు వెళుతుంది. అంటే రెండూ కలిసిన తర్వాత మిక్స్ అవుతున్నాయి కాబట్టి వాడిన అరబీ పదం 'మరజ' సరిపోయింది. కాని ఒక సముద్రం నుండి నీరు, మరో సముద్రంలోనికి ప్రవేశించగానే, ఆ నీరు తనకు అంతకుముందున్న స్పష్టమైన గుణాలను కోల్పోయి, తను ఏ సముద్రపు నీటిలో ప్రవేసించిందో ఆ నీటియొక్క గుణాలను పొందుతుంది. ఈ విధంగా ఇక్కడ తెరె ఒక సముద్రపు నీరు మరో సముద్రపు నీటిలోకి మారి అచ్చటి సమరూపాన్ని పొందేలా చేస్తుంది. ఇలా రెండూ కలిసి మిశ్రమం జరిగినా రెండు సముద్రాలగుణాలు మారకుండా రెరకు అటు, ఇటూ విభజించబడే వున్నాయి. కాబట్టి 55:19-20  వాక్యాలలో వాడిన 'బరజక్' పదం కూడా కరెక్టుగా సరిపోయింది. 

ఖుర్'ఆన్ లో చెప్పబడ్డ ఈ శాస్త్రీయ దృగ్విషయాన్ని డా:విలియమ్ హే కూడా ద్రువీకరించడం జరిగింది. ఇతను సముద్రశాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్త మరియు అమెరికాలోని కొలరాడో యూనివర్సిటిలో జియోలోగికల్ సైన్సెస్ ప్రేఫెస్సర్. ఈ విషయాన్నే క్రింద వాక్యంలో ఖుర్'ఆన్ కూడా చెబుతుంది.


و جعل بين البحرين حاجزا 


" ... రెండు రకాల జలధుల మధ్య అడ్డు తెరలను పెట్టినవాడు ఎవడు?..." (ఖుర్'ఆన్ 27:61)

గిబ్రాల్టర్ వద్ద మెడిటరేనియన్ మరియు అట్లాంటిక్ మహా సముద్రం మధ్య ఉన్న తెరెతో పాటుగా ఈ దృగ్విషయం చాలా చోట్ల సంభవించింది. కాని ఇదే తెరె మంచినీరు, ఉప్పునీటి మధ్య ఉన్నప్పుడు ఈ తెరతో నిషేధంతో కూడిన విభజన విషయాన్ని ఖుర్'ఆన్ చెబుతుంది 


وهوالذي مرج البحرين هاذا عذب فرات وهذا ملح أجاج وجعل 

 بينهما برزخا وحجرا محجورا 

"రెండు రకాల నీటిని కలిపి ఉంచినవాడు ఆయనే ఒకటేమో రుచికరమైనది, మధురమైనదీను. రెండోది చేదైనది, ఉప్పైనదీను. ఈ రెండింటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని కలిసిపోకుండా ఆపి ఉంచే అవరోధం" (ఖుర్'ఆన్ 25:53)

రెండు సముద్రాల విషయంలో అయితే కలిపే అవరోధం, మరి ఇక్కడ కలిసిపోకుండా అవరోధం. 

ఎచురీస్ (నదీ, సముద్రాలు కలిసే ప్రదేశం) లలో మధురమైన నీరు మరియు ఉప్పునీరు కలిసినప్పుడు, ఆ పరిస్థితి రెండు సముద్రాలు కలిసేచోట ఉన్న పరిస్థితికి కొంత భిన్నంగా ఉంటుందని ఆధునిక సైన్స్ కనుగొంది. ఈ ఎచురీలలో మంచినీరు, ఉప్పునీతిని వేరుచేసేదేమిటో కనుగొన్నారు. అదే 'పైక్నొక్లైన్' జోన్. ఇది రెండు రకాలనీటిని వేరుచేస్తుంది. ఈ జోన్ కి మరియు దీనిని ఆనుకుని ఉన్న నీటికి మధ్య సాంద్రతలో స్పష్టమైన వ్యత్యాసముంటుంది. 

ఈజిప్టుతో సహా ఈ దృగ్విషయం చాల చోట్ల సంభవించింది. ఈజిప్టులో నైలునది 'మెడిటరేనియన్'సముద్రంలో కలిసే చోట ఈ విషయాన్ని గమనించవచ్చు. మెడిటరేనియన్ సముద్రం అంటే ఆఫ్రికా ఖండాన్ని, యూరప్ ఖండం నుండి వేరు చేసే సముద్రం. 


మహా సాగారాలలోతులలో చీకటి

ప్రొఫెస్సర్ దుర్గారావు 'మెరైన్ జియాలజీ' (సముద్రాలకు, భూవిజ్ఞానానికి సంబంధించిన శాస్త్రం) సబ్జెక్టు లో అనుభవజ్ఞుడు. ఇతను జెద్దా లోని కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటిలో ప్రొఫెస్సర్. ఈ క్రింది వాక్యంపై ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుపవలసిందిగా అడిగారు. 


او كظلمات في بحر يغشاه مووج من فوقيه مووج من فوقيه

 سحاب ظلمات بعضها فوق بعض إذا أخرج يده لم يكاد 

ريها ومن لميجللله له نورا فماله من نور 

"లేదా (వారి కర్మలకు) ఒక లోతైన సముద్రంలోని చీకటిని ఉపమానంగా చెప్పవచ్చు. దాని పై ఒక అలవ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల, దానిపై మేఘం. చీకటిపై చీకటి. మనిషి తన చేతిని బయటకు సాచితే, దానిని కూడ చూడలేడు. ఎవరికీ అల్లాహ్ తన వెలుగును ప్రసాదించాడో, అతనికి మరే వెలుగూ లేదు." (ఖుర్'ఆన్ 24:40)

ఆధునిక పరికరాల సహాయంతో మహా సముద్రాల లోతులలో ఉన్న చీకటిని ఇటీవలకాలంలో మాత్రమె ధృవీకరించడం సాధ్యమైనదన్న విషయాన్ని ప్రొఫెస్సర్ దుర్గారావు చెప్పారు. ఎటువంటి సహాయం తీసుకోకుండా నీటిలో మునిగి 20 నుండి 30 మీటర్ల లోటు దాటి, మానవుడు ఉండలేడు. మహాసాగారాలలో 200 మీటర్ల లోతులో మనిషి బ్రతకలేడు. పై ఖుర్'ఆన్ వాక్యం అన్ని సముద్రాల కోసం కాదు. ఎందుకంటే అన్ని సముద్రాలు ఒక దానిపై మరొక పొరగా చీకటి ఉంటుందని వర్ణించలేము. ఇది ప్రత్యేకంగా మహా సాగరాల లోతులకు సంబంధించినది మాత్రమె. మహాసాగరం లోతులో ఇలా చీకటి పొరలకు కారణం క్రింద చెప్పిన రెండు విషయాల వలన. 

1. కాంతి కిరణం ఏడురంగుల సమ్మేళనం. ఈ ఏడురంగులు ఉదా: (Violet), ఇండిగో (indigo) నీలం (blue), ఆకుపచ్చ (Green), పసుపు (yellow), ఆరంజ్ (Orange) మరియు ఎరుపు (red) . వీటిని VIBGYOR అని కూడా అంటారు. ఈ కాంతి కిరణం నీటిని తాకగానే వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం అంటే కొంత కోణంలో కాంతి వంగి ప్రయాణిస్తుంది. పై 10 లేదా 15 మీటర్ల లోతులో నీరు ఎరుపుకాంతిని పీల్చుకుంటుంది. కాబట్టి ఈతగాడికి 25 మీటర్ల క్రింద తన శరీరానికి గాయం అయితే, తన రక్తాన్ని తను చూసుకోలేడన్నమాట. ఎందుకంటే ఎరుపురంగు ఆ లోతుకు చేరాడు. ఎరుపురంగు వస్తువేది అక్కడ కనిపించదు. ఇదే విధంగా 30 నుండి 50 మీటర్ల లోతులో పచ్చ, చివరకు 200 మీటర్ల లోపు నీలం, 200 మీటర్ల తరువాత ఊదా, ఇండిగో రంగులు పీల్చబడతాయి. ఈ విధంగా వరుసగా ఒక్కొక్క రంగు కనిపించకపోవడం వలన, ఒక పొర తర్వాత మరొకటిగా, సాగరం చీకటి అయిపోతు ఉంటుంది. అంటే కాంతి పొరలలో చీకటి ఏర్పడుతుంది. 1000 మీటర్ల లోటు దాటితే పూర్తిగా చీకటే. 

2. సూర్య కిరణాలు మేఘాలచే పీల్చబడి, తర్వాత కాంతికిరణాలను చెల్లాచెదురుగా విసరడం వలన మేఘాలక్రింద చీకటి పొర ఏర్పడుతుంది. ఇది చీకటికి సంబంధించిన మొదటి పొర. సాగర ఉపరితలాన్ని కాంతి కిరణాలు తాకినప్పుడు, కెరటం యొక్క ఉపరితలంచే కాంతి పరావర్తనం చెందబడటం వలన కెరటం ఉపరితలం మెరుస్తూ కనిపిస్తుంది. కాబట్టి కెరటాలు కాంతిని పరావర్తనం చేస్తూ చీకటికి కారణమవుతున్నాయి. పరావర్తనం చెందని కాంతి మాత్రం సాగరంలోపలికి చొచ్చుకొనిపోతుంది. కాబట్టి సాగరం రెండు భాగాలు కలిగి ఉంటుంది. పై ఉపరితలభాగం సహజంగా వెలుగుతో, వెచ్చగా ఉంటుంది. లోతైన భాగం చీకటి లక్షణాన్ని కలిగి ఉంటుంది.

పై ఉపరితలభాగం సహజంగా వెలుగుతో, వెచ్చగా ఉంటుంది. లోతైన భాగం చీకటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఉపరితలం కెరటాలవలన లోటు భాగం నుండి వేరు చేయబడుతుంది. లోతులో ఉన్న నీటిని అంతర (లోపలి) కెరటాలు కప్పుతాయి. ఎందుకంటే లోతుగా ఉన్న నేటి యొక్క సాంద్రత, పైన ఉన్న నీటి సాంద్రత కంటే ఎక్కువ. చీకటి ఈ అంతర కెరటాలక్రింద నుండి ప్రారంభమవుతుంది. చేప సయితం బాగా లోతులో చూడలేదు. దానికన్నా ఏకైక వెలుగుకు మూలం దాని దేహమే.

ఖుర్'ఆన్ ఖచ్చితంగా చెబుతుంది. "లోతైన సముద్రంలోని చీకటిపై ఒక అలవ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల." మరోలా చెప్పాలంటే ఈ కేరతాలపైన చాలా రకాల కెరటాలున్నాయి. అంటే అవి సాగారంపై భాగాన కనిపిస్తాయి. ఖుర్'ఆన్ వాక్యం ఇంకను ఇలా చెబుతుంది. "దానిపై మెఘమ్. చీకటిపై చీకటి".

ముందు వివరించినట్లు ఈ మేఘాలే ఒక దానిపై మరొకటిగా ఉండే తెరలు. వివిధ లోతులలో రంగులను పీల్చుకోవడం ద్వారా మరింత చీకటికి కారణమవుతున్నాయి.

"1400 సంవత్సరాల క్రితం ఓ సామాన్య వ్యక్తి ఈ దృగ్విషయాన్ని ఇంత స్పష్టంగా వివరించలేడు. కాబట్టి ఈ వివరాలు ఖచ్చితంగా ప్రకృతికి అతీతమైన మూలం నుండి వచ్చి ఉండాలి" అని చెబుతూ ప్రొఫెస్సర్ దుర్గా రావు ముగించారు.

ప్రతీ జీవి నీతితో సృష్టింపబడింది

క్రింది ఖుర్'ఆన్ వాక్యాలను గమనించండి: 

"తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించరా? ఆకాశాలు భూమి పరస్పరం కలిసి ఉండేవని తరువాత మేము వాటిని వేరు చేశామని ప్రాణం ఉన్న ప్రతీదానిని నీళ్ళతో సృష్టించామనీ? వారు అంగీకరించరా?"
(ఖుర్'ఆన్ 21:30)

సైన్స్ లో అభివృద్ధి సాధించిన తర్వాత మాత్రమే 'సైటొప్లాజం', జీవకణానికి సంబంధించిన ప్రధానమైన పదార్ధం, 80 శాతం నీటితో తయారయ్యిందన్న విషయం మనకు తెలిసింది. చాలా జీవులు 50 శాతం నుండి 90 శాతం వరకు నీటిని కలిగి ఉంటాయని, జీవం ఉన్న ప్రతీ వస్తువు దాని యొక్క మనుగడకు నీరు అవసరమని ఆధునిక పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. 

ఎవరైనా మానవునికి 14 శతాబ్దాలక్రితమే ప్రతీజీవి నీటితో తయారయ్యిందన్న విషయాన్ని ఊహించడం సాధ్యమా? అంతేకాకుండా అలాంటి ఊహను నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అరేబియా ఎడారులలో నివశించే ఓ మానవుడు వెల్లడించగలడా? 

నీటినుండి జంతువుల సృష్టికి సంబంధించిన ఖుర్'ఆన్ వాక్యం: 


والله خلق كل دابة من ماء 

"అల్లాహ్ ప్రతిప్రాణిని నీటితో సృష్టించాడు------"      (ఖుర్'ఆన్ 24:45) 

ఈ క్రింది వాక్యం మానవులు నీటినుండి సృష్టింపబడ్డారని వివరిస్తుంది:

وهوالذي خلق من الماء بشرا فجعله نسبا و صهرا وكان 

ربك قديرا 
"ఆయనే నీతితో మానవుణ్ణి సృష్టించాడు. తర్వాత అతని ద్వారా (తన) వంశము, అత్తవారి వంశము అనే రెండు వేర్వేరు బదుత్వపు క్రమాలను రూపొందించాడు. నీ ప్రభువు సర్వశక్తి సంపన్నుడు" (ఖుర్'ఆన్ 25:54)  


ఖుర్'ఆన్ లో పెళ్లి కొరకు నిషేధించబడిన స్త్రీలు

"మీకు ఈ స్త్రీలు (హరామ్) నిషేధించాబడ్డారు - మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు మీ తల్లి సోదరీమణులు (పినతల్లులు) మీ సోదరుల కుమార్తెలు, మేనకోడళ్ళు మీకు పాలిచ్చిన తల్లులు, మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు అంటే మీరు రమించిన భార్యల కుమార్తెలు అయితే ఒకవేళ (వివాహం మాత్రమే అయి) రమించటం జరిగి ఉండకపోతే (వారికి విడాకులిచ్చి, వారి వారి కుమార్తెలను వివాహమాడటం) మీకు దోషం కాదు. మీ వెన్ను నుండి పుట్టన మీ కుమారుల భార్యలు, ఇంకా ఏక కాలంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ చేర్చి భార్యలుగా చేసుకోవడం కూడా నిషిద్ధమే. 
పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అల్లాహ్ క్షమించేవాడు, కరునిన్చేవాడునూ." (ఖుర్'ఆన్ 4:23)

వైద్య శాస్త్రం కూడా మేనరికం చెయ్యరాదని (అంటే అక్క కుమార్తెను వివాహం) చేసుకోవటం వలన అనేక సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఖరు'ఆన్ లో 1400 సంవత్సరాలకు పూర్వమే చెప్పబడింది. ఇప్పుడు శాస్త్రీయపరంగా పరిశీలిద్దాం. క్రీ. శ. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అను శాస్త్రజ్ఞుడు జీవరాసుల శరీరము అనేక గ్రంధులు వాటి కణములతో నిర్మింపబడి ఉంటాయని కనుగొన్నాడు.


ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) చూపిన మహిమలు

ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) చేసిన అద్భుతాలలో మహా అద్భుతం ఖుర్'ఆన్. ఏ మానవ మాత్రుడు తెలియజేయలేని ఎన్నో విషయాలను ఆయన ఖుర్'ఆన్ లో తెలియజేసారు. అంతేకాక ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం)రెన్నో అద్భుతాలు చేశారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ను ఒక అవిశ్వాసి నీవు నిజంగా దైవ ప్రవక్తవే అయితే చంద్రుణ్ణి రెండుగా విడదీసి చూపమనగా ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) అల్లాహ్ ను స్మరిస్తూ తన చూపుడు వ్రేలుతో సైగ చేయగా చంద్రుడు కొంతసేపు రెండుగా విడిపోయెను. (బుఖారి)

మన భారత దేశంలో ఉన్న కేరళలో ఉన్న కొడంగలూరు కు చెందిన రాజా చేరామల్ పెరామల్ అనే ఒక రాజు తన కలలో చంద్రుడు రెండు మ్రుక్కలవడాన్ని చూసాడు. ఈ సఘటన గురించి తెలుసుకోవడానికి ఆయన అరేబియా కు ప్రయాణం చేసి అక్కడ మక్కా నగరంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ను కలుసుకొని విషయాన్ని తెలుసుకుని ఇస్లాం స్వీకరించడం జరిగింది. తిరుగు ప్రయాణంలో యెమెన్ లో మాలిక్ బిన్ దీనార్ (రె. అ) ని కలిశారు. అక్కడ ఆయన ఆతిధ్యం లో ఉన్న కొన్నేళ్ళకు రాజా చేరామల్ పెరామల్ వారు అనారోగ్యానికి గురైనారు. ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్న రాజ ముద్రను దానితో పాటు ఒక లేఖను మాలిక్ బిన్ దీనార్ కు ఇచ్చి కేరళ లో తన రాజ్యంలో ఒక మస్జిద్ నిర్మించవలసినదిగా కోరారు. ఆ తర్వాత ఆయన అక్కడే పరమ పదించారు.

ఆ లేఖను తీసుకుని మాలిక్ బిన్ దీనార్ వారు కొడంగలూరు కు పోయి అక్కడ ఉన్న మంత్రికి ఇచ్చారు. రాజుగారిని అభిమానించే మంత్రి తదితర ఆస్థానం లో ఉన్న వారందరూ రాజా వారి మాటను మన్నించి వారందూ ఇస్లాం స్వీకరించడమే కాకుండా అక్కడ ఒక మస్జిద్ కూడా కట్టించారు. అంటే మన దేశంలో 1400 సంవత్సరాలకు పూర్వమే మస్జిద్ కట్టడం జరిగింది.

జాబిర్ (రజి) వారు ఉల్లేఖనం ప్రకారం - సులైహ్ హుదేబియా (హుదేబియా ఒప్పందం) సమయంలో ఓ సంఘటన జరిగింది. ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ఓ పాత్రలోని నీటితో వజూ చేస్తున్నారు. మేము ఆయన వద్దకు వెళ్ళాము. ఆయన మమ్ములను గమనించి ఏమిటి విషయం అని అడిగారు.

ఓ ప్రవక్తా! మీ ముందు ఉన్న నీళ్ళు తప్ప మనకు త్రాగటానికి గాని వజూ చేయటానికి గాని మా వద్ద నీళ్ళు లేవు అని అన్నాము. అంతట ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) తన చేతిని నీళ్ళలో ముంచగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) చేతి వ్రేళ్ళ మధ్య నుండి నీళ్ళ ఊటలు చిమ్మతం ప్రారంభించింది. ఆ నీళ్ళను మేము త్రాగినంత త్రాగాము. వజూ చేసుకున్నాము. ఆ సమయంలో మేము 1000 మందికి పైగా ఉన్నాము. (బుఖారి , ముస్లిం హదీస్ గ్రంధాలు) 

ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) వారు ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేశారు. 




 ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) సాధారణ జీవితం

 ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) చాలా సాధారణ జీవితం గడిపేవారని, ఆయన జీవిత చరిత్ర చదివితే అర్ధం అవుతుంది. ఆయన తన వారని ఇహలోకపు బాధల నుండి రక్షించుట కొరకు గాని లేదా అధికార వ్యామోహంలో గాని తనను తానూ దైవప్రవక్తగా ప్రకటించుకోలేదు. అలానే అధికారాన్ని ఆయన ఏనాడు తన స్వప్రయోజనాల కొరకు వాడుకోలేదు.  ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) 40 సంవత్సరముల వయస్సులో ప్రవక్తగా నియమింపబడ్డారు.ఆ సమయంలో ఆయన ఆర్ధిక స్థితి ఏంటో మెరుగ్గా ఉండేది. అంటే కాకుండా మంచి వ్యాపారవేత్తగా పేరు పొందారు మరియు మక్కావాసులు ఆయనను సత్యవంతుదని నమ్మకస్తుడని, విశ్వాసపాత్రుడని, సహనశీలుడని, దాత్రుగుణం కలవాడని కొనియాడేవారు. అలా పొగిడిన వారంతా 'తానూ దైవప్రవక్తనని, బహుదైవారాధన మాని మీరంతా ఒకే అల్లాహ్ ను ఆరాధించమని' చెప్పగానే ఆయనను వ్యతిరేకించ సాగారు. 

ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) నడిచే మార్గంలో ముళ్ళ కంపలు పరచ సాగారు. ఆయనపై ఇసుక గుమ్మరించేవారు. చివరికి హత్యా ప్రయత్నం కూడా చేశారు. పొగిడిన వాళ్ళే శాపనార్థాలు పెట్టారు. నమస్కరించిన చేతులే రాళ్ళు రువ్వాయి.  ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) చలించలేదు. మక్కా అవిస్వాసులలోని పెద్దలందరూ కలిసి  ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ను ఇస్లాం ప్రచారం ఆపమని ఆయన బాబాయి చేత కబురు పంపారు. దానికి సమాధానంగా ఆయన ఇలా అన్నారు. "మీరు ఒక చేతిలో చంద్రుడు మరో చేతిలో సూర్యుడు ఉంచినా నేను మాత్రం ఇస్లాం ధర్మప్రచారం మానలేను". 

 ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం)  తన సంపాదనంతా బీదసాదలపై ఖర్చు చేసేవారు. ఆయన మదీనాకు వలస వెళ్ళిన తర్వాత ఇస్లాం బలం పుంజుకుంది. స్వచ్చందంగా ఎందఱో ఇస్లాం లో చేరారు. అరబ్బు ప్రాంతాలెన్నో ఇస్లాం వశం అయినాయి. అలాంటి సమయంలో కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) సాధారణ జీవితమే గడిపేవారు

"మా ఇంట్లో ఒక్కోసారి రెండు చంద్రులు గడిచినా (రెండు నెలల పాటు) పొయ్యి వెలిగించేవారమే కాదు.' అని ఆయిషా (ర.జి) (ఈమె ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) భార్యామణి) అన్నారు. 'ఆ సమయంలో మేము రెండు నల్లటి వస్తువులతోనే కాలం వెళ్ళబుచ్చేవారము. ఆ నల్లటి వస్తువులు ఏమని ప్రశ్నించగా అవి ఒకటి కర్జూరములు,రెండవది నీళ్ళు అన్నారు.' (బుఖారి, ముస్లిం) 

ఇబ్నె సాద్ (ర.జి) ఇలా ఉల్లేఖిస్తున్నారు: 'ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) ప్రవక్త అయిన నాటి నుండి చివరి ఘడియ వరకు ఆయన తన ఇంట్లో జల్లించిన మెత్తటి పిండితో చేసిన రొట్టెలు భుజించేవారు.' (బుఖారి, ముస్లిం)

ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) కర్జూరపు పీచుతో తయారు చేయబడిన పరుపుపై శయనించేవారు. దానిపై పాడుకొనుట వలన ఆ పీచు గుర్తులు వీపుపై పడేవి. (బుఖారి, ముస్లిం) 

అమ్ర్ ఇబ్నె హరీద్ (ర.జి) ఇలా తెలియజేసారు. 'ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం)  ఈ లోకంలో నుండి తనువూ చాలించే నాటికి ఆయన వద్ద ఉన్న ఆస్తి ఏమిటంటే ఓ తెల్లగాడిద, యుద్ధరంగంలో ఉపయోగించే కవచము, డ్హాలు,ఖడ్గం మొదలగునవి. కొద్దిపాటి భూమి ఈ స్తలాన్ని కూడా బైతుల్ మాల్ కి ఇచ్చేసారు. (బుఖారి, మస్నదే అహ్మద్) 

ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) యొక్క జీవిత విషయాలు చదివినట్లైతే ఇలాంటి విషయాలు లెక్కలేనన్ని మనకు కనపడతాయి. ముహమ్మద్ (సల్లల్లాహు అలిహివ సల్లం) కు అధికార వ్యామోహం ఇసుమంత కూడా ఉండది కాదు. అరబ్బు ప్రాంతమంతా ఇస్లాం ఆధీనంలో ఉన్నా, ఏనాడూ ఆయన తన స్వలాభామునకు గాని తన వాళ్ళ గురించి గాని వాడుకోలేదు. 

ఆయన అన్ని రంగాలలో తన పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఆయన ఓ బోధకుడిలో ఎన్నో మంచి విషయాలు బోధించేవారు. చెప్పటమే కాదు వాటిని స్వయంగా ఆచరించి చూపేవారు కూడా . ఓ పాలకునిగా అందరికీ సమానంగా న్యాయాన్ని అందించేవారు. యుద్ధరంగంలో ఉన్నప్పుడు సైన్యాధిపతిగా ఏంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి, సైన్యాన్ని ముందుకు నడిపించేవారు. ఇంట్లోనివారికి, ఇంటి పనులలో కూడా సహకరించేవారు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక మామగా, ఒక తాతగా, అన్ని కోణాల్లో కూడా తన వంతు పాత్రను సక్రమంగా నెరవేర్చారు. మదీనాలో మస్జిదు నిర్మించే సమయంలో తన సహచరులతో కలిసి ఆయన కూడా ఇటుకలు మోశారు. ఖందఖ్ అనే యుద్ధ సమయంలో ఖందఖ్ (గొయ్యి) త్రోవ్వుతున్నప్పుడు ఆ తవ్వకాలలో ఆయన కూడా పలుగు పట్టి గొయ్యి త్రావ్వతంలో పాలుపంచుకున్నారు. 

ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆయన ఎంత మంచి వ్యక్తిత్వం కల వ్యక్తి అని. కాని కొందరు పనిలేని దుర్మార్గులు ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసీ తెలియక వారి ఇష్టం వచ్చినట్లు ఆయన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిస్సందేహంగా ఇటువంటి వ్యక్తులు (ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో) వీరికి త్వరలోనే నరకమనే బహుమానం సిద్ధంగా ఉంది అని తెలుసుకోవాలి. 


ఖుర్'ఆన్ లో భౌతిక శాస్త్రం గురించి

పురాతన కాలంలో బాగా ప్రసిద్ధిచెందినా సిద్ధాంతమేమిటంటే 'థీరి ఆఫ్ అటమిజమ్' ఇది విస్తృతంగా అంగీకరిచబడింది. నిజానికి ఈ సిద్ధాంతాన్ని గ్రీకులు ప్రతిపాదించారు. ముఖ్యంగా చెప్పాలంటే 23 శతాబ్దాలక్రితం జీవించిన డెమోక్రిటస్ దీనిని ప్రతిపాదించాడు. ద్రవ్యానికి (మేటర్) సంబంధించిన అతి చిన్న ప్రమాణాన్ని 'పరమాణువు (ఆటమ్)'గా భావించారు. అరబ్బులు కూడా అదే నమ్మేవారు. 'దర్రహ్' అనే అరబీపడం సామాన్యంగా ఈ పరమాణువు అర్థాన్నే ఇస్తుంది. 

ఇటీవలి కాలంలో ఆధునిక సైన్స్ పరమాణువును సైతం విభజించడం సాధ్యమని కనుగొనడం జరిగింది. ఈ పరమానువును విభజించడం అనేది 20వ శతాబ్దంలో సాధించిన అభివృద్ధి.  14 శతాబ్దాలక్రితం ఈ విషయాన్ని చెబితే, అరబ్బులకు కూడా చాలా అసాదారంగా అన్పిస్తుంది. ఎందుకంటే అరబ్బులకున్న హద్దు 'దర్రహ్' అంతకు మించి వారు పోలేదు. క్రింది ఖుర్'ఆన్ వాక్యం ఈ హద్దును ఒప్పుకోకుండా తిరస్కరిస్తుంది. 

"ఏదీ, ప్రళయం ఇంకా మా మీదకు రావటం లేదేమిటి? అని అవిశ్వాసులు అంటారు. వారితో ఇలా అను "అగోచర విషయజ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీ మీదకు తప్పకుండా వస్తుంది. పరమాణువంత వస్తువైనా సరే ఆయనకు ఆకాశాలలోనూ గోప్యంగా లేదు. భూమిపైనా గోప్యంగా లేదు. పరమాణువుకంటే పెద్దదైనా సరే దానికంటే చిన్నదైనా సరే అంతా ఒక స్పష్టమైన దస్త్రములో వ్రాయబడి ఉన్నది".  (ఖుర్'ఆన్ 34:3)

ఈ వాక్యం దేవుడు సర్వజ్ఞాని అనే విషయానికి సంబంధించినది. కనిపించే లేదా కనిపించని అన్ని వస్తువులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇది మరింత ముందుకెళ్ళి దైవానికి ప్రతీది తెలుసునని, అది పరమాణువు కంటే చిన్నదైనప్పటికీ, పెద్దదైనప్పటికీ, ఈ విధంగా పై వాక్యం పరమాణువు కంటే చిన్నది ఉండటం సాధ్యమని ఈ మధ్యనే ఆధునిక సైన్స్ కనుగొన్న ఈ వాస్తవ విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. 

ఇటువంటి సందేసమే ఖుర్'ఆన్ లో 10:61 లో తెలుపబడింది.  


ఖుర్'ఆన్ లో భౌగోళిక శాస్త్రం గురించి

1580లో బెర్నార్డ్ పలిస్సీ మొదటగా ప్రస్తుత వాటర్ సైకిల్ భావాన్ని వివరించాడు. నీరు ఏ విధంగా సముద్రాలనుండి ఆవిరౌతుంది. తర్వాత చల్లారి ఎలా మేఘాలుగా మారుతుందో వివరించాడు. ఈ మేఘాలు భూభాగం వైపు కదిలి అక్కడవి పైకి వెళ్లి, ద్రవీభవించి మరలా వర్ష రూపేణా క్రిందకు పడటం జరుగుతుంది. ఈ నీరు చేరి సరస్సులుగా, నదులుగా మారి, తిరిగి చివరకు సముద్రంలో కలిసిపోతుంది. ఈ విధంగా నిరంతరంగా వాటర్ సైకిల్ పనిచేస్తుంది. క్రీస్తు పూర్వం 7వశతాబ్దంలో గాలీ, నీటి అలలూ మొదలగు వాటి వేగం వల్ల ఏర్పడిన సముద్రనీటి తుంపరను వాయు పవనాలు భూభాగం వైపు తీసుకొని పోయి, వర్షం పడేలా చేస్తాయని మిలేటస్ కు చెందినా 'థెల్స్' నమ్మాడు. 

పూర్వకాలంలో భోగర్భములొని నీటికి మూలం ఏమిటో తెలిసేది కాదు. వారు ఏమనుకునే వారంటే వాయు పవనాలప్రభావం వలన, సముద్ర నీరు ఖండాలలోపలికి బలంగా త్రోయబడుతుందని అనుకునేవారు. ఆ నీరు మరలా రహస్య మార్గం (పాతాళం) నుండి వెనక్కి వస్తుందని కూడా నమ్మేవారు. సముద్రాలలో కలిసియున్న ఈ రహస్యమార్గాన్ని 'టార్టారస్' అనేవారు అంటే గ్రీకు పురాణాల ప్రకారం పాతాళలోకం అడుగున టైటాన్లను చెరలో ఉంచిన అగాధం అని అర్ధం. 19వ శతాబ్దంవరకు అరిస్టాటిల్ సిద్ధాంతమే వ్యాప్తిలోఉంది , ఈ సిద్ధాంతం ప్రకారం పర్వతాల సోరంగాలలో నీరు ద్రవీభవించి భూగర్భ సరస్సులు ఏర్పడతాయని అవి 'దారాలు' (ఊటలు) గా బయటికి వస్తాయి. కాని ఈనాడు వర్షపునీరు భూమి పగుళ్ళ గుండా లోపలికి ఇంకటమే. ఈ భూగర్భజలాలకు కారణమని మనకు తెలుసు. 

వాటర్ సైకిల్ గురించి ఖుర్'ఆన్ వర్ణించిన వాక్యాలు :

"మీరు గమనించారా! అల్లాహ్ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. తరువాత దాని ఊటలు, చలమలు, నదులరూపాలలో భూమిలో ప్రవేసింపజేసాడు. తర్వాత ఈ నీటి ద్వారా ఆయన రకరకాలపంటలు పండిస్తున్నాడు. వాటి రంగులు కూడా భిన్నంగా ఉంటాయి." (ఖుర్'ఆన్ 39:21)

"ఆకాశం నుండి నీటిని కురిపిస్తున్నాడు. తర్వాత దాని ద్వారా భూమికి, దాని మరణానంతరం జీవితాన్ని ప్రసాదిస్తూన్నాడు. నిశ్చయంగా ఇందులో తెలివిని వినియోగించుకునే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి". (ఖుర్'ఆన్ 30:24)

"ఆకాశం నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యెక పరిమాణంలో నీటిని దించాము. దానిని భూమి లోపల నిలువ చేశాము. మేము దానిని ఎలా కోరితే అలా మాయం చేయగలం"(ఖుర్'ఆన్ 23:18)

1400 సంవత్సరాల క్రితం నాటి ఏ గ్రంధం కూడా ఇంత ఖచ్చితంగా వాటర్ సైకిలును వర్ణించలేదు. 


వృక్ష శాస్త్రం 

మొక్కలు ఆడ, మగ జంటలుగా సృష్టింపబడ్డాయి: 

మొక్కలకు కూడా ఆడ, మగ లింగ బెధలుంటాయని మానవులకు మొదట్లో తెలియదు. ప్రతీ మొక్క ఒక ఆడ ఒక మగ లింగాన్ని కలిగి ఉంటుందని వృక్ష శాస్త్రం చెబుతుంది. ఏకలింగ లక్షణాలు కలిగిన మొక్కలు సయితం భిన్నమైన ఆడ, మగ రెండింటి మూలకాలను కలిగి ఉంటాయి. 

و أنزل من أسماء ماء فأخرجنا به  ازوجآ من نبات شتى 

"ఆకాశం నుండి నీటిని కురిపించాడు. తద్వారా రకరకాల పంటలను జంటలుగా పండించాడు-...... "
(ఖుర్'ఆన్ 20:53)

ఫలాలు ఆడ, మగ జంటలుగా సృష్టింపబడ్డాయి:


ومن كل أثمرت جعل فيها زوجين أثنين 

"ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించినవాడు....." (ఖుర్'ఆన్ 13:3)

హైయర్ మొక్కలలో జరిగే బహుళోత్పత్తిలో (reproduction) చివరగా ఉత్పన్నమయ్యేదే ఫలం. ఫలానికి ముందరి దశ పుష్పం. ఇది ఆడ, మగ అంగాలను కలిగి ఉంటుంది. ఒకసారి పుప్పొడి పుష్పం దగ్గరికి తీసుకురాబడగానే, అది ఫలాన్ని మోస్తుంది. అది పరిపక్వానికి చేరి, దాని విత్తనాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి అన్ని ఫలాలు ఆడ, మగ అంగాలు కలిగి ఉంటాయని ఖుర్"ఆన్ లో చెప్పిన వాస్తవాన్ని ఇది సూచిస్తుంది. 

కొన్ని నిర్డుష్టమిన జాతి మొక్కలలో, గర్భోత్పత్తి కాని పుష్పాలలో నుండి కూడా ఫలాలు వెలువడ గలవు. ఉదా: అరటి, అలాగే కొన్ని రకాల పైనాపిల్, ఫిగ్, ఆరంజ్, ద్రాక్ష మొదలైనవి. అవి కూడా స్పష్టమైన లింగ బేధాన్ని కలిగి ఉంటాయి. 


ప్రతీ వస్తువు జంటగా సృష్టింపబడింది: 



ومن كل شيئ خلقنا زوجين 

"ప్రతీ వస్తువూ మేము జంటలుగా సృష్టించాము...." (ఖుర్'ఆన్ 51:49)

ఈ వాక్యం మానవులు, జంతువులూ, మొక్కలు మరియు ఫలాల గురించి కాకుండా, ఇతర వస్తువుల గురించి వివరిస్తుంది. విద్యుత్తు  లాంటి విషయాలను గురించి వివరించి ఉండవచ్చు. (ఋణావేశం, ధనావేశం). పరమాణువులు ఋణావేశం, ధనావేశం గల ఎలెక్త్రానులను,ప్రోటానులను కలిగి ఉంటాయి. 


 سبحانالذي خلق الأزواج كلها مما تمبتل الارض

ومن أنفسهم ومما لايعلمون   

"అన్ని రకాల జంటలను సృష్టించిన ఆయన పరిశుద్ధుడు. అవి భూమిలో నుండి పుట్టే వ్రుక్షరాసులలోనివైనా సరే లేదా స్వయంగా వారి జాతి (అంటే మానవులు) లో నుండి అయినా సరే లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినా సరే" (ఖుర్'ఆన్ 36:36)

ప్రతీ వస్తువు జంటగా సృష్టింపబడినదని, అంతేకాకుండా ఇప్పటి వరకూ తెలియని, భవిష్యత్తులో కనుగొనబోయే వస్తువులకు కూడా ఈ పై వాక్యాలు వర్తిస్తాయనే విషయం తెలుస్తుంది. 


జంతువులు మరియు పక్షులు సంఘాలుగా నివశిస్తున్నాయి: 



وما من دابة في الارضولا طائر يطير بجناحيه إلا أمام أمثالكم 


"భూమిపై సంచరించే ఏ జంతువైనా, గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి. ఇవన్నీ మీ వంటి సంఘజీవులే" (ఖుర్'ఆన్ 6:38)

జంతువులు, పక్షులు సంఘాలుగా జీవిస్తున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవి వ్యవస్థీకరిస్తాయి. కలిసి మెలిసె జీవిస్తాయి మరియు పనిచేస్తాయి. 

పక్షులు గాలిలో ఎగరడం:

పక్షులు గాలిలో ఎగరడానికి సంబంధించి ఖుర్'ఆన్ ఇలా చెబుతుంది . 


ألم يرو إلى الطير مسخرات في جو أسماء ما 

يمسكهن إلا الله إن فى ذالك لآ يات ليقوم يؤمنون 

"గగనమండలంలో భద్రంగా విహరించే పక్షులను వారు ఎన్నడూ చూడలేదా? అల్లాహ్ తప్ప వాటిని క్రిందపడకుండా నిలిపి ఉంచినదెవరు? విశ్వాసులకు ఇందులో చాలా నిదర్శనాలు ఉన్నాయి" (ఖుర్'ఆన్ 16:79)

ఇటువంటి సందేశమే క్రింది ఖుర్'ఆన్ వాక్యంలో మరల చెప్పడం జరిగింది.  


أولم يرو إلى أطير فووقهم صافات ويبيضن ما يمسكهن 

إلا ارحمن إنه بكل شئ بصير 

"వారు తమ మీద ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడటం లేదా?
కరుణామయుడైన అల్లాహ్ తప్ప వాటిని అలా నిలిపి ఉంచే వారెవ్వరూ లేరు. ఆయనే ప్రతి వస్తువును కనిపెట్టి ఉండేవాడు" (ఖుర్'ఆన్ 67:19)

'అమ్ సక' అనే అరబీ పదానికి భాషాపరంగా అర్ధం ఏమిటంటే to put one's hand on, పటుకోవడం, hold some one back. అల్లాహ్ తన శక్తితో అవి క్రిందపదకుండా నిలిపి ఉంచిన భావాన్ని తెలియజేస్తున్నాయి. దైవ ఆజ్ఞపై పక్షుల ప్రవర్తన ఎంత ఎక్కువగా ఆధారపడుతుందో ఈ వాక్యాలు నొక్కి చెబుతున్నాయి. కొన్ని రకాల పక్షులు వాటి కదలికల యొక్క ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏ స్థాయిలో అవి ప్రావీణ్యాన్ని పొందాయో ఆధునిక శాస్త్రీయ వివరాలు తెలియజ్స్తున్నాయి. చాలా లేత ప్రాయంలో ఉన్న పక్షులు కూడా, ఎటువంటి అనుభవం లకుండా, మార్గాన్ని చూపే ఏ మార్గదర్శి లేకుండా చాలా సుదూరమైన కష్టమైనా ప్రయాణాన్ని పూర్తిచేయ గలుగుతున్నాయి అంటే ఆ పక్షుల జెనెటిక్ కోడ్ (ప్రత్యుత్పాదనకు సంబంధించిన శరీర శాస్త్రపు సాకేతిక భాష) లో వలసకి సంబంధించిన ప్రొగ్రామ్ ఉండటమే దీనికి కారణం. అంతేకాదు, అవి తాము బయలుదేరిన ప్రదేశానికి తిరిగి ప్రయాణం పూర్తి చేసుకొని ఓ ఖచ్చితమైన తారీఖును చేరుకోగలవు.

ప్రొఫెస్సర్ హామ్ బర్గర్ తన పుస్తకమైన "Power and Fragility" లో పసిఫిక్లో ఉండే 'మటన్' పక్షి '8' అంకె ఆకారం లో 15,000 మైళ్లుకు మించి ప్రయాణం చేస్తుందని ఓ ఉదాహరణ నిచ్చారు. అది ఈ ప్రయాణాన్ని దాదాపు 6నెలల పాటు చేసి తిరిగి తను బయలుదేరిన ప్రదేశానికి ఓ వారం లోపు తేడాతో చేరుకుంటుంది. ఈ ప్రయాణం కోసం అత్యంత క్లిష్టమైన సూచనలు పక్షుల యొక్క నాడీ కణాలలో కలిగి ఉండాల్సి ఉంది. మరి పక్షులలో ఇలాంటి ప్రొగ్రామ్ ను ఏర్పాటు చేసిన ఆ ప్రోగ్రామర్ యొక్క గుర్తింపును మనం ఆలొచించమా? 


ఖుర్'ఆన్ లో తేనెటీగ గురించి

و او حى ربك إلى انحل أن أتخذي من الجبال بيوتا ومن 

أشجر ومما يعرشون  ثم كلي من كل أثمرات فاسلكي سبل 

ربك ذللا 


"చూడండి మీ ప్రభువు తెనేటీగకు వహీ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. "కొండలలో, చెట్లమీద, తడికలపై ఎక్కించబడిన తీగెలలొ నీ తెట్టెలను నిర్మించుకో, అన్ని రకాల పండ్ల రసాన్ని పీల్చు, నీ ప్రభువు సుగమం చేసిన మార్గాలపై నడుస్తూ ఉండు. ఈ ఈగ కడుపులో నుండి రంగురంగుల పానకం ఒకటి వెలువడుతుంది. అందులో ప్రజలకోసం వ్యాధి నివారణ శక్తి ఉన్నది. ఆలోచించేవారికి ఇందులో కూడా నిశ్చయంగా ఒక సూచన ఉంది." (ఖుర్'ఆన్ 16:68-69)

von-Frisch అనే శాస్త్రవేత్త 1973లో తేనెటీగల ప్రవర్తన మరియు వాటి మధ్య ఒకదానినుండి మరొకదానికి సందేశాలు ఎలా చేరతాయన్న విషయంపై చేసిన పరిశోధనకి నోబెల్ ప్రైజ్ ని అందుకున్నారు. ఏదైనా కొత్త తోటను గాని, పుష్పాన్ని గాని ఓ తేనేటీగ కనుక్కోగానే వెనక్కి వెళ్లి, తన తోటి తేనెటీగలకు అక్కడికి ఎలా చేరాలో ఖచ్చితమైన దిశను మరియు మ్యాప్ ను వివరిస్తుంది. దీనినే తేనెటీగల నృత్యం అంటారు. ఈ ఈగల కదలికలకు అర్ధం ఏమిటంటే పనిచేసే తేనెటీగలకు వివరాలను అందించే ఉద్దేశమే ఈ నృత్యం. శాస్త్రీయంగా ఫోటోగ్రఫీ మరియు ఇతర పద్ధతుల ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. తేనెటీగ ఎలా తన దేవుని యొక్క విశాల మార్గాలను ప్రావీణ్యంతో కనుగొంటుందో పై వాక్యాలలో ఖుర్'ఆన్ తెలియజేస్తుంది. 

వీటిలో పనులు చేసే ఈగ లేదా సిపాయి ఈగ 'ఆడ తేనెటీగ'. సూరా అన్-నహ్ల్ (అధ్యాయం 16 ఆయత్ లు 68 మరియు 69లలో తేనెటీగ 'లింగం' కోసం వాడిన పదం స్త్రీ లింగం (ఫస్ లుకి మరియు కులి). ఆహారాన్ని సముపార్జించడానికి ఇళ్ళు వదిలి వెళ్ళేది ఆడ తెనేటీగేనన్న విషయాన్ని సూచిస్తుంది. మరోలా చెప్పాలంటే ఆడ తేనేటీగే, సిపాయి లేదా పని చేసే తేనెటీగ. అయినప్పటికీ 'Henry the Forth' అనే షేక్స్ పియర్ నాటకంలో కొన్ని పాత్రలు తేనెటీగ గురించి మాట్లాడటం జరుగుతుంది. తేనెటీగలు సిపాయిలు గాను, అవి ఓ రాజును కలిగి ఉన్నట్లుగాను చెప్పడం జరిగింది. షేక్స్ పియర్ కాలంలో ప్రజలు అలా ఆలోచించే వారన్నది మనకు తెలుస్తుంది. పనిచేసే తేనెటీగలు మగ తేనెటీగలేనని, మరియు అవి ఇంటికెళ్ళి 'రాజు తేనెటీగ'కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అనుకునే వారు. ఇది నిజం కాదు. 'కార్మిక తేనెటీగలు' అనేవి ఆడ ఈగలు, అవి రాజు తేనెటీగకు కాకుండా 'రాణి ఈగ'కు నివేదిస్తాయి. కాని ఇది గత 300 సంవత్సరాలలో జరిగిన ఆధునిక పరిశోధనల వలన మాత్రమే కనుగొనడం జరిగింది.    


సాలె పురుగు గూడు చాలా బలహీనమైనది

సూరీ అల్ అన్ కబూత్ లో ఖుర్'ఆన్ ఇలా చెబుతుంది: 


مثل الذين اتخذو من دون الله أولياء كمثل العنكبوت أتخذت بيتا وإن أوهن البيوت لبيت العنكبوت لوكانو يعلمون 


"అల్లాహ్ ను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నవారు సాలెపురుగును పోలి ఉన్నారు. అది తన కొరకు ఒక ఇల్లు కట్టుకుంటుంది. అన్ని ఇళ్ళ కంటే అతి బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లే అవుతుంది. అయ్యో! వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుంటుంది!" (ఖుర్'ఆన్ 29:41)

సాలె పురుగు గూడును సులభంగా నశించే,మృదువుగా మరియు బలహీనంగా ఉండేదిగా ఖుర్'ఆన్ యొక్క భౌతిక వర్ణనవెనుక, సాలెపురుగు ఇంటిలోని సంబంధాల యొక్క సులభ నాశనం గురించి నొక్కి చెబుతుంది. అంటే ఆడ సాలె పురుగు తరచుగా తనతో జతగా ఉన్న మగ సాలె పురుగును చంపేస్తుంది. 


చీమల యొక్క జీవన సరళి


క్రింది ఖుర్'ఆన్ వాక్యాలు గమనించండి: 




"సులైమాన్ కొరకు జిన్నాతుల, మానవుల, పక్షుల సైన్యాలు సమీకరించబడ్డాయి. అవి గట్టి క్రమ శిక్షణలో ఉంచబడేవి. (ఒకసారి ఆటను వాటిని తీసుకుని దండయాత్రకు బయలుదేరారు). చివరకు వారంతా చీమల లోయకు చేరుకున్నప్పుడు, ఒక చీమ ఇలా అన్నది "చీమలారా! మీరు మీ పుట్టలలోకి దూరిపోండి. లేకపోతే సులైమాన్, అతని సైనికులు మిమ్మల్ని నల్పివేస్తారు. ఆ సంగతి వారికి తెలియక పోవచ్చు కూడా"
(ఖుర్'ఆన్ 27:17-18)

చీమలు ఒకదానితో ఒకటి చాలా తెలివిగా సందేశాలు ఇచ్చి పుచ్చుకుంటాయనే విషయం ఖుర్'ఆన్ తెలపడంతో, ఈ గ్రంధాన్ని అద్భుత కధలపుస్తకంలా ఉందని కొంతమంది గతంలో హేళన చేసి ఉండవచ్చేమో. ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనలు చీమల జీవన సరళికి సంబంధించిన ఎన్నో వాస్తవాలను తెలియజేస్తున్నాయి. ఇవి మానవజాతికి ఇంతకు ముందు తెలియని విషయాలు. జంతువులు, పురుగుల యొక్క జీవన సరళిలను గమనిస్తే, మానవ జీవన సరళికి అత్యంత సామీప్య పోలికున్న జీవన సరళి ఎవరిదంటే, అది చీమలదేనని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. చీమలకు సంబంధించి క్రింద కనుగొన్న విషయాలను బట్టి ఇది తెలుస్తుంది. 

(1) మనుష్యులు ఎలా అయితే చనిపోయిన వారిని మట్టిలో పూడ్చిపెడతారో, అలాగే చీమలు కూడా చేస్తాయి. 

(2) చీమలు తెలివైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఆ వ్యవస్థలో కూలిచీమలు, అలాగే వాటికి మేనేజర్లు, సూపర్వైజర్లు, ఫోర్ మెన్, కార్మికులు మొదలైన విభాగాలు ఉంటాయి. 

(3) చీమలు అప్పుడప్పుడు తమంతట తాము కలుసుకుని మాట్లాడుకుంటాయి. 

(4) చీమలు, వాటి మధ్య అభివృద్ధి చెందినా కమ్మ్యునికేషన్ పద్ధతుంది. 

(5) చీమలు క్రమబద్ధంగా సంతలను ఏర్పాటు చేసుకుని అక్కడ పరస్పరం వస్తుమార్పిడులు చేసుకుంటాయి. 

(6) చీమలు ధాన్యపు గింజలను చలికాలంలో చాలాకాలం వరకు నిల్వ ఉంచుతాయి. ఒకవేళ గింజ మొగ్గ తొడిగితే, వాటిని కత్తిరిస్తాయి. వాటిని కనుక అలా వదిలేస్తే గింజ కుళ్ళుతుందని అవి అర్ధం చేసుకోవడంతో, వాటి వేళ్ళను కత్తిరిస్తాయన్నమాట. ఒకవేళ నిల్వ చేసుకున్న గింజలు వర్షాలకు తడిస్తే, వాటిని అవి సూర్య రశ్మిలో ఉంచి పొడిగా అయ్యేటట్లు చేస్తాయి. ఒకసారి అవి పొడిగా అవగానే, మరలా వాటిని లోపలి తీసుకెళతాయి. ఎందుకంటే humidity (ఆర్ద్రత) వలన గింజలో వేళ్ళ వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. తర్వాత గింజ కుళ్ళి పోతుందన్న ఉద్దేశంతో అలా చేస్తాయి.  


తేనె రోగాన్ని నయం చేసే గుణాన్ని కలిగి ఉంది

తేనె టీగ రకరకాల ఫలాలు, పుష్పాల నుండి రసాన్ని పీల్చి, తన శరీరంలో జీర్ణించుకుని, తన సరీరంలోనే తేనెను తయారు చేస్తాయి. ఆ తేనెను తన జిగురు కణాలలో నిల్వ ఉంచుతుంది. తేనెటీగ కడుపునుండే తేనె వస్తుందన్న విషయం మనిషికి ఓ రెండు వందల సంవత్సరాల క్రితం మాత్రమే తెలిసింది. ఈ వాస్తవాన్ని క్రింది వాక్యంలో 1400 సంవత్సరాల క్రితం ఖుర్'ఆన్ లో చెప్పబడింది.


يخرج من بطونها شراب مختلفن الوانه فيه شفاء لناس 

"ఈ ఈగ కడుపులో నుండి రంగురంగుల పానకం ఒకటి వెలువడుతుంది. అందులో ప్రజలకోసం వ్యాధి నివారణ శక్తి ఉన్నది. ఆలోచించేవారికి ఇందులో కూడా నిశ్చయంగా ఒక సూచన ఉంది"
.....(ఖుర్'ఆన్ 16:69) 

తేనెకు రోగాన్ని నివారించే గుణముందని మరియు మృదువైన యాంటి సెప్టిక్ గుణాన్ని కూడా కలిగి ఉండనే విషయం మనకిప్పుడు తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రష్యన్లు తమ గాయాలకు పైన తేనెను పూసేవారట. అప్పుడు ఆ గాయం తేమను పోకుండా ఉంచి, చాలా చిన్న మచ్చ ధాతువును విదిచిపెడుతుంది. తేనెకుండే సాంద్రత వలన ఫంగస్ గాని, బాక్టీరియా గాని గాయంపై పెరుగవు. 

ఓ ప్రత్యేకమైన మొక్క వలన వచ్చిన ఎలర్జీతో బాధపడే వ్యక్తికీ, ఆ మొక్క నుండి తయారైన తేనెను ఇస్తే, ఆ మనిషిలో ఆ ఎలర్జీని నిరోధించే గలిగే శక్తి అభివృద్ధి అవుతుంది. తేనెలో ప్రక్టోజ్ మరియు విటమిన్ 'కె' సమృద్ధిగా ఉంటాయి. 

ఆ విధంగా తేనె, దాని పుట్టుక మరియు దాని గుణాలకు సంబంధించి 'ఖుర్'ఆన్ లో ఉన్న జ్ఞానాన్ని బట్టి, ఈ గ్రంధం తను అవతరించిన కాలం కంటే చాలా ముందంజలో ఉందన్న విషయం మనకు తెలుస్తుంది.  


శరీర ధర్మ శాస్త్రం 


రక్త ప్రసరణ మరియు పాల ఉత్పత్తి :

'ఇబ్నె నఫీన్' అనే ఓ ముస్లిం శాస్త్రవేత్త మొదటిసారిగా 'రక్తప్రసరణం' గురించి వర్ణించడానికి, ఓ 600 సంవత్సరాలకు ముందుగానే, దాని గురించి ఖుర్'ఆన్ వివరించడం జరిగింది. ఖుర్'ఆన్ అవతరణకు 1000 సంవత్సరాల తర్వాతనే ఈ విషయాన్ని విలియమ్ హార్వే అనే శాస్త్రవేత్త పాశ్చాత్త ప్రపంచం గ్రహెంచేల చేశాడు. Digestive absorption (జీర్ణమైన ఆహార సారాన్ని పీల్చుకోవడం) అనే ప్రక్రియ ద్వారా వివిధ అంగాలకు పోషకాలు అందుతాయని తెలుసుకోవడంలో, ప్రేవులలో ఏం జరుగుతుందోనన్న విషయాన్ని దాదాపు 1400 సంవత్సరాల క్రితమే, పాలలోని మూలకాలకు సంబంధించి ఖుర్'ఆన్ వాక్యం తెలిపిన వర్ణన ఈ భావాలతో బాగా సరిపోతుంది. 

పై భావాలకు సంబంధించి ఖుర్'ఆన్ వాక్యాన్ని అర్ధం చేసుకోవడానికి, ప్రేవులలో జరిగే రసాయనిక చర్యలను తెలుసుకోవడం, ఆ తరువాత ఆహారం నుండి పోషక పదార్ధాన్ని ఓ క్లిష్టమైన వ్యవస్థ ద్వారా రక్తప్రవాహంలో కలిసేలా చేయడం లేదా కొన్నిసార్లు ఆహారం యొక్క రసాయనిక తత్వానికి బట్టి Liver (కాలేయం) మార్గం లోనే ఈ ప్రక్రియ జరగడం గురించి తెలుసు కోవలసి ఉంది. రక్తం ఈ పోషక పదార్ధాలని శరీరం లోని అన్ని అంగాలకు తీసుకు వెళుతుంది. అలాంటి వాటి లోనివే పాలను ఉత్పత్తి చేసే Mammary glands (పాల గ్రంధులు). 

సులభమైన మాటలలో చెప్పాలంటే, ప్రేవులలో ఉండే వాటినుండి కొన్ని ప్రత్యేకమైన పోషక పదార్ధాలు ప్రేవు నిర్మాణంలోని రక్తనాళాలలోకి ప్రవేసిస్తాయి. ఈ పోషక పదార్ధాలు రక్త ప్రసరణ ద్వారా శరీరంలో వివిధ అంగాలకు చేరడం జరుగుతుంది. 

క్రింద ఇచ్చిన ఖుర్'ఆన్ వాక్యాలని అర్ధం చేసుకోవాలని కోరుకుంటే గనుక, అందులో తెలిపిన ఈ భావాన్ని సంపూర్ణంగా మెచ్చుకోవలసిందే. 

وان لكم في العنم لعبرة نسقيكم مما في بطونه من بين 

فرث ودم لبنا خالصا سائغا ليشاربن


"మీకు పశువులలో కూడా ఒక గుణపాఠం ఉన్నది. వాటి గర్భంలో పేడ, రక్తానికి మధ్య ఉన్న ఒక వస్తువును మేము మీకు త్రాగిస్తాము. అంటే స్వచ్చమైన పాలు. అది త్రాగేవారికి ఏంటో కమ్మనిది" (ఖుర్'ఆన్ 16:66)


وان لكم في العنم لعبرة نسقيكم مما في بطونها ولكم فيها

منافع كثيرة ومنها تا كلون



"నిజంగానే పశువులలో కూడ మీకు ఒక గుణపాఠం ఉంది. వాటి గర్భాలలొ ఉన్న దాని నుంచే మేము ఒక వస్తువును (అంటే పాలు) మీకు త్రాపుతున్నాము. మీకు వాటిలో ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు తింటారు." (ఖుర్'ఆన్ 23:21)

పశువులలో జరిగే పాలుత్పత్తి గురించి ఖుర్'ఆన్ ఎలా అయితే వివరణ ఇచ్చిందో, ఆ విషయమై సరిగ్గా అలాగే ఆధునిక ఫిజియాలజీ కనుగొనడం జరిగింది. 


జనరల్ సైన్స్

వేలి ముద్రలు : 



أيحسب الإنسان ألن نجمع عظامه  بلى قادرين على أن نسوي

 بنانه 

"మేము మానవుని ఎముకలను జతచేయలేమని తను అనుకుంటున్నాడా? ఎందుకు జత చేయలేము? మేము అతని వ్రేళ్ళ కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించ గల సమర్ధులం"(ఖుర్'ఆన్ 75:3-4)

చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం జరుగుతుందనే విషయానికి సంబంధించి అవిశ్వాసులు ఇలా వాదనకు దిగారు - చనిపోయిన వారి ఎముకలు భూమిలో కలిసిపోయిన తర్వాత తీర్పుదినం నాడు ఎలా ప్రతీ వ్యక్తిని గుర్తించడం జరుగుతుంది అని. సకల లోకాల ప్రభువు అల్లాహ్ ఎముకలని తిరిగి జతచేయడమే కాదు, వ్రేళ్ళ కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించ గల సమర్ధుడని సమాధానం చెబుతున్నారు.

ప్రతీ వ్యక్తినీ గుర్తించడానికి ప్రత్యేకంగా అతని వేలి కోణాల గురించే ఎందుకు ఖుర్'ఆన్ చెప్పడం జరిగింది? క్రీ. శ; 1880లో వ్యక్తులను గుర్తించడానికి వేలు ముద్రలను తీసుకోవడం శాస్త్రీయ పధ్ధతిగా మారింది. ప్రపంచంలో, ఎప్పుడూ ఏ ఇద్దరికీ కూడా ఒకేలాంటి నమూనా ఉన్న వెలి ముద్ర ఉండదు. ఈ కారణం వలనే ప్రపంచంలోని పోలీసు యంత్రాంగం క్రిమినల్ (నేరస్తుణ్ణి గుర్తించడానికి వేలిముద్రలను ఉపయోగిస్తున్నారు.

ప్రతీ మానవుని యొక్క వేలిముద్ర అసమానంగా ఉంటుందనే విషయం 1400 సంవత్సరాల క్రితం ఎవరు తెలుసుకో గలిగారు? నిస్సందేహంగా అది ఎవరై ఉండగలరు? ఇంకెవరో కాదు మన సర్వసృష్టికర్త మాత్రమే.

నొప్పిని గ్రహించే భాగాలు చర్మంలో ఉంటాయి.

మెదడు వలెనే స్పర్శజ్ఞానం మరియు నొప్పి మనిషికి తెలుస్తున్నాయని అనుకునేవారు. కాని చర్మంలోనే నొప్పిని గ్రహేంచే భాగాలునాయని, అవి లేకుండా నొప్పిని తెలుసుకోలేడని ఇటీవలనే కనుగొన్న విషయాలు నిరూపించాయి. 

కాలిన గాయాలతో బాధపడుతున్న పేషెంట్ని డాక్టర్ పరీక్షిస్తున్నప్పుడు, ఏ స్థాయిలో ఆ రోగి శరీరం కాలినదో పరిశీలించడానికి పిన్నుతో గుచ్చుతారు. ఎందుకంటే కాలిన గాయాలు పైపైనే అయ్యాయని, నొప్పిని గ్రహించే భాగాలను తాకలేదు అని డాక్టర్ కు తెలుస్తుంది. మరో విధంగా  చెప్పాలంటే,పేషంట్ కు ఏ విధమైన నొప్పి తెలియకపోతే, కాలిన గాయాలు చాలా లోతుగా ఉన్నాయని నొప్పిని గ్రహించే భాగాలు నాశనమయ్యాయని తెలుస్తుంది. నొప్పిని గ్రహించే భాగాలున్నట్లు క్రింది ఖుర్'ఆన్ వాక్యం సూచిస్తుంది. 

إن الذين كفرو با ياتينا سوف نصلهم نارا كلما نضجت 

جلودهم بذلناهم جولدا غيرها ليزو قو العذاب إن الله كان عزيز

 حكيما 

"మా ఆయత్ లను నిరాకరించిన వారిని మేము నిశ్చయంగా అగ్నిలో పదవేస్తాము. ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగి పోయినప్పుడల్లా, దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము, వారు శిక్షను బాగా రుచి చూడాలని. అల్లాహ్ సర్వ శక్తిమంతుడు. తన నిర్ణయాలను అమలు పరచే విజ్ఞత ఆయనకు నిండుగా ఉంది."(ఖుర్'ఆన్ 4:56)

ప్రొఫెస్సర్ తగాతత్ తెజాసెన్, థాయిలాండ్ చిమాంగ్ మాయ్ యునివర్సిటి అనాటమీ విభాగానికి చైర్మన్, చాలాకాలం నొప్పిని గ్రహించే భాగాలపై పరిశోధనలు చేశారు. 1400 సం: ల క్రితమే ఖుర్'ఆన్ పైన తెలిపిన ఈ శాస్త్రీయ వాస్తవాన్ని తెలియజేసిందంటే మొదట్లో ఈయన నమ్మలేక పోయాడు. తర్వాత అతడు ప్రత్యేకంగా పై ఖుర్'ఆన్ వాక్యం యొక్క శాస్త్రీయ ఖచ్చితత్వానికి ఎంతో ప్రభావితం చెందాడు. ఎంతగా ప్రభావితుడయ్యాడంటే, ఖుర్'ఆన్ మరియు సున్నత్ లలో సాత్రీయ సూచనలపై రియాద్ లో జరిగిన 8వ సౌదీ మెడికల్ కాన్ఫెరెన్స్ లో అందరి సమక్షంలో ఇస్లాం స్వీకరించాడు. 

لا إله إلا الله محمد رسول الله 

అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన సందేశహరుడు అని సాక్ష్యం పలికాడు.  

ఇస్లాం - మానవతా ధర్మం

ఇస్లాం ధర్మం ప్రతి మానవుడి ధన, మాన ప్రాణాలకు విలువనిస్తుంది. ఇస్లామీయ రాజ్యాలలో ఉండే ముస్లిమేతరుల విషయంలో కూడా వీటి రక్షణకు తగు ఏర్పాట్లు కల్పించబడతాయి. 

ఇతరులను హేళన చేయడం, తక్కువ చేసి మాట్లాడటం వంటి పనులను ఇస్లాం వారిస్తుంది. ఒకరి ధన, మాన ప్రాణాలకు నష్టం కలిగించడం నిషిద్ధం చేయబడిందని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలియజేశారు. 

వర్ణ భేదానికి ఇస్లాంలో తావులేదు:

"మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను, తెగలుగానూ, చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వ లోక జ్ఞానం కలవాడు. సకల విషయాలు తెలిసిన వాడూనూ." (ఖుర్'ఆన్ 49:13)

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) "మీ అజ్ఞాన అహంకారాలను, తాత ముత్తాతల మీద గర్వించే తత్వాన్ని అల్లాహ్ అంతమొందించాడు. మనిషి విశ్వాసి, దైవభీతి గలవానిగానో లేదా హీనమైన దురాచారిగానో రూపొండుతాడు. సర్వ మానవులు ఆదమ్ సంతానం. ఆదమ్ మట్టితో సృష్టించ బడ్డారు." తిర్మిజీ హదీస్ గ్రంధం. 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: 

"ఓ జనులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. మీ తండ్రి (ఆదమ్) ఒక్కడే. అరబ్బు వారికి అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునికి అరబ్బువారిపై ఎటువంటి ఆధిక్యత లేదు. అల్లాహ్ దృష్టిలో ఆయన పట్ల భయ భక్తులు కలవాడే అత్త్యుత్తముడు." (మస్నదే అహ్మద్) 

ఇస్లాం కు పూర్వం అజ్ఞాన కాలంలో ప్రజలు జాతి దురభిమానాలతో కొట్టుమిట్టాడేవారు. వారి దృష్టిలో వంశం, జాతి ఔన్యత్యమే మానవ శ్రేష్ఠతకు ప్రమాణం. ఇది వారిలో అహంకారం, గర్వం లాంటి భావనల్ని జనింపజేసింది. వారి సంస్కరణలో ఆటంకంగా పరిణమించింది. యూదులు కూడా జాతి దురహంకార రుగ్మతకు గురై ఉన్న వారే. ఫలితంగా వారు కార్య శూన్యులుగా రూపొందారు. ఈ అజ్ఞాన భావనల్ని మిధ్యగా, మహానీచమైనవిగా ఇస్లాం అభివర్ణించింది. మానవులంతా సమానమేనని, మానవుడు తన చెడు ప్రవర్తన వల్ల చెడ్డవాడుగా సత్ప్రవర్తన వల్ల మంచివాడుగా రూపొందుతాడని స్పష్ట పరిచింది. గౌరవానికి ప్రమాణం వంశం, గోత్రం కాదని, అల్లాహ్ పై విశ్వాసం మరియు భాభాక్తులు, శీల సంపత్తి మాత్రమే గౌరవాదరనలకు,  శ్రేష్ఠతకు ఆధారాలని తెలిపింది. మనిషి ఏ వంశానికి చెందినవాడైనను అతనిలో అల్లాహ్ పై విశ్వాసం, అల్లాహ్ పట్ల భాభాక్తులు కల్గి ఉండి, ఆయన ఆదేసించినట్లుగా జీవించే మానవుడే ఉత్తముడని, గౌరవనీయుడనీ ఇస్లాం స్పష్టం చేసింది. దైవ ప్రవక్త ఇలా ఉపదేశించారు. ఓ జనులారా! అన్యాయం చేయడం నుండి దూరంగా ఉండండి. అది మీకు తీర్పుదినం నాడు చీకటిలోనికి నెట్టివేస్తుంది.
(బుఖారి, మస్నదే అహ్మద్) 

మరో హదీస్ లో : ఎవరికైతే ఇహలోకంలో న్యాయం జరగలేదో వారికి తీర్పు దినం నాడు అల్లాహ్ న్యాయం చేస్తాడు. వారి హక్కులను వారికి ఇప్పిస్తాడు. (తిర్మిజీ, ఇబ్నె మాజా) 

ఎదుటి మనిషిని గౌరవించడం తన వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడం ప్రతి ముస్లిం ధర్మం. (బుఖారి) 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: అల్లాహ్ మీ రూపురేఖల్ని, ధన సంపత్తుల ను చూడడు. ఆయన మీ సంకల్పాన్ని మరియు మీ ఆచరణలను చూస్తాడు. (ముస్లిం)












   



  























   










1 comment:

  1. అల్ హందులిల్లాహ్ చాలా బాగుంది

    ReplyDelete