బైబిల్ పై క్రైస్తవ సోదరుల అపోహలు:


బైబిల్ పై క్రైస్తవ సోదరుల అపోహలు:

I . ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని యెంచుకొనలెదుగాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తాను రిక్తునిగా (తక్కువ వానిగా) చేసుకొనెను. (ఫిలిప్పీ ; 2:6-7)

"యేసు ఈ లోకంలో పుట్టడానికి ముందు దేవుని వద్ద దేవునితో సమానంగా ఉండేవారు" అని చెప్పడానికి పై వాక్యం ఉపయోగిస్తుంటారు. దీని సమాధానం: 

1. ఈ కధనం ఎవరిది? 

A. దేవుడు స్వయంగా చెప్పాడా? "యేసు నాతొ సమానం అని." 

B. లేదా యేసు స్వయంగా చెప్పారా? "నేను దేవునితో సమానం అని."ఈ విషయమై వీరిద్దరూ ఏమంటున్నారు?

A. యెహోవా: నేను దేవుడను నన్ను పోలిన వాడెవడునూ లేడు. (యెషయా ; 46:9)

B. యేసు : తండ్రి నా కంటే గొప్పవాడు. (యోహాను; 14:28)

పై వాక్యాలలో సర్వ సృష్టికర్త స్వయంగా "నాతొ ఎవనికీ పోలికలేదు. అంటే నాతొ సమానుడు ఎవడూలేడు అని స్పష్టంగా చెబుతున్నాడు. ఆ దేవునితో సర్వసమానుడని చెప్పబడుతున్న వ్యక్తి స్వయంగా (యెసువారు) "తండ్రి నాకంటే గొప్పవాడు." అని స్పష్టంగా ప్రకటిస్తుంటే వీరిద్దరి ప్రకటనలకు వ్యతిరేకంగా మూడోవ్యక్తికి "వీరిద్దరూ సమానమే" అని చెప్పే హక్కు ఉందా? మూడో వ్యక్తి ఇచ్చే కధనం వీరిద్దరి కధనానికి వ్యతిరేకంగా ఉంటె అది స్వీకార యోగ్యం అవుతుందా???

మరో కోణంలో ఆలోచిద్దాం : 

పౌలు కధనం ప్రకారం యేసు పరలోకంలో ఉన్నప్పుడు యేహోవాతో సమానం అని అంగీకరిస్తూ ... యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు దైవత్వాన్ని పరలోకంలో విడచి వచ్చేశారు. కాబట్టీ ఇహలోకంలో సాధారణ మాన మాత్రునిగా వ్యవహరించారు. దీనిని ఒకవేళ అంగీకరిస్తే యేసువారు తిరిగి పరలోకం వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏ స్థితిలో ఉండాలి? మరలా దైవంతో సమానం అయిపోవాలి కదా! అలా అవుతుందా?

'ఆయన (యేసు) - మీరు గిన్నెలోనిది త్రాగుడురు గాని, నాకుడి వైపునకు, నా యెడమవైపునకు కూర్చుండ నిచ్చుట నావశమున లేదు. (మరి ఎవరి వశం లో ఉంది?) నా తండ్రి చేత ఎవరికీ సిద్ధపరచ బడెనో వారికే అది దొరుకునని చెప్పెను.' (మత్తయి; 20:23)

ఈ వాక్యం లో గమనించ వలసిన విషయాలు:

1. యేసును ఇరువురు శిష్యుల తల్లి తన బిడ్డలను కేవలం యేసు ఇరుప్రక్కల కూర్చుండనిచ్చే అవకాశం కల్పించమని కోరినది. 

2. యేసు - "అది నా వశంలో లేదు." అని చెప్పి, అది యెహోవా వశంలోనే ఉన్నదని స్పష్టంగా చెప్పారు. 

3. ఈ అభ్యర్ధన పరలోకంలో నేరవేర్చమని ఆమె కోరింది. దానికి యేసు వారు నా వలన అది సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పారు. దీనిబట్టి యేసు ఇహలోకంలో 'రిక్తునిగా' ఎలా ఉన్నారో, పరలోకంలో కూడా అలాగే ఉంటారని స్పష్టమౌతుంది.

II. "ఆదియందు వాక్యముండెను .... ఆయన మూలముగా కలిగెను. (యోహాను; 1:1-2)

ఈ వచనాన్ని అర్ధం చేసుకోవాలంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

1.  దేవుడు అని ఎవరిని అంటారు? 

2. దేవుడు అని కేవలం సృష్టికర్తను ఉద్దేశించే అంటారా? లేక ఇతర అస్తిత్వాలను కూడా దేవుడు అని అంటారా? (బైబిల్ ప్రకారం) తెలుసుకుందాం :

a. బైబిల్ ను పరిశీలనగా చదివితే "యెహోవా గ్రంధము పరిశీలనగా చదువుకొనుడి." దేవుడు అని కేవలం సృష్టికర్తనే గాక, ఇతరులకు కూడా 'దేవుడు' అని ప్రయోగించడం జరిగిందనే వాస్తవం మనకు తెలుస్తుంది. 

ఉదా: (నిర్గమ;7:1) ; (నిర్గమ; 4:16) ; (కీర్తన; 82:1; 82:6) ; (యోహాను; 10:35)

ఈ వాక్యాల ప్రకారం దేవుని వాక్యం (వహీ) ఎవని వద్దకు వస్తుందో వారిని దైవములని పేర్కొనడమైనది. 

ఉదా: పాత నిబంధనలో - యిర్మియాకు దేవుని వాక్యం ప్రత్యక్షమై ...... అలాగే అనేక ప్రవకలకు దేవుని వాక్యం ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అని అనేక వాక్యములు కనిపిస్తాయి. (.......) (..........) అంటే వారందరూ దైవములేనన్న మాట. 

2వ కోరిందీ 4:4 "ఈ యుగసంబంధమైన దేవత (దేవుడు) అవిస్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను." ఈ వాక్యం ప్రకారం సాతాను కూడా ఒక దైవమే. ఈ విధంగా బైబిల్ లో ఎందరినో దైవములని చెప్పడమైనది. అయితే దైవం అంటే ఎవరు? అనేకులను దైవములని సంబోధించ బడిందంటే, వారిలో ఏదో ఒక ప్రత్యెక సామర్ధ్యము లేదా ప్రత్యెక అధికారం కలిగి ఉండాలని పై వాక్యముల బట్టి తెలుస్తుంది. 

ఉదా: - మోషేను ఫరొకు దైవంగా నియమించడమంటే, మోషేను అధికారిగా నియమించడమన్నమాట. అదే విధంగా దీన జనోద్ధారకులను, న్యాయాధిపతులను దైవం గా పేర్కొనడానికి కారణం, పేద సాదలకు, దీనులకు సహాయపడువారిని, అదేవిధంగా అన్యాయానికి, దౌర్జన్యానికి గురి అయ్యిన వారిని సహాయపడుతున్నారు కాబట్టి. ఇదే విధంగా 'దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చెనో వారెదైవములని' అంటే వారు దేవుని తరపున ప్రజలకు మార్గదర్శకులుగా ప్రవక్తలుగా ఒక ప్రత్యేక బాధ్యతతో నియమించబడ్డారు. గనుక వారిని దైవములని పేర్కొనడమైనది. చివరికి సాతానును కూడా దైవంగా పేర్కొనడానికి కారణం వాడు చెడు సంకల్పం కలవారిపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ పూర్తి చర్చ ద్వారా తెలిసిందేమిటంటే, సృష్టి మొత్తం లేనప్పుడు ఉన్నది కేవలం సర్వశ్రుష్టికర్త మాత్రమే. ఆ సృష్టికర్త తానూ తలచుకున్న దానిని ఉనికిలో తీసుకు రావడానికి 'ఆగుము' అనే 'వాక్యం' (988) ప్రయోగించాడు. దైవం నుండి ఉనికిలోనికి వచ్చింది. మొదటిది ఇదేకదా! 'ఆగుము' అనే ' వాక్యము' దీనిని కూడా 'దైవం' అని పేర్కొనడమైనది. 

ఇప్పుడు ఈ క్రింది వాక్యాన్ని గమనించండి :-

ఆదియందు వాక్యముండెను .... 

ఏవిధంగానైతే బైబిల్ లో అనేక మందిని 'దైవాలుగా' పేర్కొనడమైనదో ఇక్కడ కూడా 'వాక్యము' ను దైవంగా చెప్పడమైనది ఎందుకంటే సర్వసృష్టికర్త నుండి ఈ వాక్యం వెలువడి సర్వసృష్టికర్త సంకల్పాన్ని నెరవేర్చే సామర్ధ్యం కలిగి ఉంది గనుక ".... ఆయన (వాక్యమైన దేవుడు)ఆది యందు దెవునివద్ద ఉండెను. (యోహాను; 1:2) వాస్తవమే కదా! "ఆగుము" అనే ఆజ్ఞ సర్వ సృష్టికర్త అయిన దేవుని వద్దనేకదా ఉన్నది. సమస్తమూ ఆయన (ఆగుము అనే వాక్యం) మూలముగా కలిగెను. కలిగుయున్న దేదియు ఆయన (వాక్యం) లేకుండా కలుగలేదు. సృష్టిలోని సమస్తమూ అనగా ఆకాశము, భూమి, సూర్యచంద్రాదులు ఒక్కటేమిటి సమస్తమూ "ఆగుము" అనే దేవుని ఆజ్ఞాతోనే సృష్టించబడ్డాయి. 

ఉదా: ఆది కాండం ; 1;:3 దేవుడు వెలుగు "కమ్మని" పలుకగా వెలుగు కలిగెను. ఆది కాండం ; 1:14-15 దేవుడు పగటిని రాత్రిని వేరుపర్చునట్లు ఆకాశమందు జ్యోతులను "కలుగును గాక" అని ..... ఆ ప్రకారమాయెను. ఇలాంటి ఎన్నో వాక్యాలు మనకు బాబిల్ లో కనిపిస్తాయి. యేసు వారి పుట్టుక ఎలా జరిగింది? ప్రకృతి నియమం ప్రకారం ఒక బిడ్డ కలగాలంటే స్త్రీ-పురుషుల కలయిక తప్పనిసరి. అయితే యెసువారి పుట్టుక విషయంలో ఈ ప్రకృతినియమానికి భిన్నంగా దేవుడే స్వయంగా గతంలో సర్వాన్ని సృష్టించి నట్లు కన్యక "మరియమ్మ" గర్భం ధరించి బిడ్డను కనునుగాక అని సంకల్పించుకొని 'ఆగుము' అని ఆజ్ఞాపించగా యేసువారు జన్మించారు. ఈ విషయాన్ని ఈ క్రింది వాక్యంలో గమనించగలరు. 
......"ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను." (యోహాను; 1:14)
ఈ వాక్యాన్ని బట్టి యేసును దేవుడని భావిస్తే, భూమీ, ఆడాసము, పశుపక్షాదులను ఏమని భావించాలి? ఇవన్నీ 'ఆగుము' అనే వాక్యము ద్వారానే కదా పుట్టాయి? మరి ఇవన్నీ దైవాలా? ఇవన్నీ దైవాలు కానట్లయితే మరి యేసు దేవుడు ఎలా అవుతారు? 

1. యేసు తండ్రి లేకుండా పుట్టారు? 

జ. ఆది కాండం; 18:9-15 ప్రకారం ఇస్సాకు పుట్టుక, హేబ్రీయులు; 7:3 ప్రకారం మిల్కిసెదె పుట్టుక. 

2. యేసు అద్భుతాలు చేశారు కదా? 

జ. యేసు అద్భుతాలు చేశారు కానీ ఎలా? మత్తయి ; 14:19, యోహాను; 11:41 ప్రకారం యేసు వారి ప్రార్ధనల వలన జరిగాయి. యోహాను; 3:2 ఆది కాండం; 10:38 ; 2:22 ప్రకారం అద్భుతాలు దేవుని వలన జరిగాయి.

3. యేసు చనిపోయిన వారిని బ్రతికించారు కదా?

జ. 2 వ రాజులు ; 11:20,21 ఎలిషా ఎముక ద్వారా బ్రతుకుట 

4. యేసు ఎత్తుకో బడ్డారు, తిరిగి వస్తారు కదా? 

జ. 2 వ రాజులు ; 2:1-11 ప్రకారం ఏలియా కూడా ఎత్తుకో బడ్డారు. మలకీ ; 4:5 ప్రకారం ఏలియా కూడా తిరిగి వస్తారు. 


   







  





















No comments:

Post a Comment