మీరు ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నారా ?

ఇస్లాం ఎలా స్వీకరించాలి ???


                                                لا إله إلا الله محمد رسول الله 


"లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ ర్రసూలుల్లాః " 

or

అషహదు అల్లాహ్ ఇలాహ  ఇల్లల్లాహ్  వ అషహదు అన్న మహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు 

ఈ యొక్క మహోన్నత పవిత్ర వచనాన్ని త్రికరణ శుద్ధిగా అంటే మానసా , వాచా , కర్మణా  ఉచ్చరిస్తూ  మనస్పూర్తి గా సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఇక మీద ముస్లిం గా పరిగణించబడుతాడు

ఇస్లాం పరిధిలో ఒక వ్యక్తి "లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ ర్రసూలుల్లాహ్" పవిత్ర వచనాన్ని అని మనస్పూర్తి గా సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఇక మీద ముస్లిం గా పరిగణించబడుతాడు

ఈ వచనంలో కేవలం రెండు వాక్యాలు ఉన్నాయి.
1. లా ఇలాహ ఇల్లల్లాహ్ (తౌహీద్- దేవుని ఏకత్వపు వచనము)
2. ముహమ్మదుర్ ర్రసోలుల్లాహ్ (రిసాలత్- దైవ దౌత్య వచనం)

 అల్లాహ్ అంటే ఎవరు ?
భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని
ఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో , లెక్కా తీసుకుంటాడో.
ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు
అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం. కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు) కాని, పీర్లు కాని, బాబాలు కాని మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం'
"లా ఇలాహ ఇల్లల్లాహ్" అంటే...?
అల్లాహ్ తప్ప ఇతరులెవరూ ఆరాధ్య దైవాలు కారు. ఆయనకు తప్ప ఇతరులకు దైవత్వం లేదు. ఆయన ఆరాధనలలో మరెవరికీ భాగ్యస్వామ్యం లేదు.
ఆయనే సృష్టికర్త, యజమాని, పాలకుడు, పోషకుడు. ఆయన అధికారాల్లో, ఔన్నత్వంలో, గుణగణాల్లో ఆరాధనల్లొ వేరెవ్వరికి బాగస్వామ్యం లేదని మనస్పూర్తిగా భావించి సాక్షం ఇవ్వడం. దీనినె "తౌహీద్" అంటారు. "తౌహీద్" కు మూడు కోణాలు ఉన్నాయి, అవి :
1. తౌహీదె రుబూబియత్
2. తౌహీదే ఉలూహియత్
3. తౌహీదె అస్మా వ సిఫాత్.
1. తౌహీదె రుబూబియత్
సమస్త సృష్టిని సృష్టించినవాడు కేవలం అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించడం. ఆయన ఏది చేయాలనుకున్న కేవలం "అయిపో" అని ఆజ్ఞాపిస్తే చాలు. అది అయిపోతుంది. ఆయన ఆజ్ఞ లేనిదే చెట్టునుండి ఆకు కూడా రాలదు. ఆయనే సృష్టికి యజమాని, పాలకుడు, నడుపించువాడు, ఆయనే మానవునికి జీవన్-మరణాలను ప్రసాదిస్తాడు.
(సూర యూనుస్ 31 వ వాక్యం) వారిని అడుగు: ''ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దానినుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?'' వారు: ''అల్లాహ్!'' అని తప్పకుండా అంటారు. అప్పుడను: ''అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?''

"తౌహీదె రుబూబియత్" కు వ్యతిరేకం "షిర్క్ ఫిర్-రుబూబియత్". అంటే స్ప్రుష్టించడంలో, పాలనలో, పోషణలో, అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించడం.
2. "తౌహీదే ఉలూహియత్"
" ఆరాధనకు అర్హుడు కేవలం సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. ఆరాధనలను, మొక్కుబడులను స్వీకరించెవాడు ఆయనే. మన నమాజులు, ఉపవాసాలు, ఖుర్బానీలు, దుఆలు, సమస్త ఆరాధనలు, ఆయన జీవన్మరనాలు ఆయనకే వర్దిస్తాయి". అని విశ్వసించటం.
ఆయన తన ఆరాధనలలో మద్యవర్తిత్వం అక్కరలేనివాడు. విశ్వాసులకు- అవిశ్వాసులకు మద్య తేడ ఏమిటంటే విశ్వాసులు కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమె నమ్మి, ఆయన కొరకు ధన, ప్రాణ, శారీరక, సకల ఆరాధనలు చేస్తారు. అవిశ్వాసులు సృష్టికర్త ఒక్కదాని నమ్మినప్పటికి ధన, ప్రాణ, శారీరక సకల ఆరాధనల్లో అనేకులను బాగాస్వాములుగా లేదా మద్య వర్తులుగా చేస్తారు, ఇది "షిర్క్ ఫిర్-ఉలూహియత్" (ఆరాధనల్లొ సాటి కల్పించటం) గా పరిగణించబడుతుంది.
3. తౌహీదె అస్మా వ సిఫాత్
అల్లాహ్ గుణగణాల్లో, నామాల్లో వేటినైతే అల్లాహ్ తనకోసం ప్రత్యేకించి ఎన్ను కున్నాడో (అవి పవిత్ర ఖుర్ఆన్ హదీసుల్లొ వివరించబడినవి) అవి కేవలం అల్లాహ్ కొరకే విశ్వసించాలి.
(సూర అష్-షూరా 11 వ వాక్యం) " ఆయనను పోలినది ఏదీలేదు, మరియు ఆయన సర్వం వినేవాడు, చూసేవాడు."

"తౌహీదె-అస్మా-వ-సిఫాత్" లేకుండా "తౌహీదె-రుబూబియత్" ,"తౌహీదే -ఉలూహియత్" స్వీకరించబడవు. ఇతరుల్లో అల్లాహ్ కు చెందిన గుణాలున్నాయని విశ్వసించడం "షిర్క్ ఫి అస్మా-వ-స్సిఫాత్" అవుతుంది.

1. ఈ మూడు కోణాల్లో దేనిని నిరాకరించి, అల్లాహ్ తో పాటు ఇతరులకు సాటి కల్పించినా, అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధి నుండి దూరమై అవిశ్వాసానికి పాల్పడినవాడవుతాడు. అల్లాంటి వ్యక్తి నరకాగ్నిలొ ఆహుతి అవుతాడు.
" అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారని నమ్మకం కలిగి ఉండే వ్యక్తి మరణిస్తే అతడికి శాశ్వత నరకాగ్ని ప్రవేశం తప్పదు".
2. బహు దైవారాధన (షిర్క్) వలన పున్యకార్యాలను వృధా అవుతాయి. పవిత్ర ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా నేలవిస్తున్నాడు.
(సూర అత్-తౌబహ్ 17 వ వాక్యం) "బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్య-తిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయ టానికి) అర్హులుకారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమైపోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు."

'ముహమ్మదుర్- ర్రసూలుల్లాహ్' అంటే..
'ముహమ్మదుర్- ర్రసూలుల్లాహ్'కలిమాలో ప్రస్తావించబడిన వాక్యానికి రెండవ భాగం. 'ఇది రిసాలత్' కి (దైవ దుత్యునికి) సంభందించినది. అంటే ముహమ్మద్ (సల్లలాహు అలైన సల్లమ్) అల్లాహ్ ప్రవక్త అని అర్ధం. మనం రిసాలత్ వచనాన్ని విశ్వసిస్తున్నత్ల్అయితే అందుకు ప్రతిగా మన జీవితంలో అడుగడు గునా మహా ప్రవక్త ముహమ్మద్ (స ) ఏదైనా ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను శిరసావహించాలి, ఆయన(స ) తెలిపే ప్రతి విషయమ అల్లాహ్ ఆదేశానికి అనుగుణంగా ఉంటుంది. పవిత్ర ఖుర్ ఆన్ లో అల్లాహ్ ఇలా సేవిస్తున్నారు:
(అన్-నజ్మ్ : 3,4 )" మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వ'హీ) మాత్రమే"

మన సకల ఆరాధనలకు కేవలం ప్రవక్త(స ) చూపిన మార్గం లోనే పూర్తి చేయాలి. దానినే "సున్నత్" (ప్రవక్త సంప్రదాయం) అంటారు.

'సున్నత్' (ముహమ్మద్ (స ) పద్ధతి)

"సున్నత్" అంటే ప్రవక్త(స) ఆచరణ, పద్ధతి. దాని పరిధిలో ప్రవక్త(స) పలుకులు, ఆచారాలు, నడవడికలు వస్తాయి. ప్రతి ముస్లిం తన ఆచరణలను ప్రవక్త (సల్లలాహు అలైన సల్లమ్) సున్నత్ (పద్ధతి) ప్రకారం ఆచరించాలని విధిగా నిర్ణయించబడింది. దాని గురించి అల్లాహ్ పవిత్ర ఖుర్ ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు :
(అల్-'హష్ర్ : 7 ) అల్లాహ్ తనప్రవక్తకు ఆనగరవాసుల నుండి ఇప్పించినదానిలో (ఫయ్అ'లో), అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. అది మీలో ధనవంతులైనవారి మధ్యనే తిరగ కుండా ఉండ టానికి, ఇలా నిర్ణయించ బడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసు కోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్షించటంలో చాలా కఠినుడు.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైన సల్లమ్) ఇలా సెలవిచ్చారు :
" ఎవరైతే నా పద్దతిని వఎతిరేకిస్తారో, అన్గికరించారో అతనికి - నాకు మధ్య ఎటువంటి సంభందం ఉండదు. ధర్మంలో లేని విషయాలను సృస్తిన్చాకూడదు. అటువంటి ఆచరణలు స్వికరించ బడవు. వాటిని బిద్అత్ అంటరు. వాటిని సృష్టించే వారికీ నరకమే శరణం అవుతుంది"
' బిద్అత్', దాని వివరణ
ఇస్లాం ధర్మంలో నవీన పోకడలను సృస్టించదాన్ని "బిద్ అత్" అంటారు. పవిత్ర ఖుర్ ఆన్, హదీస్ ప్రకారం ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదైనా కార్యాన్ని సృష్టించి పుణ్యంగా భావించి చేయడం - దీనినే 'బిద్అత్' అంటారు. ఇలాంటి ఆచరణలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి సంభందం లేదు. ఇలాంటి ఆచరనలు చేసేవారు మార్గ భ్రష్టులవుతారు. అగ్నికి ఆహుతులవుతారు. మహా ప్రవక్త(స ) ఇలా సెలవిచ్చారు:
(సహిహ్ ఇబ్నె ఖుజైమా : 3/1785) : "ఇస్లాం ధర్మంలో ప్రతి క్రొత్త పోకడ 'బిద్అత్' అవుతుంది. ప్రతి బిద్అత్ మార్గ భ్రష్టత అవుతుంది. ప్రతి మార్గ భ్రష్టత నరకానికి దారి తీస్తుంది."

( సహిహ్ బుఖారి : 2697) : " ఎవారైతే మా ఈ ధర్మంలో 'లేని పోనీ ఆచారాలు' (బిద్అత్ లు) సృష్టిస్తాడో అతను దుత్కారి. "

'బిద్అత్' వలన విశ్వసి హీనమైన అపవాదాలకు గురువుతాడు. అల్లాహ్ సన్నిధి నుండి, పవిత్ర ఇస్లాం ధర్మం నుండి దూరమవుతారు. 'బిద్అత్' వ్యక్తిని 'తౌబా' నుండి దూరం చేస్తుంది. అందుకే మనం వాటికి దూరంగా ఉండాలి. ప్రవక్త (స) మార్గంలో నడవాలి.

ప్రవక్త (స) విశిష్టత, ప్రత్యేకతలు

అంతిమ ప్రవక్త(స)కు అనేక ప్రత్యేకతలు, వరాలు ప్రసాదిoచబడ్డాయి.
1. అల్లాహ్ ప్రవక్త (స) కు మునుపు ఎందరినో ప్రవక్తలుగా పంపించాడు, కానీ ముహమ్మద్ (స) ను సర్వమానవాలికి ప్రవక్తగా చేసాడు.
(అల్-అ'అరాఫ్ : 158 ) (ఓ ము'హమ్మద్!) వారితో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరివైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యా ధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు; ఆయనే జీవన్మ రణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ను మరియు ఆయన సందేశహరుడు నిరక్ష రాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుస రించండి, అప్పుడే మీరు మార్గదర్శ కత్వం పొందుతారు!"

కాబట్టి ఇహలోకంలో ప్రతి మానవునికి ప్రవక్త (స) ను విశ్వసించడం తప్పనిసరి. ప్రవక్త (స) ఒక హదీసులో ఈ విధంగా ప్రస్తావించారు :
" ఎవరి అధినంలో అయితే నా ప్రానముందో ఆ దేవుని సాక్షిగా! ఏ వఎక్తి అయినా (యుదుడైన, క్రైస్తువుడైన) నా గురించి ప్రస్తావన విని కూడా నన్ను విశ్వసించక పోతే అతడు నరకవాసి. (ముస్లిం )
2. ముహమ్మద్(స ) అంతిమ దైవ ప్రవక్త. అయన తరువాత ప్రళయం వరకు ఏ ప్రవక్తా రారు. ఆయనే ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు.

అంతిమ దైవ దౌత్యం పై విశ్వాసం

ప్రవక్త ముహమ్మద్ (స) అంతిమ ప్రవక్త. అయన తరువాత ఎవరు ప్రవక్త కాజాలరు. ఒకవేళ ఎవరైనా ప్రవక్తగా ప్రకటించుకుంటే అతను బూటకపు ప్రవక్త అనబడతాడు. ఎందుకంటే అల్లాహ్ పవిత్ర ఖుర్అన్ లో ముహమ్మద్ (స) అంతిమ ప్రవక్త అని తెలియజేసారు:
(అల్-అ'హ్'జాబ్ : 40) (ఓ మానవులారా!) ము'హమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్‌యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.
" ఖాత్మున్" అంటే "సిలు" అని అర్ధం. సిలు అనేది ఒక ప్రక్రియ పూర్తయిన తరువాత పడుతుంది. ముద్ర పడిన తరువాత ఆ పని అన్ విధాలుగా పుర్తయినట్లే. అంటే ప్రవక్త ముహమ్మద్ (స) రాకతో దైవ దౌత్య పరంపరకు సిలు పడిపోయింది. కనుక మన ప్రవక్త ముహమ్మద్ (స ) తరువాత ఎవరైనా ప్రవక్తగా ప్రకటించుకుంటే అతను అసత్యవాది, మోసగాడు.
అల్లాహ్ మానవులందరికీ 'కలిమా' ను అర్ధం చేసుకొని మనసారా పతించే భాగ్యాన్ని ప్రసదిన్చుగాక...! ఆమీన్ !


తిరస్కరించి చెడ్డ పనులు చేసేవారికి శాశ్వత నరకము

నరకవాసులకు ఇదొక వ్యధబహరితమైన శిక్ష. దైవదూతలకు ఇలా ఆదేశించడం జరుగుతున్ద్. వారిని పట్టుకోండి. ఈడ్చుకుంటూ నరకం మధ్య భాగంలోనికి తీసుకుపోండి. వాడి తలపైన మరుగుతున్న నీటిని పోయండి.(44:47).
అప్పుడు వారి చర్మమే కాదు శరీర భాగాలన్నీ కరిగిపోతాయి. వారి శరీరం, చర్మం కాలిపోఇ నా ప్రతీసారి వారికి కొత్తశరీరం తోడిగించండo జరుగుతుంది.(ఈ ప్రపంచంలో ఒక హత్యకు వందహత్యలకు ఒకే శిక్ష పడుతుంది కాని పరలోకంలో మనషి చేసిన ప్రతీదుష్కర్మకు శిక్ష పడుతుంది.)(4:56).

ఖుర్ఆన్ అంతిమ సందేశం:-

సర్వలోకాలకు సృష్టికర్త ఒక్కడే అని విశ్వసించి, ఆయన అంతిమ దైవప్రవక్తగా మహమ్మద్(స) వారిని స్వీకరించి, ఆయనపై అవతరింపచేసిన ఖుర్ఆన్ గ్రంధాన్ని అనుసరిస్తూ మంచిజీవితం గడిపే వారికి శాశ్వతస్వర్గాశుభాలు వున్నాయి. దైవాన్ని, దైవప్రవక్తలను, దైవగ్రందాన్ని తిరస్కరించి తమ మనోవాంచలను అనుసరించే వారికి వ్యధాభరిత మైన శాశ్వతనరకశిక్షలు సిద్ధం చేయబడి ఉన్నాయీ.
నా ధార్మిక సోదరులారా...!  మనమంతా ఏదో ఓరోజుమృత్యువు ఒడిని చేరవలిసిందే, మరి ఆ మరణం తరువాత మీరు శాశ్వతనరకo నుండి రక్షించబడి స్వర్గాశుభాలను పోoధాలనుకుంటే, ఇకపై మీ జీవితాన్ని దైవవిదేయుడిగా (ముస్లింగా) గడపాలనుకుంటే, మనస్పూర్తిగా ఇలా సాక్షం పలకండి... "అష్ హదు అల్లాహ్ ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న మొహమ్మద అబ్దుహు  వ రసూలుహూ". నేను సాక్షమిస్తున్నాను అల్లాహ్ ఒక్కడే అని ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడని,
మొహమ్మద్(స) ఆయన ప్రవక్త మరియు దాసుడు అని . చివరగా ఈ ఖుర్ ఆన్ వాఖ్యాలను గమనించండి.
మీ ప్రభువు వద్దనుండి సత్యం (ఖుర్ఆన్) వచ్చేసింది. ఇష్టమైన వారు దీన్ని స్వీకరించంవచ్చు. ఇష్టంలేని వారు దీన్ని తిరస్కరించవచ్చు మేము దుర్మార్గులకోసం శాశ్వత నరకాన్ని సిద్దపరచి వుంచాం.(18:27)
ఎవర్తితే సత్యాన్ని తిరస్కరిస్తారో వారికి కటినమైన శిక్షపడుతుంది. ఎవర్తితే విశ్వసించి సత్యర్మలు చేస్తారో వారికి క్షమాపణ, గోప్ప ప్రతిఫలం (శాశ్వతస్వర్గం) దొరుకుతుంది. దివ్యఖుర్ఆన్ (35:7)

సర్వ మానవాళికి సృష్టికర్త సందేశం

సొదరమహాశయులార! సర్వలోకాల సృష్టికర్త సర్వమానవాళికి ఋజుమార్గం చూపడానికి ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసాడు. ఉదా:-- ఈ  ఖుర్ఆన్ వాఖ్యాలను పరిశీలించండి

దివ్యఖుర్ఆన్ (14:52) ఈ ఖుర్ఆన్ మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) ఒక్కడే ఆరాధ్యదైవమని వారు తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది.              

దివ్యఖుర్ఆన్(2:185)  దివ్యఖుర్ఆన్ మానవులందరికీ మార్గదర్శకం. ఋజుమార్గం చూపే, సత్య అసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు దీనిలోఉన్నాయి.                                        

ఈ పవిత్ర  ఖుర్ఆన్   గ్రంథానికి మరొక పేరు ఫుర్ఖాన్ (గీటురాయి). సాధారణంగా మనం గీటురాయిని  ఏది మంచి బంగారం, ఏది నకిలీ బంగారం అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం.
అదేవిధంగా ఖుర్ఆన్ గ్రంధం కూడా ఏది సత్యం ఏది అసత్యం, ఏది ధర్మం ఏది అధర్మం,  నిజ దేవుడెవరు..?  కల్పిత దేవుళ్ళు ఎవరు ....? అనే విషయాలు వేరు చేసి చూపిస్తుంది.
కాబట్టి దీన్ని సృష్టికర్త  ఫుర్ఖాన్ (గీటురాయి) అని పిలిచాడు.
నా  ప్రియసోదరులార... ! సత్యాన్వేశకులారా... !  మన విశ్వాసాలు, నమ్మకాలు కాసేపు పక్కన పెట్టి, నిష్కల్మషమైన మనసులతో మన నిజ సృష్టికర్త ఈ గీటురాయి (ఖుర్ఆన్) ద్వారా  తెలియజేసిన సందేశమేమిటో  ఒక్కసారి పరిశీలిద్దాం రండి.

సర్వ మానవాళి ఒకే  జంట సంతానం

సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ  జాతికి చెందినవారైనా మానవులందరు ఒకే జంట సంతానం, పరస్పరం రక్త సంబంధీకులని  సర్వమానవాళి సృష్టికర్త  "ఖుర్ఆన్"  గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు
ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయ -భక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.దివ్యఖుర్ఆన్(4:1)
ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా సమస్త మానవులు ఒకే జంట ద్వారా   పుట్టించబడ్డారు అని  భూమిపై నివసించే మానవులందరు ఇకే కుటుంబమని సర్వమానవాళికి  సృష్టికర్త ప్రకటిస్తున్నాడు

కుల మత వ్యవస్థలకు పునాదులు

వాస్తవానికి కులాలు,మతాలు మానవులు సృష్టించు కున్నవే.
కుల వ్యవస్థ ఏర్పడడానికి కారణం ఏమిటంటే ఒక ఊరిలో ఉన్నవారందరు ఒకే విధమైన పని చేస్తే ఆ ఊరి అవసరాలు తీరవు కాబట్టి వారు పని విభజన సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. ఒక్కొక్క కుటుంబం వారు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకున్నారు. ఆ విధంగా కుండలు తయారు చేసే వారిని కుమ్మరి అని, బట్టలు ఉతికే వారిని చాకలివారని, చెక్క పని చేసే వారిని వడ్రంగి అని, బంగారాన్ని మలిచే వారిని  కంసాలి అని పిలిచేవారు. ఇలా కొన్ని తరాల తర్వాత ఇవి కులవ్యవస్థలుగా పాతుకుపోయీ ఎక్కువ జాతి అనే అసమానతలకు గురి చేసాయి. మానవులంతా ఒకే జంట సంతానమైనప్పుడు మనషులందరూ వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా ఒకే కుటుంబం అవుతారు. కులాల పేర్లతో వేరు చేసుకోవడం అర్ధం లేని పని.


ముహమ్మద్ (స) వారి విషయం లోనే కాదు దేవుడు తన ప్రవక్త లను భూమి ఫైకి పంపినప్పుడల్లా  అవిశ్వాసులు ప్రవక్తలనుధూశించె వారు, అవమానిచే వారు , కొందరు ప్రవక్తలను చంపివేసే వారు.
కానీ ముహమ్మద్ (స) వారు ఇస్లాం బోదనలతో ప్రవక్తల అందరిని ప్రేమించే విదంగా మరియు గౌరవించె విదంగాముస్లిమ్స్ ల కు శిక్షణ ఇచ్చారు.
క్రైస్తవులు యేసును అతిగా ప్రేమించి,
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి పై విద్వేషం కక్కుతున్నారు

ముహమ్మద్ (స) వారిని అనుసరించే వారు, ప్రవక్తలందరిని  ప్రేమిస్తారు. ఎవరిని ద్వేషించరు
ఖురాన్ వాక్యాలను గమనించండి :

"నిశ్చయంగా మీరు, మీ ధన ప్రాణాలతో పరీక్షింప బడుతారు మరియు నిశ్చయంగా, మీకు పూర్వము గ్రంధంప్రసాదించబడిన వారి నుండి మరియు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పించిన వారి నుండి, మీరు అనేకవేదన కలిగించే మాటలు వింటూ ఉంటారు. కాని ఒక వేల, మీరు ఓర్పు వహించి, అల్లాహ్ పట్ల భీతి కలిగి ఉంటె!నిశ్చయంగా, అది సాహసం తో కూడిన కార్యం. (ఖుర్ అన్ : 3:186)


(ఓ ప్రవక్తా!) వారి మాటలు నిన్నుదుఃఖానికి లోను చేయకూడదు. యదార్థానికి సర్వాధిపత్యం అల్లాహ్ దే.ఆయన అంతా వినేవాడు, అన్నీ చూచేవాడు.(10.యూనుస్ 65)

(ఓ ముహమ్మద్స!) నువ్వు సహనం వహించు.(అయితే) అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనంవహించలేవు. వారి చేష్టల పట్ల బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఖించకు. అల్లాహ్తనకు భయపడుతూ జీవితం గడిపేవారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు. (16. అన్ నహ్ల్ 127-128)
(ఓ ప్రవక్తా!) వాళ్ళు అనేమాటలు నిన్ను దుఃఖానికి గురిచేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. వారుధిక్కరిస్తున్నది నిన్ను కాదు, నిజానికి ఈ దుర్మార్గులు అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తున్నారు.
(6.అల్ అన్ఆమ్ 33)


ప్రవక్తా! మంచీ చెడూ ఒకటి కాజాలవు. కనుక నీవు అత్యంత శ్రేష్ఠమైన ‘మంచి’ ద్వారా చెడును నిర్మూలించు.అప్పుడు నీ గర్భశత్రువు కూడా నీకు ప్రాణమిత్రుడయి పోవడం నీవు చూస్తావు.{41:34}

“ప్రభూ! మాకు సహనం, స్థయిర్యం ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడ చేకూర్చి అవిశ్వాసులపై మాకు విజయంప్రసాదించు” అని వేడుకున్నారు. (2:250)

సృష్టికర్త ప్రతి యుగంలో ప్రవక్తల ద్వారా గ్రంధాలను అవతరింపజేసి ధర్మాన్ని సంస్థాపించాడు. ప్రవక్తలు గతించిన తర్వాత ఆయా అనుసరులు వారి గ్రంధాలను, ధర్మాన్నిమనోవాంఛలకను గుణంగా మార్చుకున్నారు. సృష్టికర్త ప్రజలను సంస్కరించడానికి మరొక ప్రవక్తను, గ్రంధాన్ని పంపేవాడు. ప్రజలలో కొందరు విశ్వసించి సన్మార్గలుగా (ముస్లిం) మారేవారు. మిగిలిన వారు మతావలంబీకులు (కాఫిర్) గా స్థిరపడిపోయేవారు.
వాస్తవానికి ప్రళయంరోజు అల్లాహ్ ముందు రెండే వర్గాలుంటాయి.  

మీరు ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నారా ... ? అయితే సంప్రదించండి 

Islamic Information Center (IIC)
AddressMountain Plaza, 3rd, 1800 2000 787 (Toll Free, Road Number 2, above Juliet Shop, Banjara Hills, Hyderabad, Telangana 500034
Toll Free no: 1800 2000 787 
Islamic Truth Exploration Center
AddressOfficers Colony, Chanchalguda, Hyderabad, Telangana 500024
Universal Islamic Research Center
AddressH. No. 2-2-439, Amberpet Main Road, Beside Gandhi Statue Bus Stop, Amberpet, Hyderabad, 500013
Peace Propagation Center
AddressShop No. 8-1-400/48, II Floor, Opposite Darussalam Bank, Deluxe Colony, Toli Chowki, Hyderabad, Telangana 500008

No comments:

Post a Comment