------------------------------------------------------------------------------------------
ప్రతి మనిషి తప్పకుండా తన నిజ సృష్టికర్తను గురించి అన్వేషించాలి
------------------------------------------------------------------------------------------
ఈ
ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో
జాగ్రత్తగా పరిశీలిస్తాడు. స్వీయపరిశీలన చేయకుండా గుడ్డిగా ఏ వస్తువూ
తీసుకోడు.
ఉదాహరణకు:- బట్టల షాపుకు, లేదా చెప్పుల షాపుకు వెళ్ళి,
చూడకుండా, పరిశీలించకుండా ఏదైనా వస్తువును కొంటారా... ?????
ఖచ్చితంగా అలా చేయరు.
ఎందుకంటే అలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది.
అందుకే ఒక ఒక కేజీ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారు ....
కాని
ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయపరిశీలన చేయకుండా మన పూర్వీకుల పై,
పండితులపై, పాస్తర్లపై, మౌల్వీలపై, గుడ్డిగా ఆధారపడటం వల్ల వారు మనల్ని సత్యానికి దూరంగా తీసుకొని వెళ్తున్నారు.అందువల్ల మనం నిజ దేవుడు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్య దైవాలను ఆరాధిస్తూ ... ఇదే మన సంస్కృతి అన్న భ్రమ లో ఉన్నాము.
ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము,,,
ఎవరైతే మనల్ని పుట్టించాడో,,
ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో,
ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు.
ప్రాపంచిక
సరదాలకోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి
అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు.
సోదరులార! అందుకే ఆ సృష్టికర్త గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ సృష్టికర్తను అన్వేషించడానికి సమయాన్ని కేటాయించాలి.
నిజమైన దేవుడు ఎవరు? అని ఈ ప్రపంచంలో ఉన్న సగటు వ్యక్తిని ప్రశ్నించండి., విభిన్న సమాధానాలు వస్త్ఘాయి.
ఉదాహరణకు:--
కొందరు దేవుడు ఒక్కడే అని, మరికొందరు ముగ్గురు అని, ఇంకొందరు ముక్కోటి
అని ఇలా అనేక రకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు. దేవుడు మానవుడిగా అవతరిచాడు అని
కొందరు అంటే, మనవున్నే దేవునిగా మార్చినవారు మరికొందరు సృష్టికర్త
వేరు, సృష్టి వేరు అని ద్వైతవాదులు అంటే సృష్టి మరియు సృష్టికర్త రెండూ
ఒక్కటే అనేవారు అద్వైతవాదులు ఇవన్ని విని అసలు దేవుడే లేడు అని వాదించే
నాస్తికులు ఉన్నారు.
నిజమైన దేవుడు ఎవరు? అన్న ప్రశ్న ఎంతో కన్ఫ్యూషన్ కు గురైంది అనేది వాస్తవం. ఈ కన్ఫ్యూషన్ దూరం చేయవలసిన భాద్యత ఎవరిది? ఆలోచించండి !!!!!!!!
No comments:
Post a Comment