కాబట్టి దేవుడా?






క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు: "కాబట్టి యేసు దేవుడా?


యేసు ద్వారా రక్షణ పొందాలనుకునే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో తెలుసుకోవలసిందే!

* ఆదాము,హవ్వల పుట్టుకలో ప్రమేయం ఎవనిది?
* యేసు దేవుడై ఉండి అద్భుతాలు చేసారా? లేక దైవ శక్తితో చేసారా?
* యేసు చేసిన అద్భుతాల విషయంలో యేసు అనంతరం శిష్యుల విశ్వాసం ఏమిటి?
* బైబిల్ ప్రకారం ప్రభువనే ప్రయోగం ఒక్క దేవునికే వర్తిస్తుందా?
* రక్షకుడైన రక్షకుడిని రక్షించువాడెవడు?
* యేసు మృతులలో నుండి లేచారా? దేవునిచే లేపబడ్డారా?
* బైబిల్ లో అనేకులు పూజింపబడిన వారున్నారు? వారందరూ దైవాలేనా?
* యేసును యధార్థంగా గుర్తించింది జ్ఞానులా? శిష్యులా?
* యేసును దేవునిగా ప్రకటించే నేటి బోధకులు ఆయనను గూర్చి ప్రత్యక్ష శిష్యులకంటే మరియు పౌలు కంటే అధిక జ్ఞానం కలిగి యున్నారా?
            పై ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.
యేసు శిలువ దండన దేవుని సంకల్పమా? యూదుల కుట్రయా? :ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చదవండి.
Saturday, February 28, 2015


యేసువారు నిజానికి ఎందుకొచ్చారు? నేటి సువార్తికుల బోధనలే వాస్తవమైతే ఆయనను శిలువ వేయడానికి సాతాను ఎందుకు రెచ్చగొడ్తాడు. మానవుల పాపపరిహారార్ధబలి నిమిత్తం ఆయన శిలువపై మరణించడానికి వచ్చి యుంటే సాతాను శిలువను వ్యతిరేకించడం మాని ఎందుకు సహకరించినట్టు? నిజానికి యేసు శిలువ సంఘటన దేవుని సంకల్పమా? యూదుల కుట్రయా? ఒకవేళ పాపపరిహారార్ధబలే దేవుని సంకల్పమైతే యేసును మరణం నుండి దేవుడే ఎందుకు రక్షించుకున్నట్టు? ఆయన మరణించడని ఘోషిస్తున్న అనేక లేఖనాల పరిస్థితి ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకు జవాబు దొరికే సంచలన పుస్తకం:

యేసు శిలువదండన దేవుని సంకల్పమా?యూదుల కుట్ర?
ఈ క్రింది లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చదవండి.



చర్చి౦చబడిన అ౦శాలు
క్రైస్తవులారా!
అబద్ధ బోధకుల ను౦డి క్రైస్తవ్యాన్ని కాపాడండి!!------------------------------------I-II
1. యేసు తండ్రి లేకుండా పుట్టాడు -------------------------------------------------1
     ఆదాము, హవ్వాల పుట్టుకలో ప్రమేయం ఎవనిది?...కాబట్టి దేవుడా? --------------2
2. యేసు అద్భుతాలు చేశారు....కాబట్టి దేవుడా? -------------------------------------4
యేసు దైవత్వపు భావనకు కారణం? వాస్తవికత --------------------------------5
మోషె చేసిన అద్భుతాలు ----------------------------------------------------5
ఏలీయా చేసిన అద్భుతాలు  -------------------------------------------------6
ఎలీషా చేసిన అద్భుతములు  ------------------------------------------------------------7
ఎలీషాద్వారా జరిగిన మహా అద్భుతం! -----------------------------------------------8
ఈ అద్భుతాలు చేసినవారు స్వశక్తితో చేశారా? లేక దైవశక్తితో చేశారా? --------------9
యేసు దేవుడై ఉ౦డి అద్భుతాలు చేశారా? లేక దేవుని సహాయంతో చేశారా?---------9
యేసుచేసిన అద్భుతాల విషయంలో యేసు అనంతరం శిష్యుల విశ్వాసం ఏమిటి?----I2
3. యేను ప్రభువు... కాబట్టి దేవుడా? -----------------------------------------------13
బైబిలు ప్రకారం ప్రభువనే ప్రయోగం ఒక్క దేవునికే చేస్తు౦దా?----------------------14
యోసేవు ప్రభువు! ----------------------------------------------------------14
దేవువి దూత ప్రభువు -------------------------------------------------------14
ప్రభువులనబడిన వారు అనేకులు ఉన్నారు! ------------------------------------14
సాధారణ ప్రభువులకు-ప్రత్యేక ప్రభువునకు మధ్య ఉన్న వ్వత్యాసాన్ని గుర్తి౦చే విధాన౦ (పాతనిబంధనలో) -----------------------------------------------------------15
క్రొత్త నిబ౦ధనలో అసలు ప్రభువును ఎలా గుర్తించలి ? -----------------------------15
సువార్తలలో రెండు రకాలుగా వ్రాయబడిన ప్రభువు! -------------------------------15
పత్రికలలోనూ ఈ వ్వత్యాసం కనిపిస్తు౦ది! ---------------------------------------16
ఆ వ్యత్యాసాన్ని  పాటించటంలోని ఔచిత్యం ఏమిటి? -------------------------------16
4. యేసు రక్షకుడు... కాబట్టి దేవుడా? -----------------------------------------------17
అసలు రక్షకుడు ఎవరు? -----------------------------------------------------19
ఇదిగో! యేసుకూడా రక్షకుడే! కాబట్టి దేవుడు!  ----------------------------------20
యేసును దేవునిగా ప్రకటించే నేటి బోధకులు ఆయనను గూర్చి ప్రత్యక్ష శిష్యులకంటే మరియు పౌలుకంటే అధిక జ్ఞానం కలిగి ఉన్నారా?--------------------------------21
రక్షకుడైన రక్షకుడిని రక్షంచు వాడెవడు!? ---------------------------------------23
5. యేసు అబ్రాహాము కంటే ము౦దున్నారు... కాబట్టి దేవుడా? ------------------------24 
6. యేను మృతులలోనుండి లేచారు...  కాబట్టి దేవుడా? -------------------------------26
7. యేసు పూజించ బడ్దారు కాబట్టి దేవుడా? --------------------------------------------28
యేసును యథార్ధంగా గుర్తించింది జ్ఞానులా ? శిష్యులా? ---------------------------2

యేసు తండ్రి లేకుండా పుట్టాడు..... కాబట్టి దేవుడా ?
‘యెహోవా దేవుడు' లేక 'యెహోవాయే దేవుడు' లాంటి స్పష్టమైన ప్రకటనలు బైబిలు గ్రంథంలో అనేకంగా లభిస్తాయి. కాని 'యేసే దేవుడు' అని కాక పోయినా కనీసం 'యేసు దేవుడు' అనే ఒక్కగాని ఒక్క ప్రకటన అయినా పూర్తి బైబిలు గ్రంథలలో ఏ కొశానా కనబడదు. అయినప్పటికీ యేసుకు దైవత్వాన్ని ఆపాదించటానికి అధిక  శాతం క్రైస్తవ ప౦డితులు ప్రయత్నిస్తుంటారు . ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు దేవుడని 'మూఢం'గా నమ్మాలే తప్ప దానికీ 'వాక్యానుసారం' అయిన అధార౦ కి౦చిత్తు కూడా లఛి౦చదు. యేసు దైవత్వాన్ని నిరూపించటానికి చూపించే కారణాలు సుమారు ఏడు ఉన్నాయి.  ఈ పుస్తకంలో వాటన్నిటిపై పరిశుద్ద వాక్యం వెలుగులో చర్చించటం జరిగి౦ది.  వాటిలో ఒక కారణం- 'యేసు త౦డ్రి లేకు౦డా జన్మించారు.... కాబట్టి దేవుడు' అన్నది. ఈ కారణం అధారాంగా యేసుకు దైవత్వాన్ని కనుక ఆపాదిస్తే బైబిలు ప్రకారం ఇ౦కా ఎందరెందరినో దైవాలుగా అ౦గీకరి౦చవలసి  పస్తుంది. అంటే 
బైబిలు గ్రంథ పరిపూర్ణ అవగాహన లేని కారణ౦గానే యేను దైవత్వపు భావన ఏర్పడుతుంది. కారణం ? యేసుకంటే అద్భుతమైన పద్దతిలో జన్మించిన వారు బైబిలు గ్రంథంలో ఎందరో ఉన్నారు!
ఒక స్త్రికీ బిడ్డ జన్మించాలంటే ప్రకృతినియమాల  ప్రకార౦ పురుషుని ప్రమేయ౦ ఉ౦డాలి. అతని పాత్ర లేకు౦డా  జస్మి౦చట౦ అస౦భవ౦. నిజమే కాని ఇది మానవుని శక్తి పరిధికి స౦బ౦ధి౦చిన విషయం. అయితే మానవుడి శక్తి పరిమితం. కాని దైవశక్తి అపరిమితం కదా! అలాంటి దైవాన్ని మానవశక్తి పరిధికి దిగజార్చి అదే  దైవకార్యాలను ఊహి౦చట౦ జ్ఞానరాహిత్యం.
సర్వశక్తి మ౦తుడైన దేవుడు పదార్ధాన్నీ, అ పదార్థంద్వారా అపరిమిత సృష్టినీ చేయగల సమర్ధుడు. కాని మానవుడు పదార్ధాన్ని చేయలేడు. పదార్ధం ఉ౦టే దాని ద్వారా సృష్టి చేయగలడు. అది కూడా అతి పరిమితంగా మాత్రమే! ఇది మనిషి తీరస్క రించలేని బలహీనత. యేసు  పురుష ప్రమేయం లేకుండా జన్మించారు. కాబట్టి దేవుడు అని కొందరు తీర్మానించటానికి కారణ౦
ఏమిటంటే- యేసు పుట్టుకలో దేవుని ప్రయేయం ఉంది కనుక అన్నది!

అ౦టే ఒక స్త్రికి బిడ్డ కలగటంలో ఎవని ప్రమేయ౦ ఉ౦దో అతని సంతానంగా ఆ బిడ్డను పరిగణించటం జరుగుతు౦ది. అలాగే యేసు జన్మించటంలో దేవుని ప్రమేయం ఉంది కాబట్టి యేసు దేవుని సంతానంగా పరిగణిస్తున్నారన్న మాట .

అదాము, హవ్వాల పుట్టుకలో ప్రమేయం ఎవనిది ?

(ఆదికాండము 1: 2 7) డేపుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుఘనిగాను వాని సృజించెను.

(ఆదికాండము 2:21) అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేపి అతడు నిద్రించినంప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటు మాంస ముతో పూడ్చివేసెను

పై రె౦డు వచనముల ద్వారా అర్ధ౦ అయ్యేదేమిటంటే- ఆదాము-హవ్వాలైన మొదటి మానవజంట పుట్టుకలో పూర్తిగా దేవుని ప్రమేయం ఉ౦ది. కనుక ఆదాము- హవ్వాలను దేవుని స౦తాన౦గా పరిగణించవచ్చా? కాదు కదా! మరి అటువంటప్పుడు యేసు పుట్టుకలో దేవుని ప్రమేయం ఉ౦ది కాబట్టి యేసును దేవుడు అనటం ఎంతవరకు సమంజసం ?

ఇక భూమ్యాకాశాలు వాటిమధ్య ఉన్నా సకల చరాచర సృష్టితాల జననానికి కారణం ఎవరు? దేవుని వాక్కు లేక దేవుని వాక్యము లేక దేవుని మాట లేక దేవుని అజ్ఞ. అయితే దేవుని సృష్టి క్రమం రెండు విధాలుగా స౦భవిస్తు౦ది.
1.      ప్రకృతి నియమాలకు అతీతంగా అంటే 'దేవుని ఆజ్ఞ' ద్వ రా.
2.      ప్రకృతి నియమాల ప్రకారం.                                     
భూమిని- ఆకాశాలను, వాటిలో ఉన్నదంతటిని ఏ వాక్శక్తితో కలిగించాడొ  అదే వాక్కు లేక అజ్ఞతో యేసునూ పుట్టించాడు ఆ దేవుడు.

(యోహాను 1:14) ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి.
పై వాక్యం ద్వారా స్పష్టం అయ్యేదేమిఎటంటే- ఏ వాక్యమైతే భూమ్యాకాశాల నిర్మాణానికి దోహదమయ్యిందో ఆ వాక్యమే యేసు పుటుకకూ కారణమయ్యిందన్నది. 'మనందరి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింప లేదా!' అని మలాకి 2:10 తెలుపుతోంది. తండ్రి  అయిన దేవుని వలన పుట్టిన౦దుకు యేసు దేవుడైతే సకల చరాచర ప్రకృతీ కూడా దైవం అయిపొతుంది! దేవుని శక్తిని ప్రస్తావిస్తూ యొహాను చెబుతున్న ఈ క్రింది విషయూన్ని గమనించగలరు.

(మత్తయి 3:8) అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు; దేవుడు (యొహోవా) ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుటింపగలడని మీతో చెప్పుచున్నాను.
అ౦తటి శక్తి కలిగిన దైవం ఒక స్త్రీద్వారా పురుష ప్రమేయ౦ లేకు౦దా ఒక శిశువును పుట్టించిన౦దుకు, ఆ శిశువును దైవ అస్తిత్వంతో సమానం అని, సాక్షాత్తు దైవ౦ అని భ్రమి౦చట౦ అంటే అది పక్కా అన్య పోకడే. ఈ సర్వ సృష్టిలోనిది ప్రతీది దేవుని వాక్శక్తి ద్వారాగానే కలిగింది అయినప్పటికీ వాటిలోనిది ఏదీ దైవ సమాన౦ కాదు కదా! మరి అటువంటప్పుడు అదే దేవుని వాక్శక్తి ద్వారా పుట్టిన యేసు దైవ సమానం ఎలాగైపోతారు?

2. యేసు అద్భతాలు చేశారు… కాబట్టి దేవుడా?
అనాది కాలం ను౦డి సర్వశక్తిగల దేవుడు తన అద్వితీయతను చాటుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకు ఏదో విధ౦గా సహపర్తులను అ౦టగట్టట౦ కూడా సాగుతూనే ఉంది. గొప్ప చోద్యం ఏమిటంటే- ఏ ప్రవక్త అయితే దేవుని ఏకత్వాన్ని చాటాడో సరిగ్గా అతనినే దైవత్వంలో భాగస్వామ్యం చేయటం ఒక అనవాయితీగా వస్తుంది. అనేక మ౦ది దైవ ప్రవక్తల పరంపరలో  క్రీస్తుగా దేవునిగా  నియమించబడిన యేసు కూడా సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు అద్వితీయుడనే విషయన్ని ఎంతో విస్పష్ట౦గా తెలియజేశారు. అయినప్పటికీ అందరి ప్రవక్తల మాదిరిగానే యేసు అన౦తర౦ యేసుకూ దైవత్వాన్ని ఆపాదించారు. దాని నిరూపణకు  అనేకానేక ప్రయత్నాలు జరిగాయి. అలా౦టి  ప్రయత్నాలలో ఒకటి యేసు  అద్భుతాలు చేశారు కదా! కాబట్టి దేవుడు అన్నది.

అద్భుత౦ అ౦టే ఏమిటి ?
ప్రకృతీ నియమాలకు అతీతంగా జరిగే ప్రతి సంఘటననూ అద్భుతంగా పేర్కొన వచ్చును. అయితే యేసు అలాంటి ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి ఉన్నారు. ఆ పనులు మానవ మాత్రులకు సాధ్య౦ కాదు. మరి…? దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి యేసు దేవుడు అన్నది లాజిక్కు! అది బైబిలు గ్రంధపు పరిపూర్ణ జ్జాన౦ లేని వారి లాజిక్కు మాత్రమే. ఒకవేళ ఈ లాజిక్కు ప్రకారం యేసు దేవుడైతే… ఇ౦కా డజన్లకొద్దీ మందిని దైవాలుగా అ౦గీకరి౦చవలసి వస్తు౦ది. ఎ౦దుక౦టే- యేసు చేసిన అద్భుతాలకంటే గొప్ప అద్భుతాలు చేసినవారు బైబిలు గ్రంధంలో అనేకులు ఉన్నారు.
యేను దైవత్వపు భావనకు కారణం? - వాస్తవికత
(బైబిలు ప్రకారం యేసు ఒక్కరే అద్భుతాలు చేశారా?)
మోషే చేసిన అద్భుతాలు
(నిర్గ//కా//7:20) యెహోవా అజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.
(నిర్గ//కా//8:16:17) అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్రచాపీ యీ దేశపు దూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని ఆహరోనుతో చెప్పమనగా వారు చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు  అంతయూ పేలాయెను
(నిర్గ//కా//9:10) కాబట్టి వారు అవపుబుగ్గి తీసికొని వచ్చి ఫరోయెదుల నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు రద్దురులాయెను.
(నిర్గ//కా//10:13) మోషే ఇగుప్తు దేశముమీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలి ఎగురజేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలి మిడతలు వచ్చెనం.
(నిర్గ//కా//10:22) మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెను. మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోటునుండి లేవ లేకపోయెను; అయినను ఇశ్రాయేలీయులందరికి వారి నివాసములలో వెలుగుండెను.
(నిర్గ//కా//14:16) నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రమువైవు నీ చెయ్యిచాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడచి పోవుదురు.
(నిర్గ//కా//17: 6) ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగానిలిచెదను; నివు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో ను౦డి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషె ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.
ఫై వాక్యాల ప్రకార౦ మోషె చేసిన అద్భుతాలు ఏమిటో తెలుస్తున్నాయి.  అవి:
·        ఐగుప్తు దేశంలోని నదులు, కాలువలు ఇంకా గృహాలలో ఉంచిన నీరు సైతం రక్తముగా మారటం
·        ఐగుప్తు దేశములోని మనుషులు, జంతువులు పేలతో నిండి పోవటం
·        మనుషులకు, జంతువులకు పొక్కులు దద్దురులు ఏర్పడటం
·        యావద్దేశంలో గాడాంధకారం క్రమ్ముకోవటం
·        గొప్ప ప్రవాహముగల సముద్రమను రెండుగా చీల్చుట
·        కటిక బండనుండి నీళ్లను ప్రవహింపజేయుటం

లాంటి ఇ౦కా ఇత్యాదివి.
ఏలీయా చేసిన అద్భుతాలు
(1వ రాజులు 17:15, 16) …అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యోహోవా ఏలీయాద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువకాలేదు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
(1వ రాజులు 17:22) యెహోవా ఏలీయా చేసిన ప్రార్ధన ఆలకించి ఆ చిన్నివానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను.
(1వ రాజులు 18:45) అంతలో ఆకాశము మేషుములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక ఆహోబు రధమోక్కి యెజ్రాయేలునకు వెళ్లిపోయెను.
ఈ వాక్యాల ప్రకారం –
ఏలీయా 
·        కొద్దిపాటి పిండి, నూనె దినములు భుజించటానికి తగి నంతగా వృద్ధిపరచాడు
·        చనిపోయిన వానిని బ్రతికించాడు 
·        వర్షాన్ని కురిపించాడు ఇంకా అనేక అద్భుతాలను ప్రదర్శించాడు .

ఎలీషా చేసిన అద్భుతములు
(2వ రాజులు 4:5-6) ఆమె అతని యొద్దనుండి తలుపు మూసి,కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నియు నిండిన అరువాత ఇ౦కా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు- మరేమియూ లేవని చెప్పెను అంతలో నూనె నిలిచి పోయెను
(2వ రాజులు 4:40-41) తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచిచూచి- దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినకమానిరి. అతడు- పిండికొంత తెమ్మనెను. వారు తేగా- కుండలో దాన్నివేసి, జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించక పోయెను.
(2వ రాజులు 4:42-44) మరియు ఒకడు జయిల్షాలిషా ను౦డి మొదటి పంట బాబతు యవల పీండితో చేయబడిన యిరువది రొట్టిలను, క్రొత్త గొధుమ నెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా ఆతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుననెను. అయితే అతని పనివాడు- వారు తినగా మిగులుమని యెహోవా సెలవిచ్చి యున్నాడు.  గనుక జనులు భోజనము చేయునుట్టు వడ్డించుమని మరల అజ్ఞ ఇచ్చెను. పనినాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.
(2వ రాజులు 5:10) ఏలీషా- నీవు యోర్దాను నదికిపోయి యేడు మారులు స్నానము, చేయుము, నీ ఒళ్లు మరలా బాగై శుద్దుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.
పై వాక్యాలు ఏలీషా చేసిన అద్భుతాలను తెలియజే స్తున్నాయి. అవి:
·        నూనెను వృద్ధిపరచుట
·        విషాన్ని విరుగుడు చేయుట
·        కొద్దిపాటి ఆహారము వంద మందికి
·        కుష్ఠ రోగగ్రస్తుడిని స్వస్థపరచుట       

లాంటి అనేక అద్భుతాలను మహత్కార్యాలను ఎలీషా చేసి ఉన్నాడు. ఈ మహత్కార్యాలకు స౦బ౦ధి౦చిన కొన్ని స౦ఘటనలు మాత్రమే పేర్కొనటం జరిగింది. ఇలా౦టి ఇ౦కా అనేక అద్భుతాలు చేసిన వారిని బైబిలు గ్రంథం చూపిస్తుంది.
ఎలీషాద్వారా జరిగిన మహా అద్భతం
యేసుతొ సహా సకల ప్రవక్తలు ఏ అద్భుతాన్ని ప్రదరిర్శించినా, వారు బ్రతికి  ఉండి, దైవాన్ని పార్ధించి చేసినవే. కాని ఎలీషా ద్వారా జరిగిన అద్భుతం ఎ౦త గొప్పదో ఈ కింది వాక్యాలలో గమనిలచగలరు.
(2వ రాజులు 13:20-21) తరువాత ఎలీషా మృతిపొ౦దగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల స్తెన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు స్తెన్యమునకు భయపడి ఆ శవమును యొక సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము శల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లుమోపి నిలిచెను.
ఫైవాక్యం ప్రకార౦- ఒకటి ఎలీషా బ్రతికేలేడు. రె౦డు దేవుని ప్రార్ధించనూ లేదు.
అంటే అతని ప్రమేయం ఏమాత్రం లేనప్పటికీ కేవలం అతని శరీరపు శిథిల శల్య౦ తగిలినంతనే ఒక మృతువు  దిగ్గున లేచి నిలబడటం ఎలీషా ద్వారా జరిగిన మహా అద్భుతం కాదా? యెహోవాను పార్ధి౦చి, మృతులను లేపినందుకు యేసును దేవుడు అనవలసివస్తే మరి ఎలీషాను యేసుక౦టే గొప్ప దేపుడనాలా!?

ఈ అద్భుతాలు చేసినవారు స్వశక్తితో చేశారా? లేక దైవశక్తితో చెశారా?
(నిర్గమకాండము 8:19) శకునగాండ్రు - ఇది, దైవశక్తి అని ఫరోతో చెప్పెరి.
(-1 రాజులు 17:22) యెహోవాను ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన పార్థన ఆలకించి ఆ చిన్నివానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను.
పైవాక్యాల ప్రకారం మోషేగాని, ఏలీయా ఎలిషాలుగాని చేసిన అద్భుతాలు వారు సాక్షాత్తు  దైవ అవతారాలుగా చేసినవి కావు. కాని దైవ సహాయంతో చేసినవని అర్థం అవుతుంది. మోషే చేసిన అద్భుతాలను చూచి 'అది దైవశక్తి' అని అలాగే 'యోహోవాను పార్థింపగా' అని పేర్కొనబ డిన వాక్య భాగాలే ప్రబలసాక్ష్యం. సరే ఇది యేసుకు పూర్వం అద్భుతాలు చేసినవారి పరెస్థితి.





యేసు దేవుడై ఉండి అద్భుతాలు చేశారా ? లేక దేవుని సహాయంతో చేశారా?
యేసు దేవుడు కాబట్టే ఇన్ని అద్భుతాలు చేయగలిగారని ప్రచారం జరుగుతొంది. అయితే దీని విషయంలో బైబిలు గ్రంథం ఏమ౦టు౦దో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
(యోహాను 11:20, 21) మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెను గాని మరియ ఇంటిలో కూర్చుండి యుండెను. మార్త యేసుతో- ప్రభువా! నీవిక్కడ ఉ౦డిన యెడల నా సహోరరుడు చావకుండును…
పై వాక్యాల ప్రకార౦ యేసు ప్రత్యక్ష  శిష్యులకు -'యేసు మృతులను లేపగలడు' అనే ఒక ప్రగాఢమైన నమ్మకం ఉండేదని అర్థ౦ అవుతుంది. అయితే వారి ఆ నమ్మక౦ క్రింది పేర్కొన్నరె౦దు విధాలలో ఏ విధమైనది? అన్నది గుర్తించవలసి ఉంది.  
1.       యేసుదేవుడు కనుక చనిపోయిన లాజరును లేపగలడు అన్నదా?
2.       యేసు తన స్వశక్తితో కాక సర్వశక్తిగల దేవుడైన యెహోవాను అర్థించి, ప్రార్థించి లాజరును లేపుతాడన్నదా ?
పైన పేర్కొన్న రెండు అభిప్రాయాలలో ఏఅభిప్రాయాన్ని శిష్యులు కలిగి ఉన్నారో ఈ క్రింది వాక్యాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది గమనించగలరు.
(యొహాను 11: 22) ఇప్పుడైనను నీవు (యేసు) దేవుని (యెహోవాను) ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.
ఈ వాక్యం పైన పేర్కొన్న రెండిటిలో రెండవ అభిప్రాయాన్నే శిష్యులు కలిగి ఉండేవారని తెలుస్తుంది. యేసు ప్రత్యక్ష శిష్యురాలైన మార్త విశ్వాసం ప్రకారం-యేసు తన స్వశక్తితో కాక, దైవప్రసాదిత శక్తితో తన సహోదరుడైన లాజరును లేవు తారన్నది. అయినప్పటికీ ఏమో… మార్త విశ్వాసం తప్పేమో! యేసు స్వయంగా దేవుడై ఉండి మృతులను బ్రతికించారేమో… అనే సందేహాలు కలిగే అవకాశం లేకపోలేదు కదా! అయితే వాటికి సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
(యొహాను 11: 35) యేసు కన్నీళ్లు విడిచెను.
ఆ తరువాత
(యొహాను 11: 39) యేసు - రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరి అయిన మార్త-ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను.
ఆ విధంగా చెబుతున్న తన శిష్యురాలైన మార్తకు యేసు ఇస్తున్న సమాధానం అత్యంత గమనార్హమైనది.
దానిని ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
(యొహాను 11: 40-44) యేసు – నీవు నమ్మిన దేవుని (యొహొవా) మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని అమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి – తండ్రీ (యొహోవా) నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతలు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని చుట్టు నిలిచియున్నయీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చేసి – లాజరూ, బయటకురమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్ర్తములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు – మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.
పై వాక్యం ప్రకారం తెలిసే మౌలిక విషయాలలో మొదటిది యేసు మార్తతో – నీవు నమ్మినయెడల 'నామహిమ' చూతువని చెప్పక, ' దేవుని (యొహోవా) మహిమ' చూతువని చెప్పటం. రెండవది ' నీవు (యొహోవా) నామనవి విన్నావు' అన్నది అంటే – మృతుడైన లాజరును బ్రతికించమని యేసు దేవునికి మనవి చేసుకున్నారని ఇంకా ఎప్పుడు ఏ అద్భుతం చేసినా ఆ దేవునికే మనవి చేసుకుంటున్నారని స్పష్టం కావటం. మూడవది యేసు స్వయంగా ఆ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించటం. నాలుగోది ఇదంతా ఎందుకు చేసినట్లు..? అని ప్రశ్నిస్తే… చుట్టు నిలిచియున్న జనసమూహం… ' యేసు చేసుకునే మనవిని దేవుడు వింటున్నాడు ' అనే విషయాన్ని వారు (జనులు) నమ్మటానికని సమాధానం ఇస్తున్నారు.
గమనిక: కాని నేటి జనం యేసు మనవి విని దేవుడు యేసుచేత అద్భుతాలు చేయించాడని కాక యేసే దేవుడై మహిమలు చేశారని నమ్ముతున్నారు. ఇది పూర్తిగా యేసు బోధకు వ్యతిరేక విశ్వాసము.
యేసు ద్వారా ఆశీర్వాదాన్ని పొంది, నిత్యజీవానికి అర్హులైన యేసు ప్రత్యక్ష శిష్యులు ఒక ప్రత్యేక విధమైన విశ్వాసాన్ని యెసుపట్ల కలిగి ఉన్నారు. వారి ఆ ప్రత్యేక విశ్వాసమే వారికి ఆ విధమైన ప్రత్యేక అదృష్టాన్ని కలిగించింది. నేడు, రేపు ఎప్పుడైనా అలాంటి అదృష్టభాగ్యాన్ని ఎవరైనా పొందగోరితే యేసుపట్ల అతని ప్రత్యక్ష శిష్యులు కలిగి ఉన్న విశ్వాసాన్నే ఖఛ్ఛితంగా కలిగి ఉండాలి. దానికి కాస్త ఎక్కువాగాని, తక్కువగాని కలిగి ఉన్నా నిత్యనరకమే వారి అదృష్టం అవుతుంది.

యేసుచేసిన అద్భుతాల విషయంలో యేసు అనంతరం శిష్యుల విశ్వాసం ఎమిటి?
యేసు ఈలోకంలో ఉన్నంతకాలం చేస్తున్న అద్భుతాలను ఆయన తన స్వశక్తితో కాక దేవుని ప్రార్ధించి, ఆయనకు మనవి చేసుకుని వాటిని చేస్తున్నారని యేసు ప్రత్యక్ష శిష్యులు నమ్మేవారని అర్ధం అయ్యంది. అయితే యేసు ఈ లోకంనుండి నిష్క్రమించిన తరువాత వారి ఆ విశ్వాసంలో ఏమైనా మార్పు వచ్చిందా ? అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
(అపో//కా//2: 22) ఇశ్రాయేలు వారలారా! ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను, మహత్కార్యములను, సూచకక్రియలను మీ మధ్యన చేయించి ఆయన (యేసు)ను తన (యొహోవా) వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే యెరుగుదురు.
(అపో//కా//10: 38) దేవుడు (యెహోవా) ఆయన (యేసు) కు తోడైయుండెను గనుక ఆయన (యేసు) మేలుచేయుచు, అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్ధపరచుచు సంచరించుచుండెను. 
పై రెండు వాక్యాలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే – దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములు మహత్కార్యములు సూచక క్రియలు మీ మద్యన చేయించెను. దేవుడు యేసుకు తోడై ఉండెను గనుక మేలు చేయుచు అపవాది పీడితులకు స్వస్థపరిచేవారు అన్న వాక్యభాగాలు- యేసు దేవుడై ఉండి అద్భుతాలు చేశారనే విశ్వాసాన్ని తునా తునకలు చేస్తున్నాయి. ఇంకా దానిని ఒక అంధ విశ్వాసంగాను కల్పిత విశ్వాసంగాను చూపిస్తున్నాయి.

అదినుండీ ప్రవక్తలందరూ మానవ మాత్రులైనప్పటికీ దేవునిచే ఎంపిక చేయబడి నందుకు గోప్పవారయ్యారు. దేవుడు వారిని ఎన్నుకున్నoదుకు కొన్ని అద్భుత శక్తులను అవి కూడా అవసరార్థం సందర్భొచితంగా మాత్రమే వారికి ఇచ్చేవాడు. అచ్చం అలాగే ఆ సర్వశక్తిగల దేవుడు యేసుతో కూడా కొన్ని అద్భుతాలు చేయించాడు. విషయాన్ని ఎవరైనా గుర్తించలేదంటే – వారికి బైబిలు పరిజ్ఞానం లేనట్లే.

3.       యేసు ప్రభువు…కాబట్టి దేవుడా?

యేసుకు లేని దైవత్వాన్ని అంటగట్టటానికి ఉపయొగించే వాక్యాలలోని ఒక వాక్యం - ' యేసు అందరికీ ప్రభువు ' అన్నది ఒకటి. నిజమే ఈ వాక్యం బైబిలు గ్రంథంలో ఉంది. కాని యేసు అందరికీ ప్రభువు కాబట్టి ఆయనను దేవునిగా అంగీకరించి, ఆరాధించిన దాఖలా ఒక్కగాని ఒక్కటి కూడా పూర్తి బైబిల్లో ఎక్కడా లేదు. ఈ వాక్యం ఈ మధ్యకాలంలో వ్రాయబడింది కాదు. అదిమ అసోస్తలుల కాలం నుండి ఉన్నదే. పైగా యేసు ప్రత్యక్ష శిష్యులు ఎరిగి ఉన్నదే.
అయినప్పటికీ ఆ వాక్యన్నిబట్టి ఆనాటి యేసు ప్రత్యక్ష శిష్యులు యేసును దేవునిగా భావించారా? లేదు. ఇంకా అలా ప్రచారం కూడా చేయలేదు. అటువంటప్పుడు ఆ వాక్యాన్ని ఆధారంచేసుకుని యేసును దైవంగా భావించటం అలాగే ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం?
అటు యొహోవానూ ప్రభువు అని ఇటు యేసునూ ప్రభువు అని బైబిలు గ్రంథం తన పాఠకులను గందరగోళ పరుస్తుందా ? లేదు. బైబిలు గ్రంథాన్ని అనేకమంది దైవజనులు ఎంతో ప్రయాసకోర్చి, ఎంతో తేటగా మనవరకూ చేర్చారు. అలాంటి గ్రంథం తన ప్రజలకు గలిబిలి విశ్వాసాలకు గురిచేయగలదా ? అలాంటి అవకాశం ఎంతమాత్రం లేదు .
అయితే నేటి క్రైస్తవ సమాజంలో చోటు చేసుకున్న ఈ పరస్పర విరుద్ధ విశ్వాసాలకు కారణం ఏమిటి ? అన్నప్రశ్న ఒకటి తలెత్తుతుంది. దానికి బైబిలు గ్రంథం ఇస్తున్న ఈ క్రింది ఆజ్ఞను సామాన్య ప్రజలు పాటించకపోవటమే.
(యెషయా 34: 16) యొహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి.
ఈ ఒక్క ఆజ్ఞ అతిక్రమమే అనేకానేక తప్పుడు విశ్వాసాలకు ఆలోచనలకు కారణ భూతం అయింది. పై ఆజ్ఞ ప్రకారం యేసు ప్రభువు కాబట్టి దేవుడౌతారా? అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదాం…
బైబిలు ప్రకారం ప్రభువనే ప్రయోగం ఒక్క దేవునికే చేస్తుందా ? - యోసేపు ప్రబూవు!
(ఆది//కా//45:18) కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించేను.
పై వాక్యం ప్రకారం యేసేవును యొహోవా స్వయంగా ప్రభువుగా నియమించాడని అర్థం అవుతుంది.
దేవుని దూత ప్రభువు !
మరియు ఆ స్వప్నమందు దేవుని దూత – యాకోబూ! అని నన్ను పిలువగా – చిత్తము ప్రభువా అని అవుతుంది.
(అపో//కా//10: 4) అతడు దూతవైపు తేరిచూచి భయపడి – ప్రభూ, యేమని అడిగెను.
పై వాక్యములద్వారా దేవుని దూతలనూ ప్రభువనే సంబోధన చేయబడిందని తెలుస్తోంది.
 ప్రభువులనబడిన వారు అనేకులు ఉన్నారు !
(1వ కొరింథీయులకు 8:5) దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు…
ఈ వాక్యం ప్రకారం ప్రభువు అనే సంబోధన దేవునికి మాత్రమే ప్రత్యేకం కాదని స్పష్టం అవుతుంది. ప్రభువనే సంబోధన సాధారణమైనది కాబట్టి అందరికీ ఉపయోగించినట్లే యేసుకు కూడా ఉపయోగించారని తెలుస్తోంది. యేసును ప్రభువు అని బైబిలులో పేర్కోనబడి ఉంది కాబట్టి యేసు దేవుడు అని భావిస్తే మరి అదే బైబిలు చాలామందిని ప్రభువని సంబోధించింది. కనుక వారంతా దేవుళ్లేనా?... కాదు!
సాధారణ ప్రభువులకు – ప్రాత్యేక ప్రభువునకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించే విధానం (పాతనిబంధనలో)
(ద్వితీ//కా//10: 17) ఏలయనగా నీ దేవుడైన యొహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై యున్నాడు.
(కీర్తనలు 136:3) ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును.
ప్రభువని అనేకులను సంబోధిస్తే మరి అసలు ప్రభువును గుర్తించటం ఎలా? అన్న ప్రశ్నకు పై వాక్యాలు సమాధానం ఇస్తున్నాయి. అందరూ సాధారణ ప్రభువులైతే ' పరమప్రభువు ' అని ' ప్రభువులకు ప్రభువు ' అని సర్వ సృష్టికర్త అయిన యెహోవా ప్రభువును ' విశిష్టం ' గా చూపించటం జరిగింది. దీని ద్వారా ప్రభువు అనే సంబోధన ఇతరులకు చేసినా అసలు ప్రభువును గుర్తించటంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది పాతనిబంధనలో అసలు దైవాన్ని గుర్తించే విధానం.

క్రొత్త నిబంధనలో అసలు ప్రభువును ఎలా గుర్తించాలి ?

(మార్కు 12: 36) నేను నీ శత్రువులను నికు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండ మని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
పై వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం గుర్తిచగలరు. అదేమిటంటే – మొదటిది పెద్ద అక్షరాలతో కూడిన ప్రభువు మరియు రెండవది చిన్న అక్షరాలతో కూడిన ప్రభువు. బైబిల్ లేఖకులు ఆ వ్యత్యాసాన్ని ఎందుకు పాటించరు ? అని ప్రశ్నిస్తే సర్వసృష్టికర్త అయిన యెహోవా ప్రభువును మరియు యేసు ప్రభువును ఒక్కటి కాదు అని సూచించటానికి మాత్రమేనన్నది సమాధానం.
సువార్తలలో రెండు రకాలుగా వ్రాయబడిన ప్రభువు!
(యెహాను 11:21) మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును.
(యొహాను 20: 28) అందుకు తోమా ఆయన (యేసు) తో – నా ప్రభువా! నాదేవా!
పై రెండు వాక్యాలలోనూ ప్రభువు అనే పదం చిన్న అక్షరాలలోనే వ్రాయబడి ఉన్నవైనం స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
(మత్తయి 1:19-20) ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమాన పరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేసించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్పమందు అతనికి ప్రత్యక్షమై….
పై వాక్యాలు సువార్తలలోనివి. వాటిలో ప్రభువు అనే పదాన్ని చిన్నదిగా కాక పెద్దదిగా వ్రాయటాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాము.

పత్రికలలోనూ ఈ వ్యత్యాసం కనిపిస్తుంది!

(అపో//కా//2: 36)మీరు శిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగ తెలిసికొన వలెనని చెప్పెను.
(అపో//కా//2: 39) ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పెను.
ప్రభువు అనే పదాన్ని పైన పేర్కొన్నట్లు రెండు విధాలుగా లిఖించటాన్ని ప్రకటన గ్రంథం వరకూ చూడవచ్చు. అంటే క్రొత్త నిబంధన యావత్తులోనూ ఈ వ్యత్యాసాన్ని పాటించటం జరుగుతుంది.
ఆ వ్యత్యాసాన్ని పాటించటంలోని ఔచిత్యం ఏమిటి ?
ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకూ యెహోవాయేతరులకు ప్రభువు అన్నప్పుడు – కేవలం చిన్న అక్షరాలలో ప్రభువు అని పేర్కొనటం అదే యెహోవా కొరకైతే ' పరమప్రభువు ' లేక ' పెద్దక్షరాలలో ప్రభువు ' అని పేర్కొనటం జరిగింది. దానికి గల ఔచిత్యం ఏమిటి ? అని ప్రశ్నించుకుంటే - 
(యెహాను 10:29) నా తండ్రి అందరికంటే గోప్పవాడు.
అని యేసు సమాధానం ఇస్తున్నారు. యేసు స్వయంగా నా తండ్రి అయిన యెహోవా దేవుడు నా కంటే గొప్పవాడు అని ప్రకటించినప్పుడు ఆ వ్యత్యాసాన్ని చూపాలి కదా! అందుకే బైబిలు సంకలన కర్తలు యెహోవ యేసుకంటే గొప్పవాడు కాబట్టి పెద్దక్షరాలలో రాయటం జరిగింది. ఇప్పుడు చెప్పండి! దేవుడు ఏ ప్రభువు ? పరమప్రభువు అనగా పెద్దక్షరాలలో ఉన్న ప్రభువే! అదెవరు యేసా? కాదు. మరి? యెహోవా!
 యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదివితే ఇలాంటి సత్యాలు బయటపడతాయి. కనుక తన గ్రంథాన్ని పరిశీలించి చదివే సద్బుద్ధిని పరమ ప్రభువైన యెహోవా మనందరికీ ప్రసాదించు గాక, ఆమెన్ .

4.       యేసు రక్షకుడు… కాబట్టి దేవుడా ?

సర్వసృష్టికర్త అయిన యెహోవా దేవుడు కలిగి ఉన్న శక్తులు అనంతం. ఆయన ప్రతి శక్తీ పరిపూర్ణం. ఆయన కంటే గొప్పవాడు ఉండటం బహుదూరం  కనీసం ఆయనకు సమానమైనవాడు సైతం లేడు. ఆయన స్వయంగా ' దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు, నేనే దేవుడను నన్ను పోలినవాడు ఎవడును లేడు ' (యెషయా 46: 9)
అని అధికారికంగా ప్రకటిస్తున్నాడు . అయితే ఆయన మానవాళికి మరుగై ఉన్నాడు. కాని తన ఉనికిని, శక్తులను తన సృష్టి ద్వారా ప్రదర్శిస్తున్నాడు. ఈ సృష్టిలోని ' సంక్లిష్టత ' ఆయన నివుణతను చాటుతుంది . ఈ సృష్టిలోని ' క్రమం ' ఆయన ' అధికారాన్ని' వెల్లడి చేస్తుంది. ఈ సృష్టిలోని ' కళ ' ఆయన ' కళా సామర్థ్యాన్ని' ప్రదర్శిస్తుంది. ఈ విషయాన్ని పరిశుద్ధ వాక్య భాగం (రోమా 1: 20) లో స్వయంగా ప్రకటించడుతున్న వైనాన్ని గమనించగలరు. ' ఆయన (యెహోవా) ఆదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడచచున్నవి…' ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం మీద ఆయనది సాటి లేని ' అనుపమ ' అస్తిత్వము .  
కేవలం ఆ సృష్టికర్తను అద్వితీయునిగా గుర్తించటమే విశ్వాసి విశ్వాస స్వచ్ఛతకు ప్రబలగుర్తు. ఒక విశ్వాసాన్ని కలుషితం చేసి, నాశనం చేసే చర్య ఆ అద్వితీయునికి సమానుడుగా మరొకని సాటి కల్పించటమే. సాతాను మానవులపట్ల పన్నే కుట్రల్లో ప్రబలమైనది. ఆ ఏకైక దేవునితో మరొకనిని సాటి కల్పింపజేయటమే .
ఆ ఆద్వితీయ సృష్టికర్త తన సృష్టితాలలో తన గుణ లక్షణాలను ప్రతి
బింబింపజేస్తుంటాడు. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
(కీర్తనలు 19: 1-2) ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచుర పరచుచున్నది పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది . వాటికి భాషలేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు .
(యెషయా 11: 9)…సముద్రము జలముతో నిండి యున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
(1 కొరింథీ 11: 7) పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు…
పైవాక్యాలన్నిటిని గమనించినట్లయితే సర్వసృష్టిలో సృష్టికర్త పరోక్షంగా కనిపిస్తునే ఉన్నాడు. ఎలాగైతే ఒక కళాఖండాన్ని బట్టి దాని కళాకారుని ప్రతిభను నిర్ధారించగలమో అచ్చం అదేవిధంగా సృష్టిలోని ప్రతి సృష్టిరాశీ ఆయన శక్తియుక్తులను ప్రదర్శిస్తుందో. అయితే అలాగని సృష్టిలోని దెనినీ ఆయనతో సమానంగా భావించకూడదు కదా! అటువంటప్పుడు దేవునిలోని ' కొన్ని లక్షణాలు ' అవికూడా 'అసంపూర్ణం'గా యేసు కలిగి ఉన్నందుకు యేసు ఎలా దేవుడైపోతారు ? ఒకవేళ ఆ కొన్ని మరియు ఆ అసంపూర్ణ లక్షణాల ఆధారంగా యేసును దేవుడ్ని అంగీకరించటం తప్పదంటే దానికి ముందు సకల సృష్టినీ దేవునిగా అంగీకరించవలసివస్తుంది. అప్పుడది నేటి హిందూ సమాజవు అద్వైత సిద్ధంతాన్ని అంగీకరించినట్లవుతుంది. ఇది సాధ్యమా?
అసలు రక్షకుడు ఎవరు ?
(1 కొరింథీ//1: 24) ఎలాగైతే దేవుని మహిమను ఆయన కళాచాతుర్యాన్ని, ఆయన జ్ఞానాన్ని తన సృష్టిలో కొద్దికొద్దిగా పెట్టాడో అలాగే యేసుకూడా దేవుని సృష్టియే కనుక అతనిలోనూ కొన్ని మహిమా పూర్వక ప్రత్యేకతలను పెట్టాడు. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
(కొలస్సీ//2: 9-10)క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునైయున్నారు. ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; ఆయన యందు మీరు పరిపూర్ణులైయున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు.
పై వాక్యాలలో యేసులోని దేవుని ప్రత్యేకతలు ఎలా చూపించడుతున్నాయి ? అని ప్రశ్నిస్తే అంతకు ముందు వాక్యాల ప్రకారం సర్వసృష్టిలో దేవుని ప్రత్యేకతలు చూపబడి నట్లేనన్నది సమాధానం. అలాగే దేవుని ప్రత్యేకతలలోని ఒక ప్రత్యేకత 'రక్షణ!'. దీని గురించి పరిశుద్ధ గ్రంధం ఏమని తెలియజేస్తుందో గమనించగలరు .
(యెషయా 43: 11) నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.
పై వాక్యం ప్రకారం ఒక్క యెహోవా దేవుడు తప్ప ఎవ్వడూ రక్షకుడు కాడని సుస్పష్టం ఆవుతుంది. మరొక వాక్యాన్ని గమనించగలరు.
(యెషయా 43: 3) యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడ్నైన నేనే నిన్ను రక్షీంచువాడ్ను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను.
సర్వసృష్టికీ రక్షకుడైన యెహోవా తండ్రి ఇశ్రాయేలు వర్గానికి రక్షకుడనని ప్రకటిస్తున్నాడు. నిజమే ఏ సందర్భంలో తన ఆ సామర్థ్యాన్ని ఎవని కొరకు వినియోగిస్తున్నాడో దాని నిమిత్తం మాట్లాడటం జరుగుతుంది. అలాగే దేవుడు పై వాక్యంలో మాట్లాడుతున్నాడు. పైన పేర్కొన్న మొదటి వాక్యం ప్రకారం ఒక్క యొహోవా మాత్రమే అసలు సిసలు రక్షకుడు . ఇక ఆయిన తప్ప భవిష్యత్తులో ఏ రక్షకుడూ ఉండబోడని. 
ఇదిగో! యేసుకూడా రక్షకుడే! కాబట్తి దేవుడు!
పరిశుద్ధ బైబిలు గ్రంథాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొనక దానిని పాక్షికంగా చదివి, ఎవనికి తోచిన ఆలోచన ప్రకారం వారు అర్ధాలను చెప్పుకుంటూ పోవటం బైబిలు గ్రంథాన్ని అపహాస్యం చేయటమే అవుతుంది. ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.
 (లూకా 2: 11) దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు
పైవాక్యాన్ని ఆధారంగా చూపి కొందరు యేసుకు లేని దైవత్వాన్ని అంటగట్టటానికి ప్రయత్నిస్తుంటారు. కారణం ఏమంటే యెహోవాను రక్షకుడని గ్రంథం చెబుతుంది. అలాగే యేసునూ రక్షకుడని చెబుతుంది. కాబట్టి యేసే యెహోవా! అని అనాలోచితంగా తీర్మానించటం జరుగుతుంది. యేసును రక్షకుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్పిందని యేసు దేవుడైపోతే ఈ క్రింది వాక్యల సంగతి ఏమిటి ?
 (న్యాయాధిపతులు 3: 9) ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనవెల యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను.
(2వ రాజులు 13: 5) కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశాయేలు వారు సిరియనుల వంశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థానములు కాపురముండిరి.
ఈ రెండు వాక్యాల ప్రకారం ఇశ్రాయేలీయుల కోరకు యేసును ఏ విధంగా రక్షకునిగా నియమించాడో అలాగే గతంలో కూడా వారికొరకు అనేక రక్షకులను నియమించి ఉన్నాడని స్పష్టం అవుతుంది. ఇంకా ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.
(ఓబద్యా 1: 21) మరియు ఏఎశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సియోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాదియగును.
ఈ వాక్యం ద్వారానూ ఈ లోకంలో ఎందరో రక్షకులు పుడతారని తేటపడుతుంది. అటువంటప్పుడు యెహోవా ఒక్కడు రక్షకుడూగా ఉండి, ఆ తరువాత ఆ యెహోవాయే యేసుగా అంటే రక్షకునిగా అవతరించాడు. కనుక యేసు దేవుడు అని అంటున్నారు. అదే నిజమైతే మిగతా అనేక రక్షకుల సంగతి ఏమిటి? రక్షకుడు అన్న పేరునుబట్టి  యేసు దైవం అయిపోతే అదే రక్షకుడనే పేరుగలవారు అనేకులున్నారు కదా! మరి వారందరినీ దైవాలుగ ఒప్పుకోవటం సాధ్యమా? కాదు. అటువంటప్పుడు రక్షకుడు అన్నందుకు యేసు దైవం ఎలా కాగలరు?  బైబిలు గ్రంథాన్ని ప్రశాంతంగా ధ్యానించగలరు .  
యేసును దేవునిగా ప్రకటించే నేటి బోధకులు ఆయనను గూర్చి ప్రత్యక్ష శిష్యులకంటే మరియు పౌలుకంటే అధిక జ్ఞానం కలిగి ఉన్నారా?
యేసుకు ఉన్న ఈ ప్రత్యేకతల ఆధారంగా అతనికి లేని దైవత్వాన్ని అంటకట్టడానికి నేడు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రత్యేకతలు యేసు ప్రత్యక్ష శిష్యుడైన యూదాకు తెలియవా? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
(యూదా 1: 25) తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందములో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ (యెహోవా) దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమెన్.
అలాగే పౌలు చెబుతున్నది కాస్త గమనించగలరు.
(1 తిమోతి 4: 10) మనుష్యులందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల (యెహోవా) దేవునియందు మనము నిరీక్షణ నుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుచున్నాము.
(తీతుకు 3: 4-5) మన రక్షకుడైన (యెహోవా) దేవునియుక్క దయయు, మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగాకాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
ఈ వాక్యాలలో అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే-క్రీస్తును యేసుగా అంటే రక్షకునిగా యూదా అర్ధంచేసుకున్నప్పటికీ మానవులందరినీ మరియు విశ్వాసులందరినీ రక్షించువాడు మాత్రం జీవముగల యెహోవా దేవుడే అని సాక్ష్యమివ్వటం. ఇంకా పౌలు విశ్వాసులను తొట్రిల్లకుండా కాపాడువాడు రక్షకుడైన అద్వితీయదేవుడేనని ప్రకటించటం. దీనిని బట్టీ యెషయా 13: 11 లో ' నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ' అన్న ప్రకటన ప్రకారం యేసు అనంతరం సువార్తను ప్రకటించిన ఆదిమ అపోస్తలులు యెహోవా మాత్రమే అసలు రక్షకుడు అన్న విశ్వాసం కలిగి ఉన్నారని తెలుస్తుంది. అందుకే వారంతా యేసును పాతనిబంధనలోని అనేక రక్షకులలోని ఒక రక్షకునిగా చూసారే తప్ప యేసును యెహోవా వంటి రక్షకునిగా వారు ఎన్నడూ ఎంచలేదని అర్థమవుతుంది.
రక్షకుడైన యెహోవయే యేసుగా అవతరించాడని భ్రమించేవారు తామే యేసును సరిగ్గా అర్థం చేసుకున్నామని అనుకుంటే, ఆదిమ అపొస్తలుల యేసుపట్లగల అవగాహనను ఏమనుకోవాలి? వారికి అపోస్తలత్వాన్ని ఇచ్చిన యేసు విజ్ఞతను ఏమనుకోవాలి. వారికంటే నేటీ బోధకులు ఆధిక  జ్ఞానులా?  
ఇవి చాలా గంభీరమైన ప్రశ్నలు. యేసుద్వారా నిత్యజీవం పొందాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ వాటికి సరైన సమాధానాలను తెలుసుకొని ఉండాలి. అబద్ధ బోధకులనుండి రక్షించి, ఆదిమ అపోస్తలుల ప్రకారం తను ఒక్కని మాత్రమే నిజమైన రక్షకునిగా విశ్వసించే సద్బుద్ధిని యెహోవా మనందరికీ కలగించు గాక! ఆలాగే యేసును అనేక సాధారణ రక్షకులలోని ఒక రక్షకునిగా విశ్వసించే వాక్యానుసారమైన విశ్వాసాన్ని నమ్మేధైర్యాన్ని కూడా మనందరికీ ప్రసాదించును గాక . ఆమెన్.

రక్షకుడైన రక్షకుడిని రక్షించు వాడెవడు!?

యేసే రక్షకుడు కనుక తమకు కలుగుతున్న కష్టాలు ఆపదలలో తమను కాపాడమని యేసునే వేడుకోండి అన్న ప్రచారం నేడు విపరీతంగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో యేసు విధానం ఏమిటి ? పౌలునోట వినండి.
(హెబ్రీయులకు 5: 7) శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను (యేసును) మరణము నుండి రక్షింపగల వానికి (యెహోవాకు) ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరించబడెను
పైవాక్యం ప్రకారం రక్షకుడైన యేసు తనను రక్షింపగలవాడిని వేడుకున్నారని స్పష్టం అవుతోంది. దీనినిబట్టి పౌలు యేసును సాక్షాత్తు రక్షకుడైన యెహోవాగా భావించలేదని తెలుస్తోంది. అందుకే సిలువ మరణం నుండి కాపాడమని అసలు రక్షకుడైన యెహోవా తండ్రిని వేడుకొని యేసు రక్షించబడ్డారని పౌలు చెబుతున్నాడు. కాబట్టి యేసు శిష్యులు, పౌలూ తమకు కలిగిన అపదల నుండి రక్షించమని యేసును కాక యేసు కాక యెహోవానే వేడుకున్నారు.
కాబట్టి ' యెహోవాను దేవునిగా – యేసును క్రిస్తు ' గా అంగీకరించిన నిజమైన క్రైస్తవులు కూడా తమకు కలిగిన ఆపదల నుండి రక్షంచమని ఒక్క యెహోవానే వేడుకోవాలి. ఎందుకంటే యేసు మరియు ఆదిమ అపోస్తలులు ఇంకా పౌలు సైతం అలాగే చేశారు. వారి ఆదర్శమే మనందరికీ శిరోధాయం కావాలి . తద్వారా మాత్రమే నిత్యజీవము ప్రాప్తిస్తుంది. దానికి విరుద్ధంగా యేసునుగాని, పరిశుద్ధాత్మనుగానిలేక మరెవనినైనా సరే రక్షించమని వేడుకుంటే నిత్యమరణమే గతి అవుతుంది. కారణం అలా వేడుకొనటం అన్యత్వం మరియు  బైబిలు వాక్యానికి విరుద్ధం కనుక. యేసును అనేక రక్ష కులలోని ఒక రక్షకునిగా అంగీకరించి, అసలైన రక్షకునిగా ఒక్క యెహోవాను మాత్రమే అంగీకరించే వాక్యానుసారమైన జ్ఞానం  మనందరికీ కలుగునుగాక! ఆమెన్.

5. యేసు అబ్రాహాము కంటే ముందు న్నారు…. కాబట్టి దేవుడా?

యేసుకు లేని దైవత్వాన్ని ఆపాదించటానికి ప్రయత్నిస్తుంటారు. ఒక్క ఈ విషయలోనే కాదు, విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించినప్పుడు, ఏ విషయంలోనైనా పడరాని పాట్లు పడక తప్పదు. కొందరు క్రైస్తవ పండితులు ఆలాంటి విఫలయత్నాలలోని ఒక ప్రయత్నం ఈ క్రింది వాక్యం విషయంలో చేస్తుంటారు. గమనించగలరు.
(యోహాను 8: 50) యేసు – అబ్రాహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
యేసు పలికిన పై వాక్యపు సందర్భాన్ని తెలుసుకోవాలంటే ఎనిమిదవ అధ్యాయము ప్రారంభం నుండీ చదవాలి. ఆ వచనాలలో ' నామాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను '(యెహాను 8: 51) అని యేసు చెబుతారు. దానికి యూదశాస్ర్తులు, పరిశయ్యులు పెడార్థాన్ని తీసి అబ్రహాము ఇంకా ఇతర ప్రవక్తలు చనిపోయారు. అలాంటప్పుడు నీ మాటను గైకొనే వాడు ఎన్నడూ చనిపోడని చెబుతున్నావేమిటి ? అంటే నీకు దెయ్యం పట్టింది యేసును అతిఘాటుగా విమర్శించారు. నా మాటను అంగీకరించినవాడు మరణము పొందడన్నది నిజానికది ఆత్మీయ మరణం గురించి యేసు చెప్పారు. కాని శాస్ర్తులు ఆ మాటకు  కావాలని బుద్ధిపూర్వకంగా శారీరక మరణంగా తీసుకుని యేసును విమర్శించారు.  
ఈ నేపథ్యంలో యేసు కుత్సిత బుద్ధిగల యూదుల నషాళానికి అంటుకునేలా కావాలనే ' నేను అబ్రాహాము పుట్టక మునుపే ఉన్నాను ' అని గట్టి చురకనంటించారు. ఆ దెబ్బను తట్టుకోలేక యూదులు మరింత మండిపడ్డారు.  
అయితే యేసులాంటి ఒక బాధ్యతాయుతుడైన వ్యక్తి ఆ విధంగా చెప్పటం సమంజసమా? ఇంకా ఆ విధమైన మాట యేసు దేని ఆధారంగా చెప్పారు ? అన్న రెండు ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతాయి. వాటిలో మొదటి ప్రశ్నకు సమంధానం ఎమిటంటే – దుష్టులైన యూదశాస్త్రులు యేసును నానా యా తనలకు గురిచేశారు. రోమను ప్రభుత్వం దృష్టీలో యేసును ఒక నేరస్తుడుగా నిరూపించటానికి వారు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు . అలాగే యేసు సరళమైన సువార్తను వక్రీకరించి, దానికి పెడర్థాలు తీసి, ప్రజలను అయోమయానికి గురిచేసి యేసు శిష్యరికంలో రాకుండా ఆడ్డగించేవారు. అలాంటి తరుణంలో వక్రబుద్ధికల యూదులతో యేసు ఆ విధంగా మాట్లాడటం సమంజసమే.
రెండవ ప్రశ్న యేసు - ' అబ్రాహాము పుట్టకముదే నేనున్నాను' అని చెప్పటం సమంజసమా? అన్నది. అలా చెప్పటం నూటికి నూరు శాతం సమంజసమే అదెలాగో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు .
(ఎ ఫెసీయులకు 1: 6) మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలె నని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన (యెహోవా) క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
ఈ పై వచనాన్ని పౌలు చెప్పి ఉన్నాడు. ఈ వచనం ప్రకారం – మనము అనగా నాటి పౌలు, అతని సంఘపు విశ్వాసులు. ఇంకా చెప్పాలంటే ఈనాటి క్రీస్తు యథార్థ అనుచరులు కూడా. దేవునిచే ఎప్పుడు ఏర్పరచుకోబడ్డారు ? 'జగత్తు పునాది వేయబడక మునుపే!' ఇది దేవుని సంకల్పానికి సంబంధించిన విషయం. ఈ విషయం యథార్థం కూడా. ఈ దృక్పథం ఆధారంగానే యేసు - ' అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నాను ' అని చెప్పగలిగారు. ఇదీ అసలు వాస్తవం. 
ఈ వాస్తవాన్ని విడచి దేవునిచే క్రీస్తుగా నియమించబడిన యేసుకు దైవత్వాన్ని ఆపాదించటం కోసం అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని యేసు చెబుతున్నారు కదా! మరి ఆ విధంగా ఎవరైనా చెప్పారా? లేదు! ఒక్క యేసే ఆ విధంగా చెప్పారు అంటే ఆయన దేవుడు కనుక అని తీర్మానిస్తుంటారు కొందరు.
అబ్రాహాము పుట్టుకకు పూర్వం యేసు ఉన్నారు కనుక యేసును దేవుడుగా గుర్తించాలంటే మరి జగత్తు పునాది వేయంబడక మునుపే దేవుని చేత ఏర్పరచుకోబడిన వారి పరిస్థితి ఎమి కావాలి ? చెప్పండి. వారూ దైవాలా ? కాదా! అలాగే యెసు కూడా దేవుడు కాదు.

6. యేసు మృతులలోనుండి లేచారు….. కాబట్టి దేవుడా?

యేసుకు దైవత్వాన్ని అంటగట్టటానికి పడే ప్రయాసలో భాగంగా ఎన్నెన్నో సాధారణ విషయాలను అసాధారణంగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. అలాంటి విఫలయత్నాలలో యేసు మృత్యువును జయించారు కాబట్టి దేవుడు అన్నది ఒకటి. ఇంతకు ఈ విషయం గురించి బైబిలు గ్రంథం ఏమంటుందో క్రింది వాక్యాలలో గమనించగలరు.
(అపో//కా//2: 24) మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు (యెహోవా) మరణవేదనలు తొలగించి ఆయనను లేపేను
(అపో//కా//2: 32) ఈ యేసును దేవుడు (యెహోవా) లేపెను; దీనికి మేమందరము సాక్షులము.
(అపో//కా//4: 10) మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసినదేమనగా, మీరు శిలువ వేసినట్టియు, మృతులలో నుండి దేవుడు (యెహోవా) లేపినట్టియు నజరేయుడైన యేసు క్రీస్తు…
(అపో//కా//5: 30) మీరు మ్రానున వ్రేలాడవేసి సణరించిన యేసును మన పితరుల దేవుడు (యెహోవా) లేపెను.
(అపోస్త//కా//17: 31)…మృతులలోనుండి లేపబడిన క్రీస్తు…
మనప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని (యెహోవా) (రోమా 4: 24) యందు విశ్వాసముంచిన మనును…
(రోమా 7: 4)…మృతులలోనుండి లేపబడిన క్రీస్తు …
(రోమా 8: 11) మృతులలోనుండి యేసును లేపినవాని…
(రోమా 8: 11) అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, నదేవుడు (యెహోవా) మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షించబడుదువు.
(1వ//కోరింథీ//15: 4) లేఖనముల ప్రకారము (యేసు) మూడవ దినము లేపబడెను.
(1వ//కోరింథీ//15: 12) క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటించుచుండగా…
(1వ//కోరింథీ//15: 15) క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటించుచుండగ దేవుడు (యెహోవా) క్రీస్తును లేపెనని, ఆయనను గూర్చి మేము సాక్ష్యమిచ్చి యున్నాము గదా!
(1వ//కోరింథీ//15: 20) ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు.
(ఎఫిసియులకు 1: 20) ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి…
పై పేర్కొన్న వాక్యాలన్నింటిలో దేవుడు మరణ వేదనలు తోలగించి
·        ఆయనను లేపెను
·        యేసును దేవుడు
·        దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను
·        యేసును మన పితరుల దేవుడు లేపెను
·        క్రీస్తు మృతులో నుండి లేపబడి యున్నాడు
లాంటి వాక్యభాగాలన్నీ, స్వథా శక్తితో లేవలేని యేసు చనిపోతే, స్వీయశక్తితో లేపగలిగే వాడైన యెహోవా యేసును లేపినట్లు తెలియజేస్తున్నాయి. అయితే లేచినవాడు గొప్పవాడా ? లేపినవాడు గొప్పవాడా ? లేపిన వాడే గొప్పవాడన్నది జగమెరిగిన సత్యం. మరి యెసు సమాధానం ఏమిటో ఈ క్రింది వాక్యాలను గమనించగలరు .            (యెహాను 14: 28) తండ్రి నాకంటే గొప్పవాడు…
దీనిని బట్టి యేసు మృత్యుంజయుడు అని నమ్మటంప్రకటించటంవాక్యవిరుద్ధం కాదా ? యేసు బోధకు వ్యతిరేకం కాదా? అలాంటి వ్యతిరేక బోధనలును అనుసరించే వారికి రక్షణ లభించటం అసాధ్యం. యేసు ప్రభోదిత సత్య సువార్తనునమ్మి, అనుసరించే సద్భాగ్యాన్ని ఆ సర్వశక్తిగల యెహోవ దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్ .

7. యేసు పూజించ బడ్డారు… కాబట్టి దేవుడా?

దేవుని గురించి బోధించటానికి వచ్చిన వారినే దేవునిగా చిత్రించే దురాచారం అనాదిగా వస్తున్నదే! దానికి ఆధారం ఏమిటి ? అని ప్ర్రశ్నిస్తే – ఆ సర్వ శక్తిగల దేవునికి మరియు ఆయన పంపగా వచ్చిన పరిశుద్ధులకు మధ్య ఏవేవో ' కొన్ని పోలికల' ను చూపటం జరుగుతుంది. వాస్తవానికి  ఒకనితో పోల్చాలంటే – మొదటి వానిలో ఉన్న ' కోన్ని పోలికలు ' మాత్రమే కాదు, ' అన్ని పోలికలు ' రెండోవానిలో తప్పనిసరిగా ఉండి తీరాలి. కనీస జ్ఞానం  ఉన్నవారైనా దీనిని అర్ధం చేసుకోగలరు. అయితే యేసుకు లేని దైవత్వాన్ని ఆపాదించటానికి ప్రయత్నిచేవారు – ఈ క్రింది వారు నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువు (యేసు )ను చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. (మత్తయి 2:10, 11)

పైవాక్యంలో పశివాడైన యేసు ముందు ' తూర్పు దేశ జాఇనులు ' – ఒకటి సాగిల, పడినట్లు మరియు రెండు పూజించినట్లు ఉంది. కనుక మనం కూడా యేసు పట్ల విగ్రహాల ముందు సాగిలపడి, పూజించటంలో తప్పేమిటి ? అన్నది కొందరి వాదన. అలాగైతే ' గొప్ప గొప్ప ధర్మశాస్త్ర పండితులైన శాస్త్రులు  పరిసయ్యులూ ' అదే యెసును ఒకటి దూషించారని మరియు రెండు తిరస్కరించానికూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనమూ యేసుపట్ల అలాగే ప్రవర్తించవచ్చునని తీర్మానించగలమా? కాదుకదా!
యేసు క్రీస్తు పట్ల మనం ఎలా ప్రవర్తించాలి ? ఎలా ప్రవర్తించకూడదు ? అన్నది నిర్ధారించటానికి అంతిమ ప్రమాణం – ఒకటి యేసు ప్రత్యక్ష శిష్యులైన ఆదిమ అపోస్తలులు మరియు రెండు పౌలు మాత్రమే! వారిని కాక, ఎవరిని ప్రమాణంగా తీసుకున్నా అది ధర్మవిరుద్ధం వాక్య విరుద్ధం అవుతుంది.
యేసును సాగిలపడి, పూజించిన ఆ జ్ఞానులు  యేసుబోధ విన్నవారా ? లేదు. యేసు బోధను వినని వారిని అనుసరించటం మార్గవిహీనమే అవుతుంది. జ్ఞానులు  పూజించారు కాబట్టి మనం కూడా పూజించాలని అనుకోవటం పొరపాటు ఎందుచేతనంటే ? తనను గురించి వాస్తవికత జ్ఞానులకు తెలియబడ లేదని యేసు స్వయంగా తెలియజేస్తున్న విషయాన్ని ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.
(మత్తయి 11: 25) ఆ సమయుమున యేసు చెప్పినదేమనగా – తండ్రీ, ఆకాశమునకు భామికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ (తనకు సంబంధించిన) సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను .
పైవాక్యం ప్రకారం – యేసు నిజమైన అనుచరులు కాదలచిన ప్రతి ఒక్కరూ ' తూర్పు దేశ జ్ఞానులనో, గొప్ప గొప్ప ధర్మశాస్త్ర పండితులైన శాస్త్రులనో పరిసయ్యులనో' కాదు అనుసరించ వలసింది, ఇక, పూజించటం అనేది గౌరవానికి సూచనే తప్పా! ప్రార్థించటానికి పర్యాయపదం కాదు. ఎందుచేతనంటే – యేసు చేత ప్రేమించబడి, తన అనంతరం తాను ప్రకటించిన దేవుని సువార్తను ప్రజలకు అందించటానికి యేసుచే అధికారికంగా నియ్తమించబడిన శిష్యులు – తమ జీవితం లో చెయ్యమని ప్రజలలో ప్రచారం చేసిన సందర్భమూ పరిశద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు.

ప్రార్థించటం అనే ప్రక్రియ మాత్రం ఒక్క యెహోవాతో మాత్రమే కలిగి ఉండాలి. ఎందుచేతనంటే – సకల ప్రవక్తలు పరిశుద్ధులతోపాటు యేసుకూడా ఆ యెహోవాను మాత్రమే ప్రార్థించిన సన్నివేశాలు మరియు ఆ యెహోవాను మాత్రమే ప్రార్థించమని తన శిష్యులను ఆదేశించిన సంఘుటనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. అయితే దానియేలు విషయములో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమంటుందో ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.
(దానియేలు 2: 46) అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను
పైవాక్యం ఉన్నదికూడా బైబిలులోనేకదా ! అలా అని దానియేలును పూజించవచ్చా! ? కాదుకదా! అటువంటప్పుడు యేసును పూజించటం ఎలా సాధ్యం ? ఈ మధ్య కోందరు యేసును పూజించనివారు అజ్ఞానులని అంగీకరించవలసి ఉంటుంది! దేవుడు క్షమించుగాక. ఎందుకంటే – వారిలోని ఏ ఒక్కడూ ఏనాడూ యేసును పూజించి ఉండలేదు ! సర్వ శక్తిగల దేవుడైన యెహోవా మనందరినీ అబద్ధ బోధకుల బోధలనుండి నుండి కాపాడి, పరిశుద్ధ బైబిలు మరియు యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రబోధనల ప్రకారం నడిపించును గాక. ఆమేన్ ! 












3 comments:

  1. YOU ARE OUTSIDER and WE ARE INSIDERS. You speak out of your study and knowledge we believe Jesus as Lord because we know Him personally and experienced His life. There is quite a lot of difference in your words and our faith. If Jesus is not God then who is He? If Jesus is "Rooh Allah", is ROOH of Allah not God? Why creating confusion? Atheists are better than you to understand the concept of God.

    ReplyDelete
  2. YOU ARE OUTSIDER and WE ARE INSIDERS. You speak out of your study and knowledge we believe Jesus as Lord because we know Him personally and experienced His life. There is quite a lot of difference in your words and our faith. If Jesus is not God then who is He? If Jesus is "Rooh Allah", is ROOH of Allah not God? Why creating confusion? Atheists are better than you to understand the concept of God.

    ReplyDelete
  3. Hello...are you praying in the name of Moses, or in the name of Jesus..

    ReplyDelete