Tuesday, February 4, 2014


ఇస్లాం ఎలా స్వీకరించాలి ???
"లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ ర్రసూలుల్లాః "

ఇస్లాం స్వీకరించడానికి కలిమాను  (సద్వచనమ్) మనస్పూర్తి గా చదవాలి 
అంటే  "లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ ర్రసూలుల్లాః " అని సాక్ష్యం చెప్పాలి

ఇస్లాం పరిధిలో ఒక వ్యక్తి "లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ ర్రసూలుల్లాహ్" పవిత్ర వచనాన్ని అని మనస్పూర్తి గా సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఇక మీద ముస్లిం గా పరిగణించబడుతాడు 

ఈ వచనంలో కేవలం రెండు వాక్యాలు ఉన్నాయి.
1. లా ఇలాహ ఇల్లల్లాహ్ (తౌహీద్- దేవుని ఏకత్వపు వచనము)
2. ముహమ్మదుర్ ర్రసోలుల్లాహ్ (రిసాలత్- దైవ దౌత్య వచనం)

 అల్లాహ్ అంటే ఎవరు ?
        భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని
ఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో , లెక్కా తీసుకుంటాడో.
ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు
అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం. కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు) కాని, పీర్లు కాని, బాబాలు కాని మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం'

"లా ఇలాహ ఇల్లల్లాహ్" అంటే...?

అల్లాహ్ తప్ప ఇతరులెవరూ ఆరాధ్య దైవాలు కారు. ఆయనకు తప్ప ఇతరులకు దైవత్వం లేదు. ఆయన ఆరాధనలలో మరెవరికీ భాగ్యస్వామ్యం లేదు.
ఆయనే సృష్టికర్త, యజమాని, పాలకుడు, పోషకుడు. ఆయన అధికారాల్లో, ఔన్నత్వంలో, గుణగణాల్లో ఆరాధనల్లొ వేరెవ్వరికి బాగస్వామ్యం లేదని మనస్పూర్తిగా భావించి సాక్షం ఇవ్వడం. దీనినె "తౌహీద్" అంటారు. "తౌహీద్" కు మూడు కోణాలు ఉన్నాయి, అవి :
1. తౌహీదె రుబూబియత్
2. తౌహీదే ఉలూహియత్
3. తౌహీదె అస్మా వ సిఫాత్.
1. తౌహీదె రుబూబియత్
సమస్త సృష్టిని సృష్టించినవాడు కేవలం అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించడం. ఆయన ఏది చేయాలనుకున్న కేవలం "అయిపో" అని ఆజ్ఞాపిస్తే చాలు. అది అయిపోతుంది. ఆయన ఆజ్ఞ లేనిదే చెట్టునుండి ఆకు కూడా రాలదు. ఆయనే సృష్టికి యజమాని, పాలకుడు, నడుపించువాడు, ఆయనే మానవునికి జీవన్-మరణాలను ప్రసాదిస్తాడు.
(సూర యూనుస్ 31 వ వాక్యం) వారిని అడుగు: ''ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దానినుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?'' వారు: ''అల్లాహ్!'' అని తప్పకుండా అంటారు. అప్పుడను: ''అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?''

"తౌహీదె రుబూబియత్" కు వ్యతిరేకం "షిర్క్ ఫిర్-రుబూబియత్". అంటే స్ప్రుష్టించడంలో, పాలనలో, పోషణలో, అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించడం.
2. "తౌహీదే ఉలూహియత్"
" ఆరాధనకు అర్హుడు కేవలం సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. ఆరాధనలను, మొక్కుబడులను స్వీకరించెవాడు ఆయనే. మన నమాజులు, ఉపవాసాలు, ఖుర్బానీలు, దుఆలు, సమస్త ఆరాధనలు, ఆయన జీవన్మరనాలు ఆయనకే వర్దిస్తాయి". అని విశ్వసించటం.
ఆయన తన ఆరాధనలలో మద్యవర్తిత్వం అక్కరలేనివాడు. విశ్వాసులకు- అవిశ్వాసులకు మద్య తేడ ఏమిటంటే విశ్వాసులు కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమె నమ్మి, ఆయన కొరకు ధన, ప్రాణ, శారీరక, సకల ఆరాధనలు చేస్తారు. అవిశ్వాసులు సృష్టికర్త ఒక్కదాని నమ్మినప్పటికి ధన, ప్రాణ, శారీరక సకల ఆరాధనల్లో అనేకులను బాగాస్వాములుగా లేదా మద్య వర్తులుగా చేస్తారు, ఇది "షిర్క్ ఫిర్-ఉలూహియత్" (ఆరాధనల్లొ సాటి కల్పించటం) గా పరిగణించబడుతుంది.
3. తౌహీదె అస్మా వ సిఫాత్
అల్లాహ్ గుణగణాల్లో, నామాల్లో వేటినైతే అల్లాహ్ తనకోసం ప్రత్యేకించి ఎన్ను కున్నాడో (అవి పవిత్ర ఖుర్ఆన్ హదీసుల్లొ వివరించబడినవి) అవి కేవలం అల్లాహ్ కొరకే విశ్వసించాలి.
(సూర అష్-షూరా 11 వ వాక్యం) " ఆయనను పోలినది ఏదీలేదు, మరియు ఆయన సర్వం వినేవాడు, చూసేవాడు."

"తౌహీదె-అస్మా-వ-సిఫాత్" లేకుండా "తౌహీదె-రుబూబియత్" ,"తౌహీదే -ఉలూహియత్" స్వీకరించబడవు. ఇతరుల్లో అల్లాహ్ కు చెందిన గుణాలున్నాయని విశ్వసించడం "షిర్క్ ఫి అస్మా-వ-స్సిఫాత్" అవుతుంది.

1. ఈ మూడు కోణాల్లో దేనిని నిరాకరించి, అల్లాహ్ తో పాటు ఇతరులకు సాటి కల్పించినా, అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధి నుండి దూరమై అవిశ్వాసానికి పాల్పడినవాడవుతాడు. అల్లాంటి వ్యక్తి నరకాగ్నిలొ ఆహుతి అవుతాడు.
" అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారని నమ్మకం కలిగి ఉండే వ్యక్తి మరణిస్తే అతడికి శాశ్వత నరకాగ్ని ప్రవేశం తప్పదు".
2. బహు దైవారాధన (షిర్క్) వలన పున్యకార్యాలను వృధా అవుతాయి. పవిత్ర ఖుర్ఆన్ అల్లాహ్ ఇలా నేలవిస్తున్నాడు.
(సూర అత్-తౌబహ్ 17 వ వాక్యం) "బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్య-తిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయ టానికి) అర్హులుకారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమైపోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు."

'ముహమ్మదుర్- ర్రసూలుల్లాహ్' అంటే..
'ముహమ్మదుర్- ర్రసూలుల్లాహ్'కలిమాలో ప్రస్తావించబడిన వాక్యానికి రెండవ భాగం. 'ఇది రిసాలత్' కి (దైవ దుత్యునికి) సంభందించినది. అంటే ముహమ్మద్ (సల్లలాహు అలైన సల్లమ్) అల్లాహ్ ప్రవక్త అని అర్ధం. మనం రిసాలత్ వచనాన్ని విశ్వసిస్తున్నత్ల్అయితే అందుకు ప్రతిగా మన జీవితంలో అడుగడు గునా మహా ప్రవక్త ముహమ్మద్ (స ) ఏదైనా ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను శిరసావహించాలి, ఆయన(స ) తెలిపే ప్రతి విషయమ అల్లాహ్ ఆదేశానికి అనుగుణంగా ఉంటుంది. పవిత్ర ఖుర్ ఆన్ లో అల్లాహ్ ఇలా సేవిస్తున్నారు:
(అన్-నజ్మ్ : 3,4 )" మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వ'హీ) మాత్రమే"

మన సకల ఆరాధనలకు కేవలం ప్రవక్త(స ) చూపిన మార్గం లోనే పూర్తి చేయాలి. దానినే "సున్నత్" (ప్రవక్త సంప్రదాయం) అంటారు.

'సున్నత్' (ముహమ్మద్ (స ) పద్ధతి)

"సున్నత్" అంటే ప్రవక్త(స) ఆచరణ, పద్ధతి. దాని పరిధిలో ప్రవక్త(స) పలుకులు, ఆచారాలు, నడవడికలు వస్తాయి. ప్రతి ముస్లిం తన ఆచరణలను ప్రవక్త (సల్లలాహు అలైన సల్లమ్) సున్నత్ (పద్ధతి) ప్రకారం ఆచరించాలని విధిగా నిర్ణయించబడింది. దాని గురించి అల్లాహ్ పవిత్ర ఖుర్ ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు :
(అల్-'హష్ర్ : 7 ) అల్లాహ్‌ తనప్రవక్తకు ఆనగరవాసుల నుండి ఇప్పించినదానిలో (ఫయ్‌అ'లో), అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. అది మీలో ధనవంతులైనవారి మధ్యనే తిరగ కుండా ఉండ టానికి, ఇలా నిర్ణయించ బడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసు కోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్షించటంలో చాలా కఠినుడు.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైన సల్లమ్) ఇలా సెలవిచ్చారు :
" ఎవరైతే నా పద్దతిని వఎతిరేకిస్తారో, అన్గికరించారో అతనికి - నాకు మధ్య ఎటువంటి సంభందం ఉండదు. ధర్మంలో లేని విషయాలను సృస్తిన్చాకూడదు. అటువంటి ఆచరణలు స్వికరించ బడవు. వాటిని బిద్అత్ అంటరు. వాటిని సృష్టించే వారికీ నరకమే శరణం అవుతుంది"
' బిద్అత్', దాని వివరణ
ఇస్లాం ధర్మంలో నవీన పోకడలను సృస్టించదాన్ని "బిద్ అత్" అంటారు. పవిత్ర ఖుర్ ఆన్, హదీస్ ప్రకారం ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదైనా కార్యాన్ని సృష్టించి పుణ్యంగా భావించి చేయడం - దీనినే 'బిద్అత్' అంటారు. ఇలాంటి ఆచరణలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి సంభందం లేదు. ఇలాంటి ఆచరనలు చేసేవారు మార్గ భ్రష్టులవుతారు. అగ్నికి ఆహుతులవుతారు. మహా ప్రవక్త(స ) ఇలా సెలవిచ్చారు:
(సహిహ్ ఇబ్నె ఖుజైమా : 3/1785) : "ఇస్లాం ధర్మంలో ప్రతి క్రొత్త పోకడ 'బిద్అత్' అవుతుంది. ప్రతి బిద్అత్ మార్గ భ్రష్టత అవుతుంది. ప్రతి మార్గ భ్రష్టత నరకానికి దారి తీస్తుంది."

( సహిహ్ బుఖారి : 2697) : " ఎవారైతే మా ఈ ధర్మంలో 'లేని పోనీ ఆచారాలు' (బిద్అత్ లు) సృష్టిస్తాడో అతను దుత్కారి. "

'బిద్అత్' వలన విశ్వసి హీనమైన అపవాదాలకు గురువుతాడు. అల్లాహ్ సన్నిధి నుండి, పవిత్ర ఇస్లాం ధర్మం నుండి దూరమవుతారు. 'బిద్అత్' వ్యక్తిని 'తౌబా' నుండి దూరం చేస్తుంది. అందుకే మనం వాటికి దూరంగా ఉండాలి. ప్రవక్త (స) మార్గంలో నడవాలి.
ప్రవక్త (స) విశిష్టత, ప్రత్యేకతలు
అంతిమ ప్రవక్త(స)కు అనేక ప్రత్యేకతలు, వరాలు ప్రసాదిoచబడ్డాయి.
1. అల్లాహ్ ప్రవక్త (స) కు మునుపు ఎందరినో ప్రవక్తలుగా పంపించాడు, కానీ ముహమ్మద్ (స) ను సర్వమానవాలికి ప్రవక్తగా చేసాడు.
(అల్-అ'అరాఫ్ : 158 ) (ఓ ము'హమ్మద్!) వారితో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరివైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యా ధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు; ఆయనే జీవన్మ రణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ను మరియు ఆయన సందేశహరుడు నిరక్ష రాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుస రించండి, అప్పుడే మీరు మార్గదర్శ కత్వం పొందుతారు!"

కాబట్టి ఇహలోకంలో ప్రతి మానవునికి ప్రవక్త (స) ను విశ్వసించడం తప్పనిసరి. ప్రవక్త (స) ఒక హదీసులో ఈ విధంగా ప్రస్తావించారు :
" ఎవరి అధినంలో అయితే నా ప్రానముందో ఆ దేవుని సాక్షిగా! ఏ వఎక్తి అయినా (యుదుడైన, క్రైస్తువుడైన) నా గురించి ప్రస్తావన విని కూడా నన్ను విశ్వసించక పోతే అతడు నరకవాసి. (ముస్లిం )
2. ముహమ్మద్(స ) అంతిమ దైవ ప్రవక్త. అయన తరువాత ప్రళయం వరకు ఏ ప్రవక్తా రారు. ఆయనే ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు.
అంతిమ దైవ దౌత్యం పై విశ్వాసం
ప్రవక్త ముహమ్మద్ (స) అంతిమ ప్రవక్త. అయన తరువాత ఎవరు ప్రవక్త కాజాలరు. ఒకవేళ ఎవరైనా ప్రవక్తగా ప్రకటించుకుంటే అతను బూటకపు ప్రవక్త అనబడతాడు. ఎందుకంటే అల్లాహ్ పవిత్ర ఖుర్అన్ లో ముహమ్మద్ (స) అంతిమ ప్రవక్త అని తెలియజేసారు:
(అల్-అ'హ్'జాబ్ : 40) (ఓ మానవులారా!) ము'హమ్మద్‌ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్‌ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్‌యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు. 
" ఖాత్మున్" అంటే "సిలు" అని అర్ధం. సిలు అనేది ఒక ప్రక్రియ పూర్తయిన తరువాత పడుతుంది. ముద్ర పడిన తరువాత ఆ పని అన్ విధాలుగా పుర్తయినట్లే. అంటే ప్రవక్త ముహమ్మద్ (స) రాకతో దైవ దౌత్య పరంపరకు సిలు పడిపోయింది. కనుక మన ప్రవక్త ముహమ్మద్ (స ) తరువాత ఎవరైనా ప్రవక్తగా ప్రకటించుకుంటే అతను అసత్యవాది, మోసగాడు.
అల్లాహ్ మానవులందరికీ 'కలిమా' ను అర్ధం చేసుకొని మనసారా పతించే భాగ్యాన్ని ప్రసదిన్చుగాక...! ఆమీన్ !

No comments:

Post a Comment