الله الذي خلقكم ثم رزقكم ثم يوميتكم ثم يحيكم هل من شركايكم من يفعل من ذلكم من شيي سبحانه و تعالى عما يشركون
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
ఆ అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని మరణాన్ని ఇస్తాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయ గలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు. (ఖుర్'ఆన్ ; 30:40)
ఎవరైతే భూమినీ, ఆకాశాన్ని, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడో ఆయనే మనకు ఉపాధిని, జీవితాన్ని, మరియు మరణాన్ని సమకూరుస్తున్నాడు. ఈ పనులు చేయగల వారెవరైనా మీరు ఆరాధించే మిధ్యా దైవాలు ఉన్నారా? నిస్సందేహంగా ఒక్క అల్లాహ్ తప్ప ఎవరూ పై పనులు చేయలేరు.
ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) మొదటి వివాహం హజ్రత్ ఖదీజా (ర జి) తో జరిగింది. ఆమె అప్పుడు 40 ఏళ్ల వితంతు మహిళ. హజ్రత్ ఖదీజా (ర.జి) మక్కాలో ఉత్తమ స్త్రీ గా, నీటి నియమాలతో బ్రతికే మహిళగా పేరు పొందారు. ప్రవక్త (స.అ. సం) కన్నా ఆమె 15 సంవత్సరాలు వయసులో పెద్దవారు. ఆమె స్వయంగా పెళ్లి ప్రతిపాదన ప్రవక్త (స.అ.సం) వద్దకు పంపారు. ఆమె వయసులో పెద్ద వారైనా, వితంతువైనా ప్రవక్త (స.అ.సం) ఆ ప్రతిపాదనను అంగీకరించారు. అప్పట్లో మక్కాలో ప్రవక్త (స.అ.సం) కావాలనుకుంటే అనేక మంది అందమైన కన్యలు ఆయన్ను వివాహమాడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన హజ్రత్ ఖదీజా (రజి) ను, తన కన్నా 15 సంవత్సరాలు పెద్దవారైనా ఆమెను వివాహం చేసుకున్నారు.
హర్జ్రత్ ఖదీజా (ర. జి) తో ఆయన పాతికేళ్ళపాటు సంతోషకరమైన సంసార జీవనాన్ని గడిపారు. ఆయనకు పుట్టిన పిల్లలందరూ, ఒక్కరు తప్ప హజ్రత్ ఖదీజా (ర.జి) వల్లనే కలిగారు. ఆమె జీవించి ఉన్నంత కాలం ఆయన (స.అ. సం) మరో మహిళను వివాహమాడ లేదు. క్రీ.శ 619 డిసెంబెర్ మాసంలో హజ్రత్ ఖదీజా (ర.జి) మూడు రోజులు అనారోగ్యంతో బాధపడి తుది శ్వాస విడిచారు. ఆమె మరణం ప్రవక్త (స.అ.సం) కు తీవ్ర విషాదకారణమైంది. తనకు అత్యంత ప్రియమైన జీవిత భాగస్వామి మరణంతో ఆయన చాలా దుఃఖించారు. ఆయన హజ్రత్ ఖదీజా (ర.జి) ను ఎంతగా ప్రేమించేవారంటే, ఆమె మరణం తర్వాత ప్రవక్త
(స. అ.సం) మిత్రులు ఆయన వద్దకు వచ్చి మరలా వివాహం చేసుకోవలసిందిగా సలహా ఇచ్చినప్పుడు ఆయన ఇలా అన్నారు:
"ఖదీజా తర్వాత మళ్ళీ పెళ్లి గురించి ఎలా ఆలోచించగలను? ఆమె జ్ఞాపకాలు నాకు చాలు. ఆమె నాకు చాలా నమ్మకస్తురాలు. ప్రజలు నాకు సహాయం చేయడానికి భయపడి నప్పుడు ఆమె నాకు సహాయంగా నిలబడింది. ఆమె నాకు ఉత్తమమైన తోడు. ఆమె నా పిల్లలకు తల్లి" అన్నారు.
ఆయన వివాహమాడిన రెండవ మహిళ హజ్రత్ సౌదా (ర.జి) కూడా వితంతు మహిళ. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ను ప్రారంభ కాలంలో విశ్వసించి ఇస్లాం స్వీకరించిన వారిలో హజ్రత్ సౌదా
(ర. జి), ఆమె భర్త కూడా ఉన్నారు. ఈ దంపతులు మక్కాలో వేధింపులు భరించలేక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) సలహాతో అబిసీనియాకు వలస వెళ్ళారు. వారు తిరిగి వస్తున్నపుడు ఆమె భర్త మరణించారు. ఆమెకు ఆశ్రయం అవసరమైంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ప్రారంభించిన ఇస్లామీయ ఉద్యమంలోనే ఆమె భర్త మరణించారు కాబట్టి సహజంగానే ఆమె భర్త మరణాంతరం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) వద్దకు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఆమెను వివాహమాడి ఆశ్రయమిచ్చారు. వివాహ సమయంలో హజ్రత్ సౌదా (ర.జి) వయస్సు 55 సంవత్సరాలు. ఉన్న ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) కుమార్తెల బాగోగులు ఆమె చూసుకునేవారు. ఆమెకు మొదటి భర్త ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) వల్ల ఆమెకు సంతానం కలుగ లేదు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) మూడవ భార్య పేరు హజ్రత్ ఆయిషా (ర. జి). ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) కు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు అయిన అనుచరుడు, మొదటి ఖలీఫా, ప్రారంభంలో ఇస్లాం స్వీకరించిన అతికొద్ది మందిలో ఒకరైన హజ్రత్ అబూబక్ర్ (ర.జి) కుమార్తె ఆమె. ఈ వివాహం వెనుక ముఖ్యమైన కారణాల్లో ఒకటి అబూబక్ర్ (ర.జి) తో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) బంధుత్వ సంబంధం ద్వారా మైత్రిని మరింత ధృడతరం చేసుకోవాలని భావించడం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) కు సహాయంగా నిలబడి, శత్రు దాడుల నుంచి కాపాడిన వారిలో అబూబక్ర్ (ర.జి) అత్యంత ముఖ్యమైన వారు. రెండవ కారణమేమంటే ఆయిషా (ర.జి) వంశం రీత్యా గౌరవోన్నతులు, మేధో సంపద ఉన్న వంశానికి చెందినవారు. వివాహం సమయంలో ఆమె వయసు 15 సంవత్సరాలు. చాలా మంది చెబుతున్నట్లు ఆమె వయస్సు ఆరేళ్ళు లేదా తొమ్మిదేళ్ళు లేదా పన్నెండేళ్ళు కాదు. ఇందులో ఎలాంటి వివాదం ఇప్పుడు లేదు.
వివాహ వయస్సుకు సంబంధించిన సంప్రదాయాలు సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాలానుగుణంగా ఇవి చాలా మారాయి. ఏడవ శతాబ్దానికి చెందిన అరబ్బు సమాజంలో ఉన్న సంప్రదాయాల ప్రకారం చిన్న వయస్సులో వివాహం, వయస్సులో తేడా ఇవి అడ్డంకులు కావని గమనించాలి. వెయ్యేళ్ళకు పైబడిన కాలం తర్వాత వివాహ వయస్సు విషయంలో వచ్చిన మార్పులను ప్రవక్త కాలంలో కూడా ఉండాలని చెప్పడం సముచితం కాదు. ఆ కాలంలో ఉన్న సంస్కృతీ సంప్రదాయాల నేపధ్యంలో చూడాలి. ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే ఈ వివాహం విషయంలో విమర్శ అన్నది కూడా ఆధునిక కాలంలోనే వచ్చింది. అప్పట్లో మక్కాలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ను అనేక విషయాల్లో విమర్శించిన శత్రువులు సయితం ఈ వివాహం విషయంలో అప్పట్లో మక్కాలో ఎలాంటి విమర్శలు చేయలేదు. మధ్య యుగాల్లో క్రైస్తవ ప్రాంతాల్లో కూడా ఈ వివాహం పై ఎలాంటి విమర్శలు లేవు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం)కు ఆయిషా (ర.జి) కు మధ్య ఉన్న సంబంధం ప్రవక్త (స. అ. సం) కు ఇతర భార్యలతో ఉన్న సంబంధం వంటిది కాదు. ఈ సంబంధం చాలా వరకు విద్యాజ్ఞానాలకు సంబంధించిన సంబంధం. ఆయన ఆమె పట్ల చాలా శ్రద్ధ చూపేవారు. ఎందుకంటే ఆమె ఆయనతో స్వేచ్చగా మాట్లాడేవారు, వాదించేవారు. ఆయన వద్ద తెలివైన, ఆసక్తికలిగిన విద్యార్ధినిగా ఆమె ధార్మిక విద్యాజ్ఞానాలు పొందారు. ఆమె ద్వారా 2210 ముఖ్యమైన హదీసులు (ప్రవక్త ప్రవచనాలు) ముస్ల్లిమ్ సమాజానికి లభించాయి. ఆమె దార్మికజ్ఞానం, న్యాయపరమైన పరిజ్ఞానం విషయంలో చాలా పేరుపొందారు. చాలా మంది ముస్లిం పండితులు ఆమెను సంప్రదించేవారు. ఆమెకు సంతానం కలుగలేదు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఈ ఇద్దరు భార్యలు, అంటే హజ్రత్ సౌదా (ర.జి), హజ్రత్ ఆయిషా (ర.జి) లతో ఐదారేళ్ళ కాలం వరకు ఉన్నారు. అంటే ఆయన యాభయ్యారు సంవత్సరాల వయసుకు చేరుకునే వరకు. అప్పటి వరకు ఆయన మరో వివాహం చేసుకోలేదు. యాభయ్యారు సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వరకు ఆయన తొమ్మిది వివాహాలు చేసుకున్నారు. ఇందులో ప్రతి ఒక్క వివాహానికి ప్రత్యేక కారణాలున్నాయి. ఆయన జీవితంలో చివరి మూడు సంవత్సరాల కాలంలో ఆయన ఎవరినీ పెళ్లాడలేదు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) నాల్గవ భార్య హజ్రత్ హఫ్సా (ర.జి). ఈమె ముక్కోపిగా పేరుపొందారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) కు అత్యంత ఆప్తుడైన సహచరుడు హజ్రత్ ఉమర్ (ర.జి) కు కుమార్తె. బద్ర్ యుద్ధంలో ఆమె భర్త చనిపోయారు. హజ్రత్ ఉమర్ (ర.జి) కు కుమార్తె పట్ల చెప్పలేనంత ప్రేమ. ఆయన వితంతువుగా తన కుమార్తెను చూడలేక పోయారు. తన స్నేహితుడు హజ్రత్ ఉస్మాన్ (ర.జి) ను తన కుమార్తెను వివాహమాడ వలసినదిగా కోరారు. కాని ఆయన ఆ కోరికను మన్నించలేదు. హజ్రత్ అబూబక్ర్ (ర.జి) ను కోరినా ఆయనా తిరస్కరించారు. బహుశా వారిద్దరికీ హజ్రత్ హఫ్సా (ర.జి) కోపం గురించి ముందుగానే తెలిసి ఉండ వచ్చు. హజ్రత్ ఉమర్ (ర.జి) నిరాశగా ఉండడాన్ని చూసి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) స్వయంగా ఆయన కుమార్తెను వివాహమాడారు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఆరవ భార్య పేరు హజ్రత్ ఉమ్మె సల్మా (ర.జి). ఈమె కూడా వితంతువే. బనూ ఫిరాస్ తెగకు చెందిన కులీన వంశం నుంచి వచ్చారు. ప్రారంభ కాలంలోనే ఇస్లాం శ్వీకరించిన తెగ ఇది. ఆమె, ఆమె భర్త ఇద్దరు ఇస్లాం శ్వీకరించారు. భర్తతో పాటు ఆమె మదీనా వలసపోవడానికి సిద్ధమైనప్పుడు మక్కాలోని శత్రువులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె తన బిడ్డను తీసుకు వెళ్ళడానికి లేదని మక్కా ఖురైషీలు పేచీ పెట్టారు. అందువల్ల ఆమె భర్తతో పాటు మదీనా వెళ్ళలేక పోయారు. మక్కాలో ముస్లిములను అప్పటి శత్రువులు ఎలా వేధించేవారో ఈ సంఘటన బట్టి కూడా తెలుస్తుంది. కొంతకాలం తర్వాత ఆమె ఎలాగో తప్పించుకుని మదీనా చేరుకున్నారు. కాని ఆమె మదీనా వలస వచ్చిన కొంతకాలానికి ఆమె భర్త అమరుడిగా ఇస్లాం కోసం ప్రాణాలు అర్పించారు. అప్పుడు ఆమె నలుగురు పిల్లల తల్లికాగా గర్భంలో మరో శిశువు. ఆమె తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురైయ్యారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఆమె పట్ల అత్యంత సానుభూతి ప్రకటించారు. ఆమెను వివాహమాడి ఆశ్రయమిచ్చారు. కాని ఆత్మాభిమానం అపారంగా ఉన్న ఉమ్మె సల్మా మొదట పెళ్ళికి సంకోచించారు. మొదటి భర్త వల్ల పిల్లలు ఉన్నారన్నది ఆమె సంకోచం. ఆ పిల్లలను తన స్వంత పిల్లలుగా చూసుకుంటానని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) ఆమెకు హామీ ఇచ్చారు. ఆయన చూపిన అభిమానం ఆమెను కదిలించింది. ఆ విధంగా ఈ వివాహం జరిగింది.
యభైయ్యారు సంవత్సరాల వ్యక్తి నలుగురు పిల్లల గర్భవతిని పెళ్ళాడడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉంటుంది. ప్రేమాభిమానాలు, సానుభూతి తప్ప మరేముంటాయి? ఈ పెళ్ళిలో గమనించవలసిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఉమ్మె సల్మా మక్కాలో అత్యంత శక్తివంతమైన బనీ మక్తూమ్ తెగకు చెందినవారు. అప్పట్లో ఈ తెగ ఇస్లాంకు ప్రధాన శత్రువుల్లో ఒకటి. ఈ వివాహం ద్వారా అత్యంత పలుకుబడి, శక్తి సామర్ధ్యాలున్న బనీ మక్తూం తెగకు ఇస్లాంకు దగ్గరయ్యేలా చేశారాయన.
ప్రవక్త ఏడవ భార్య హజ్రత్ జైనబ్ (ర.జి). ఈ వివాహాన్ని ఇస్లాం విమర్శకులు గొప్ప ఆయుధంగా భావిస్తారు. ఇస్లాంపై ప్రవక్త (స.అ.సం) పై దాడికి ఈ వివాహాన్ని కూడా వాడుకుంటారు. ఇది నైతికంగా తప్పుడు వివాహమని అంటారు. దానికి రెండు కారణాలు చూపిస్తారు. ఒకటి: హజ్రత్ జైనబ్ (ర.జి) ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) దత్తత తీసుకున్న కుమారుడి భార్య. అంటే ఆమె ఆయనకు కుమార్తె వంటిది కదా అని అంటారు. రెండవ కారణం : ప్రవక్త (స.అ.సం) ఆమెకు విడాకులిప్పించి తనను వివాహమాడే లా చేశారన్న ఆరోపణ. ఈ ఆరోపణలు, విమర్శలు అన్నీ అర్ధ రహితమన్నది కాస్త నిశితంగా గమనిస్తే తెలుస్తుంది.
హజ్రత్ జైద్ (ర.జి) చిన్నప్పుడు ఒక బానిసగా ప్రవక్త (స.అ.సం) వద్దకు వచ్చారు. ఆయనకు స్వేచ్చ ప్రసాదించి తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. ఆయనకు హజ్రత్ జైద్ (ర.జి) అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్లనే తన జైనబ్ (ర.జి) తో వివాహం జరిపించారు. కాని ఈ వివాహం వల్ల జైనబ్ (ర.జి) పెద్దగా సంతోషించలేదు. ఎందుకంటే, జైద్ (ర.జి) స్వేచ్చ పొందిన బానిస, ఆమె ఒక కులీన కుటుంబానికి చెందినా స్త్రీ. సాంఘికంగా హోదాలో ఉన్న ఈ తేడా వారి సంబంధంపై ప్రభావం చూపింది. వీరిద్దరి విడాకులకు ప్రవక్త (స.అ.సం) కారణమన్న ఆరోపణ సత్య దూరమే కాదు, దుష్ట బుద్ధితో కూడుకున్న ఆరోపణ. ఎందుకంటే హజ్రత్ జైనబ్ (ర.జి) ను ప్రవక్త (స.అ.సం) చాలా కాలం నుంచి ఎరుగును. ఆమె స్వయంగా ఆయనకు మేనత్త కూతురు. బాల్యం నుంచి తెలిసిన స్త్రీ. ఆమె కొత్తవారేమీ కాదు. ఆమె మొదటి భర్తను కోల్పోయినందు వల్ల ప్రవక్త (స.అ.సం) ఆమెకు పునరావాసం కల్పించాలనుకున్నారు.
ఆమె అందచందాలకు ఆయన నిజంగా అంత ఆకర్షితుడై ఉంటె ఆమె వివాహం హజ్రత్ జైద్ (ర.జి) తో ఎందుకు జరిపిస్తారు. జైద్ (ర.జి) తో వివాహం తర్వాత ఆమె సంతోషంగా లేరు. తనను ఒక బానిసకిచ్చి వివాహం జరిపారన్న అసంతృప్తి ఆమెకు ఉండేది. అందువల్ల జైద్ (ర.జి) ను తక్కువ గా చూసేది. అవమానకరంగా వ్యవహరించేది. జైద్ (ర.జి) ఈ విషయాలను అనేక సార్లు ప్రవక్త (స.అ.సం) వద్ద ఫిర్యాదు చేశారు. ప్రవక్త (స.అ.సం) సహనం వహించాలని చెప్పేవారు. కాని ఆమె వ్యవహార శైలి భరించలేక జైద్ (ర.జి) ఒకరోజు ఆమెకు విడాకులిచ్చేశారు. జైనబ్ (ర.జి) బంధువులు స్వయంగా ఈ విడాకుల తర్వాత ప్రవక్త (స.అ.సం) వద్దకు వచ్చి జైనబ్ (ర.జి) ను వివాహమాడాలని ఒత్తిడి తెచ్చారు. కాని ప్రవక్త (స.అ.సం) అంగీకరించలేదు. ఈ వివాహం తానూ ఆలోచించడం కూడా సాధ్యం కాదని అన్నారు. ఆమె ఎంతైనా దత్త కుమారుడిగా ప్రకటించిన వ్యక్తి భార్య. ఎందుకంటే అప్పటి అరబ్బు తెగలలో దత్త పుత్రుడు స్వంత కుమారుడితో సమానంగా భావించడం జరిగింది. కాని తర్వాత అవతరించిన దివ్య ఖుర్'ఆన్ వాక్యాలు ఈ నైతిక అసంబద్దతను కొట్టివేశాయి. దత్త పుత్రుడు స్వంత పుత్రుడు కాడని ప్రకటించాయి. ఆ విధంగా హజ్రత్ జైనబ్ ను వివాహమాడే అల్లాహ్ యే స్వయంగా ప్రవక్త (స.అ.సం)కు ఇచ్చాడు. ఈ వివాహం వెనుక ఉన్న మరో ముఖ్య ఉద్దేశం సుదీర్ఘకాలంగా అరబ్బు సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న దత్తత సంబంధాలు, దత్తపుత్రుడు స్వంత పుత్రుడితో సమానమన్న భావనలను తొలగించడం. వారసత్వ వ్యవహారాలను చక్క బరచడం. వివాహ సమయంలో జైనబ్ (ర.జి) వయసు 38 సంవత్సరాలు.
ప్రవక్త (స.అ.సం) ఎనిమిదవ భార్య పేరు హజ్రత్ జువేరియా (ర.జి). అత్యంత శక్తివంతమైన బనూ ముస్తలక్ తెగ నాయకుడు హారిస్ కుమార్తె జువేరియా (ర.జి). ఆమె మొదటి వివాహం అదే తెగకు చెందిన యువకుడితో జరిగింది. ఆమె తండ్రి, భర్త ఇద్దరు ప్రవక్త (స.అ.సం) పట్ల తీవ్రమైన వైరం వహించిన వారు. యుద్ధంలో ఆమె భర్త మరణించాడు. ఆమె యుద్ధ ఖైదీగా బందీ అయ్యారు. ఆమె తండ్రి సంకోచిస్తూనే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వద్దకు వెళ్ళాడు. "నేను నా తెగ ప్రజలకు నాయకుడిని, నా కుమార్తె ఒక పని మనిషిగా ఉండడం నాకు చాలా సిగ్గుచేటు. కాబట్టి ఆమెను విడుదల చేయండి. అందుకు పరిహార దానం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను." అని అన్నాడు. ప్రవక్త (స.అ.సం) జవాబిస్తూ : నిర్ణయాన్ని జువేరియాకు వదిలేయడం మంచిది కదా! అన్నారు. హారిస్ తన కుమార్తె వద్దకు వెళ్లి ప్రవక్త (స.అ.సం) ఆమె నిర్ణయానికే వదిలేశారని చెప్పాడు. ఆమెను తనతో రమ్మన్నాడు. ఆమె తానూ ప్రవక్త (స.అ.సం) సేవలో ఉండడానికే ఇష్ట పడుతున్నానని, కాబట్టి ప్రవక్త (స.అ.సం) తనను వివాహమాడడమే మంచి పద్ధతని చెప్పారు. ఈ సమాధానం విని హారిస్ కూడా చాల సంతోషించాడు. ప్రవక్త (స.అ.సం) అంగీకరించి, ఆమె విడుదలకు అవసరమైన పరిహార దానం తానే చెల్లించి ఆమెను విడుదల చేసి వివాహమాడారు. ఈ వివాహం వల్ల బనూ ముస్తలక్ తెగ ముస్లిములకు దగ్గరయ్యింది. ఈ వివాహం వల్ల శాంతియుత, స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి.
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) తొమ్మిదవ భార్య ఉమ్మేహబీబా (ర.జి). ఇస్లాం ప్రధాన శత్రువు అబూ సుఫియాన్ కుమార్తె ఆమె. మక్కాలో ఖురైషు సైన్యాలకు ఆయనే నాయకుడు. ఆయన భార్య హిందా. ఉమ్మె హబీబా ఆమె భర్త ఇరువురు ఇస్లాం స్వీకరించారు. ఇరువురి తల్లిదండ్రులకు ఇది నచ్చ లేదు. వేధింపులను తప్పించుకోవడానికి ఈ దంపతులు అబిసీనియాకు వలస వెళ్ళారు. అక్కడ ఆమె భర్త క్రైస్తవ్యం స్వీకరించాడు. కాని ఉమ్మె హబీబా (ర.జి) ఇస్లాంను వదలడానికి నిరాకరించారు. కాలక్రమేణా ఆమె భర్త విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. మద్యపానానికి బానిసై చివరకు మరణించాడు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి చూసి ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) చాల చింతించారు. ఆమెను వివాహమాడి ఆశ్రయమిచ్చారు. ఈ వివాహం వల్ల ఆమె కుటుంబం, వంశంలోని అనేక మంది ఇస్లాంకు దగ్గరయ్యారు. ముఖ్యంగా ఖురైషుల్లో ఒక పెద్ద తెగ బనూ అబ్దల్ షమ్స్ ఇస్లాం స్వీకరించడానికి ఈ వివాహం కారణమయింది. వివాహ సమయంలో ఆమె వయసు 38 సంవత్సరాలు. ఆమె తన జీవితంలోని ప్రతిక్షణం ప్రవక్త (స.అ.సం) సేవకే అంకితమయ్యారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) తర్వాత రెండు దశాబ్దాల వరకు ఆమె జీవించి ఉన్నారు. డెబ్భై మూడేళ్ళ వయసులో మరణించారు. మొదటి భర్త వల్ల ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వల్ల ఆమెకు సంతానం లేదు.
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) పదవ భార్య పేరు సఫియా (ర.జి). ఖైబర్ యుద్ధంలో ఆమె యుద్ధ ఖైదీగా వచ్చారు. ఆమె తల్లిదండ్రులు యూదులు. రెండు ముఖ్యమైన యూద వంశాలకు చెందినవారు. సఫియా (ర.జి) మొదటి వివాహం ప్రముఖ యూదకవి బిన్ మష్కాంతో జరిగింది. కాని వారిద్దరికీ పాడేది కాదు. చివరకు ఆమె భర్త విడాకులిచ్చాడు. ఆమె మళ్ళీ వివాహం చేసుకున్నారు. గొప్ప యోధుడిగా పేరున్న యువకుడిని వివాహమాడారు. కాని ఖైబర్ యుద్ధంలో అతడు మరణించాడు. ఆ యుద్ధంలో సఫియా (ర.జి) తండ్రి, కుటుంబంలోని ఇతర పురుషులు కూడా హతమయ్యారు. సఫియా (ర.జి) యూద్ధ ఖైదీగా బందీ అయ్యారు. సఫియా (ర.జి) ఆమె తండ్రి లాంటివారు కాదు. ఆమె చాలా కాలంగా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) సందేశాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఆమె చాల మంచి గుణాలున్న స్త్రీ. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) పట్ల తన తెగవారు తీవ్రమైన వైరం ఉన్నప్పటికీ ఆమెలో వైరం లేదు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఆమె గురించి విని ఉన్నారు. ఆమె ఆధ్యాత్మిక భావాల గురించి కూడా విని ఉన్నారు. తన భవిష్యత్తు మదీనా ముస్లిములతో ముడిపడాలన్న తన కలను ఆమె ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) కు చెప్పడానికి సంకోచించలేదు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఆమె చెప్పిన మాటలు విన్నారు. తర్వాత ఆమెకు రెండు ప్రత్యామ్న్యాయాలు చూపించారు. యుద్ధమహిళగా ఉండడం, తన ప్రజల వద్దకు తిరిగి వెళ్ళిపోవడం. లేదా ముస్లింగా మారి అక్కడ ఉండడం. సఫియా (ర.జి) ముస్లింగా మారి ముస్లిముల నాయకుడిని వివాహమాడడానికి ఇష్టపడ్డారు. ఆ విధంగా చేయడం వల్ల తన స్థాయి, యూద తెగలో తన హోదా రెండూ దెబ్బతినకుండా ఉంటాయని అభిప్రాయ పడ్డారు. "నేను దేవుడిని, దైవ ప్రవక్త (స.అ.సం) ను ఎన్నుకున్నాను అన్నారామె.
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఆమెను విడుదల చేసి ఆ తర్వాత కొంతకాలానికి వివాహం చేసుకున్నారు. విజేతలు తాము జయించిన భూభాగాల రాజుల భార్యలను, కుమార్తెలను వివాహమాడడం అన్నది ఇంతకూ ముందు నుంచి ఉన్నదే. ఇలాంటి వివాహాల ద్వారా యుద్ధ భీభత్సాన్ని కొంత తగ్గించడము, పరాజితుల మర్యాదను కొంతవరకు కాపాడడము రెండు ఉద్దేశాలు నెరవేరుతాయి.
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) జీవించి ఉన్నప్పుడు ఒకసారి హజ్రత్ ఉమర్ (ర.జి) ఆమెతో మీరు ఇంకా యూదులతో సంబంధాలు కొనసాగిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆమె "నేను శనివారాలు పాటించను, శుక్రవారాలు పాటిస్తానని" కరకుగా జవాబిచ్చారు. అయితే నేను నా యూద బంధువుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉన్నాను. ఇస్లాం దీన్ని నిషేధించలేదు అని కూడా చెప్పారు. హజ్రత్ ఉమర్ (ర.జి) నిరుత్తరుడై ఉండిపోయారు. ఆమెకు పిల్లలు లేరు. అరవయ్యేళ్ళ వయసులో తనువు చాలించారు.
మారియా (ర.జి) ఒక బానిసగా, అలెగ్జాండ్రియాకు చెందిన ఆర్చ్బిషప్ పంపిన కానుకగా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వద్దకు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఆమెకు స్వేచ్చ ఇచ్చి వివాహం చేసుకున్నారు. ఆమెను ఒక బానిసగా ఉంచుకోవడం అన్నది ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఎన్నటికీ చేసే పని కాదు. హజ్రత్ ఖదీజా (ర.జి) తర్వాత ఈమె వల్లనే ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) కు పిల్లలు కలిగారు. ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు ఇబ్రాహీం. కాని రెండేళ్ళ వయసులోనే మరణించాడు. పుత్ర శోకాన్ని ఆమె భరించలేక పోయారు. కొన్నేళ్ళకు ఆమె కూడా మరణించారు.
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) చేసుకున్న చివరి వివాహం మైమూనా కూడా వితంతువు. ఆమెకు అంతకు ముంది రెండు సార్లు వివాహమైంది. వివాహమైనప్పుదు ఆమె వయసు 51 సంవత్సరాలు. ఆమె చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వయసు 57 సంవత్సరాలు. ఈ వివాహానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆమె హలాలియ్యీన్ తెగకు చెందినవారు. ఆమె తెగను ఇస్లాంలోనికి తీసుకురావడానికి ఆమెను వివాహం చేసుకోవడం మంచిదని ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) పినతండ్రి హజ్రత్ అబ్బాస్ (రజి) సలహా ఇచ్చారు. ఈ వివాహం తర్వాత అలాగే జరిగింది. హలాలియ్యీన్ తెగ యావత్తు ఇస్లాం స్వీకరించింది.
పైన పేర్కొన్న వివాహాలను పరిశీలిస్తే ఈ వివాహాల వెనుక ఎలాంటి శారీరక వాంచలు కనబడవు. గమనించవలసిన మరో ముఖ్యమిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) చేసుకున్న వివాహాలన్నీ ఒక్క హజ్రత్ ఆయిషా (రజి) తప్ప అందరూ అంతకు ముంది వివాహమైనవారే. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)తో వివాహం జరిగి నప్పుడు ఆ మహిళలందరూ నలభై, యాభై సంవత్సరాల వయసులో ఉన్నవారే. అంటే ఎవరు యవ్వనంలో ఉన్నవారు కాదు. ఇందులో ఎవరు శారీరకంగా సౌందర్యవతులు కూడా కాదు. వీరందరూ విడాకులు పొందిన లేదా వితంతువులైన మహిళలు. చాలా మందికి అంతకు ముందు భర్తల వల్ల పిల్లలు కూడా ఉన్నారు. వివాహానికి కన్యలు కావాలనుకునే సమాజాల్లో ఇది ఒక పెద్ద మార్పును తీసుకు వచ్చే అంశం.
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) చేసుకున్న వివాహాల కారణంగా ఆయన నైతికత, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సందేహించేవారు ఎవరైనా గాని ఈ క్రింది ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వెదకవలసి ఉంటుంది.
1. పాతికేళ్ళ వయసులో ఎన్నో అందమైన యువతులు మక్కా నగరంలో ఉన్నప్పటికినీ, తన కన్నా పదిహేను సంవత్సరాలు పెద్దదైన వితంతు మహిళను ఎందుకు వివాహమాడారు? 2. ఒకవేళ ఆయనలో శృంగార విశృంఖలత ఉంటె ఆయన యవ్వనంలో అందం ఐశ్వర్యం ఉండి కూడా ఎందుకు వివాహాలు చేసుకోలేదు? 3. ఆయన మొదటి భార్య జీవించి ఉన్నంత కాలం, అంటే ఆయన యాభై సంవత్సరాల వయసు దాటే వరకు మరో వివాహం ఎందుకు చేసుకోలేదు? 4. ఎలాంటి ప్రత్యెక అందచందాలు లేని వితంతువులు, విడాకులు పొందిన నిస్సహాయ స్త్రీలను ఎందుకు తర్వాత స్వీకరించారు? 5. సర్వసుఖాలు, విలాసాలు అనుభవించే అధికారం ఉన్నప్పటికీ ఎందుకు అత్యంత నిరాడంబరంగా పేదగా బతికారు? 6. ఆయన జీవితం చివరి భాగంలో, ఇస్లామీయ కార్యభారం ఎంతో ఎక్కువగా ఉన్న ఐదేళ్ళ కాలంలో, స్వయంగా ఆయన ఉద్యమం, ఆయన సందేశ ప్రచారం క్లిష్ట దశలో ఉన్నప్పుడే ఈ వివాహాలు ఎందుకు చేసుకున్నారు? 7. విమర్శకులు ఆరోపిస్తున్నట్లు కామ వాంఛల్లొ మునిగిపోయిన మాట వాస్తవమైతే ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఎలా ఉండ గలిగారు? ఈ వివాహాలు విషయలోలత్వం కారణంగా జరిగిన వివాహాలుగా భావించడమే పొరబాటు. ఈ వివాహాలు జరిగిన పరిస్థితులను నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే మనకు చాలా వాస్తవాలు అర్ధమౌతాయి.
NOTE : నిజం చెప్పాలంటే, ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారు ప్రవక్త కాదని నిరూపించడానికి ఏ విషయంలో దొరుకుతారా అని ఆనాటి బహుదైవారాధకులు అయిన మక్కా ప్రజలు ఎదురు చూసేవారు . ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) అధికభార్యలను కలిగి ఉండడం, చిన్న వయసు ఉన్న ఆయిషా (ర.జి) వారిని వివాహం చేసుకోవడం సామాజికంగా తప్పు అయితే ఆనాటి మక్కా ప్రజలు ఎందుకు ఆయన్నుఈ విషయంలో విమర్శించలేదు?
ఎందుకంటే, ఆ కాలంలో అధిక భార్యలు కలిగి ఉండడం అరబ్బు ప్రజల సంస్కృతి లో భాగంగా ఉండేది. అరబ్బులు అధిక భార్యలు కలిగి ఉండేవారు. ఇక ఆయిషా (ర) వారి విషయానికి వస్తే, వారి తండ్రి గారు మక్కాలో ఉన్న అతి తక్కువ మంది అక్ష్యరాసుల్లో ఈయన ఒకరు. ఇంకా మక్కా నగరంలో ఉన్న ధన వంతులలో ఈయన కూడా ఒకరు. హజ్రత్ అబూబక్ర్ (ర.జి) వారు అంత విద్యా వేత్త, ధనవంతుడు అయి ఉండి ఎందుకు గారాభంగా చూసుకున్న కూతురిని ఒక నిరక్ష రాస్యుడు, పేదవారు, అధిక వయసు కలిగినటువంటి ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వారికి ఇచ్చి వివాహం జరిపించారు?
వాస్తవాలను తెలుసుకోకుండా దైవ ప్రవక్తను హేళన చేయడం వారి మూర్ఖత్వానికి నిదర్సనం కాదా?
అజ్ఞానంతో దైవ ప్రవక్తను హేళన చేసేవారు దైవాగ్రహానికి గురికాక తప్పదు.
వివాహాలకు వెనుక కారణాలు:
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) లైంగిక వాంఛల పరిపూర్తి కోసం అనేక మందిని వివాహమాడడం ఇస్లామ్ శత్రువులు విమర్శిస్తూ, బురద జల్లుతూ తమ అజ్ఞానానికి చాటుకుంటూ ఉంటారు. ఎలాంటి అవగాహన లేకుండా తీర్పులు ఇచ్చేస్తుంటారు. ప్రవక్త (స.అ.సం) చేపట్టిన ఉద్యమ స్వభావం, నాటి పరిస్థితులు, ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) స్వయంగా జీవించి చూపించిన జీవనవిధానం, ఈ వివాహాలకు ముందు ఆయన బతికిన తీరు, ఈ వివాహాలు చేసుకున్న తర్వాత బతికిన తీరు, మక్కాలో ఆయన జీవితం, మదీనాలో ఆయన జీవితం వీటి గురించి ఏమాత్రం తెలియకుండానే ఆరోపణలు గుప్పిస్తుంటారు.
ప్రవక్త (స.అ.సం) చేసుకున్న వివాహాల్లో చాలా వరకు మదీనాలో ఉన్నప్పుడు జరిగాయి. ఈ వివాహాల వెనుక చాలా కారణాలున్నాయి. తెగలకు సంబంధించిన కారణాలు, రాజకీయ కారణాలు వీటి వెనుక ఉన్నాయి. ఆయన ఈ వివాహాలు చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఆయన వయసు యాభై ఐదు సంవత్సరాలు. వివాహం చేసుకున్నవారందరూ వితంతువులు, విడాకులు పొందిన మహిళలు. ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ 38 సంవత్సరాలకు పైబడినవారే. ఆయన 50 సంవత్సరాలు దాటిన తర్వాత విషయలోలత్వం, స్త్రీ వ్యసనం ప్రారంభించారని ఎవరన్నా చెప్పగలరా? అది కూడా తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నప్పుడు విషయలోలత్వంతో వివాహాలు చేసుకున్నారని ఆరోపించడంలో వివేకముందా ? అప్పట్లో ఆయన అనేక మంది శత్రువుల దాడుల మధ్య ఉన్నారు. అంతర్గతంగా మదీనాలో కపట విశ్వాసుల ద్రొహాలు, యూదుల కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇస్లామ్ శత్రువులు, ఖురైషులు వరుస దాడులు చేస్తున్నారు. మదీనా చుట్టూ వున్నా శత్రు తెగలు మదీనాకు తలపై వేలాడే కత్తిలా మారాయి. ఈ వాతావరణంలో రాత్రి ప్రశాంతంగా పడుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఒక సగటు మనిషి కూడా విలాసాలు, శారీరకవాంఛల గురించి ఆలోచించ లేనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) వంటి ఉత్తమ గుణగణాలున్నమనిషి ఇలాంటి ఆలోచనలతో వివాహాలు చేసుకున్నారని చెప్పడం ఎంత అవివేకం.
ఆయన వివాహమాడిన భార్యలలో చాలా మంది కులీన వంశాలకు, సంపన్న కుటుంబాలకు చెందినవారు. తమ తల్లిదండ్రుల ఇండ్లలో అత్యంత విలాస వంతమైన జీవితాన్ని గడిపిన వారు. కాని ప్రవక్త (స.అ.సం) తరచూ ఆకలి కడుపుతో ఉండే పరిస్థితి. ఉపవాసాలు పాటిస్తూ ఉండేవారు. ఆయన భార్యలకు నిత్యావసర వస్తువులు కూడా దొరికేవి కావు. ఆయన జీవితం చివరి దశలో సంపద ధనకనక రాశులు అన్ని ప్రానతాల నుంచి మదీనాకు వరదలా వచ్చేవి. ఇలా మదీనాకు సంపద పెద్ద ఎత్తున రావాడం, ఆ సంపదను మదీనా ప్రజలకు పంపిణీ చేయడం జరిగేది. ఆ సంపదలో కుటుంబానికి ఏదో నామ మాత్రంగా కొంత లేదా అసలు తీసుకోకపోవడం జరిగేది. ఇది చూసి భార్యలు తమకు ఆ సంపదల నుంచి తగిన స్థాయిలో ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్య ఖుర్'ఆన్ హెచ్చరిక గమనించదగ్గది.
"ప్రవక్తా! మీ భార్యలకు చెప్పండి, ఈ ప్రపంచ జీవితం, ఇక్కడి తళుకు బెళుకులు మీరు కోరుకున్నట్లయితే, రండి, మీకు కావలసిన భోగభాగ్యాలు అందిస్తాను, మీకు ఉచితమైన రీతిలో స్వేచ్చనిస్తాను."
అంటే, ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) తో జీవించడమంటే వారు పేదరికం, నిరాడంబర సాధారణ జీవితంతో తృప్తి పడాలి. లేదా తమకు కావలసిన ధనసంపదలు తీసుకుని ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)తో వేర్పడాలి. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) భార్యలు అందరు ఆయనతో ఉండడానికి, పేదజీవితం గడపడానికే ఇష్టపడ్డారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)ను విమర్శించేవారు ఈ వాస్తవాలు గుర్తించారా? కామకేళి , సుఖవిలాసాల జీవితాన్ని ఇష్టపడే వ్యక్తి ఇలాంటి గుణగణాలు, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడా? ఇలాంటి విమర్శలు చేస్తున్నవారు మొదట తమ స్వంత జీవితంలో తొంగి చూసుకోవాలి. తామెక్కడున్నారో గ్రహించాలి. తన ఒక్క సైగతో అపార ధనకనకరాశులు తన వద్దకు వచ్చే అధికారం కలిగి ఉన్నా అత్యంత నిరాడంబరంగా, పేదజీవితాన్ని గడిపిన ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ను వేలెత్తి చూపే నైతిక అర్హత తమకు ఎంత ఉందో లెక్కించుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) తన జీవితం ఎలా ఉండేదో, ఆయన జీవనశైలి ఎలా ఉండేదో అర్ధం చేసుకుని ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలి.
యేసు తండ్రి లేకుండా పుట్టాడు ...
కాబట్టి దేవుడా ?
'యెహోవా దేవుడు' లేక 'యెహోవాయే దేవుడు' లాంటి స్పష్టమైన ప్రకటనలు బైబిలు గ్రంధంలో అనేకంగా లభిస్తాయి. కాని 'ఏసే దేవుడు' అని కాక పోయినా కనీసం 'యేసు దేవుడు' అనే ఒక్క గాని ఒక్క ప్రకటన అయినా పూర్తి బైబిలు గ్రంధంలో ఏ కోశానా కనబదదు. అయినప్పటికీ యేసుకు దైవత్వాన్ని ఆపాదించటానికి అధిక శాతం క్రైస్తవ పండితులు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు దేవుడని 'మూడ్హంగా నమ్మలే తప్ప దానికి 'వాక్యానుసారం' అయిన ఆధారం కించిత్తు కూడా లభించదు. యేసు దైవత్వాన్ని నిరూపించడానికి చూపించే కారణాలు సుమారు ఏడు ఉన్నాయి. ఈ పుస్తకంలో వాటన్నిటి పై పరిశుద్ధ వాక్యం ప్రకారం చర్చించడం జరిగింది. వాటిలో ఒక కారణం ఆధారంగా యేసుకు దైవత్వాన్ని కనుక ఆపాదిస్తే బైబిలు ప్రకారం ఇంకా ఎందరెందరినో దైవాలుగా అంగీకరించ వలసి వస్తుంది. అంటే బైబిలు గ్రంధ పరిపూర్ణ అవగాహన లేని కారణంగానే యేసు దైవత్వపు భావన ఏర్పడుతుంది. కారణం ? యేసు కంటే అద్భుతమైన పద్ధతిలో జన్మించిన వారు బైబిలు గ్రంధంలో ఎందఱో ఉన్నారు!
ఒక స్త్రీకి బిడ్డ జన్మించాలంటే ప్రక్రుతి నియమాల ప్రకారం పురుషుని ప్రమేయం ఉండాలి. అతని పాత్ర లేకుండా బిడ్డ జన్మించడం అసాధ్యం. నిజమే కాని ఇది మానవుని శక్తి పరిధికి సంబంధించిన విషయం. అయితే మానవుడి శక్తి పరిమితం. కాని దైవ శక్తి అపరిమితం కదా! అలాంటి దైవాన్ని మానవ శక్తి పరిధికి దిగజార్చి అదే స్థాయిలో దైవకార్యాలను ఊహించడం జ్ఞాన రాహిత్యం.
సర్వ శక్తి మంతుడైన దేవుడు పదార్ధాన్ని, ఆ పదార్ధం ద్వారా అపరిమిత సృష్టిని చేయగల సమర్ధుడు. కాని మానవుడు పదార్ధాన్ని చేయలేడు . పదార్ధం ఉంటె దాని ద్వారా సృష్టి చేయగలడు . అది కూడా అతి పరిమితంగా మాత్రమే ! ఇది మనిషి తిరస్కరించలేని బలహీనత. యేసు పురుష ప్రమేయం లేకుండా జన్మించారు. కాబట్టి దేవుడు అని కొందరు తీర్మానించడానికి కారణం ఏమిటంటే - యేసు పుట్టుకలో దేవుని ప్రమేయం ఉంది కనుక అన్నది!
అంటే ఒక స్త్రీకి బిడ్డ కలగడంలో ఎవని ప్రమేయం ఉందొ అతని సంతానంగా ఆ బిడ్డను పరిగనించడం జరుగుతుంది. అలాగే యేసు జన్మించంలో దేవుని ప్రమేయం ఉంది కాబట్టి యేసు దేవుని సంతానంగా పరిగణిస్తున్నారన్న మాట.
ఆదాము, హవ్వాల పుట్టుకలో ప్రమేయం ఎవరిదీ?
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. ( ఆది కాండం ; 1:27)
అప్పుడు దేవుడైన యెహోవా ఆడామునకు గాఢ నిద్ర కలుగ జేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క తెముకలలో ఒకదానిని తీసి ఆ చోటు మాంసముతో పూడ్చి వేసెను. (ఆది కాండం ; 2:21)
పై రెండు వాక్యాల ద్వారా అర్ధం అయ్యేదేమిటంటే ఆదాము హవ్వాలైన మొదటి మానవ జంట పుట్టుకలో పూర్తిగా దేవుని ప్రమేయం ఉంది. కనుక ఆదాము హవ్వాలను దేవుని సంతానంగా పరిగణించవచ్చా? కాదు కదా! మరి అటువంటప్పుడు యేసు పుట్టుకలో దేవుని ప్రమేయం ఉంది కాబట్టి యేసును దేవుడు అనటం ఎంతవరకు సమంజసం?
ఇక భూమ్యాకాశాలు వాటి మధ్య ఉన్న సకల చరాచర సృష్టితాల జననానికి కారణం ఎవరు? దేవుని వాక్కు లేక దేవుని వాక్యము లేక దేవుని మాట లేక దేవుని ఆజ్ఞ అయితే దేవుని సృష్టి క్రమం రెండు విధాలుగా సంభవిస్తుంది.
1. ప్రక్రుతి నియమాలకు అతీతంగా అంటే 'దేవుని ఆజ్ఞ' ద్వారా
2. ప్రక్రుతి నియమాల ప్రకారం.
భూమిని - ఆకాశాలను వాటిలో సమస్తాన్ని ఏ వాక్శక్తితో కలిగించాడో అదే వాక్కు లేక ఆజ్ఞతో యేసునూ పుట్టించాడు ఆ దేవుడు.
ఆ వాక్యము శరీర ధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. (యోహాను; 1:14)
పై వాక్యం ద్వారా స్పష్టం అయ్యేదేమిటంటే - ఏ వాక్యమైతే భూమ్యాకాశాల నిర్మాణానికి దోహదమయ్యిందో ఆ వాక్యమే యేసు పుట్టుకకూ కారణ మయ్యిన్దన్నది 'మనందరి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింప లేదా!' అని మలాకి 2:10 తెలుపుతుంది. తండ్రి అయిన దేవుని వలన పుట్టినందుకు యేసు దేవుడైతే సకల చరాచర ప్రక్రుతి కూడా దైవం అయిపోతుంది. దేవుని శక్తిని ప్రస్తావిస్తూ యోహాను చెబుతున్న ఈ క్రింది విషయాన్ని గమనించగలరు.
అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోన తలంచ వద్దు. దేవుడు (యెహోవా) ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించ గలడని మీతో చెప్పుచున్నాను. (మత్తయి ; 3:8)
అంతటి శక్తి కలిగిన దైవం ఒక స్త్రీ ద్వారా పురుష ప్రమేయం లేకుండా ఒక శిశువును పుట్టించి నందుకు, ఆ శిశువును దైవ అస్తిత్వంతో సమానం అని, సాక్షాత్తు దైవం అని భ్రమించడం అంటే అది పక్కా అన్య పోకడే. ఈ సర్వ సృష్టిలోనిది ప్రతీది దేవుని వాక్ శక్తి ద్వారానే కలిగింది అయినప్పటికీ వాటిలోనిది ఏదీ దైవ సమానం కాదు కదా! మరి అటువంటప్పుడు అదే దేవుని వాక్ శక్తి ద్వారా పుట్టిన యేసు దైవ సమానం ఎలాగై పోతారు?
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) వివాహాలు
ప్రవక్త (స. అ. సం) వివాహాల్లో చాలా వరకు మదీనాలో ఉన్నప్పుడు జరిగాయి. ఈ వివాహాల వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలు, తెగలకు సంబంధించిన కారణాలు, రాజకీయ, సామాజిక కారణాలు వీటి వెనుక ఉన్నాయి.

No comments:
Post a Comment