Sunday, September 28, 2014

దేవుడు(GOD)అంటే ఏమిటి .....?

దేవుడు(GOD)అంటే ఏమిటి .....?
--------------------------------------------------------------------------------

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని 

సృష్టిస్తున్నారో

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని 

పోషిస్తున్నారో

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాని కి 

మరణాన్ని ఇస్తున్నారో

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్త జీవుల 

కర్మల లెక్క తీసుకుంటాడో.

 ఆయననే తెలుగు బాషలో దేవుడు అని,
                    సంస్కృతం లో సర్వేశ్వరుడు అని,
         ఇంగ్లీష్ బాషలో గాడ్ అని,
               హిబ్రూ  బాషలో యహోవా అని,
                 ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు
అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని 
అర్ధం.కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు), పీర్లు, బాబాలు,

మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని 

ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం'

కాని ఈ ప్రపంచం లోని ఏ మానవునై నా  , ఏ 
జంతువుకైనా ఏ సృష్టి పదార్ధానికయినా, ఏ వస్తువునయినా,
ప్రతిరూపాన్నికలిపించి దానికి దేవుడు అనే పదం  కాని, GOD అనే పదం 
కాని, యహోవా, అల్లాహ్ అనే పదాలు కాని ఉపయోగించకూడదు
------------------------------------------------------------------------------------
 దేవుడు ఒక్కడే ఆయనను వేరు వేరు బాషలలో వేరు వేరు పేర్లతో పిలిచారు 
 ------------------------------------------------------------------------------------
LanguageName ScriptName of the GodMeaning of the Name
SANSKRIT  सर्वेश्वर సర్వేశ్వరుడుసర్వానికి+నియామకుడు
అక్షర పరఃబ్రహ్మ.నాశనంకానట్టి+పరమండున్నట్టి+సృష్టికర్త
ఆది పరాశక్తిఆదిమం ఐన పరమందున్నసృష్టికర్త
TELUGUదేవుడుదేవుడుదేవుడు
ENGLISHGodGODGENERATOR+ORGANIZER+DISTROYER
HEBREWהאלYahova Eternal Power
ARABICالله అల్లాహ్ఆరాధనలకు అర్హుడుworthy to be worship

  1). దేవుడు అంటే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించే వాడు, సృష్టించే వాడు, ( GENERATOR )
(ఈ పదాన్ని సంస్కృతంలో బ్రహ్మ అని, అరబీ భాషలో ఖాలిఖ్ అని అంటారు )
2). సమస్తాన్ని పోషించే వాడు , పరిపాలించేవాడు, (ORGANIZER )
(ఈ పదాన్నే సంస్కృతం లో విష్ణు అని, అరబీ భాష లో 'రబ్' అని అంటారు)
3). సమస్తాన్ని నాశనం చేసేవాడు, మరణాన్ని ఇచ్చే వాడు, (DISTROYER)
(ఈ పదాన్నే సంస్కృతం లో రుద్రుడు అని, అరబీ భాషలో 'అల్ ఖహ్హార్' అని అంటారు)

NOTE:  G O D=GENERATOR+ORGANIZER +DISTROYER
నోట్: కాని ఈ బ్రహ్మ + విష్ణు + మహేశ్వరం అనే పదాలకు ప్రతిరూపాన్ని కల్పించి వేరు వేరు దైవాలుగా చేసారు.
(ఇవి దేవుడి ౩ కర్మలు, పనులు ( పుట్టించడం + పాలించటం +మరణాన్ని ఇవ్వటం )

(ఈ పేర్ల అర్ధం మనకి ఋగ్వేదం (2:1:3)లో కనిపిస్తుంది) కాని వాస్తవానికి దేవుడు ఒక్కడే
--------------------------------------------------------------------------------
ఎకం సత్ విప్రా బహుదా వదం తే

एकम सत विप्रा बहुदावदंते
                                         Rigveda(1:64:46)

దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు అనేకం
NOTE: దేవుడికి ప్రతిరూపం లేదు, ఆయనకు ప్రతిరూపం పెట్టి ఆరాధించడం గ్రంధాల ప్రకారం తప్పు .

నతస్య ప్రతిమ అస్థి नातस्य प्रतिम अस्थि (దేవుడికి ప్రతిమ లేదు)


శుద్ధమపోపవిద్ధం सुद्धमपोपविद्धम (ఆయన పరిశుద్దుడు)

నోట్: దేవుడికి రూపం లేదు అని చెప్పబడడం లేదు కానీ ప్రతి రూపం(image, ఫోటో, విగ్రహం)లేదు అని చెప్పబడుతుంది.

--------------------------------------------------------------------------------
 ఒకే దైవానికి అనేక రుపాలున్నాయా లేక అనేక పేర్లా.?
--------------------------------------------------------------------------------

వేదాల్లో కెలా ప్రచీనమైనదీ, పవిత్రమైనదీ అయిన రుగ్వేదంలో మొదటి పుస్తకం, 164వ సూక్తంలో 46వ మంత్రం ఇలా చెబుతుంది. 

(ఋగ్వేదం 1:164:46)  एकम सद विप्र बहुदा वदंते   "ఏకం సద్ విప్రా బహుదా వదంతే"        

(ఋగ్వేదం 1:164:46) "సత్యం ఒక్కటే; దైవం ఒక్కడే; ఋషులు ఆయన్ని వివిధ పేర్లతో పిలుస్తారు" 

అదే విధంగా రుగ్వేదంలో 

(ఋగ్వేదం 10:114:5)"దేవుడు ఒక్కడే, ఋషులు ఆయన్ని పలు పేర్లతో స్తుతిస్తారు" 

(ఋగ్వేదం 2:1) లో దేవుడికి 33 వివిధ పేర్లు ప్రస్తావించబడ్డాయి.
 వాటిలో ఒకటి బ్రహ్మ. 'బ్రహ్మ' అంటే సృష్టికర్త అని అర్ధం. అరబ్బీలో దీనికి సమానపదం 'ఖాలిఖ్' ఆ దేవుణ్ణి ఖాలిఖ్ అన్నా, సృష్టికర్త అన్నా బ్రహ్మ అన్నా ముస్లిములకు అభ్యంతరము లేదు. 

కానీ దైవం అంటే బ్రహ్మ అని ఆయనకు నాలుగు తలలున్నాయనీ, ప్రతి తలమీదా కిరీటం ఉంటుందనీ, అనడం మాత్రం పొరబాటు. ఎందుకంటే అలా వర్ణించడం తప్పు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో(4:19) చెబుతుంది. అంటే దైవానికి ఎటువంటి ప్రతిమ, ప్రతిరూపం లేదని అర్ధం. 

(ఋగ్వేదం 2:1:3) లో దైవానికి మరో పేరును 'విష్ణు'గా ప్రస్తావించడం జరిగింది. విష్ణు అంటే నడిపించే వాడు. అని అర్ధం. అరబ్బీ లో దీనినే 'రబ్' అని అంటారు. ఆయనను రబ్ అన్నా, విష్ణు అన్నా, నడిపించే వాడు అన్నా ముస్లిములకు అభ్యంతరము లేదు. 

కాని దైవం అంటే విష్ణు అని, ఆయన పాముతల పై శయనిస్తాడని, సముద్రంలో నిదురిస్తాడని, గాలిలో గరుడ పక్షి పై ప్రయాణిస్తాడని ఆయనకు నాలుగు చేతులు, ఒక చేతిలో విష్ణుచక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయని వర్ణిస్తే మాత్రం పోరబాటవుతుంది. 

ఎందుకంటే అలా వర్ణించడం వేదాలకు, ఉపనిషత్తులకు వ్యతిరేకం. వేదాలలో ఉపనిషత్తులలో ఆయనకు ప్రతిమ గాని, ప్రతిరూపం గాని లెవని ఉంది. 

(ఋగ్వేదం 8:1:1) "ఆయన ఒక్కరినే స్తోత్రం చేయండి ఆయనే ఆరాధనలకు అర్హుడు"     

(ఋగ్వేదం 6:45:16) य येक इत्तमु शतुही (యఏక ఇత్తము ష్తుహి)                                  

"ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలి" 

హిందూ ధర్మం యొక్క బ్రహ్మ సూత్రం ఏమిటంటే ... 

एकम ब्रह्मम द्वितीय नस्तनेन न नस्ते किंचन 
(ఏకం బ్రహ్మం ద్వితీయ నస్తనేన్ న నస్తే కించన్)     

అంటే దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు అసలు లేనే లేడు . అని అర్ధం. అంటే హిందూ ధర్మ గ్రంధాలలో విషయాల్ని క్షుణ్ణంగా చదివితే హిందూ ధర్మంలో దైవ భావన ఏమిటో అర్ధం అవుతుంది. 

No comments:

Post a Comment