Monday, June 8, 2015

أحمد యేసు నిజంగానే శిలువ పై మరణించారా?

యేసు నిజంగానే శిలువ పై మరణించారా?
"వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. కాని ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయభేదం వ్యక్తం చేసినవారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమి తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయముగా చంపలేదు. కాని అల్లాహ్ ఆయనని తన వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్ అత్భుత శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు." (ఖుర్'ఆన్; 4:155-157)

ముస్లిముల విశ్వాసాలు రెండు రకాలు: 

1. యేసు మరణ వేదనలు పడకుండా (శిలువపైకి ఎక్కించ కుండా) ఆయన స్థానంలో మరొక వ్యక్తిని నియమించి, అల్లాహ్, యేసును తనవైపుకు లేపుకున్నాడు. 

2. యేసును మరణ వేదనలు అంటే శ్రమలు పెట్టి శిలువపైకి ఎక్కించి సజీవంగా తనవైపుకు లేపుకున్నాడు. 

లేఖనములు: 

"పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకోనును." (సామెతలు; 12:13)

"నీతి మరణము నుండి రక్షించును" (సామెతలు ; 1.:2)

"యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది" (కీర్తన; 34:15)

"నీతిమంతులు మోర పెట్టగా యహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును.
(కీర్తన; 34:17)

"నేను చావను సజీవుడునై యహోవా క్రియలు వివరించెదను యహోవా నన్ను కఠినముగా సిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించ లేదు." (కీర్తనలు; 118:17-18)

"క్రుంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. ఆటను గోతిలోకి పోడు చనిపోడు, అతడికి ఆహారము తప్పదు." (యషయా : 51:14)

"తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లి పోయెను." (మత్తయి; 27:60) 

"ఆయనతో ఉండిన వారు దుఃఖముతో యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని, ఆయన బ్రతికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మక పోయిరి." (మార్కు; 16:11)

"వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి యెదుట భుజించెను."
(లూకా; 24:42)

నోట్: యషయా 51:14 ఈ లేఖనం యేసుకు వర్తించదు అని అంటే ఈ లేఖనం ఎవరి నిమిత్తం ఎక్కడ ఎవరి నిమిత్తం నెరవేరింది అని అడగాలి. ఈ లేఖనం శిష్యులు ఎందుకు కోట్ చేయలేదు అంటే మార్కు 16:11 ప్రకారం శిష్యులు విని నమ్మక పోయిరి గనుక. 

"వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యోకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడిఅలోనే వారు లేచి తిరిగి యరుషలేము వెళ్ళగా పదునోకండుగురు శిష్యులను వారితోకూడ నున్నవారును కూడివచ్చి - ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి. వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధామవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. (లూకా: 24:29-37)  

యేసు తనను గురించి చెప్పిన భవిష్యత్వాణి :

"వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచివెళ్ళిపోయెను.
(మత్తయి; 16:4)

"అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యలలోను కొందరు - బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియలడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచకక్రియయైనను వారికి అనుగ్రహింపబడదు."   
(మత్తయి; 12:38)

"మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగెను. ఈ తరమువారు దుష్టతరము వారైయుండి సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచకక్రియయే గాని మరే సూచకక్రియను వారికనుగ్రహింపబడదు." (లూకా; 11:29)

1. యోనా సూచక క్రియ చూపెడతానని యూదులకు యేసు వాగ్దానం.

2. యోనా మూడు రాత్రిబవళ్ళు తిమింగలం కడుపులో ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా మనుష్యకుమారుడు భూగర్భంలో ఉన్నాడు.

3. ఆ యోనా తిమింగలం కడుపులో చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. (యోనా ; 2:1)

అ. యోనా మూడు రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు.

ఇ. యోనాను సముద్రంలో పడవేయడం వలన అందరూ చనిపోయాడు అనుకున్నారు. ఎందుకంటే ఆయన తిరిగి లేవలేదు కనుక. 


యేసు శిలువమరణం దేవుని నిర్ణయం కాదు  

"అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు నేను ఆయనను గూర్చి కలలో మిక్కిలి బాధ పడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. (మత్తయి; 27:19)

"తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులును ఆయన వెంట వెళ్ళిరి.
ఆ చోటు చేరి ఆయన వారితో - మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్ధన చేయుడని చెప్పి, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్లూని, తండ్రీ ఈ గిన్నె నాయోద్దనుంది (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్ధించెను. (లూకా; 22:39-42)

"అంతట యేసు వారితో కూడ గేత్సేమనే అనబడిన చోటికి వచ్చి - నేను అక్కడికి వెళ్లి ప్రార్ధన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడి అని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు - మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది. మీరు ఇక్కడ నిలిచి, నాతో కూడ మెలుకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిల పడి - నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యోద్దనుండి తోలిగిపోనిమ్ము. అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్ధించెను. ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి- ఒక గడియయైనను నాతొ కూడ మేల్కొనియుండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకువగా యుండి ప్రార్ధన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము అని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్లి నా తండ్రీ, నేను త్రాగితేనే గాని ఇది నాయొద్ద నుండి తొలిగిపోవుట సాధ్యము కాని యెడల, నీ చిత్తమే సిద్ధించుగాకా అని ప్రార్ధించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయన వారిని మరల విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్ధన చేసెను. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చి - ఇక నిద్ర పోయి అలసట తీర్చుకోనుడి; ఇదిగో ఆ గడియ వచ్చియున్నది; మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. లెండి వెళ్లుదము; ఇదుగో నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను." (మత్తయి; 26:36-46)

"వారు గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు, ఆయన - నేను ప్రార్ధన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పెతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి, మిగుల విభ్రాంతినొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడాయన - నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ యుండి మెలుకువుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగివలెనని ప్రార్ధించుచు - నా తండ్రీ! నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నాయిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను." (మార్కు; 14:32-36)

"ఆయన శ్రమపడి తరువాత నలుబది దినములవరకు వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనబరుచుకొనెను." (అపోస్తులకార్యములు; 1:3)

పౌలు సాక్ష్యం:

"ఓ అవివేకులైన గలతీయులారా! మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? శిలువవేయబడిన వాడైనట్లుగా ఏసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా!" (గలతీయులు; 3:1)

"మహా రోదముతోను, కన్నీళ్ళతోనూ, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్ధనలను, యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగిన్యున్నందున ఆయన అంగీకరింపబడెను." (హెబ్రీ; 5:7)

"ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, మరణముపొండునంతగా అనగా శిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్నుతాను తగ్గించుకోనేను." (ఫైలిప్పు; 2:8)

"... ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి, ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను." (హెబ్రి; 11:19)  

యాకోబు సాక్ష్యం:

"మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి పీఠము మీద అర్పించి నప్పుడు అతడు క్రియల వలన అతడు నీతిమంతుడని తీర్పుపొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసేననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా తీర్పు పొందినప్పుడు ఆతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? (యాకోబు ; 2:21)

మగ్డలేని మర్య సాక్ష్యం: 

"ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని, ఆయన బ్రతికి ఉన్నాడనియు, ఆమెకు కనబడెననియు వారు విని నమ్మ లేక పోయిరి. ఆ తర్వాత వారితో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా ఆయన మారు రూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి." (మార్కు; 16:10-13)

యేసు తనకు తాను సజీవుడుగా ఋజువుపరుచుకొనుట:

"ఆయన శ్రమపడి తరువాత నలుబది దినములవరకు వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనబరుచుకొనెను.(అపోస్తులకార్యములు; 1:3)

"మీ హృదయములో సందేహం పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను..." (లూకా; 24:38) 

"కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నారని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.(లూకా; 24:23)  

"వారు భయపడి ముఖములను నేలమోపి యుండగా వీరు - సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి యున్నాడు.(లూకా; 24:5)

యేసు శిలువమరణము తప్పించమని యహోవాను ప్రార్ధించెను:

"కొంత దూరము వెళ్లి సాగిల పడి - నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యోద్దనుండి తోలిగిపోనిమ్ము. అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్ధించెను." (మత్తయి; 26:39)

"కొంత దూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగివలెనని ప్రార్ధించుచు - నా తండ్రీ! నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నాయిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను.(మార్కు; 14:35)

"తండ్రీ ఈ గిన్నె నాయోద్దనుంది (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్ధించెను. (లూకా; 22:42)

నోట్: ఎవరి మరణంలో అయితే క్రైస్తవులు పునాదిగా తమ విశ్వాసాన్ని నిర్మించు కున్నారో ఆ వ్యక్తి (యేసు వారి) మరణాన్ని తప్పించమని యహోవాను కడు దీనంగా చెమటను రక్తంగా కారుస్తూ (లూకా; 22:44) తనను పంపిన దేవుని వేడుకున్నారు.

మారు వేషంలో యేసు వారు:

"ఆయన యేసు వారని గుర్తుపట్టలేదు" (యోహాను; 20:14)

"ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను." (యోహాను; 21:5)

నోట్: పై వాక్యాలలో యేసు వారు మారు వేషంలో తిరిగే వారని కనీసం శిష్యులు కూడా గుర్తుపట్టలేనంతగా వేషాన్ని మార్చుకున్నారని బైబిలు వాక్యాలు తెలియపరుస్తున్నాయి. క్రైస్తవులు చెబుతున్నట్లు ఆయన శిలువ మరణం కోసమే పుట్టి శిలువ మరణం పొంది, చనిపోయి నిజంగానే పునరుద్ధానం చెందినట్లయితే మారు వేషాలలో తిరగటం ఎందుకు? శిలువ వేషంలో యేసువారు స్పృహకోల్పోయారు. దానినే వారు మరణంగా భావించారు. అందుచేతనే యేసువారు బ్రతికి ఉన్నాడంటే శిష్యులు సైతం నమ్మలేక పోయారు. ఆయన స్పృహలోకి రావడానికి పునరుద్ధానంగా భావించారు. కాని నిజంగా పునరుద్దానుడైతే అందరిముందు బహిరంగంగా తిరగవచ్చు. కాని కేవలం ఆయన స్ప్రుహలోనికి వచ్చి ఉండుట చేత తాను బ్రతికి ఉన్నట్లుగా విరోదికి తెలిస్తే వాళ్ళు ఎక్కడ చంపుతారో నని ఎవరికీ కనబడకుండా Under Ground లో ఉంది మారు వేషాల్లో ఉండి తన సిష్య్లకు మాత్రమే కనబడే వారు.

క్రైస్తవుల ప్రశ్న:

"లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతినోందెను. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" (1వ కోరిందీ; 15:3)

"వారు యేసు యొద్దకు వచ్చి, అంతకు ముందే ఆయన మృతి పొంది యుండుట చూచి ఆయన కాళ్ళు విరగకొట్ట లేదు కాని, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్ళును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగుదును" (యోహాను; 19:33-35)

జవాబు:

"అతడు పుట్టిన రోజునా, అతడు మరణించిన రోజునా, అతనిని బ్రతికించి లేపే రోజునా అతనిపై శాంతి నెలకొను గాక" (ఖుర్'ఆన్; 19:15)

(ఇది యోహాను గూర్చి యహ్యాగా) 

"నేను పుట్టిన రోజునా, నేను మరణించే రోజునా, బ్రతికింప బడి లేపబడే రోజునా నాకు శాంతి కలుగుతుంది." (ఖుర్'ఆన్; 19:33)

ఇది యేసు గురించి ఈసాగా 

"మనుష్యులోక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును." (హెబ్రీ; 9:27)

"మరణ శిక్షకు పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వ్రేలాడ  దీసిన యెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను." (ద్వితియోప దేశ కాండము; 21:22,23)





















No comments:

Post a Comment