ఆచారాలు దురాచారాలు
(ఖుర్ ఆన్; 3: 164)
"లఖద్ మన్నల్లాహు అలల్ మూ'మినీన ఇజ్ బఅస ఫీహిమ్ రసూలమ్మిన్ అన్ ఫుసిహిమ్ యత్ లూ అలైహిమ్, ఆయాతిహి వయుజక్కీహిమ్ వ యుఅల్లిము హుముల్ కితాబ వల్ హిక్మత, వ ఇన్ కాను మిన్ ఖబ్లు లఫి జలాలిమ్ ముబీన్."
అల్లాహ్ విశ్వాసులకు చేసిన
మహోపకారంఏమిటంటే, ఆయన వారిలో
నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని
వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన
వాక్యాలను
చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని
చేస్తాడు.
వారికి
గ్రంధగ్నానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు.
నిశ్ఛయంగా
అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికిలోనై
ఉండేవారు.
అయితే ఆ ప్రవక్త
(స. అ.
సం) మనకు స్పష్టమైన ఉపదేశాలు, వివేకాన్నీ బోధించిన తర్వాత
కూడా
ఆయనను అనుసరించకపోతే అల్లాహ్ కూడా మనలను ప్రేమించడు. అల్లాహ్
ప్రేమ, కరుణాకటాక్షాలు, దయాదాక్షణ్యాలు లేక పోతే
మనకు మోక్షం, నిత్యజీవితం, పరలోకజీవితం
ఈ మూడింటిలో అసఫలీకృతమై
పోతాము.
అల్లాహ్
సెలవిస్తున్నాడు.
(ఖుర్ ఆన్; 3: 31)
"ఖుల్ ఇన్ కున్ తుమ్ తుహిబ్బూనల్లాహ
ఫత్తబీయూనీ యుహ్బీకుముల్లాహ్ వ యగ్ ఫిర్ లకుమ్ జునూబకుమ్
వల్లాహు గఫూరుర్రహీమ్"
"ఓ ప్రవక్తా! వారికి చెప్పు: "మీకు
నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ
ఉంటే
మెరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు.
ఆయన
అమితంగా
క్ష్మించేవాడు, అపారంగా కనికరించేవాడు."
ఈ
పై ఆయతును బట్టి మనకు తెలిసిందేమిటంటే, మనం మన
దైనందిన
జీవితంలో
ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) చెప్పి, ఆచరించి చూపిన
మార్గాన్నే
అనుసరించాలి. ఆయన
(స. అ.
సం) ఆచరణకు విరుద్ధంగా మన ఆచరణ
ఉంటే
అది ఆమోదించ బడదు. అందుకే ప్రవక్త
ముహమ్మద్ (స.అ.సం) అన్నారు.
"మన్ అమిల అమలన్ లైస అలైహి
అమృనా ఫహువ రద్దున్"
(ముస్లిమ్)
"మా ఆదేశాలతో నిమిత్తం లేని ఏ
పనులు చేసినా అవి శ్వీకార యోగ్యము
కావు,
అవి రద్దు చేయబడతాయి.”
కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ప్రవక్త
ముహమ్మద్ (స.అ.సం) యొక్క
సున్నత్
ప్రకారం,
ఆయన (స.
అ.
సం) యొక్క అమలు,
ఆయన
(స. అ.
సం) యొక్క అనుచరుల
(సహాబాల) అమలుకు వ్యతిరేకంగా ఉండకూడదు.
అలా
ఉంటే అది దురాచారం అనిపిస్తుంది. వారి (ప్రవక్త, సహాబాలు) అమలుకు తగ్గట్టుగా ఉంటే అది సదాచారం అనిపిస్తుంది.
ఈ క్రింద
కొన్ని
దురాచారాలు మచ్చుకు కొన్ని తెలియజేయడం జరుగుతుంది.
మొహర్రమ్ నెలలో పీర్లు నిలబడించవచ్చా? ఫాతిహా
చేయవచ్చా?
ఈ పీర్ల
పండుగా
షియా వర్గం వారు ప్రారంభించారు. పంజా
అని ఆస్థాన ఉంటుంది.
అక్కడ
ఇత్తడితో
హస్తాల మాదిరిగా తయారు చేయబడిన
వాటికి,
హసన్,
హుసైన్, ఫాతిమా, అలీ అనే
పేర్లు పెట్టి వాటికి పూలహారాలు, ఆకుపచ్చ,
ఎరుపురంగులుగల
గుడ్డలు
కట్టి,
వాటికి
ఫాతిహాలు చేసి, 10 వ
తేదీ
నాడు పండుగ చేసుకొని మాతంలు చేస్తూ
పెర్ల కోనేరు అను బావిలోగాని నీటి
కొలనులోగాని ముంచి మరలా అవే తీసుకొనివచ్చి ఆస్థానాలలో ఉంచి మరలా మరో సంవత్సరం వీటినే
శుభ్ర పరచి మరలా అలా సంవత్సరం సంవత్సరం
చేస్తూ ఉంటారు. ఈ పని ఇస్లామ్లో లేని కొత్త
పని,
షిర్క్, బిద్ ఆత్ పనులు,
ఇస్లాంకి, ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) కు, సహాబాలకు ఎటువంటి సంబంధం వీటితో లేదు.
ఆఖరీ ఛార్ఛుంబా (చివరి బుధవారం) అని చేసుకోవచ్చా?
ఆఖరీ ఛార్ఛుంబా అనే మాటే ఖుర్ఆన్ మరియు హదీసులలో లేదు. అంతే కాకుండా ఇది జరుపుకోవడానికి
చెప్పేదంతా ఒక కట్టుకధే
తప్ప మరేమీ కాదు.
బార్వీహ్ షరీఫ్ చేయవచ్చా?
సామాన్యంగా రబీయుల్ అవ్వల్ నెలలో దీనిని పండుగగా
చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నెలలో ప్రవక్త
ముహమ్మద్ (స. అ.
సం) వారు జన్మించారు. అలాగే
ఇదే నెలలో ఆయన (స.
అ.
సం) మరణించారు కూడా. ప్రవక్త
ముహమ్మద్ (స. అ.
సం) ఆయన జీవిత
కాలంలో
ఏనాడు కూడా ఆయన పుట్టిన
రోజు
చేసుకోలేదు. ఆయన
అనుచరులైన
సహాబాలు
కూడా ఆయన పుట్టినరోజు చేసుకున్న
దాఖలాలు
లేవు.
అలాగే
చనిపొయిన రోజు చేస్తున్నారు అని
అంటే ఆయన
(స. అ.
సం) మరణించిన తర్వాత
హజ్రత్
అబూబకర్
(ర. జి)
ఏనాడు
సంతాప దినం గాని,
శ్రద్ధాంజలి
గాని జరపలేదు. అలాగే మిగతా అను్చరులు (సహాబాలు) కూడా సంతాప
దినాలు
పాటించలేదు. వీళ్ళెవరూ చేయని పనులు మనం చేస్తే
పుణ్యం లభిస్తుందా? పాపం దక్కుతుందా? ఒక్క సారి
నిష్కల్మషమైన మనస్సుతో ఆలోచించండి.
గ్యార్వీహ్ షరీఫ్ చేయవచ్చా?
సామాన్యంగా ఇది షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని (ర. అ)
పేరు
మీద చేస్తూ ఉంటారు.
ఆయన
పూర్తి
జీవితకాలంలో ఎప్పుడూ ఇలా చేయమని చెప్పలేదు. ఆయన
ఒక
దైవ
దాసుడే. ఆయన కూడా
ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) యొక్క సున్నత్ల ప్రకారంగానే అమలు చేసేవారు.
కేవలం
అల్లాహ్
పేరు మీదనే ఖుబానీ చేయాలి. ఇతరుల
పేరుపై
ఖుర్బానీ చేయరాదు. ఖుర్బానీ అల్లాహ్ పేరు
మీద కాకుండా వేరెవరి పేరు మీదైనా
చేస్తే అది షిర్క్ కోవకు చెందుతుంది. కాబట్టి
గ్యార్వీహ్ చేయడం ధర్మ
సమ్మతం
కాదు.
అలాగే
ఏ పని అయినా వేరితరులపై అంటే బతికి ఉన్నవారిపై గాని, చనిపొయినవారి
పైగాని ఖుర్బానీలు, భోజనాలు గాని, 9
రోజులు,
బర్సీలు,
పిండాకూడు
గాని పెట్ట
కూడదు.
ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారి వసీలాతో దుఆ చేయవచ్చా?
అల్లాహ్ యొక్క
మంచి
పేర్లు ఉన్నాయి దాని ద్వారా, మన
జీవిత
కాలంలో
అల్లాహ్కు ప్రసన్నత కల్గించే
ఉద్దేశంతో ఏదైనా మంచి పని చేసినచో దాని వసీలాతో, లేక
ఎవరైనా
దైవదాసుడు (ముత్తఖి)
బ్రతికివున్న
ఆయన
ద్వారా
దుఆ చేయించవచ్చు.
Quraan lo levantaara? Paraspara viruddha vishayaalu?
ReplyDeleteBible lo undi, vedallo undi Mohammed e ani khacchitamga cheppagalara?
ఖురాన్ ప్రకారం దేవుడు మనిషిని ఎందు కొరకు సృష్టించాడు?
‘ధర్మ సందేహం’ తరపు నుంచి మొట్ట మొదటి వ్యాసం.
‘ఇస్లాం మరియు నేను - 1’
dharmasandeham.blogspot.com లో
మీ అభిప్రాయలు తెలియజేయండి.
Islam and me 1 - ఇస్లాం మరియు నేను 1
dharmasandeham.blogspot.com
Mgm Casino – Online Gambling with a Bitcoin Bonus
ReplyDeleteHow to join Mgm Casino – 안동 출장샵 Online Gambling with 경기도 출장마사지 a 제천 출장마사지 Bitcoin Bonus — Mgm Casino – Online Gambling with 상주 출장마사지 a Bitcoin Bonus – September 28, 2019, 여주 출장샵