Monday, July 6, 2015

హిందూయిజమ్ పరిచయం

హిందూయిజమ్ పరిచయం 


మనదేశంలో మతాలు - విశ్వాసాలు

"ప్రారంభంలో ప్రజలందరూ ఒకే మతాన్ని, ఒకే ధర్మాన్ని అనుసరిస్తూ ఒకే దారిన నడుస్తూ ఉండేవారు. తర్వాత అందరూ తమ ఇష్టమొచ్చినట్లుగా వేరే మతాలను సృష్టించుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారి దగ్గర శుభవార్తలు తెలిపే, హెచ్చరించే ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. సత్యం గురించి ప్రజలలో వచ్చిన విబేధాలను పరిష్కరించడానికి ఆయన ప్రవక్తలపై సత్యపూరితమైన గ్రంధాలను  కూడా అవతరింపజేశాడు. ఈ విబేధాలు సృష్టించిన వారు పరిజ్ఞానం ప్రసాదించబడిన వారే. స్పష్టమైన హితోక్తులు లభించిన తర్వాత కూడా వారు మూర్ఖత్వంతో సత్యాన్ని వదిలి విభిన్న పద్ధతులు సృష్టించుకున్నారు. ఏ సత్యం గురించి వారు విబేధాలు సృష్టించారో ఆ సత్యాన్ని పొందే మార్గం దేవుడు దయతో విశ్వాసులకు చూపించాడు. దేవుడు తాను తలచుకున్న వారికి సన్మార్గం చూపుతాడు.
(ఖుర్ఆన్  2:213)

ఆర్య సమాజం:-

స్థాపకులు       :    స్వామి దయానంద సరస్వతి

గ్రంధం            :     వేదాలు

విశ్వాసాలు     :     విగ్రహారాధనను దూషిస్తారు, దేవుడు నిరాకారుడు, పుట్టుక మరణము లేని వాడు, అవ్యక్త                                      రూపుడని చెబుతారు. ఏకేశ్వరో పాసన చేసి మనిషి మరణిస్తే మోక్షం పొందుతాడు, చేయక పొతే                              అనేక జన్మలు ఎత్తుతాడు.

బ్రహ్మ సమాజం:-

స్థాపకులు        : రాజా రామ్ మోహన్ రాయ్

విశ్వాసాలు      : వీరి విశ్వాసము కూడా ఆర్య సమాజము లాంటిదే.

గ్రంధము          : వేదాలు, ఉపనిషత్తులు

బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ సమాజము :-

స్థాపకులు       : శ్రీ రాధా స్వామి వారు

గ్రంధం             : భగవద్గీత , వేదాలు

విశ్వాసాలు      : దీని ముఖ్య కేంద్రం Mount Abu, Rajasthan, దేవునికి పుట్టుక, మరణము లేదు. దేవుడు                                   అవ్యక్తుడు, దేహాన్ని ధరించిన వారెవరు దేవుళ్ళు కారు. మనిషి దేవుణ్ణి జ్యోతిర్బిందువు ద్వారా                               ఆరాధించి కొన్నాళ్ళకు ఆ జ్యోతిని కూడా తీసివేయాలి. వీరికి జన్మల పై విశ్వాసము ఉంది.

వైష్ణవులు:-

స్థాపకులు      : శ్రీ శంకరాచార్యులు (అద్వైతాన్ని బోధించారు)

గ్రంధం            : విష్ణు సహస్ర నామం, నారాయణోపనిషత్తు

విశ్వాసం        : విష్ణువును సృష్టికర్తగా నమ్ముతారు. జన్మలున్నాయని నమ్ముతారు. శైవులంటే వీరికి                                            ఇష్టముండదు.

శైవులు:-

స్థాపకులు      : శ్రీ కంఠ శివాచార్యులు

గ్రంధం            : శైవ పురాణం

విశ్వాసం        : శివుణ్ణి సృష్టికర్తగా నమ్ముతారు. జన్మలున్నాయని నమ్ముతారు. వీరికి వైష్ణవులంటే ఇష్టముండదు.

జైన మతం:-

స్థాపకులు      : ఋషజ్ఞ నాధుడు

విశ్వాసాలు     : తీర్ధంకరులను ఆరాధిస్తారు.

బౌద్ధ మతం:-

స్థాపకులు      : గౌతమ బుద్ధుడు

గ్రంధాలు        : త్రిపీఠకాలు

అద్వైతము:-

స్థాపకులు     : శంకరాచార్యులు

విశ్వాసాలు   : దేవుడు అన్నిటిలోనూ ఉన్నాడు, అహం బ్రహ్మస్మి

ద్వైతము:-

స్థాపకులు     : మద్వాచార్యులు

విశ్వాసాలు    : సృష్టి వేరు, సృష్టికర్త వేరు, కాని సృష్టికర్త వివిధ దేవతా రూపాలలో అవతరిస్తాడు.

విశిష్టాద్వైతము :-

స్థాపకులు      : రామానుజాచార్యులు

విశ్వాసము    : నిర్గుణోపాసము, మానవుడు దేవునిలో ఐక్యమైపోవును.

నోట్: అన్ని వర్గాలు జన్మలున్తాయనే విశ్వాసము కలిగి ఉంటారు.

గీతా పరిచయము 

ఖుర్'ఆన్ అవతరింపబడిన నెల రమజాను నెల. ఇది మానవులందరికీ మార్గదర్శకము. ఇందులో సన్మార్గం మరియు సత్యాసత్యాలను వేరు పరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. (ఖుర్'ఆన్ ; 2:185)

గీత అవతరించిన నెల మార్గ శిర శుద్ధ ఏకాదశి (9వ నెల) గీత అవతరించి 2005 సంవత్సరానికి 5142 సంవత్సరములు.

గీతను

నిర్మించింది : అక్షర పరబ్రహ్మ

బోధించింది : పరమాత్మ (కృష్ణుడు)

ఛందోబద్ధమొనర్చింది : వేద వ్యాసుడు

లిఖించింది: విఘ్నేశ్వరుడు: (పూజింపబడుతున్న వినాయకుడు కాదు)

ప్రచారం చేసింది : సంజయుడు

పరమాత్మకు, అర్జునుడికి మధ్య జరుగుతున్న సంభాషణను సంజయుడు విని దుతరాష్ట్రునికి వివరిస్తున్నట్లుగా గీత ఉంటుంది.

                   గీత అవతరించినప్పటి         ఇప్పుడున్న
                              శ్లోకాలు                       శ్లోకాలు

శ్రీ కృష్ణుడు               620                               574

అర్జునుడు                 57                                 85

సంజయుడు              67                                 41

దృతరాష్ట్రుడు               1                                   1

    
భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు కలవు. ప్రతీ అధ్యాయమునకు యోగము అని పేరు.


  • యోగమనగా జీవాత్మ (అర్జునుడు) పరమాత్మ (కృష్ణుడు) కలయికను యోగమని అందురు. (గీత 2:53) పరమాత్ముని ద్వారా చెప్పబడిన దానిని కూడా యోగమని అంటారు (గీత; 6:33, 18:35) 
  • యొగమనగా మరొక అర్ధం మనిషి దైవం తో ఐక్యమవడం. 
  • లేనిది ఇచ్చుట (గీత; 9:22)    

గీతలు అనేకం కలవు

1. అష్టా పక్ర గీత    2. అవధూత గీత  3. ఋభు గీత  4. బ్రహ్మ గీత 5. వశిష్ట గీత 6. గణేష గీత   7. హనుమ గీత

8. పరాశర గీత  9. హరిత గీత   10. శివ గీత   11. హంస గీత  12. భిక్షు గీత  13. కపిల గీత  14. దేవి గీత

15. భగవద్గీత

నోట్: విద్యాప్రకాశనందగిరి స్వాముల వారి ప్రకారం భగవద్గీత మాత్రమే అన్ని రకాల గీతల యందు 'భగవద్గీత యొక్క దానికే గీతయను నామము చక్కగా రూడ్హీ పడినది.' అని గీతా మకరందములోని తమ ఉపోద్ఘాతములో "వివిధ గీతాలు అందు భగవద్గీత యూక్క స్థానము" అన్న శీర్షికలో పేర్కొన్నారు.

ఖుర్'ఆన్ గురించి ఖుర్'ఆన్ లో :- 

"ఇది ఏ విధమైన సందేహములేని ఐశ్వర్య గ్రంధం." (ఖుర్'ఆన్ ; 2:2)

"మానవులారా! మీ వద్దకు మా తరుపునుండి నిదర్శనము వచ్చేసింది. మేము మీ వైపుకు ప్రకాశమానమైన జ్యోతిని పంపించాము" (ఖుర్'ఆన్ ; 4:174)

" గ్రంధం  ఇవ్వబడిన ప్రజలారా! మీ ముఖాలను వీపులవైపు వెనకకు తిప్పి వికృతంగా మార్చివేయక ముందే లేదా శనివారపు (సబ్బత్) ప్రజలను శపించిన విధంగా మిమ్మల్ని శపించక ముందే, పూర్వం నుండి మీ వద్ద ఉన్న గ్రంధాన్ని ధృవీకరిస్తూ మేము అవతరింపజేసిన ఖుర్'ఆన్ ను విశ్వసించండి." (ఖుర్'ఆన్ ; 4:47) 

శాస్త్రం అంటే ఏమిటి? 

శాసించేది లేక ఆజ్ఞాపించేది.

  • ప్రజలు ఏమి చేయుచున్నారు 

                       "అశాస్త్ర విహితం ఘోరం తవ్యంతే యే తపో జనాః" (గీత; 17:5)

        శాస్త్రమునందు విధింపబడనిదియు, తమకును ఇతరులకును కూడా బాధాకరమైనదియునగు తపస్సు చేయుచున్నారు.

  • అర్జునుడు ఏమి చేయాలి?

          "నియతం కురు కర్మత్వం" (గీత; 3:8)

        "ఓ అర్జునా నీవు శాస్త్రముచే నియమించబడినట్టి కర్మమునే చేయుము."

  • శాస్త్రం శాసించేదేమిటి?  

           "తస్మాస్ఛాస్తం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థి తౌ 
             జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహర్వసి"  (గీత;16:24)

          కావున నీకు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము ప్రమాణమై యున్నది. శాస్త్రము నందు చెప్పబడిన దానిని తెలుసుకొని దాని ననుసరించి నీ వీ ప్రపంచమున కర్మము జేయదగును.

  • శాస్త్రాన్ని తిరస్కరిస్తే 
                  "యశ్శాస్త విధిముత్ర్సుజ్య వర్తతే కామకారతః 
                   న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరం గతిమ్"  (గీత; 16:23)

ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచి పెట్టి తన యిష్టమువచ్చినట్లు ప్రవర్తించునొ, అట్టివాడు పురుషార్ధసిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమగతియగు మోక్షమును గాని పొందనేరడు

                  "నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే 
                    మొహత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః" (గీత; 18:7)

(వేద శాస్త్రాదులచే) విధింపబడినప్పటి కర్మము యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచి పెట్టునేని అది తామసత్యాగమే యగునని చెప్పబడుచున్నది.


  • శాస్త్రాన్ని ప్రచారం చేస్తే వచ్చే లాభం   

"అల్లాహ్ వైపునకు పిలిచి, మంచి పనులు చేసి, నేను ముస్లిమును (దైవ విదేయుడను) అని ప్రకటించుకునే వాని మాట కంటే మంచి మాట ఎవరిది కాగలదు" (ఖుర్'ఆన్; 41:33)

"య ఇదం పరమం గుహ్యం మద్దక్తేష్వభిదాస్యతి 
భక్తిం మయి పరం కృత్వా మామేవైష్యత్యసంశయః" (గీత; 18:68)

ఎవడు అతిరహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పునో అట్టి వాడు నా యండుత్తమ భక్తి గల వాడై, సంశయరహితుడై , నన్నే పొందగలడు.

"న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః 
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి" (గీత; 18:69)

మనుజులలో అట్టివాని కంటే నాకు మిక్కిలి ప్రియమునోనర్చు వాడెవడును లేడు. మఱియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్టుడైనవాడు ఈ భూలోకమున మరియొకడు కలుగబోడు.

సహ యజ్ఞాః ప్రజాస్ప్రుష్ట్యా పురోవాచ ప్రజా పతిహ్ 
అనేన ప్రస విష్యధ్వమేషవో స్త్విష్ట కామధుక్  (గీత; 3:10)

పూర్యము బ్రహ్మదేవుడు యజ్ఞములతో గూడ ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములచే మీరభివృద్ధిని పొందుడు. ఇది మీ యభీష్టములకు నెరవేర్చుగాక! అని వారితో బలికిరి.

మనుష్యాఋషయశ్చయేతతో 
మనుష్యా ఆజాయంత (యజుర్వేదం; 31:6)

సృష్టిలోని మానవులు సృష్టి ఆదియందు భగవంతునిచే నమైధున (వీర్యము లేకుండా) సృష్టి ద్వారా పుట్టించ బడిన స్త్రీ పురుషుల సంతానం.
సేకరణ: సత్యార్ధ ప్రకాశము 192వ పేజి (స్వామీ దయానంద సరస్వతి)

అన్యాద్భవంతి భూతాని... (గీత; 3:14)

ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి

జాతస్యహిద్రువో మృత్యుర్ధృవం జన్మమృతస్యచ 
తస్మాపరిహార్యే ర్ధే స త్వం శోచితు మర్హసి (గీత; 2:27)

పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు.

తిరిగి ఎప్పుడు జన్మిస్తాం:


సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాన్తిమామికాం 
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం (గీత; 9:7)

అర్జునా! సమస్త ప్రాణి కోట్లు ప్రళయ కాలమున నా ప్రకృతిని జేరి అందు అణిగియుండును, తిరిగి సృష్టికాలమున నేను సృజించు చుందును. 

స్వర్గం-నరకం :
త్రై విద్యామాం సోమపాః పూతపాపా
 యజ్ఞై రిష్ట్యా స్వర్గతింప్రార్ధ యన్తె 
తే పుణ్యమాసాధ్య సురేంధృలోక 
మశ్రుంతి దివ్యాన్ధివి దేవభోగాన్ (గీత; 9:20) 

                                                                                                                                                                   మూడు వేదముల నధ్యయనము చేసినవారును, సోమపానము గావించిన వారును, పాప కల్మషము తొలగినవారునగు మనుజుల యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొఱకై ప్రార్ధించుచున్నారు, వారు మరణానంతరము పుణ్య ఫలమగు దేవేంద్ర లోకమును బొంది, అట్టి స్వర్గమందు దివ్యములగు దేవభోగముల ననుభవించు చున్నారు. 

స్వర్గం ఎలా ఉంటుంది? 

స్వర్గలోకేన భయం కించనాస్తి 
నతత్ర త్వం న జరయా బిభేతి 
ఉచేతీర్వాశనాయా పిపాసే 
శోకాతిగో మోదతే స్వర్గలోకే  (కఠోపనిషత్తు; 1:12)

స్వర్గములో ఎలాంటి భయము లేదు. మృత్యువు అక్కడ లేదు. వృధాప్యము వలన భయము లేదు, ఆకలి దప్పులు సకల దుఃఖాలు అతిక్రమించి స్వర్గంలో ఆనందిస్తారు. 

స్వర్గం ఎన్నాళ్ళు ఉంటుంది? 

ఏతం అనంత లొకాస్ధమ్  (కఠోపనిషత్తు; 1:14)

శాశ్వత స్వర్గాన్ని పొందే మార్గము

పుణ్యకృతాం లోకాన్ ప్రాష్య 
శాస్వతీః సమాః ఉషిత్వా (గీత; 6:41)

పుణ్యాత్ముల లోకమును పొంది శాశ్వత సంవత్సరములు నివసించి... 

ప్రళయం తర్వాత నరకానికి పోయేవారు :

అనేక చిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః 
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకే శుచౌ (గీత; 16:16)

అనేక విధములైన చిత్త చాంచల్యములతో గూడిన వారును, మోహము అను వలచే బాగుగ గప్ప బడినవారును, కామముల ననుభవించుట యందు మిగుల యాసక్తి గలవారును అయి, వారు అపవిత్రమైన నరకము నందు పడుచున్నారు. 
 మనుష్యాణాం నరకే నియతం వాసోః (గీత; 1:44)

మనుష్యులకు శాశ్వత నరక నివాసం కలుగునని ... 

ఇస్లాం పై ఉన్న అపార్ధాలు - హిందూ మత గ్రందాల సమాధానం 

1. ఇస్లాం లో కఠిన శిక్షలు ఉన్నవి: 

దొంగలకు దండన 

"స్త్రీ అయిన పురుషుడు అయినా, దొంగతనం చేస్తే ఇద్దరికీ చెయ్యి నరికి వెయ్యండి. ఇది వారు సంపాదించు కున్నదానికి ప్రతిఫలం. దేవుని తరుపున కనువిప్పు కలిగించే శిక్ష. దేవుడు సర్వాధికారి, సర్వ శక్తి మంతుడు." (ఖుర్'ఆన్; 5:38)

మేన మేన మధాంగేనన్తవో సృష్టి విచేష్ఠలే 
తత్తదేవ హరేత్తన్య ప్రత్యదేశాయ పార్ధినః   (మనుధర్మ శాస్త్రం; 8:334)

దొంగ ఏ యే అంగముచే మనుష్యుల యందు విరుద్ధ చేష్టలు చేయునో, ఆయా అంగమును (మనుష్యులందరికి శిక్ష నేర్పుటకు) రాజు చేదింపవలెను. 

వ్యభిచారులకు దండన: 

"వ్యభిచారి, వ్యభిచారిని వీరిద్దరిలో ఒక్కొక్కరికి వందేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు దేవుడిని అంతిమ దినాన్ని విశ్వసించిన వారైతే దైవధర్మం విషయంలో వారి పట్ల మీరు ఏమాత్రం సానుభూతి వేలిబుచ్చకూడదు. 
(ఖుర్'ఆన్; 24:2)

భక్తారం లంఘయేద్యస్ఠి స్వజ్ఞాతి 
గణదర్పితౌ-తాం శ్వబిరిమేద్రా సంస్థానే బ్రహ్మ సంస్థతే (మనుధర్మ శాస్త్రం; 8:371)

ఏ స్త్రీ గర్వముచే భర్తను వదిలి వ్యభిచరించునొ ఆమె అనేక స్త్రీ పురుషుల యెదుట బ్రతికియుండగా కుక్కలచే కరిపించి రాజు చంపివేయవలెను. 





























2 comments:

  1. శంకరులు వైష్ణవాన్ని స్థాపించినట్లు వ్రాసినది అవాస్తవం. ఇస్లాం లోకంలో అశాంతిని సృస్టించిన మతం. దీన్ని మీరు ఎలా సమర్ధిస్తారు? వెళ్లి లక్షల మంది అమాయక ముస్లీములను చంపుతున్న ISIS మత చాందస వాదులను అడ్డుకోండి ముందు.

    ReplyDelete
  2. శంకరులు వైష్ణవాన్ని స్థాపించినట్లు వ్రాసినది అవాస్తవం. ఇస్లాం లోకంలో అశాంతిని సృస్టించిన మతం. దీన్ని మీరు ఎలా సమర్ధిస్తారు? వెళ్లి లక్షల మంది అమాయక ముస్లీములను చంపుతున్న ISIS మత చాందస వాదులను అడ్డుకోండి ముందు.

    ReplyDelete