స్వర్గ విశేషాలు
بسم ألله الرحمان الرحيم
అనంత కరుణా మయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ
మరణించిన తర్వాత మానవుని తర్వాతి జీవితం స్వర్గమా? లేక నరకమా? అసలు స్వర్గ నరకాలంటే ఏమిటి? విశ్వసించిన వారికి, మంచి పనులు చేసిన వారికి పరలోకంలో అల్లాహ్ సముచిత బహుమానంతో సత్కరిస్తాడని, అక్కడ వారు సుఖ భోగాలతో ఓలలాడుతారని, భోగభాగ్యాలతో కూడిన ఆ నిలయం పేరే స్వర్గమని, విశ్వసించనివారికి, చెడ్డ పనులు చేసేవారికి పరలోకంలో అల్లాహ్ వివిధ శిక్షలకు గురిచేస్తాడని, అక్కడ వారు ఎంతో దుర్భర జీవితాన్ని గడుపుతారని, శిక్షలతో కూడిన ఆ నివాసం పేరే నరకమని ప్రతి ముస్లిం ప్రాధమికంగా విశ్వసిస్తాడు.
ఖుర్'ఆన్ లోనూ, హదీసులలోనూ స్వర్గనరకాలకు సంబంధించిన స్పష్టమైన వివరాలు లభ్యమౌతాయి. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
1. స్వర్గం వెడల్పు భూమ్యాకాశాల విస్తృతికి సమానంగా ఉంటుంది. (ఖుర్'ఆన్; 3:133)
2. స్వర్గలోకపు పండ్లు, వసంతాలు శాస్వతంగా ఉంటాయి. (ఖుర్'ఆన్; 13:30)
3. స్వగంలో ఆకలి దప్పికలు ఉండవు. (ఖుర్'ఆన్; 20:118)
4. స్వర్గవాసులు స్వర్గంలో బంగారు కంకణాలను, ఆకుపచ్చని సన్నని జలతారు పట్టువస్త్రాలను ధరిస్తారు. (ఖుర్'ఆన్; 18:31)
5. స్వర్గవాసులు బుద్ధిని ప్రభావితం చేయని తెల్లని మధురమైన మధువు తాగుతారు. (ఖుర్'ఆన్; 37:45)
6. స్వర్గవాసుల కొరకు మహా భాగ్యాల మధ్య సిగ్గులొలికే చూపులుగల సుకన్యలు ఉంటారు. వారిని ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతులు గానీ తాకి ఉండలేదు. (ఖుర్'ఆన్; 37:45)
స్వర్గానికి సంబంధించిన కొన్ని హదీసులు (ప్రవక్త ప్రవచనాలు)
1. స్వర్గంలో వ్యాధి, వృద్ధాప్యం, మరణం ఉండదు. (ముస్లిం)
2. ఒకవేళ ఒక స్వర్గవాసి తన ఆభరణాలతో సహా ప్రపంచంలోనికి తొంగి చూసినట్లయితే సూర్యుడు నక్షత్రాల కాంతిని అంతమొందించినట్లుగా సూర్యుని కాంతిని అంతమొందిస్తాడు. (తిర్మిజి)
3. ఒకవేళ స్వర్గలోకపు స్త్రీ ఒకసారి ప్రపంచం వైపుకు తొంగిచూసినట్లయితే ప్రాక్పశ్చిమాలలో ఉన్న ప్రతి వస్తువునూ కాంతివంతం చేయడమే కాకుండా (వాతావరణమంతటినీ) సుగంధభరితం చేసివేస్తుంది. (బుఖారి)
4. స్వర్గపు గోడలు బంగారు ఇటుకలతోనూ, వెండి ఇటుకలతోనూ నిర్మించబడ్డాయి. సుగంధభరితమైన కస్తూరి ఆ ఇటుకలను కలిపేందుకై ఉపయోగించబడింది. ముత్యాలు, వజ్రాలు కంకరరాళ్ళుగా ఉపయోగించబాడ్డాయి. (తిర్మిజీ)
5. స్వర్గంలో 100 స్థాయిలున్నాయి. ప్రతి రెండు స్థాయిలకు నడుమ దూరం భూమ్యాకాశాల మధ్య దూరానికి సమానం. (తిర్మిజీ)
6. స్వర్గానికి చెందిన ఒక పండ్ల గుత్తి భూమ్యాకాశాలకు చెందిన సమస్త జీవరాశులు తిన్నప్పటికీ ఇంకా మిగిలే ఉంటుంది. (అహ్మద్)
7. స్వర్గంలో ఒక చెట్టు నీడ ఎంత పొడవుగా ఉంటుందంటే దాని నీడలో ఒక గుర్రం వంద సంవత్సరాల పాటు ప్రయాణించినప్పటికీ ఆ నీడ అంతరించదు. (బుఖారి)
8. స్వర్గంలో ఒక విల్లుకు సమానమైన స్థలం ప్రపంచం, అందులోని సమస్త సౌఖ్యాల కంటే విలువైనది. (బుఖారి)
9. స్వర్గంలో 'కౌసర్' అనే సెలయేరు వద్ద బంగారు గిన్నెలు, వెండి గిన్నెలు ఉంటాయి. వాటి సంఖ్య ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యకు సమానంగా ఉంటుంది. (ముస్లిమ్)

ఖుర్'ఆన్ వెలుగులో ఎలా ఉంటుంది గమనిద్దాం:
1. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి. వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు, కడుపు లోపలి భాగాలు సైతం కరిగిపోతాయి.
(ఖుర్'ఆన్; 22:19-20)
2. నరక వాసుల మెడలకు కంఠపాశాలు, చేతులకు గొలుసులు, కాళ్ళకు సంకెళ్ళు వేసి అగ్నిలో ఈడ్చివేయడం జరుగుతుంది. (ఖుర్'ఆన్; 69:34,35)
3. నరక వాసులకు నరకమే పాన్పు, నరకమే దుప్పటిగా ఉంటుంది. (ఖుర్'ఆన్; 7:41)
4. నరకవాసులకు తాగేందుకు పుండ్ల నుంచి కారే చీము, నెత్తురు అందించడం జరుగుతుంది.
(ఖుర్'ఆన్; 14:16,17) అలాగే నరకవాసులకు దుర్గంధభరితమైన, మరుగుతున్న నీరు ఇవ్వబడుతుంది. ఆ నీరు నోటిలోకి తీసుకున్న వెంటనే ముఖాన్ని మాడ్చివేస్తుంది. (ఖుర్'ఆన్; 18:29)
5. నరకవాసులు తినడానికి, దుర్గంధభరితమైన, చేదైన, ముళ్ళతో కూడిన రాకాశి జముడు (జక్ఖూమ్) చెట్టు ఇవ్వబడుతుంది. (ఖుర్'ఆన్; 37:62)
6. నరకవాసులను దండించేందుకు నరకంలో ఇనుప గదలు ఉంటాయి. (ఖుర్'ఆన్; 14:21,22)
7. నరకవాసులను నరకంలో ఒక ఇరుకైన స్థలంలో కాళ్ళుచేతులు బంధించి కుక్కినప్పుడు వారు చావును పిలవటం ప్రారంభిస్తాడు. (అప్పడు వారితో ఇలా అనబడుతుంది) 'ఈనాడు ఒక చావునే కాదు, ఎన్నో చావుల కోసం అరవండి. (ఖుర్'ఆన్; 25:13,14)
హదీసు వెలుగులో నరకం?
1. నరకంలో ఒంటెల పరిమాణంలో పాములు ఉంటాయి. అవి ఒక్కసారి కాటేస్తే నరకవాసి 40 సంవత్సరాలపాటు విష ప్రభావాన్ని అనుభవిస్తుంటాడు. అలాగే నరకంలో కంచర గాడిదల పరిమాణంలో తేళ్ళు ఉంటాయి. అవి ఒక్కసారి వేస్తె, 40 సంవత్సరాల పాటు నరకవాసి దాని ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. (మస్నదే అహ్మద్)
2. నరకవాసికి చెందిన ఒక దంతం ఉహద్ కొండతో సమానంగా ఉంటుంది. (ముస్లిమ్)
3. నరకవాసులు ఎంతగా రోదిస్తారంటే వారి కన్నీళ్ళలో ఓడలు నడుపవచ్చు. (హాకిమ్)
4. నరకంలో ఒక అవిశ్వాసి బాహువుల మధ్య దూరం వేగంగా పయనించే వాహనం మూడు రోజులు ప్రయాణించే దూరానికి సమానంగా ఉంటుంది. (ముస్లిమ్)
5. నరకవాసి చర్మం మందం 42 చేతులు (దాదాపు 63 అడుగులు) ఉంటుంది. (తిర్మిజీ)
6. నరకవాసి కూర్చుండే స్థలం మక్కా నుండి మదీనా పట్టణం వరకు గల మధ్యదూరానికి సమానంగా (దాదాపు 500 కిలో మీటర్లు) ఉంటుంది. (తిర్మిజీ)
7. ప్రళయ దినాన నరకాన్ని ఈడ్చుకొని వచ్చేందుకు 490 కోట్ల మంది దైవదూతలు నియుక్తులై ఉంటారు. (ముస్లిమ్)

8. నరకం ఏంటో లోతుగా ఉంటుందంటే అందులో పడిన వ్యక్తి దాని అడుగున చేరటానికి 70 సంవత్సరాల కాలం పడుతుంది. (ముస్లిమ్)
స్వర్గంలో అల్లాహ్ దర్శనం
అల్లాహ్ ను దర్శించే సమయంలో స్వర్గవాసుల ముఖాలు సంతోషంతో వెలిగిపోతూ ఉంటాయి.
"ఆ రోజున కొందరి ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటారు." (ఖుర్'ఆన్; 75:22,23)
హజ్రత్ అబూ హురైరా (ర.జి) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రజలు దైవప్రవక్త (స.అ.సం) ను ఈ విధంగా ప్రశ్నించారు. "దైవప్రవక్తా (స.అ.సం) మేము ప్రళయ దినాన మా ప్రభువును చూస్తామా? దైవప్రవక్త (స.అ.సం) ఇలా బదులిచ్చారు. "మీకు పున్నమి నాటి చంద్రుడు చూడడంలో ఏమైనా కష్టం కలుగుతుందా? ప్రజలు "ఓ దైవప్రవక్త (స.అ.సం) కష్టం కలుగదు" అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త (స.అ.సం) తిరిగి ఈ విధంగా పలికారు. "మబ్బులు లేని సమయంలో సూర్యుని చూడడంలో మీకు ఏమైనా కష్టం కలుగుతుందా?" ప్రజలు "లేదు" అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త (స.అ.సం) తిరిగి ఈ విధంగా పలికారు: "అదేవిధంగా (ఎటువంటి కష్టము లేకుండా) మీరు (ప్రళయదినాన) మీ ప్రభువును దర్శిస్తారు." (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)

ఇహ లోకంలో అల్లాహ్ ను దర్శించడం సాధ్యం కాదు:
(لا تدركهل أبصار وهو يدريك الأبصار (قرآن؛6:103
"ఆయనను ఏ చూపులు అందుకోలేవు. ఆయన అన్ని చూపులను అందుకుంటాడు" (ఖుర్'ఆన్; 6:103)
హజ్రత్ అబూజర్ (ర.జి) ఈ విధంగా పేర్కొన్నారు: నేను దైవప్రవక్త (స.అ.సం) ను ఈ విధంగా ప్రశ్నించాను, "మీరు మీ ప్రభువును దర్శించారా? దైవప్రవక్త (స.అ.సం) ఈ విధంగా బదులిచ్చారు. "అల్లాహ్ కాంతి స్వరూపుడు. నేను ఆయనను ఎలా దర్శించగలను. (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
మానవ జాతికి, స్వర్గవాసులకు నరకవాసులకు మధ్య నిష్పత్తి
1000 మందిలో కేవలం ఒక్క మనిషి మాత్రమే స్వర్గానికి వెళ్తాడు. మిగిలిన 999 మంది నరకానికి వెళ్తారు.
హజ్రత్ అబూ సయీద్ (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు. అల్లాహ్ ప్రళయ దినాన హజ్రత్ ఆదమ్ (అ. స) ను సంబోధించి ఈ విధంగా పలుకుతాడు: "ఓ ఆదమ్!" ఆదం (అ.స) ఈ విధంగా పలుకుతారు: "ఓ అల్లాహ్! నేను నీ సేవలో, నీకు విధేయుడనై హాజరై ఉన్నాను. మంచి అనేది నీ చేతుల్లోనే ఉంది" అప్పుడు అల్లాహ్ ఈ విధంగా పలుకుతాడు. "(జీవుల్లో నుంచి) అగ్నికి అర్హులైన వ్యక్తుల సమూహాన్ని వేరు చేయి." హజ్రత్ ఆదమ్ (అ.స) ఈ విధంగా పలుకుతారు: అగ్నికి అర్హులైనవారు ఎంత మంది ఉంటారు? అల్లాహ్ ఈ విధంగా పలుకుతాడు. "1000 మందిలో 999 మన్ది. 'దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పలికారు: 'ఆ సమయంలో పసిపిల్లవాడు వృద్ధుడై పోతాడు (ఆందోళన కారణంగా), గర్భవతుల గర్భాలు రాలిపోతాయి. అలాగే నీవు ప్రజలను స్పృహ కోల్పోయిన స్థితిలో చూస్తావు. వాస్తవానికి వారు స్పృహను కోల్పోరు. నిజానికి అల్లాహ్ శిక్షే అంత కఠినంగా ఉంటుంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (ర.జి) ఇలా పేర్కొన్నారు: దైవ ప్రవక్త (స.అ.సం) సహచరులు ఆందోళన చెంది ఈ విధంగా పలికారు: "ఓ దైవ ప్రవక్త (స.అ.సం)! మరి మాలో ఏ (అదృష్టవంతుడైన) వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు? దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "సంతుష్టులై ఉండండి. యాజూజ్ మాజూజ్ లు (ఈ జీవరాశి సంఖ్యా పరంగా ఎంత ఎక్కువగా ఉంటుందంటే) 999 మంది, మీలోని ఒక వ్యక్తితో ఆ లెక్క పూర్తయి పోతుంది. (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
స్వర్గానికి కొనిపోయే ఆచరణలు కష్టంతో కూడుకున్నవి
స్వర్గం బరువైన, కష్టాన్ని కోరే, మానవ నిజానికి కష్టతరంగా అనిపించే ఆచరణతో నింపివేయబడింది.
హజ్రత్ అబూ హురైర (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "అల్లాహ్ స్వర్గనరకాలను సృజించినప్పుడు దైవదూత హజ్రత్ జిబ్రయీల్ (అ.స) ను స్వర్గానికి పంపించి ఈ విధంగా పలికాడు: "స్వర్గాన్ని సందర్శించి నేను స్వర్గవాసుల కోసం సృజించిన వరానుగ్రహాలను చూడు" దైవదూత హజ్రత్ జిబ్రయీల్ (అ.స) ను స్వర్గాన్ని స్వర్గవాసుల కొరకు సృజించబడి ఉన్న వరానుగ్రహాలను చూసి తిరిగి అల్లాహ్ సన్నిధిలో హాజరై ఈ విధంగా పలికారు. "నీ గౌరవం సాక్షిగా! ఏ వ్యక్తయితే దీని గురించి వింటాడో అతడు తప్పకుండా ఇందులోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అల్లాహ్ తన దూతలను స్వర్గాన్ని కష్టనష్టాలతో నింపివేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత అల్లాహ్ తన దూత అయిన హజ్రత్ జిబ్రాయీల్ (అ.స)ను స్వర్గాన్ని, స్వర్గవాసుల కొరకు తాను సిద్ధం చేసిన వరానుగ్రహాలను చూసి రావలసిందిగా పురమాయించాడు. దైవదూత హజ్రత్ జిబ్రయీల్ (అ.స) వెళ్లి చూడగా అది కష్టాలతో నిండి ఉంది. దానితో ఆయన అల్లాహ్ సన్నిధిలో హాజరై ఈ విధంగా పలికారు. "నీ గౌరవం సాక్షిగా ఇందులో ఎవరూ ప్రవేసించలేరేమో అని భయముగా ఉన్నది" ఆ తర్వాత అల్లాహ్ హజ్రత్ జిబ్రయీల్ (అ.స) ను "ఇప్పుడు నరకం వైపుకు వెళ్లి చూడు అని ఆజ్ఞాపించాడు. అలాగే నేను నరకవాసుల కొరకు సిద్ధం చేసి ఉంచిన శిక్షలు చూసి, దాని ఒక భాగం మరొక భాగం దానిపైకి ఎలా ఎక్కుతున్నదో చూడు" ఆజ్ఞాపించగా హజ్రత్ జిబ్రయీల్ (అ.స) అంతా చూసి వెనుదిరిగి వచ్చి ఈ విధంగా పలికారు: "నీ గౌరవం సాక్షిగా!దీని గురించి విని కూడా ఇందులో ప్రవేశించే వ్యక్తి ఎవరూ ఉండరు." అప్పుడు అల్లాహ్ ఆదేశానుసారం నరకం మనోకాంక్షలతో, భోగాలతో కప్పివేయబడింది. ఆ తర్వాత అల్లాహ్ హజ్రత్ జిబ్రయీల్ (అ.స) ని మరలా నరకాన్ని చూసి రావలసినదిగా పురమాయించాడు. హజ్రత్ జిబ్రయీల్ (అ.స) రెండవ సారి నరకానికి వెళ్లి, (అంతా చూసి) తిరిగి వచ్చి ఈ విధంగా పలికాడు. "నీ గౌరవం సాక్షిగా! ఇప్పుడైతే ఎవరూ దీని నుంచి రక్షింపబడరేమోనని, ప్రతి వ్యక్తి ఇందులో ప్రవేసిస్తాడేమోనని భయంగా ఉంది". (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, హసన్)
స్వర్గాన్ని పొందేందుకు తీవ్రంగా శ్రమించవలసిన అవసరం ఉంది.
హజ్రత్ అబూ హురైర (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "భయపడిన వ్యక్తి పరుగెత్తాడు, పరుగెత్తిన వ్యక్తి గమ్యానికి చేరుకున్నాడు. వినండి, అల్లాహ్ సామాను ఎంతో ఖరీదైనది, అల్లాహ్ సామాను స్వర్గమనే విషయాన్ని తెలుసుకోండి." (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, హసన్)
వరానుగ్రహాలతో కూడిన స్వర్గాన్ని కోరిన వాడు ఇహలోకంలో ఏనాడు సుఖంగా నిద్రించలేడు.
హజ్రత్ అబూ హురైర (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "నేను నరకానికి దూరంగా పరుగెత్తే ఏ వ్యక్తినీ నిద్రిస్తుండగా చూడలేదు. అలాగే స్వర్గాన్ని కోరుకునే ఏ అభిలాషినీ నిద్రిస్తుండగా చూడలేదు." (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, హసన్)
విశ్వాసి కోసం ఇహలోకం ఒక బందీఖానా:
హజ్రత్ అబూ హురైర (ర.జి) ఉల్లేఖనం ప్రకారం, దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా అన్నారు: "ఇహలోకం విశ్వాసి కోసం బందీఖానా అయితే, అవిశ్వాసి కొరకు స్వర్గం." (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
స్వర్గంలోకి ప్రవేశించేవారు ఎవరు?
మృదు స్వభావులు, నిస్సహాయులు, సాధు స్వభావులు, అనునిత్యం అల్లాహ్కు భయపడేవారు, ఇతరులకు హాని చేయనివారు, సహనశీలురు స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
హజ్రత్ అబూ హురైరా (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా ప్రబోధించారు: "స్వర్గంలో పక్షులవలె మెత్తని హృదయం గలవారు ప్రవేశిస్తారు." (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
మృదు స్వభావులు, నిస్సహాయులు, సాధు స్వభావులు, అందరికీ ప్రీతిపాత్రులయిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: మృదు స్వభావం గలవారు, మంచి మనసు గలవారు, ప్రజలకు ప్రీతిపాత్రులైన ప్రతీ వ్యక్తిపై నరకం నిషిద్ధం చేయడం జరిగింది. (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు, సహీహ్)
దైవ ప్రవక్త (స.అ.సం) కు విధేయులుగా మసలుకునేవారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు:
హజ్రత్ అబూ హురైర (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "నా అనుచర మొత్తం స్వర్గంలోకి ప్రవేశిస్తుంది, తిరస్కరించిన వ్యక్తి తప్ప. దైవ ప్రవక్త (స.అ.సం) సహచరులు (ర.జి) ఈ విధంగా ప్రశ్నించారు, "ఓ దైవ ప్రవక్త (స.అ.సం)! ఎవరు తిరస్కరించారు?" దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పలికారు: "ఏ వ్యక్తి అయితే నాకు విధేయుడై మేలిగాడో అతడు స్వర్గంలో ప్రవేశించాడు. ఏ వ్యక్తి అయితే నా పట్ల అవిధేయుడై మేలిగాడో అతడు తిరస్కరించాడు." (దీనిని బుఖారి ఉల్లేఖించారు)
అల్లాహ్ ప్రీతి కొరకు ఏ వ్యక్తయితే ప్రతిరోజూ 12 రకాతుల నమాజ్ (ఫజర్ నమాజ్ కు ముందు 2 రకాతులు, జుహర్ కు ముందు 4 రకాతులు, తర్వాత 2 రెండు రకాతులు, మగ్రిబ్ నమాజ్ తర్వాత 2 రకాతులు, ఇషా నమాజ్ తర్వాత 2 రకాతులు) చదువుతాడో అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
దైవ ప్రవక్త (స.అ.సం) సతీమణి అయిన హజ్రత్ ఉమ్మె హబీబా (ర.జి) తాను దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నట్లు విన్నట్లుగా ఉల్లేఖించారు: "ఏ వ్యతయితే అల్లాహ్ ప్రీతి కొరకు ప్రతి రోజూ ఫరాజ్ నమాజులతో పాటు 12 రకాతులు నఫిల్ నమాజులు చదువుతాడో అల్లాహ్ అతడి కొరకు స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు." (ముస్లిమ్)

బంధు మిత్రులతో మంచిగా ప్రవర్తించేవారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు:
హజ్రత్ అబూ అయ్యూబ్ (ర.జి) ఈ విధంగా పేర్కొనారు: ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స.అ.సం) సన్నిధిలో హాజరై ఈ విధంగా పలికాడు: "నన్ను నరకానికి దూరం చేసి స్వర్గానికి చేరువ చేసే ఆచరణ ఏదయినా ఉంటె నాకు తెలపండి"దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పలికారు: "అల్లాహ్ కు దాస్యం చెయ్యి, ఆయన దైవత్వంలో మరెవరినీ భాగస్వాములుగా ఎంచకు, నమాజ్ ను స్తాపించు, జకాత్ చెల్లించు. అలాగే కరుణ గలవారితో సంబంధాలను పటిష్టంగా ఉంచుకో." ఆ వ్యక్తి వెనుదిరిగినప్పుడు దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పలికారు: "ఏఏ విషయాలైతే అతడికి ఆదేశించబాడ్డాయో ఒకవేళ అతడు వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే స్వర్గంలోకి ప్రవేసిస్తాడు." (దీనిని ములిమ్ ఉల్లేఖించారు)
సద్గుణ సంపన్నులు, తహజ్జుద్ నమాజ్ చదివేవారు, తరచుగా నఫిల్ ఉపవాసాలు పాటించేవారు, ఇతరులకు ఆహారం తినిపించేవారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
హజ్రత్ అలీ (ర.జి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "స్వర్గంలో ఎటువంటి భవంతులున్నాయంటే వాటి లోపల నిల్చుంటే బయట ఉన్న ప్రతి వస్తువు కనబడుతుంది. అలాగే బయట నిల్చుంటే లోపల ఉన్న ప్రతి వస్తువూ కనిపిస్తుంది." ఇంతలో ఒక గ్రామీణులు లేచి ఇలా ప్రశ్నించాడు: "ఓ దైవ ప్రవక్త (స.అ.సం)! అది ఎటువంటి వ్యక్తి కొరకు?" దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా బదులిచ్చారు: "ఏ వ్యతయితే మంచి మాటను పలుకుతాడో, అన్నం తినిపిస్తాడో, తరచుగా ఉపవాసాలుంటాడో, ప్రజలు గాఢనిద్రలో ఉండే సమయంలో లేచి నమాజ్ చదువుతాడో అటువంటి వ్యక్తి కొరకు." (తిర్మిజీ)
న్యాయ వంతుడైన పరిపాలకుడు, ఇతరులను కనికరించేవాడు, మెత్తని హృదయం గల వ్యక్తి, పవిత్రుడు, ఇతరులను యాచించని వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హజ్రత్ అయ్యాజ్ బిన్ హిమార్ ముజాషిఈ (రజి) ఈ విధంగా ఉల్లేఖించారు: దైవ ప్రవక్త (స.అ.సం) ఒకరోజు తన ప్రసంగంలో ఈ విధంగా పేర్కొన్నారు: "మూడు రకాల ప్రజలు స్వర్గంలో ప్రవేశిస్తారు: 1. న్యాయవంతుడైన పరిపాలకుడు, సత్యం పలికేవాడు, సత్కార్యాలు చేసే సమృద్ధి ప్రసాదించబడినవాడు 2. ప్రతి సంబందీకుని పట్ల ప్రతి ముస్లిం పట్ల కరుణతో వ్యవహరించేవాడు, మెత్తని హృదయం గలవాడు 3. శీలవంతుడైన, సంతానం కలిగి వుండి కూడా యాచించని వ్యక్తి." (ముస్లిమ్)
అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని విశ్వసించడం పట్ల ఆనందించేవారు, ఇస్లామ్ ను సంపూర్ణ సమ్మతితో తమ ధర్మంగా భావించేవారు స్వర్గంలో ప్రవేశిస్తారు.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యతయితే 'నేను అల్లాహ్ ప్రభువు అనడం పట్ల, ఇస్లాం ధర్మం అవడం పట్ల, హజ్రత్ ముహమ్మద్ (స.అ.సం) దైవ ప్రవక్త అవడం పట్ల, సంతుష్టి చెందాను' అని పలికాడో అతడి కొరకు స్వర్గం తప్పనిసరి కావించబడింది." (అబూ దావూద్)
ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మంది కుమార్తెలకు ధార్మిక విద్యను బోధించి వారు యవ్వనావస్థకు చేరుకున్నప్పుడు సత్పురుషులకు ఇచ్చి వారి వివాహాన్ని జరిపించే వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేసిస్తాడు.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) " ఏ వ్యక్తయితే ఇద్దరు కుమార్తెలను వారు యవ్వనావస్థకు చేరుకునేంత వరకు పెంచుతాడో ఆ వ్యక్తి, నేను ప్రళయదినాన ఈ విధంగా వస్తాము" అని తన వేళ్ళను పరస్పరం కలిపివేశారు. (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
వుజూ చేసిన తర్వాత 2 రకాతుల నఫిల్ నమాజ్ (తహియ్యతుల్ వుజూ) ను శ్రద్ధగా చదివే వ్యక్తి స్వర్గంలో ప్రవేసిస్తాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఈ విధంగా పేర్కొన్నారు: దైవ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స.అ.సం) ఒకరోజు ఫజర్ నమాజ్ తర్వాత హజ్రత్ భిలాల్ (రజి) ను ఈ విధంగా ప్రశ్నించారు: "ఓ భిలాల్! ఇస్లాంను స్వీకరించిన తర్వాత నే యొక్క ఏ ఆచరణ నీకు ముక్తి లభిస్తుందని ఆశిస్తున్నావు? ఎందుకంటే ఈ రోజు రాత్రి నేను స్వర్గంలో నా ముందు నీవు నడిచిన శబ్దాన్ని విన్నాను" హజ్రత్ భిలాల్ (రజి) ఈ విధంగా పేర్కొన్నారు: "పగటి పూట రాత్రి పూట ఎప్పుడైతే నేను వుజూ చేస్తానో అప్పుడు అల్లాహ్ సమ్మతించినంత మేరకు నమాజ్ చదువుతాను. ఇంతకు మించి ముక్తి కొరకు నేను ఆసలు పెట్టుకోదగ్గ ఆచరణ మరేది లేదు." (దీనిని బుఖారి మరియు ముస్లిమ్ ఉల్లేఖించారు)
నమాజులు శ్రద్ధగా చదివే, ఉపవాసాలు క్రమం తప్పకుండా పాటించే, శీలవతి, భర్తకు విదేయురాలైన స్త్రీలు స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ స్త్రీ అయితే ప్రతిజోజు ఐదు పూటలు నమాజ్ చాడువుతుందో, రమజాన్ నెలలో ఉపవాసాలు ఉంటుందో, తన శీలాన్ని సంరక్షించుకుంటుందో, తన భర్తకు విధెయురాలిగా నడుచుకుంటుందో (ప్రళయదినాన) ఆమెతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది: 'స్వర్గపు (ఎనిమిది) ద్వారాల్లో నేకు ఇష్టమైన ద్వారం గుండా ప్రవేశించు" (దీనిని ఇబ్నె హబ్బాన్ ఉల్లేఖించారు, సహీహ్)
దైవ ప్రవక్తలు, దైవ మార్గంలో వీరమరణం పొందిన యోధులు మరియు విశ్వాసులకు చెందిన మరణించిన చిన్నపిల్లలు, సజీవంగా పాటి పెట్టబడిన అమ్మాయిలు స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
హజ్రత్ ముఆవియహ్ (రజి) కుమార్తె అయిన హజ్రత్ హస్ నా (రజి) ఈ విధంగా పేర్కొన్నారు: మాకు మా పినతండ్రి ఈ హదీసును తెలిపారు: స్వర్గంలో ఎవరెవరు ప్రవేశిస్తారని, దైవ ప్రవక్త (స.అ.సం) ను నేను వాకబు చేయగా దైవప్రవక్త (స.అ.సం) ఈ విధంగా సమాధానమిచ్చారు. "దైవప్రవక్త స్వర్గంలోకి ప్రవేసిస్తాడు, దైవ మార్గంలో వీరమరణం పొందిన యోధుడు స్వర్గంలోకి ప్రవేసిస్తాడు, మరణించిన శిశువు స్వర్గం లోకి ప్రవేశిస్తుంది. అలాగే సజీవంగా పాతిపెట్టబడిన బాలిక స్వర్గంలోకి ప్రవేశిస్తుంది. (దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు; సహీహ్)
అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మ యుద్ధం) చేసేవారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు
హజ్రత్ మఅజ్ బిన్ జబల్ (రజి) ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ ముహమ్మద్ (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తి అయితే ఒంటె పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంట సమయం వరకు అల్లాహ్ మార్గంలో పోరాడాడో అతడిపై స్వర్గం తప్పనిసరి కావించబడింది." (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, సహీహ్)
అనాధను పోషించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "తన బందువైనా లేదా బంధువు కాని అనాధను పోషించే వ్యక్తి, నేను స్వర్గంలో ఈ రెండు వేళ్ళ వలె (తోడుగా) ఉంటాము" ఇమామ్ మాలిక్ (ర.అ) తన చూపుడు వేలు మరియు మధ్య వేలి ద్వారా సూచిస్తూ తెలిపారు." (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
స్వీకర యోగ్యమైన హజ్ చేసే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఉమ్రహ్ అనేది ప్రస్తుతం చేయబడే ఉమ్రహ్ కు, చివరిసారి చేయబడిన ఉమ్రహ్ కు నడుమ చేయబడిన పాపాలకు పరిహారమవుతుంది. ఇక శ్వీకారయోగ్యమైన హజ్ కు ప్రతిఫలమయితే స్వర్గమే." (దీనిని బుఖారి, ముస్లిమ్ ఉల్లేఖించారు)

మస్జిద్ ను నిర్మించే వ్యక్తి స్వర్గంలో ప్రవేసిస్తాడు.
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే అల్లాహ్ కొరకు మస్జిద్ ను నిర్మిస్తాడో అతడి కొరకు అల్లాహ్ స్వర్గంలో అటువంటి ఇంటినే నిర్మిస్తాడు." (ముస్లీం)
తమ మర్మావయాలను, నాలుకను సంరక్షించుకునేవారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
హజ్రత్ సహల్ బిన్ సఅద్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే తన రెండు దవడల మధ్య ఉన్నదాని (నాలుక) విషయంలోనూ, తన రెండు కాళ్ళ మధ్య ఉండే (మర్మావయవం) విషయంలోనూ హామీ ఇచ్చినట్లయితే నేను అతడికి స్వర్గలోక ప్రవేశానికి సంబంధించిన హామీ ఇస్తున్నాను" (దీనిని బుఖారి ఉల్లేఖించారు)
తమ పొరుగువారి పట్ల మంచిగా వ్యవహరించే వ్యక్తి స్వర్గంలో ప్రవేసిస్తాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఈ విధంగా పేర్కొన్నారు; ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స.అ.సం) సన్నిధిలో హాజరై ఈ విధంగా పలికాడు: "ఓ దైవప్రవక్తా!(స.అ.సం) ఫలానా స్త్రీ పగటి పూట ఉపవాసముంటుంది, రాత్రి వేళ నమాజ్ చదువుతుంది, కానీ తన పొరుగువారికి కష్టం కలిగిస్తుంది" దైవప్రవక్త (స.అ.సం) ఇలా పేర్కొన్నారు: ఆ స్త్రీ నరకవాసి" ఆ తర్వాత దైవ ప్రవక్త (స.అ.సం) సహచరులు (రజి) (మరొక స్త్రీ విషయంలో) ఈ విధంగా ప్రశ్నించారు: "ఫలానా స్త్రీ కేవలం ఫరాజ్ నమాజులు మాత్రమే చదువుతుంది, అయితే వెన్న ముద్దలు దానం చేస్తుంది. కానీ పొరుగువారికి కష్టం కలిగించదు." దైవప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఆ స్త్రీ స్వర్గవాసి". (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు; సహీహ్)
అల్లాహ్ కు చెందిన 99 పేర్లను కంఠస్థం చేసిన వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా పేర్కొన్నారు: "అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నాయి. ఏ వ్యక్తయితే వాటిని గుర్తించుకుంటాడో ఆ వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు." (దీనిని బుఖారి, ముస్లిమ్ ఉల్లేఖించారు)
ఖుర్'ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఖుర్'ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించినప్పుడు అతడితో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. "ఖుర్'ఆన్ ను పఠిస్తూ ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ వెళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి (తాను పఠించే) ప్రతి ఖుర్'ఆన్ వాక్యానికి బదులుగా ఒక్కొక్క స్థానాన్ని అధిరోహిస్తూ పోతాడు. చివరకు తనకు గుర్తున్న చివరి వాక్యం దగ్గర ఆగిపోతాడు. అదే అతడి (శాశ్వత) స్థానం అయి ఉంటుంది." (దీనిని ఇబ్నె మాజా ఉల్లేఖించారు;సహీహ్)
ఎక్కువ సార్లు సలాం చేసేవారు స్వర్గానికి వెళ్తారు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా పేర్కొన్నారు: "ప్రజలారా! సలాం చేసే సాంప్రదాయాన్ని వ్యాపింపజేయండి. (ప్రజలకు) అన్నం తినిపించండి, ప్రజలు నిద్రించే సమయంలో నమాజ్ చేయండి. (ఈ ఆచరణల పర్యవసానంగా) శ్రేయకరమైన రీతిలో స్వగంలోకి ప్రవేశిస్తారు." (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు సహీహ్)
వ్యాధిగ్రస్తుని పరామర్శించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
హజ్రత్ సూబాన్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా పేర్కొన్నారు: "వ్యాధిగ్రస్తుని పరామర్శించే వ్యక్తి తిరిగి వచ్చేంత వరకు స్వర్గలోకపు వనంలో ఉంటాడు." (దీనిని ముస్లిం ఉల్లేఖించారు)
అల్లాహ్ ప్రసన్నత కొరకు ధార్మిక జ్ఞానాన్ని ఆర్జించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) కథనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే ధార్మిక జ్ఞానాన్ని అర్జిచేందుకై మార్గాన్ని అధిగామిస్తాడో అతడి కొరకు అల్లాహ్ స్వర్గలోకపు మార్గాన్ని (అధిగమించడాన్ని) సుగమం చేస్తాడు. (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
నరియైన రీతిలో వుజూ చేసి 'కలిమయె షహాదత్' చదివే వ్యక్తి స్వర్గంలో ప్రవేసిస్తాడు.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "మీలో ఏ వ్యక్తయితే సరియైన రీతిలో వుజూ చేసి 'అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న మొహమ్మదన్ అబ్దుహు వ రాసూలుహు' (అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడని, హజ్రత్ ముహమ్మద్ (స.అ.సం) అల్లాహ్ దాసులు మరియు ఆయన చే పంపబడ్డ చిట్టచివరి దైవ ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.' అని పలుకుతాడో అతడి కొరకు స్వర్గలోకపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి. వాటిలో నుంచి తాను కోరిన ద్వారం గుండా అతడు స్వర్గంలోకి ప్రవేసించగలడు. (ముస్లిమ్)
ఉదయం మరియు సాయంత్రం 'సయ్యదుల్ ఇస్తిగ్ఫార్'ను పఠించే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: అన్నింటి కంటే ఉత్తమమైన ఇస్తిగ్ఫార్ ఇది:
"అల్లాహుమ్మ అన్ త రబ్బీ లా ఇలాహ ఇల్లా అన్ త ఖలఖ్తనీ వ అన
అబ్డుక వ అన అలా అహ్ దిక వ వఅదిక మస్ తఅతు అఊజుబిక
మిన్ షర్రి మాసనఅతు అబూఅ లక బినిఅమతిక అలయ్య అబూఉ
బిజంబీ ఫగ్ఫిర్లి ఫ ఇన్నహు లా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అన్ త"
"ఓ అల్లాహ్ నీవు నా ప్రభువు వి నీవు తప్ప ఆరాధ్యుడు లేడు. నీవే నన్ను పుత్తించావు. నేను నీ దాసుడిని. నేను నీతో చేసిన వాగ్దానానికి నా శక్తిమేరకు కట్టుబడి ఉన్నాను. నేను చేసిన చెడ్డ పనుల భారం నుంచి నీ రక్షణ కోరుతున్నాను. నాకు నీవు చేసిన మేళ్లను అంగీకరిస్తున్నాను. అలాగే నేను చేసిన పాపాలను అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించు. ఎందుకంటే నీవు తప్ప పాపాలను క్షమించేవారెవరు లేరు." దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే ఈ వాక్యాలను విశ్వాసంతో పగటిపూట పఠించి సాయంత్రానికి ముందు మరణించినట్లయితే స్వర్గంలోకి ప్రవేసిస్తాడు. అలాగే ఏ వ్యక్తయితే రాత్రి వేళ పఠించి తెల్లవారక ముందే మరణించినట్లయితే స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
(దీనిని బుఖారి ఉల్లేఖించారు)
ఒక వ్యక్తి కంటిచూపు అంతరించినప్పుడు ఆ వ్యక్తి సహనం వహిస్తే స్వర్గంలోకి ప్రవేసిస్తాడు.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: అల్లాహ్ ఈ విధంగా పేర్కొంటున్నాడు: "నా దాసుడిని నేను అతడికి ప్రియమైన రెండు వస్తువుల (కళ్ళ) ద్వారా పరీక్షించినప్పుడు అతడు సహనం వహించినట్లయితే అందుకు ప్రతిఫలంగా నేను అతడికి స్వర్గాన్ని ప్రసాదిస్తాను. (దీనిని బుఖారి ఉల్లేఖించారు)
తల్లిదండ్రులకు సేవ చేసే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేసిస్తాడు:
హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "తన తల్లిదండ్రుల్లో ఇద్దరినీ లేదా ఒకరిని వారు వృద్ధాప్యంలో ఉండగా పొంది కూడా ఏ వ్యక్తి అయితే (వారి ప్రసన్నతను పొంది) స్వర్గంలోకి ప్రవేసించడో అతడి ముక్కుకు మట్టి అంటుకోనుగాక, అతడు అవమానం పొందుగాక, నాశనమవుగాక." (దీనిని ముస్లిం ఉల్లేఖించారు)

ముస్లింల ఆందోళనలను లేదా కష్టాన్ని దూరం చేసే వ్యక్తి స్వర్గంలోకిప్రవేశిస్తాడు:
హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఒక చెట్టు ముస్లిములకు కష్టం కలిగిస్తూ ఉండేది. ఒక వ్యక్తి వచ్చి ఆ చెట్టును కోసివేసి స్వర్గంలోకి ప్రవేశించాడు. (దీనిని ముస్లిం ఉల్లేఖించారు)
వ్యాధి పట్ల సహనం వహించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు:
హజ్రత్ ఆతా బిన్ అబీ రిబాహ్ (రజి) ఈ విధంగా పేర్కొన్నారు: హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజి) నాతొ ఈ విధంగా పలికారు. "నేను మీకు స్వర్గవాసి అయిన స్త్రీని చూపించనా?" నేను "తప్పకుండా చూపించండి" అని అన్నాను. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజి) (ఒక స్త్రీని సూచిస్తూ) ఈ విధంగా పలికారు. "ఈ నల్లని స్త్రీ, దైవ ప్రవక్త (స.అ.సం) సన్నిధిలో హాజరై ఈ విధంగా పలికింది. 'నేను మూర్ఛ వ్యాధితో బాధ పడుతున్నాను. (మూర్ఛ వచ్చే సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే కారణంగా) నా శరీరంపై వస్త్రాలు తోలిగిపోతున్నాయి. కనుక మీరు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించవలసినదిగా అల్లాహ్ ను నా కొరకు ప్రార్ధించండి." దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఒకవేళ నీవు కోరుకుంటే సహనం వహించు. నీ కొరకు ప్రార్థిస్తాను. ఆయన నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. (అటువంటి సమయంలో స్వర్గ ప్రవేశానికి వాగ్దానం చేయను)" ఆ స్త్రీ ఇలా పలికింది: "నేను సహనం వహిస్తాను. అయితే మూర్ఛ వచ్చే సమయంలో నా వస్త్రాలు శరీరంపై నుంచి తోలిగిపోకుండా ఉండేందుకు అల్లాహ్ ను ప్రార్ధించండి" దైవ ప్రవక్త (స.అ.సం) ఆమె కొరకు ఆ విధంగా ప్రార్ధించారు." (దీనిని బుఖారి ఉల్లేఖించారు)
దైవప్రవక్త, దైవ మార్గంలో అమరగతిని పొందిన వ్యక్తి, పుట్టిన వెంటనే మరణించే శిశువు, అల్లాహ్ ప్రసన్నత కొరకు తన సోదరుని కలుసుకునే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
తన భర్తను ప్రేమించే, ఎక్కువ మంది పిల్లల్ని కనే శ్రమ తీసుకునే, తన భర్త హింస పట్ల సహనం వహించే స్త్రీ స్వర్గంలోకి ప్రవేశిస్తుంది.
హజ్రత్ కఅబ్ బిన్ ఉజ్రహ్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "స్వర్గంలోకి ప్రవేసించే పురుషుల గురించి మీకు తెలుపనా? (వినండి) దైవ ప్రవక్త స్వర్గవాసి, దైవ మార్గంలో మరణించే వ్యక్తి స్వర్గవాసి, సత్యసంధుడు స్వర్గవాసి, పుట్టిన వెంటనే మరణించే శిశువు స్వర్గవాసి, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు దూరం నుంచి తన సోదరుని కలుసుకునే వ్యక్తి స్వర్గవాసి. స్వర్గంలోకి ప్రవేశించే స్త్రీల గురించి తెలుపనా? తన భర్తను ప్రేమించే, ఎక్కువమంది పిల్లల్ని కనే శ్రమ తీసుకునే, భర్త హింసిస్తే 'నా చేయి నీ చేతిలో ఉంది. నీవు సంతుష్టుడివి కానంత వరకు నేను నిద్రించను' అని పలికే సాధ్వీమణి అయిన స్త్రీ స్వర్గవాసి." (దీనిని తిబ్రానీ ఉల్లేఖించారు; హసన్)
ఇస్లామీయ శాసనాంగంలో ధర్మ సమ్మతమైన వస్తువులను ధర్మసమ్మతమైనవిగా, నిషిద్ధమైనవాటిని నిషిద్ధమైనవిగా తెలుసుకొని వాటి ప్రకారం ఆచరించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ జాబిర్ (రజి) ఈ విధంగా ఉల్లేఖించారు: ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స.అ.సం)ను ఈ విధంగా ప్రశ్నించాడు: "ఓ దైవ ప్రవక్త (స.అ.సం)! ఒకవేళ ఫరాజ్ నమాజులు చదివినట్లయితే, రమజాన్ నెలలో ఉపవాసాలుంటే, ఇస్లామీయ శాసానాంగంలో ధర్మ బద్ధమైన వాటిని ధర్మబద్ధమైనవిగా, నిషిధమైనవాటిని నిషిద్ధమైనవిగా గ్రహించి, అంతకు మించి మరేమీ చేయకుంటే నేను స్వర్గంలో ప్రవేసిస్తానా?" అందుకు దైవ ప్రవక్త (స.అ.సం), 'అవును' అని అన్నారు.
(దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
యుక్త వయస్సుకు చేరుకోకుండానే ఇద్దరు పిల్లలు మరణించడం పట్ల సహనం వహించే తల్లిదండ్రులు స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఈ విధంగా ఉల్లేఖించారు: దైవ ప్రవక్త (స.అ.సం) అన్సారీ స్త్రీలతో ఈ విధంగా పేర్కొన్నారు: "మీలో ఏ స్త్రీ యొక్క ముగ్గురు పిల్లలైనా మరణించి నప్పుడు ఆమె అల్లాహ్ ప్రసన్నత కొరకు సహనం వహించినట్లయితే స్వర్గంలోకి ప్రవేశిస్తుంది." ఒక స్త్రీ ఈ విధంగా ప్రశ్నించింది: "ఓ దైవ ప్రవక్త (స.అ.సం)! ఒకవేళ ఇద్దరు పిల్లలు మరణించినట్లయితే ఆ స్త్రీ విషయమేమిటి?" దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా బదులిచ్చారు: "ఒకవేళ ఇద్దరు (పిల్లలు) మరణించినప్పటికీ ఆ పుణ్యఫలం లభిస్తుంది." (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
ప్రతి నమాజ్ తర్వాత 'ఆయతల్ కుర్సీ'చదివే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హజ్రత్ అబూ ఉమామహ్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ప్రతి నమాజ్ తర్వాత ఆయతల్ కుర్సీ ని చదివే వ్యక్తిని మృత్యువు తప్ప ఏ వస్తువు స్వర్గంలోకి ప్రవేశించకుండా అడ్డుకోజాలదు."
(దీనిని నిసాయీ, ఇబ్నె హబ్బాన్ మరియు తిబ్రానీ ఉల్లేఖించారు: సహీహ్)
"లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్" అనే వాక్యాన్ని విరివిగా పఠించే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హజ్రత్ అబూ జర్ (రజి) ఈ విధంగా పేర్కొన్నారు: నాతొ దైవ ప్రవక్త (స.అ.సం)ఈ విధంగా పలికారు: "నేను నీకు స్వర్గలోక ఖజానా లోనుంచి ఒక ఖజానా గురించి వివరించనా?" నేను ఇలా పలికాను: "ఓ దైవ ప్రవక్త (స.అ.సం)! తప్పకుండా వివరించండి. అప్పుడు దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా పలికారు. 'లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్' (మంచి చేసేందుకు, చెడు నుంచి రక్షించబడేందుకు శక్తి అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుంది)" (దీనిని ఇబ్నె మాజాహ్ ఉల్లేఖించారు, సహీహ్)
"సుభానల్లాహిల్ అజీమీ వబిహమ్ దిహీ" అనే వాక్యాన్ని విరివిగా పఠించే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హజ్రత్ జాబిర్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: నాతొ దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పలికారు; "ఏ వ్యక్తయితే 'సబ్ హానల్లాహిల్ అజీమీ వబిహమ్ దిహీ'(సర్వోన్నతుడైన అల్లాహ్ తన స్తోత్రంతో సహా పరమ పవిత్రుడు) అని పలుకుతాడో అతడి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది."
(దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు; సహీహ్)
ఏ వ్యక్తయితే తన సంపద కారణంగా హతమార్చబడతాడో అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే తన సంపద కారణంగా హతమార్చబడతాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు."
(దీనిని నసాయి ఉల్లేఖించారు;సహీహ్)
ఏ స్త్రీ అయితే గర్భ శ్రావం జరగడం పట్ల సహనం వహిస్తుందో ఆమె స్వర్గంలోకి ప్రవేశిస్తుంది.
హజ్రత్ మఅజ్ బిన్ జబల్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఎవరి అధీనం లోనైతే నా ప్రాణముందో ఆ అస్తిత్వం సాక్షిగా! గర్భస్రావం జరిగిన కారణంగా మరణించిన శిశువు తన తల్లిని వేలు పట్టుకొని స్వర్గానికి తీసుకు వెళ్తుంది. అయితే ఆ స్త్రీ పుణ్యఫలం పొందే ఉద్దేశ్యంతో సహనం వహించినప్పుడే అలా జరుగుతుంది." (దీనిని ఇబ్నె మాజాహ్ ఉల్లేఖించారు; సహీహ్)
సత్యం ప్రకారం తీర్పు చేసే నాయ మూర్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ బురైదాహ్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఇద్దరు న్యాయమూర్తులు నరకానికి వెళ్తారు. ఒక న్యాయమూర్తి స్వర్గానికి వెళ్తాడు. సత్యాన్ని గుర్తించి దానికనుగుణంగా తీర్పు చేసిన న్యాయమూర్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. ఇక సత్యాన్ని గుర్తించినప్పటికీ, తెలిసీ దౌర్జనానికి పాల్పడిన (సత్యానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన) న్యాయమూర్తి మరియు సరియైన రీతిలో శోధించకుండా, విచారించకుండా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి నరకానికి వెళ్తారు." (దీనిని హాకిమ్ ఉల్లేఖించారు; సహీహ్)
ఒక ముస్లిమ్ సోదరుడు లేని సమయంలో అతని గౌరవాన్ని పరిరక్షించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ అస్ మా బింతె యజీద్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే ముస్లిం సోదరుడు లేని సమయంలో అతడి గౌరవాన్ని పరిరక్షిస్తాడో అతడు అల్లాహ్ చే నరకాగ్ని నుంచి విముక్తిని పొందే హక్కును కలిగి ఉన్నాడు." (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు; సహీహ్)
ఎవరినీ యాచించని వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ సూబాన్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే తాను ఎవరినీ యాచించనని నాకు హామీ ఇస్తాడో, నేను అతడికి స్వర్గపు హామీ ఇస్తాను."
(దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు; సహీహ్)
కోపాన్ని దిగమింగే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హజ్రత్ అబూ దర్దా (రజి)ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఆగ్రహాన్ని లోనుకాకు నీ కొరకు స్వర్గమున్నది" (దీనిని తిబ్రానీ ఉల్లేఖించారు; సహీహ్)
అసర్ మరియు ఫజర్ నమాజులను జామా అత్ తో కలిసి శ్రద్ధగా చదివే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ అబూ బకర్ బిన్ అబూ మూసా ఆష్అరీ (రజి) తన తండ్రి ద్వారా దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నట్లుగా ఉల్లేఖించారు: "ఏ వ్యక్తయితే చల్లని సమయాల్లో చదువబడే రెండు నమాజులు చదివాడో అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు." (దీనిని ముస్లిమ్ ఉల్లేఖించారు)
జుహర్ నమాజుకు ముందు 4 రకాతుల సున్నత్ నమాజును క్రమం తప్పకుండా చదివే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ ఉమ్మె హబీబా (రజి) ఉల్లేఖనం ప్రాకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే జుహర్ నమాజ్ కు ముందు 4 రకాతులు నమాజ్ చదువుతాడో అతడి కొరకు అల్లాహ్ నరకాగ్నిని నిషేధించాడు."
(దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు; సహీహ్)
నిరంతరాయంగా 40 రోజుల పాటు 'తక్బీరే ఊలా' (నమాజ్ ప్రారంభించే సమయంలో 'అల్లాహు అక్బర్' పలకడం) ను సైతం విడచి పెట్టకుండా ప్రతిరోజూ ఐదు పూటలు నమాజ్ చదివిన వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే 40 రోజులపాటు (ఐదు నమాజులు) తక్బీరే ఊలాను సైతం విడచిపెట్టకుండా జామా అత్ తో కలిసి నమాజ్ చదివాడో అతడి కొరకు రెండు విషయాల నుంచి విముక్తి వ్రాయబడింది. ఒకటి నరకాగ్ని నుంచి, రెండు కాపత్యం నుంచి."
(దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు; హసన్)
క్రింద పేర్కొనబడిన వ్యక్తులు స్వర్గానికి అర్హులు:
- న్యాయవంతుడైన పరిపాలకుడు
- యవ్వనంలో దైవారాధన పట్ల ఆసక్తి గల వ్యక్తి
- ఎక్కువ సమయం మస్జిదులో గడిపే వ్యక్తి
- అల్లాహ్ కొరకు ఇతరులను ప్రేమించే వ్యక్తి
- ఏకాంతంలో అల్లాహ్ పట్ల భయంతో ఏడ్చే వ్యక్తి
- అల్లాహ్ పట్ల భయంతో అందమైన యువతి పాపకార్యం వైపుకు ఆహ్వానించినా ఆగిపోయే వ్యక్తి
- అల్లాహ్ మార్గంలో గుప్తంగా దానాలు చేసే వ్యక్తి
ఇతరులను క్షమించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ మఅజ్ బిన్ అనస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే ప్రతీకారం తీర్చుకునేందుకు పూర్తిగా శక్తిని కలిగి ఉన్నప్పటికీ (ప్రతీకారం తీర్చుకోకుండా) కోపాన్ని దిగమింగుతాడో (ప్రళయదినాన) అల్లాహ్ ఆ వ్యక్తిని ప్రజలందరి ముందు పిలిచి 'నీకు ఇష్టమైన స్వర్గలోకపు సుకన్యలను వివాహమాడు' అని పేర్కొంటాడు." (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు; హసన్)
అహంకారం, అవినీతి ఋణాల నుంచి దూరంగా ఉండే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.
హజ్రత్ సూబాన్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే అహంకారం, అవినీతి, ఋణాలు లేని స్థితిలో మరణిస్తాడో అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు." (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు; సహీహ్)
అజాన్ (నమాజ్ కొరకు పిలుపు) కు సమాధానమిచ్చే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఈ విధంగా పేర్కొన్నారు: మేము దైవ ప్రవక్త (స.అ.సం) వెంట ఉన్నాము. అప్పుడు హజ్రత్ భిలాల్ (రజి) నిల్చొని అజాన్ పలికారు. హజ్రత్ భిలాల్ (రజి) అజాన్ ముగించి మౌనం వహించినప్పుడు దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా పేర్కొన్నారు: " ఏ వ్యక్తయితే (అజాన్ పలికిన వ్యక్తి) పలికిన పలుకులను విశ్వాసంతో తిరిగి ఉచ్చరిస్తాడో అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు." (దీనిని నసాయీ ఉల్లేఖించారు; హసన్)
స్వర్గానికి దూరంగా ఉండేవారు
అబద్ధపు సాక్ష్యం పలికి ఇతరుల హక్కును కొల్లగొట్టే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడు.
హజ్రత్ అబూ ఉమామహ్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే (అబద్ధపు) ప్రమాణం చేసి ఒక ముస్లిం హక్కును కొల్లగోట్టాడో అల్లాహ్ అతడి కొరకు నరకాన్ని తప్పనిసరి చేశాడు, స్వర్గాన్ని నిషేధించాడు." ఒక వ్యక్తీ ఇలా ప్రశ్నించాడు. "ఓ దైవ ప్రవక్త (స.అ.సం)! ఒకవేళ అది మామూలు వస్తువయినా కూడానా? దైవ ప్రవక్త (స.అ.సం) ఇలా పలికారు: "ఒకవేళ అది పీలూ చెట్టు కొమ్మైనా సరే."
(దీనిని ముస్లిం ఉల్లేఖించారు)
అధర్మ మార్గంలో సంపాదిస్తూ,అధర్మసోమ్ముతో తినే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడు.
హజ్రత్ అబూబకర్ 9రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "అధర్మంగా సంపాదించిన ఆహారంతో పోషించబడిన శరీరం స్వర్గంలోకి ప్రవేశించదు." (దీనిని బైహఖీ ఉల్లేఖించారు,సహీహ్)
తల్లిదండ్రుల పట్ల అవిధేయుడైన వ్యక్తి, లజ్జావిహీనుడు (సిగ్గులేని వ్యక్తి), పురుషులను అనుకరించే స్త్రీ స్వర్గంలో ప్రవేశించరు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ముగ్గురు వ్యక్తులు స్వర్గంలోకి ప్రవేశించరు. 1. తల్లిదండ్రుల పట్ల అవిధేయుడైన వ్యక్తి 2. సిగ్గు లేని వ్యక్తి 3. పురుషులను అనుకరించే స్త్రీలు." (దీనిని హాకిమ్ ఉల్లేఖించారు, సహీహ్)
సంబంధాలను తెంచే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడు.
హజ్రత్ ముహమ్మద్ బిన్ జుబైర్ బిన్ ముత్ ఇమ్ (రజి) తన తండ్రి ద్వారా దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నట్లు ఉల్లేఖించారు: "సంబంధాలను తెంచే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడు. (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, సహీహ్)
తన ప్రజలను మోసగించే పరిపాలకుడు స్వర్గంలోకి ప్రవేశించడు.
తన ప్రజలను మోసగించే పరిపాలకుడు స్వర్గంలోకి ప్రవేశించడు.
హజ్రత్ మఅఖల్ బిన్ యసార్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ముస్లిం ప్రజలను పరిపాలించే పరిపాలకుడు ఒకవేళ తన ప్రజలను మోసపుచ్చుతున్న స్థితిలో మరణించినట్లయితే అల్లాహ్ అతడి కొరకు స్వర్గాన్ని నిషేదిస్తాడు." (దీనిని బుఖారి ఉల్లేఖించారు)
చేసిన మేలును గుర్తు చేసే వ్యక్తి, తల్లిదండ్రుల పట్ల అవిదేయునిగా మెలిగే వ్యక్తి, నిత్యం మద్యపాన సేవనంలో గడిపే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించరు.
చేసిన మేలును గుర్తు చేసే వ్యక్తి, తల్లిదండ్రుల పట్ల అవిదేయునిగా మెలిగే వ్యక్తి, నిత్యం మద్యపాన సేవనంలో గడిపే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించరు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తయితే చేసిన మేలు గుర్తు చేస్తాడో, తల్లిదండ్రుల పట్ల అవిదేయంగా మేలుగుతాడో, నిత్యం మద్యం సేవించే వ్యక్తి (అనగా వృద్ధుడైన తాగుబోతు) స్వర్గంలోకి ప్రవేశించరు." (దీనిని నసాయీ ఉల్లేఖించారు, సహీహ్)
పొరుగువానికి కష్టం కలిగించే వ్యక్తి స్వర్గానికి దూరంగా ఉంటాడు.
పొరుగువానికి కష్టం కలిగించే వ్యక్తి స్వర్గానికి దూరంగా ఉంటాడు.
హజ్రత్ అబూ హురైర (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తి పోరుగువాడైతే అతడి చెడు నుంచి సురక్షితంగా ఉండడో అతడి స్వర్గంలో ప్రవేశించరు." (దీనిని ముస్లిం ఉల్లేఖించారు)
అహంకారి స్వర్గంలో ప్రవేశించడు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "ఏ వ్యక్తి హృదయాలోనయితే ఆవ గింజంత అహంకారం ఉంటుందో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు."
(దీనిని ముస్లిం ఉల్లేఖించారు)
చాడీలు చెప్పే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు.
హజ్రత్ హుజైఫా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈ విధంగా పేర్కొన్నారు: "చాడీలు చెప్పే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు." (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు, సహీహ్)
తెలిసి కూడా తండ్రి కాని వ్యక్తిని తన తండ్రి అని చెప్పే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు.
హజ్రత్ సఅద్ బిన్ అబీ వక్ఖాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "తెలిసి కూడా తన తండ్రి కాని వ్యక్తిని తన తండ్రిగా పేర్కొనే వ్యక్తి కొరకు స్వర్గం నిషేధించబడింది." (దీనిని బుఖారి ఉల్లేఖించారు)
అకారణంగా తలాఖ్ (విడాకులు) కోరే స్త్రీ స్వర్గంలోకి ప్రవేశించదు.
హజ్రత్ సూబాన్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఏ స్త్రీ అయితే అకారణంగా తన భర్త నుంచి తలాఖ్ (విడాకులు) కోరుతుందో ఆ స్త్రీ కొరకు స్వర్గలోకపు సువాసన నిషేధించబడింది."
(దీనిని తిర్మిజీ మరియు ఇబ్నెమాజహ్ ఉల్లేఖించారు, సహీహ్)
జుట్టుకు నల్లరంగు పూసే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "ఆఖరి కాలంలో కొంత మంది పావురపు ఉదరభాగంలో ఉండే రీతిలో నల్లని రంగును జుట్టుకు పూసుకుంటారు. అటువంటి ప్రజలు స్వర్గలోకపు సువాసనను సైతం పొందలేరు." (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు, సహీహ్)
ఇహలోకంలో కొన్ని స్వర్గలోకపు సుఖాలు
'హజ్ రే అస్వద్' (కాబా గృహం వద్ద ఉన్న నల్ల రాయి) స్వర్గలోకపు రాళ్ళలోని ఒక రాయి.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త (స.అ.సం) ఈవిధంగా పేర్కొన్నారు: "హజ్ రే అస్వద్ స్వర్గం నుంచి దింపబడిన రాయి. అది పాల కంటే తెల్లగా ఉండేది. కానీ ప్రజల పాపాలు దానిని నల్లగా మార్చి వేశాయి." (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, సహీహ్)
ముఖామే ఇబ్రాహీం స్వర్గలోకపు రాయి. (ఈ రాయి మీద నిలబడి దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం (అ.స) కాబా గృహాన్ని నిర్మించారు.)
No comments:
Post a Comment