క్రైస్తవ పండితుల అపార్ధాలు - బైబిలు గ్రంధ యదార్దాలు
_______________________________________
(యూదా; 1:25)
మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు (I) పూర్వమును (II) ఇప్పుడును (III) సర్వయుగములును కలుగును గాక ఆమేన్.
ఈ పై వాక్యం కాలం మూడు భాగాలుగా విభజించబడినది. వాటిలో మొదటిది 'యుగ యుగాములకు పూర్వము' అనగా 'భూతకాలము' రెండవది 'ఇప్పుడును' అంటే 'వర్తమానకాలము' మూడవది 'సర్వయుగములును' అనగా 'భవిష్యత్ కాలము'. ఈ మూడు కాలాలలోనూ దేవుడిగా ఉండేవాడు ఆ ఒక్క యహోవా దేవుడే. అందుకే ఆయనకు మహిమయు మహాత్మ్యమును యేసు క్రీస్తు ద్వారా 'కలకాలం' కలగాలని బైబిలు గ్రంధం ప్రకటిస్తుంది.
దీనిని బట్టి తండ్రి కాలం, కుమారుని కాలం, పరిసుద్ధాత్మకాలము అన్నది ఒక అభూత కల్పన, పుక్కిటి పురాణమని, అదొక అన్య, అసత్య ద్రుక్పధమని సుస్పష్టం అవుతుంది.
బైబిలు పాఠకుడు ఎల్లప్పుడూ ఎవరిని దేవుడిగా నమ్ముకోవాలి:
(యషయా; 26:4)
యహోవా, యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగయుగములు యహోవాను నమ్ముకోనుడి.
ఎల్లప్పుడూ యహోవానే దేవుడిగా ఎందుకు నమ్ముకోవాలి:
(యషయా; 43:10)
... నాకు (యహోవాకు) ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నా తర్వాత ఏ దేవుడు నుండడు.
పై రెండు వాక్యాలు కాలాన్ని సూచిస్తున్నాయి. మొదటి వాక్యం యహోవా నిత్యాశ్రయ దుర్గం అంటుంది. అంటే ఆయన నిత్య దేవుడు. రెండవ వాక్యం 'నాకు ముందుగా ఏ దేవుడు నుండలేదు, లేక ఉండియుండలేదు. ఇది గతించి పోయిన కాలాన్ని సూచిస్తుంది. 'నాకు తర్వాత ఏ దేవుడు నుండడు' అన్న వాక్య భాగం రాబోయే కాలాన్ని సూచిస్తుంది. దీన్ని బట్టి భవిష్యత్తులోనూ అనాదిగా ఉన్న ఆ యహోవా తప్ప మరొకడు దేవునిగా తెరమీదకు వచ్చే ఏ అవకాశము లేదన్న వాస్తవాన్ని బైబిలు గ్రంధాన్ బాహాటంగా ప్రకటిస్తుంది. కాబట్టే నిజమైన క్రైస్తవుడుగా ఉండాలనుకునే వానికి పరిశుద్ధ వాక్యం 'యుగయుగములు యహోవాను నమ్ముకోనుడి' అని ఆజ్ఞాపిస్తుంది.
యహోవాను దేవుని అస్తిత్వం కాలానికనుగుణంగా రూపాంతరం చెందుతుందా?
మరి కొందరి ఆలోచన ఏమిటంటే - నిజమే యహోవా ఒక్కడు తప్ప యేసుకాని, పరిశుద్ధాత్మ కాని అనాది నుండి లేరు. అలాగే వారు యహోవా వంటి ఔన్యత్తము కలిగిలేరు. కాని, అందుకే ఆ ఒక్క యహోవాయే యేసుగా, పరిశుద్ధాత్మగా మార్పు చెందాడని భావిస్తుంటారు. ఈ భావనను బైబిలు గ్రంధం సమర్ధిస్తుందా? లేక ఖండిస్తుందా? అన్న ప్రశ్నలకు ఈ క్రింది వాక్యాలు చూడవచ్చు.
(మలాకి; 3:6) ''యహోవానైన నేను మార్పు లేని వాడను''
ఈ వాక్యం సర్వ శక్తిగల దేవుడు స్వయంగా ప్రకటిస్తున్నాడు. ఆయన చేస్తున్న ఈ ప్రకటన ద్వారా 'యహోవా దేవుడు మార్పు చెందుతాడు' అన్న విశ్వాసం కూడా ఒక కట్టు కధే అని అర్ధమవుతుంది. కనుక పై వాక్యాన్ని విశ్వసిస్తున్న ఒక నిజమైన క్రైస్తవుడు ఒక్క యహోవాను ఉద్దేశించి ఏమని ప్రకటించాలి? ఈ క్రింది వాక్యంలో చూడగలరు.
(కీర్తనలు; 102:27) నీవు (యహోవా) ఏక రీతిగానుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
బైబిలు గ్రంధాన్ని నమ్ముకున్న ప్రతివాడు దేవుని పట్ల పై వాక్యంలోని విశ్వాసాన్నే కలిగి ఉండాలి. దానికి బదులు దేవుడు మార్పు చెంది, యేసు అయ్యాడు, యేసు మార్పు చెంది పరిసుద్ధాత్మ అయ్యాడు లాంటి మాటలు వాక్య విరుద్ధాలు, అన్యుల భావాలు. ప్రతి విశ్వాసి ఈ యదార్ధాన్ని గుర్తించాలి.
గమనిక: ఈ మారక పోవడం అన్నది 'ఆలోచన' లోనా? లేక అస్తిత్వం లోనా? అన్నది ఒక వాదన ఉన్నది. బైబిల్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 'మారకపోవటం' అనేది అస్తిత్వంలోనేనని ప్రస్ఫుటం అవుతుంది. ఎందుకంటే, సర్వశక్తిగల దేవుడైన యహోవా ఒకప్పటి ప్రజలకు ధర్మ శాస్త్రాన్ని ఇవ్వలేదు. కారణం దానిని ఇవ్వాలని ఆయన ఆనాడు అనుకోలేదు. తర్వాత కాలంలో ఆయన ధర్మ శాస్త్రాన్ని ఇచ్చాడు. కారణం అప్పుడు ఆయన ఇవ్వాలనుకున్నాడు కనుక. దీనిని బట్టి ఆయన తన ఆలోచనలను మార్చుకున్నాడని తెలుస్తుంది. కాని అస్తిత్వాని మార్చుకున్నట్లు ఒక్కగని ఒక్క వాక్యం కూడా పూర్తి బైబిల్లో కానరాదన్నది గమనార్హం.
యేసు అస్తిత్వం కాలానుగుణంగా రూపాంతరం చెందుతుందా?
సర్వ సృష్టికర్త అయిన తండ్రి యహోవా యేసును సృష్టించి ఆయనకిచ్చిన స్థానమేమిటి? మరియు ఆ స్థానం నిర్దిష్టంగా ఉండేదా? లేక మార్పులు చెందేదా? అన్న ప్రశ్నలకు బైబిల్ ఇచ్చే సమాధాన మేమిటో క్రింద పేర్కొన్న వాక్యాల్లో పరిశీలిద్దాం.
(హేబ్రీయులకు; 13:8) "యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును యుగయుగములకును ఒకే రీతిగా నుండును."
ఈ వాక్యాన్ని బట్టి యేసు అస్తిత్వం మూడు కాలాల్లో మూడు రకాలుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉండేది కాదని అర్ధమవుతుంది. అయితే యేసుకు దేవుడిచ్చిన ఎన్నటికీ మార్పు చెందని ఆ స్థానం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
I (నిన్న)
(అంటే యేసు ఈ లోకానికి పంపబడక ముందు కాలం)
(కీర్తనలు; 20:6) యహోవా తన అభిషక్తుని (క్రీస్తుని) రక్షించునని నాకిప్పుడు తెలియును. పై వాక్యం పాత నిబంధనకు చెందినదని గమనార్హం. అదే దేవుని భక్తుడైన దావీదు ద్వారా ప్రవచించబడింది. అందులో యేసును ఉద్దేశించి 'దేవుడు' అనికాక దేవుని ద్వారా నియమింపబడిన 'అభిషిక్తుడు' అని చెప్పబడుతుంది. దీని ప్రకారం యేసు ఇహలోకానికి పంపబడక ముందు 'దేవుని'గా కాక 'క్రీస్తు'గానే ఉన్నారన్నమాట.
II (నేడు)
(అంటే యేసు పరలోకం నుండి ఇహలోకానికి పంపబడిన తర్వాత కాలం)
(మత్తయి; 16:15) "అందుకాయన (యేసు) మీరైతే నేను ఎవడనని చెప్పుకోనుచున్నారని వారి (శిష్యుల) నడిగెను.
తన శిష్యుల నుద్దేశించి "నా గురించి మీ విశ్వాసం ఏమై ఉంది?" అని యేసు వేసిన సూటి ప్రశ్నకు సీమోను పేతురు అనే ఒక ప్రధాన శిష్యుడు ఏవిధంగా సమాధానం ఇస్తున్నాడో ఈ క్రింద గమనించగలరు.
(మత్తయి; 16:16) "అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన (ఇష్టుడవైన) క్రీస్తువని చెప్పెను."
యేసు శిష్యుని సూటైన సమాధానం - 'యేసు దేవుడై' ఉన్నాడన్నది కాదు. యేసు 'యేసు దేవుని క్రీస్తు' అన్నదే. తన శిష్యుని ఆ స్పందనకు యేసు ప్రతిస్పందన ఏమిటో ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.
(మత్తయి; 16:17) "అందుకు యేసు - సేమోను బరియోనా! నీవు ధన్యుడవు!! పరలోకమందున్న నీ తండ్రీ ఈ సంగతి నీకు బయలు పరిచేనే గాని నరులు నీకు బయలు పరచ లేదు."
(మత్తయి; 16:17) "అందుకు యేసు - సేమోను బరియోనా! నీవు ధన్యుడవు!! పరలోకమందున్న నీ తండ్రీ ఈ సంగతి నీకు బయలు పరిచేనే గాని నరులు నీకు బయలు పరచ లేదు."
యేసు, క్రీస్తైయున్నాడనే తన శిష్యుని సూటైన సమాధానాన్ని విని, కనుక దాని సాక్ష్యం ప్రకారం 'యహోవా ఒక్కడినీ మాత్రమె సర్వోన్నతుడైన దేవుని'గా గుర్తించి, ఆయననే ఆరాధి'స్తూ మరియు యేసును క్రీస్తు'గా గుర్తించి, ఆయనను అనుస'రిస్తూ జీవితం గడిపే సద్బుద్ధిని ఆ పరమాతండ్రీ మన అందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.
భూత,భవిష్యత్,వర్తమాన కాలాల్లో దేవుడెవరు?
బైబిలు 'ఏకదైవ' ఆరాధనా సిద్ధాంతాన్ని 'నిష్కర్షగా బలపరిచే'దే కాక 'అనేక దావాల ఆరాధన'ను 'బాహాటంగా ఖండించే గ్రంధం' కూడా. ఆది నుండి అంతం వరకు తన వాదనను ఎడతెగకుండా కలిగి ఉంది. అయినప్పటికీ సాతాను సంబంధమైన 'అనేక దైవాల' ఆరాధనా సిద్ధాంతము బైబిలు లాంటి గ్రంధం కలవారిలో అతియుక్తిగా చొప్పించబడింది. ఇది సాతాను కుయుక్తి! ఆ కుయుక్తిలో భాగంగా కాలాతీతుడైన దైవాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాల పరిధిలోకి తెచ్చి ఆ అస్తిత్వాన్ని అవమాన పరచడం జరుగుతుంది. ఇది ఎంతో గొప్ప దేవుని పట్ల అత్యంత అల్పమైన ఆలోచన. పైగా ఈ హీనమైన పనికి బైబిల్ లాంటి గ్రంధాన్ని అడ్డం పెట్టుకోవడం మరింత దౌర్భాగ్యం.ఉదా:- పాత నిబంధన కాలంలో 'యహోవా దేవుడు!' కొత్త నిబంధనా కాలంలో 'యేసు దేవుడు!' యేసు ఆరోహణ తర్వాత కాలంలో 'పరిశుద్ధాత్మ దేవుడు!'
బైబిల్ ప్రకారం - దేవుని కాలం ఎంత కాలం?
కాల విభజన సృష్టితాలకే గాని సృష్టికర్తకు వర్తించదు. కారణం ఏమిటంటే సృష్టి 'నిన్న' ఉన్నట్లు 'నేడు' ఉండదు మరియు 'నేడు' ఉన్నట్లు 'రేపు' ఉండదు. కనుక! ఈ విభజన వాస్తవానికి 'కాలాని'కి సంబంధించినది కాదు. సృష్టి క్షీణిస్తూ మారుతున్న 'స్థితి'కి సంబంధించినది. అయితే సృష్టికి ఉన్న 'క్షీణత గల స్థితి' సృష్టికర్తకు వర్తించదు కదా! ఇంతకు బైబిల్ గ్రంధం ప్రకారం ఆ సృష్టికర్త అయిన దేవుని కాలం ఎంత కాలం ఉంటుందో ఈ వాక్యంలో గమనించగలరు.
1. సాగిపోతున్న కాలం: అంటే - 'ఏకరూపక కాలం'
ఈ కాలంలో దేవుడెవరు?
(కీర్తనలు; 18:14) "ఈ దేవుడు (యహోవా) సదాకాలం మనకు తోడై ఉన్నాడు"
పై వాక్యం ప్రకారం సృష్టికర్త అయిన యహోవా తండ్రి మాత్రమే సదాకాలం అనగా నిత్యకాలం లేక ఎల్లప్పుడూ దేవుడుగా ఉంటాడని స్పష్టం అవుతుంది.
2. గతించిపోయిన మరియు గతించబోయె కాలం: అంటే - 'ద్వంద రూపక కాలం'
ఈ కాలంలో దేవుడెవరు?
(కీర్తనలు; 41:13) (I) శాశ్వత కాలము నుండి (II) శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక ఆమేన్.
ఈ వాక్యం ద్వారా కాలం రెండు భాగాలుగా విభజించ బడుతుంది. ఒకటి ఇప్పటినుండి వెనుకకు గతించిపోయిన 'అనాది కాలం' అంటే గతంలో ప్రారంభం లేని అనంత 'భూత'కాలం.
రెండు ఇప్పటినుండి భవిష్యత్తులో గతించబోనున్న 'అనంతకాలం' అనగా భవిష్యత్తులో అంతంకాకుండా సాగే 'భావిష్యకాలం'. ఈ రెండు కాలాలలోనూ ఆ ఒక్క యహోవాయే దేవునిగా ఉంటాడని నిర్ధారణ అవుతుంది.
3. గతించిపోయిన, నడుస్తున్న, రాబోయే కాలం: 'త్రియోరూపక కాలం' అంటే 'భూతకాలం', 'వర్తమాన కాలం', 'భవిష్యత్ కాలం'.
ఈ కాలాలలో దేవుడెవరు?
మన రక్షకుడైన అద్వితీయ దేవునికి (యహోవా), మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా
No comments:
Post a Comment