* ప్రవక్త ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) పై అపనింద *
ప్రవక్త ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారి శీలం పై, ఆంద్ర రాష్ట్రంలో ఓ క్రైస్తవ తెగ అపనిందలు వేస్తుంది.
తూర్పు గోదావరి జిల్లా - నకిలీ ముస్లిం సంస్థ నాయకుని సమక్షంలో ప్రత్యక్షంగా ఈ అపనిందను వేసినా సరే,
'దున్నపోతు మీద వర్షం' కురిస్తే ఎలా చలనం ఉండదో, ఆ నాయకునిలో కూడా ఎటువంటి చలనం రాలేదు.
తూర్పు గోదావరి జిల్లా - నకిలీ ముస్లిం సంస్థ నాయకుని సమక్షంలో ప్రత్యక్షంగా ఈ అపనిందను వేసినా సరే,
'దున్నపోతు మీద వర్షం' కురిస్తే ఎలా చలనం ఉండదో, ఆ నాయకునిలో కూడా ఎటువంటి చలనం రాలేదు.
కీర్తి - కాంత - కనకం
ప్రపంచంలో ఎక్కువ మంది మగవాళ్ళు, ఏ కాలంలోనైనా సరే, పై మూడింటి కోసం మాత్రమే తాపత్రయ పడతారు. అందుకోసం యుద్ధాలు సైతం చేస్తారు. మారణహోమం సృష్టిస్తారు. ఎలాంటి నీచమైన పనికైనా సిద్ధపడతారు. 1. 'కీర్తి' అంటే పేరు 2. 'కాంత' అంటే స్త్రీ 3. 'కనకం' అంటే బంగారం (డబ్బు లేదా ఐశ్వర్యం). ఎక్కువ శాతం మగవాళ్ళు ఈ మూడింటి కోసం గాని లేదా ఈ మూడింటిలో ఏదో ఒక దాని కోసం ఎక్కువ పాకులాడుతారు.
అయితే మానవులలో ఉత్తములైన ప్రవక్త ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారు ఈ మూడింటిలో దేని కోసం కూడా తన జీవిత కాలంలో ప్రయత్నించలేదు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారు సత్య స్వరూపి అని, నిజాయితీ పరుడని, అనాధలకు సాయం చేసేవారని మంచి శీలం గల వ్యక్తిగా ఇంతకు ముందే వివరించడం జరిగింది.
ఈయన (స.అ.సం) 40 సం. ల వయస్సులో, సమస్త మానవాళి కోసం ప్రవక్తగా మరియు సందేశహరుడుగా అల్లాహ్ చే నియమించబడ్డారు. దేవుని ఆదేశం ప్రకారం ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారు 'అల్లాహ్ తప్ప ఏ ఆరాధ్యుడు లేడు' అని అక్కడ ఉన్న ప్రజలకు సందేశం ఇవ్వడం ఆరంభించారు.
అప్పటి అరబ్బులు సుమారు 360 విగ్రహాలను ఆరాధించేవారు. కాబట్టి వారికి ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారి మాటలు కోపాన్ని కలిగించాయి. ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారిని, ఆయన (స.అ.సం) వారి సహచరులను హింసలకు గురి చేశారు. ఇలా 13 సంవత్సరాలు హింసించారు. ఈ హింసలకు కారణం దేవుడు ఒక్కడే అని చెప్పడం.
విగ్రహాలను త్యజించమని, దేవుడు ఒక్కడే నని చెబుతున్న ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారికి, చివరగా అరబ్బు నాయకులు ఓ ఆఫర్ కూడా చేశారు. అదేమిటంటే ...
అరేబియాలో ఉండే అందమైన స్త్రీలలో, ఎంతమంది స్త్రీలు కావాలంటే, అంత మంది స్త్రీలను ఆయన (స.అ.సం) వివాహం చేసుకోవచ్చు. అంతేకాకుండా వారి దగ్గర ఉన్న సంపద అంతా ఇచ్చేస్తామన్నారు. ఆయననే తమ నాయకునిగా ఒప్పుకుంటామన్నారు.
అంటే పేరు, డబ్బు, హోదా, స్త్రీలు వీటన్నింటినీ ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారికి స్వంతం చేస్తామన్నారు. వారి ఒకే ఒక్క షరతును ఒప్పుకుంటే. అదేమిటంటే విగ్రహారాధనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మరియు దేవుడు ఒక్కడే నని చెప్పకూడదు. అంతే, అంతకు మించి ఆయన చేయవలసిన మరే పని లేదు.
వీటి కోసం తాపత్రయపడే ఏకాలం నాటి మగవాడైనా వదులుకుంటాడా? ఇందుకు చేయవలసినదల్లా ఒక్కటే, సత్యాన్ని చెప్పకూడదు.
కాని ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారు అందుకు ఒప్పుకోలేదు.
ఈ క్రైస్తవ గ్రూప్ ఆరోపిస్తున్నట్లు, ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారు స్త్రీ లోలుడు కాదని స్పష్టమౌతుంది. అంతేకాదు స్త్రీకి సమాజంలో ఉత్తమ స్థానాన్ని ఏర్పరచిన తొలిమానవుడు - ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం). అరేబియాలోని ఆయన శత్రువులు సైతం ఆయన చేసుకున్న వివాహాలపై గాని, ఆయన శీలం పై గాని అపనిందలు వేయలేదు. ఇది చారిత్రిక సత్యం.
మేడిపండు నాగరిక దేశాలైన బ్రిటన్ తదితర ఐరోపా దేశాలు స్త్రీ కి ఆస్తి హక్కు ఎప్పుడు కలిపించాయో ఓ సారి చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది. ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారు 1400 సంవత్సరాల క్రితమే స్త్రీకి ఆస్తి హక్కును ఏర్పరచి, దానిని అమలు చేయించారు.
స్త్రీ జాతి యావత్తు అభిమానించదగిన ఏకైక మానవోత్తముడు ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది తెలుసుకోవడం కోసం 'ఖుర్'ఆన్' గ్రంధం లేదా బుఖారి, ముస్లిం హదీసులు, మరియు ఆయన (స.అ.సం) యొక్క జీవిత చరిత్ర చదవడం తప్పనిసరి.
ఈ పై విషయం ఒక్కటి చెబితే ఆ క్రైస్తవ గ్రూపు వారు నోరుమూసుకునే వారు. కాని ఈ నకిలీ ముస్లిం సంస్థ నాయకుడి నోట ఇలాంటి మాటలు రాలేదు.
దీనిని ఓ గొప్ప వరంగా భావించిన ఆ క్రైస్తవ గ్రూపు వారు రాష్ట్రంలో చాల చోట్ల ఈ చర్చకు సంబంధించిన వీడియోను చూపిస్తూ, ముస్లిముల దగ్గర సమాధానం లేదంటూ ప్రచారం చేస్తున్నారు.
ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారిని అల్లాహ్ చే సర్వలోకాలకు కారుణ్యంగా చేసి పంప బడ్డారని ఖుర్'ఆన్ గ్రంధం 21వ సూరా ; 107వ వాక్యం వివరిస్తుంది.
ఆయన (స.అ.సం) గురించి ప్రఖ్యాత విమర్శకులు ఏమన్నారో చూద్దాం.
"ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అని పిలవాలి. ఆధునిక ప్రపంచానికి ఆయన లాంటి వ్యక్తి నిరంకుశ నాయకత్వం వహిస్తే, అతను ప్రపంచ సమస్యలను పరిష్కరించి నేడు కరువైన శాంతి సుఖాలను అందజేస్తాడని నా గట్టి నమ్మకం" (సర్ బెర్నార్డ్ షా)
"23 ఏళ్ల కఠినాతి కఠినమైన అసలు పరీక్షకు తగిన వ్యక్తిగా, అనుపమ యోధునిగా, ఆయన్ని నేను తిలకించాను." (థామస్ కార్లైల్)
ప్రపంచ మానవాళిలో కెల్లా ఉత్తముడైన ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారిని గురించి తెలుసుకోవాలనుకునే వారు, చదవండి "నేను ఆరాధించే ఇస్లాం" (అడియార్) మరియు "ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం)" (ప్రొఫెస్సర్ రామకృష్ణారావు) - తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ హైదరబాద్.
మరి ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారు 'కీర్తి', 'కాంతం', 'కనకం' కోసం కాకుండా దేనికోసం జీవితమంతా పరిశ్రమించారు?
1. ఆరాధ్యుడు ఒక్కడేనని, ఆయనే అల్లాహ్ అని విశ్వసింపజేశారు.
2. స్త్రీకి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు.
3. అనాధలకు ఆశ్రయమిచ్చారు.
4. బానిసత్వాన్ని రూపుమాపడాన్ని ప్రారంభించారు.
5. యుద్ధ రంగానికి కూడా మానవీయత నేర్పింది ఈయనే
6. మానవులంతా ఒకే కుటుంబమని చెప్పడమే కాకుండా ఆచరణలో తెలియజేసి, అది ప్రవక్త సాంప్రదాయంగా ముస్లిములందరూ సంతోషంగా ఆచరించేలా చేసారు.
7. అసలైన ప్రజాస్వామ్యమేమిటో ఖలీఫా వ్యవస్థ ద్వారా నిరూపించారు. అందుకే గాంధి లాంటి ప్రముఖులు కూడా హజ్రత్ ఉమర్ (రజి) లాంటి ఖలీఫా ఉంటె మన దేశానికి నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందన్నారు.
8. ఎల్లప్పుడూ ఏ పరిస్థితి లోనైనా సంతోషంగా ఎలా జీవించవచ్చో, అల్లాహ్ ఆదేశాలను ఆచరించి చూపిన మానవోత్తముడే ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం).
అపోహలు 1. అల్లాహ్ అని చెబితే ఓ వర్గం వారి యొక్క దేవుడనుకుంటారని మొహమాట పడటం. అందుకని పేర్లను మరియు ఇతర ముఖ్య పదాలను వినే వ్యక్తియొక్క భాషలోకి తప్పనిసరిగా మార్చాలనుకోవడం.
మనం ఏ దేశం వెళ్ళినా, మన పేరు అడిగితే మనకున్న పేరే చెబుతాం కదా! ఉదాహరణకు నేను రష్యా వెళితే, అక్కడ నా పేరు అబ్దుల్ కరీం అనే చెబుతాను. అది వినే రష్యన్ ఒప్పుకోడనో, అయిష్టపడతాడనో నా పేరును రష్యా భాషలో అనువదించి చెబితే, అప్పుడు నేను నేరం చేసిన వాడనౌతాను. నా పాస్ పోర్టులో 'అబ్దుల్ కరీం' అని ఉంటె రష్యా పదాలు చెప్పినందుకు నన్ను జైల్లోకి వేస్తారు.
ఓ తెలుగు వ్యక్తి 'కాకినాడ' వెళ్ళడానికి డిల్లీ స్టేషన్ లో టిక్కెట్ తీసుకోవాలను కుంటాడు. తెలుగులో చెబితే పరాయివాడను కుంటాడని 'కాకినాడ' అనే పేరుని 'కవ్వా కా రస్సి' అని హిందీలో అనువదించి టిక్కెట్ కోసం అడిగితే, అతని ఏమి సమాదానమొస్తుందో ఎవరైనా ఊహించ వచ్చు.
"అటువంటి పేరు గల స్టేషన్ ఇండియా లో లేదు బాబు" అంటాడు. ఒకవేళ అలాంటి పేరుకు దగ్గరలో ఉండే మరో రాష్ట్రంలో ఏదైనా ఊరికి టిక్కెట్ ఇచ్చాడనుకొండి, సదరు తెలుగు వ్యక్తి, తన వెళ్ళవలసిన ఊరు వెళ్ళకుండా పరాయి రాష్ట్రంలోని మరో ఊరికి వెళ్ళిపోతాడు.
వినేవానికి అర్ధమయ్యే భాష మనకు తెలిసి ఉంటే, ఆ భాషలోనే అతనితో మాట్లాడుటాము. కాని పేర్లను కూడా ఆ భాషలోకి మార్చి చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది.
పేర్లను కూడా అనువదించి చెప్పే ఓ మూర్ఖపు తెగ ఇప్పుడిప్పుడే తూర్పు గోదావరి జిల్లాలో వేళ్ళూనుకుంది.
చెప్పేవానికి జ్ఞానం, మంచి మాట తీరు, మంచి సంకల్పం, ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) వారి పైనున్న అభిమానంతో ఆయన (స.అ. సం) మార్గాన్ని అనుసరించేలా మన ప్రవర్తన ఉంటే, వినేవారు అతని మాటలను స్వీకరిస్తారు. గౌరవంగానే సమాధానం ఇస్తారు.
ముఖ్యమైన పదాలు: కొన్ని పదాలకు అసలు అర్ధం వేరేగా ఉంటుంది. ఆ పదానికి వాడుకలో ఉన్న అర్ధం మరొకటిలా ఉంటుంది. అలాంటప్పుడు మన వాడుకలో ఉన్న అర్ధాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆ పదం యొక్క అసలు అర్ధం - అది కాదని వాదించడం కొన్ని సందర్భాలలో తెలివి తక్కువ తనం అనిపించుకుంటుంది.
ఉదా :- కరెంటు పోయింది అని చెబితే తెలుగు రాష్ట్రంలో ఏ మారుమూల ఉన్న వాడికైనా అర్ధమౌతుంది. అలాగే వేసవిలో కరెంటు కోత అంటారు. ఇక్కడ కరెంటు అంటే అందరికి ఇంట్లో లైట్లు వెలగడానికి, ఫాన్లు తిరగడానికి మొ ; వాటికి అవసరమయ్యే విధ్యుత్ శక్తి అని భావిస్తారు. కాని కరెంటు అంటే అసలు అర్ధం = ప్రవాహం. Electrical Current (విద్యుత్ ప్రవాహం)లేదు అని చెప్పడానికి బదులు "కరెంటు" లేదు అని చెప్పడానికి బదులు, ''కరెంటు లేదు'' అని షార్ట్ కట్ లో మాట్లాడుతారు. ఇది అందరికి అలవాటైన పదమై పోయింది.
తీగలో విధ్యుత్ ప్రవహిస్తే లైట్లు వెలుగుతాయి. ఆ ప్రవాహం లేకపోతె విద్యుత్ మీద ఆధారపడి పని చేసే ఏ పరికరము పనిచేయదు.
నదిలోని నీటికి ప్రవాహం ఉంటుంది. చెరువులోని నీటిలో ప్రవాహం ఉండదు. కాబతీ నదిలో కరెంటు ఉంటుంది. చెరువులో కరెంటు ఉండదని చెబితే, అసలు అర్ధం ప్రకారం అది నిజమైనప్పటికీ విన్న వాళ్ళు నవ్వుకుంటారు.
కాబట్టి వాడుకలో ఉన్న పదాలు ఏమిటో, ఆ పదాలకు వారి మైండ్ లో ఉన్న భావమేమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. అందుకే పరాయి భాషలోని విషయాలను తెలుగువారికి చెప్పేటప్పుడు ఆ భాషలోని పేర్లను మాత్రమే కాకుండా, కొన్ని పదాలను కూడా మార్చ కుండా చెబుతూ, తెలుగు భాషలో వాటి అర్ధాలను వివరించ గలిగితే వారికి అర్ధం అవుతుంది, స్వీకరిస్తారు కూడా.
ఉదా : ట్రైన్, కాన్సర్, ఎయిడ్స్, సెల్ ఫోన్ ... మొదలైన ఇంగ్లీషు పదాలను తెలుగువారికి తెలుగు భాషలో అనువదించి చెప్పవలసిన అవసరం లేదు. ఏభాష పదాన్నైనా, అర్ధమయ్యేటట్లు చెబితే వాటిని తెలుగు వారు స్వీకరిస్తారు. పై పదాలను గనక నిజంగా తెలుగులోనికి అనువదించి చెబితే, ఆ పదాలు అర్ధం కాక అయోమయానికి గురై, తీరా అసలు విషయం తెలిసాక ఓరి మూర్ఖుడా! చెప్పిన వాడిని చూసి నవ్వుతారు.
2. "దేవుని పేరు యహోవా అని సర్వేశ్వరుడని చెబుతున్నా సరే చివరికి వారందరిని 'అల్లాహ్' పేరు వైపుకే మరల్చుతున్నాం" అని ఓ ప్రక్క చెబుతూనే మరో ప్రక్క "అల్లాహ్ తన పేరే నని ఖుర్'ఆన్ లో ఎక్కడా చెప్పలేదు" అని చెబుతున్నారు. ఖుర్'ఆన్ గ్రంధంలో 'నేను నేనే అల్లాహ్ ను అని ఆయన చెప్పాడు కదా! అని జవాబిస్తే, "అల్లాహ్ ని నేనే'' అని చెప్పారు గాని, ''నా పేరే అల్లాహ్'' అని చెప్పలేదు కదా? కాబట్టి అల్లాహ్ అని పిలవనవసరం లేదు అని వారి జవాబు.
ఇలాంటి ఆలోచనలతో తప్పుడు ప్రచారం చేసే నకిలీ ముస్లిం నాయకుని మాటలను విన్న, ఓ క్రైస్తవ గ్రూపు వారు - దేవుని పేరు యహోవా అని ఒప్పుకున్నందుకు సంతోషం. మీలో ఎంతమంది ముస్లిములు 'యహోవా' పేరుతొ మస్జిదులలో నమాజు చేస్తారో చేతులెత్తండి అన్నారు. ఒకడు చేయి ఎత్తాడు.
'అల్లాహ్ ఏ సృష్టికర్త యొక్క పేరు అని స్పష్టంగా మొదటి రెండు అధ్యాయాలలో చెప్పుకున్నాము.
వీరి మాటలను జాగ్రత్తగా గమనిస్తే వారి మూర్ఖత్వం, మోసం ఏ స్థాయి లో ఉందొ అర్ధమవుతుంది. ముఖ్యంగా తెలిసేదేమిటంటే, ఈ సంస్థ వారికి 'అల్లాహ్' పేరు పై అసలు విశ్వాసమే లేదని అనిపిస్తుంది.
మన స్నేహితుని ఇంటికి వెళ్లి తలుపు తడితే సాధారణంగా ఎవరది? అనే మాట లోపలినుండి వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తిని నేనే అయితే వెంటనే ''నేనే అబ్దుల్ కరీం ని'' అని జవాబిస్తాను. లోపలినుండి అడిగేవానికి కావలసింది కూడా అదే. వచ్చిన వాని పేరు తెలుసుకోవడం. ''నా పేరు అబ్దుల్ కరీమ్" అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఖుర్'ఆన్ గ్రంధంలో ''అల్లాహ్ ని నేనే'' అని చెప్పినా లేక ''నా పేరు అల్లాహ్'' అని చెప్పినా అర్ధమొక్కటే.
ఈ అపోహ గురించే ఓ సందర్భంలో అమెరికా లోని రమజాన్ జుబేరికీ తెలియజేస్తే, ఆయన ఇలా సమాధానమిచ్చారు. "ఇక్కడ అమెరికాలో క్రైస్తవ స్కాలర్స్ ప్రత్యక్షంగా అల్లాహ్ పేరును వాడ గలిగేటప్పుడు, అల్లాహ్ పేరు చెప్పడానికి వారికి ఎందుకు అంత ఇబ్బంది?"
ఆ సృష్టికర్త పేరు 'అల్లాహ్' అనే అతి ముఖ్య ప్రాధమిక విషయంలోనే వారికి స్పష్టత లేదు. వారికే అర్ధంగాని ఓ విషయంపై సత్య సందేశాన్ని ప్రజలకు అర్ధవంతంగా ఎలా ఇవ్వగలుగుతారు? సత్యధర్మాన్ని సత్యమార్గంలోనే చెప్పాలి.
మస్జిదులో యహోవా అని గాని మరో పేరుతో గాని ప్రార్ధన చేస్తే వాడు సత్య తిరస్కారి అవుతాడు. క్రింది ఖుర్'ఆన్ వాక్యం చదవండి.
(ఖుర్'ఆన్ 72:18) "మరియు నిశ్చయంగా మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించ బడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్ధించకండి."
యహోవా పేరుతొ నమాజులు చేసేవారు చేతులేత్తమని చెప్పిన క్రైస్తవ బోధకుడు తన జీవితంలో ఎప్పుడైనా బైబిల్ లోని ద్వితియోప దేశకాండంలో 18:19 వాక్యాన్ని చదివాడా? "నా నామమున చెప్పు నా మాటలను" అని ఉంది కదా!
ఇది ఎవరికీ వర్తిస్తుందో తెలుసా? క్రైస్తవులకా? ముస్లిములకా?
క్రైస్తవులు 'తండ్రి', 'కుమారా', 'పరిశుద్దాత్మ' అని అంటారు. ఇందులో దేవుని పేరు ఎక్కడ ఉంది ప్రబోధకుడా?
3. దురాత్మల ప్రభావానికి గురైన వాడు అసలు ప్రవక్త ఎలా కాగలడు?
4. కోడలును వివాహం చేసుకున్న వాడు అసలు ప్రవక్త ఎలా కాగలడు?
ఇలాంటి ఇత్యాది విమర్శలను లేవనెత్తుతున్నారు. అసలు అలాంటి విమర్శలు లేవనెత్తే వారికి బైబిల్ గ్రంధ కనీస జ్ఞానం లేదని చెప్పవచ్చు. అయితే పై విమర్శలు ఎంత పస లేనివో ఈ క్రింద పేర్కొంటున్న అంశాలలో ఒక్కొక్కటిగా గమనించగలరు.
బహుభార్యత్వం కలిగిన వాడు ప్రవక్త కాలేడా?
ఆ సృష్టికర్త పేరు 'అల్లాహ్' అనే అతి ముఖ్య ప్రాధమిక విషయంలోనే వారికి స్పష్టత లేదు. వారికే అర్ధంగాని ఓ విషయంపై సత్య సందేశాన్ని ప్రజలకు అర్ధవంతంగా ఎలా ఇవ్వగలుగుతారు? సత్యధర్మాన్ని సత్యమార్గంలోనే చెప్పాలి.
మస్జిదులో యహోవా అని గాని మరో పేరుతో గాని ప్రార్ధన చేస్తే వాడు సత్య తిరస్కారి అవుతాడు. క్రింది ఖుర్'ఆన్ వాక్యం చదవండి.
(ఖుర్'ఆన్ 72:18) "మరియు నిశ్చయంగా మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించ బడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్ధించకండి."
యహోవా పేరుతొ నమాజులు చేసేవారు చేతులేత్తమని చెప్పిన క్రైస్తవ బోధకుడు తన జీవితంలో ఎప్పుడైనా బైబిల్ లోని ద్వితియోప దేశకాండంలో 18:19 వాక్యాన్ని చదివాడా? "నా నామమున చెప్పు నా మాటలను" అని ఉంది కదా!
ఇది ఎవరికీ వర్తిస్తుందో తెలుసా? క్రైస్తవులకా? ముస్లిములకా?
క్రైస్తవులు 'తండ్రి', 'కుమారా', 'పరిశుద్దాత్మ' అని అంటారు. ఇందులో దేవుని పేరు ఎక్కడ ఉంది ప్రబోధకుడా?
3. దురాత్మల ప్రభావానికి గురైన వాడు అసలు ప్రవక్త ఎలా కాగలడు?
4. కోడలును వివాహం చేసుకున్న వాడు అసలు ప్రవక్త ఎలా కాగలడు?
ఇలాంటి ఇత్యాది విమర్శలను లేవనెత్తుతున్నారు. అసలు అలాంటి విమర్శలు లేవనెత్తే వారికి బైబిల్ గ్రంధ కనీస జ్ఞానం లేదని చెప్పవచ్చు. అయితే పై విమర్శలు ఎంత పస లేనివో ఈ క్రింద పేర్కొంటున్న అంశాలలో ఒక్కొక్కటిగా గమనించగలరు.
బహుభార్యత్వం కలిగిన వాడు ప్రవక్త కాలేడా?
బహుభార్యత్వం కలిగి ఉన్న ముహమ్మద్ (స.అ.సం) అసలు దేవుని ప్రవక్త ఎలా కాగలరు? అని ప్రశ్నిస్తున్నవారు ప్రత్యేకంగా గమనించాల్సింది - బహు భార్యత్వం కలిగి ఉన్నవాడు ప్రవక్త కాగలిగే అర్హత కోల్పోతాడను కుంటే మరి ఇశ్రాయేలు మూల పురుషులైన అనేక మంది బహు భార్యత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ 'దేవుని పరిశుద్ధ ప్రవక్తలు' (లూకా; 1:75) ఎలా ఎంచ బడుతున్నారు.
- 1సమూయేలు; 25:38-44, 2సమూయేలు; 12:7-10, వాక్యాల ప్రకారం, ప్రవక్త అయిన దావీదు, అబీగయులను, ఆహీనోయమును, బత్షేబను మాత్రమే కాక, 2సమూయేలు 5:13 ప్రకారం అనేక మంది భార్యలు, ఉప పత్నులు కలిగి ఉన్న వైనం గమనించగలం. ఈ బహుభార్యత్వం కలిగి ఉన్న దావీదు పేరు చిగురు మరియు సంతానము పేరే యేసు (ప్రకటన; 22:16) అయి ఉన్నారన్న విషయం కాస్త దృష్టిలో ఉంచుకోవలసిన విషయం.
- 1 రాజులు; 11:3 ప్రకారం ప్రవక్త అయిన సోలోమోనుకు ఏడు వందల మంది భార్యలు, మూడు వందల మంది ఉప పత్నులు కలిగి ఉన్నట్లు చూడగలం.
- ఆదికాండం; 11:29, 16:3, 25:1 వాక్యాల ప్రకారం ప్రవక్త అబ్రహాము ముగ్గురు భార్యాలనే కాక, ఆదికాండము; 25:6 ప్రకారం అనేక మంది ఉప పత్నులు ఉన్నట్లు చూడగలం.
- ఆదికాండం; 29:16-28, 30:1-9 ప్రకారం ప్రవక్త అయిన యాకోబు, లేయా, రాహేలుతో పాటు వారిద్దరి దాసీలైన జిల్ఫా, బిల్హాలను పెళ్ళాడిన వైనాన్ని చూడగలం.
అటువంటి వారందరి విషయంలో - 'అబ్రహాము', 'యాకోబు', 'ఇస్సాకులును' సకల ప్రవక్తలును దేవుని రాజ్యంలో ఉంటార'ని (లూకా; 13:28) లో యేసే స్వయంగా ప్రకటిస్తున్నారు. ఈ విధంగా వారందరూ దేవుని పరిశుద్దులు, ప్రవక్తలూ మరియు దేవుని రాజ్య ప్రవేశానికి అర్హులు అయినప్పుడు ఒక్క
ముహమ్మద్ (స.అ.సం) మాత్రమే ఎందుకు పరిశుద్ధుడూ మరియు ప్రవక్త కాలేరు?
ఇక ముహమ్మద్ (స.అ.సం)ను స్త్రీ లోలుడు అని విమర్శించేవారు తెలుసు కావాల్సింది - ఆయన తన ఇరవై ఐదవ ఏటన రెండు సార్లు వితంతువు అయి ఉన్న మరియు తనకంటే పదిహేను సంవత్సరాల పెద్ద వయస్సు కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆయన చేసుకున్న మొత్తం 11 వివాహాల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ వితంతు లేక విడాకులు పొందిన స్త్రీలే! అసలు వాస్తవం ఏమిటంటే, ఆనాటి అరబ్బు సమాజం విభిన్న వైరి వర్గాలుగా విడిపోయి ఉండేది. వారు పరస్పరం ఎలాంటి సంబంధాలను పెట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి నేపధ్యంలో వారందరిలో ఉన్న అంటరాని తనాన్ని దూరం చేసి, వారిని అత్యంత సన్నిహితం చేసే ఏకైక మార్గం వర్గాంతర వివాహ సంబంధాలను ప్రోత్సహించడం ఒక్కటే. ఆ పని చేయడానికి ఎవరూ సాహసించనప్పుడు ఒక ప్రవక్తగా 'మాదిరి' చూపవలసింది ఆయనే కదా! అందుకే ఆయన అన్ని వివాహాలు చేసుకోవలసి వచ్చింది. అసలు స్త్రీ లోలుడైన వ్యక్తి అక్రమ సంబంధాలను పెట్టుకుంటాడే గాని 'వివాహాలు' ఎందుకు చేసుకుంటాడు? ఒకవేళ వివాహాలు చేసుకున్నా కన్యలను చేసుకుంటాడే గాని వయసులో తనకంటే పెద్దలను, వితంతువులను, విడాకులు పొందిన స్త్రీలను ఎందుకు చేసుకుంటాడు?
తన పొరపాట్లకు దేవునిని క్షమాపణ వేడుకునేవాడు ప్రవక్త కాలేడా?
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)ను దేవుడే ఖుర్'ఆన్ లో ఈ క్రింది విధంగా తన పొరపాట్లకు క్షమాపణ వేడుకోమన్నాడంటే ఆయనలో పాపం ఉన్నట్లే కదా! కాబట్టి పాపి అయిన వాడు ప్రవక్త ఎలా కాగలడన్నది నేటి నామ మాత్రపు సువార్తీకుల వాదన!
(ఖుర్'ఆన్ ; 17:19) "కనుక ప్రవక్తా! బాగా తెలుసుకో, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు ఎవ్వడూ లేడు అని. నీ పొరపాట్లకు క్షమా భిక్ష పెట్టుము అని వేడుకో, విశ్వాసులైన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడా."
పొరపాట్లు జరగటం మాన సహజ బలహీనత. కాబట్టి ఒక వ్యక్తి నిరంతరం తన పొరపాట్ల గురించి, ఇతరుల పొరపాట్ల గురించి దేవునికి వేడుకుంటూ ఉండాలి. అలా వేడుకున్నంత మాత్రాన తన తో పాటు అందరు పాపుల్ని కాదు కదా! అలా అనుకుంటే యోహాను దగ్గర అనేక మంది పాపులు, పాప క్షమాభిక్ష బాప్తిస్మం పొందుతున్న సందర్భంలో (మార్కు; 1:4) స్వయంగా యేసు గలీలయ నుండి ఎక్కడో దూరంగా ఉన్న జోర్డాను వరకు వెళ్లి అక్కడ తాను కూడా యోహాను ద్వారా నీటి బాప్తిస్మం ఎందుకు పొందారు? (మత్తయి; 3:13) అది తన పాపాల క్షమాపణ కొరకు కాదా? "కాదండీ ... అది కేవలం మనకు మాదిరి చూపడానికి అలా చేశారంతే!" అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) కూడా మనకు మాదిరి చూపటానికే దైవాన్ని అలా వేడుకున్నారను కోవచ్చుగా? వాస్తవానికి బైబిల్ గ్రంధం ఆది నుండి వచ్చిన సకల ప్రవక్తలందరినీ 'దేవుని పరిశుద్ధ ప్రవక్తలని' (లూకా; 1:75) కీర్తిస్తుంది. వారందరూ మానవ మాత్రులే! కాబట్టి తన పొరపాట్లకు ఒక ప్రవక్త దేవునిని వేడుకున్నంత మాత్రాన అతడు పాపి అయిపోడు.
దురాత్మల ప్రభావానికి గురైనవాడు ప్రవక్త కాలేడా?
ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) దురాత్మ చేత శోధింపబడ్డారు కాని, యేసు వారు అయితే దురాత్మల ప్రభావానికి గురి కాలేదు అని కొందరు భావిస్తు ఉంటారు. ఆ విధంగా దురాత్మల ప్రభావానికి గురి అయిన ముహమ్మద్ (స.అ.సం) ఆసలు ప్రవక్త ఎలా కాగలరని కొందరి వాదన. ఇలా వాదించేవారు ఈ క్రింది వాక్యాలు గమనించాలి.
(లూకా; 4:1,2) "యేసు పరిశుద్దాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత శోధింపబడుచుండెను."
పై వాక్యం ప్రకారం యేసు అపవాది ప్రభావానికి గురి అయ్యారని స్పష్టమవుతుంది. అపవాది ప్రభావానికి అసలు ఏమాత్రం గురి కాని వాడెవ్వడు? అన్న ప్రశ్నకు 'దేవుడు (యహోవా) కీడు విషయమై శోధింప బడడు' (యాకోబు; 1:13) అని వాక్యం సమాధానమిస్తుంది. దీని ప్రకారం ఒక్క దేవుడు తప్ప ఎవరైనా దురాత్మల చే శోధింపబడే అవకాశం ఉందన్న మాట. యేసు, క్రీస్తు అయినప్పటికీ ఆయన ఒక మానవ మాత్రుడే కదా! అందుకే ఆయన కూడా సాతాను చే శోధింప బడ్డారు. దీనిని బట్టి యేసును పరిశుద్ధుడు అనవచ్చా? అలాగే ముహమ్మద్ (స.అ.సం) కూడా దేవుని ప్రవక్త అయినప్పటికీ మానవ మాత్రులే కదా! కనుక ఆయన శోధింప బడతంలో వింతేముంది?
కోడలును వివాహం చేసుకున్నవాడు ప్రవక్త ఎలా కాగలడు?
ప్రవక్త
ముహమ్మద్ (స. అ.
సం) వ్యక్తి త్వాన్ని
కించపరిచే క్రమమ్లో చేసే విమర్శలలో ఒక విమర్శ
ఆయన
తన
సొంత
కోడలినే
వివాహం చేసుకున్నారన్నది. వాస్తవానికి ఇదొక
అభాండం. అభూత కల్పన.
ప్రవక్తల
నియామకం
జరిగేదే మూఢ నమ్మకాలను, మూఢాచారాలను అంతమొందించడం కోసం. అయితే ప్రవక్తల
బొధనలతో
వాటిని ప్రజలు విడనాడలేనప్పుడు ఆ ప్రవక్తలే వాటిని అతిక్రమించి చూపించాల్సి ఉంటుంది. 'దత్త
పుత్రుడు
కన్న కుమారునితో సమానం'
అనే
ఒక తప్పుడు భావన
ఆనాటి
ప్రజలలో అత్యంత బలంగా నాటుకుని ఉండేది. ఆ భావన
ఆధ్యాత్మికంగానే
కాక,
నైతికంగాను, ప్రకృతిపరంగానూ తప్పే కదా! అలాంటి తప్పుడు భావనను ఖండించే
ఎలాంటి పనినీ చేయడానికి ఆనాటి ప్రజలు ఏమాత్రమూ సాహసించే వారు కాదు. అంటే ఆ దురాచారం అంతగా ఆనాటి సమాజమ్లో వేళ్ళూనుకొని ఉంది.
ఆ నేపధ్యం లో ప్రవక్త
ముహమ్మద్ (స. అ.
సం) వద్ద నోటిమాటగా
కుమారునిగా పిలువ
బడే
ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి తన మేనత్త
కూతురికిచ్చి వివాహం చేసి ఉంటారు. ఆ వ్యక్తికి అతని భార్యకు
పొసగని అనివార్య పరిస్థితుల్లో విడాకులైపొతాయి. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) 'కన్న'
కొడుకు
కానప్పుడు అతని భార్య ఆయనకు
కోడలు ఎలా కాగలదు? ఈ విధంగా నోటి మాటగా కుమారునిగా
పిలువబడేవాడు ఎన్నటికీ కన్న కుమారుడు
కాలేడని కేవలం చెప్పటమే కాక, ఆ దురాచారాన్ని
ఆయన స్వయంగా ఆచరణ
ద్వారా
ఖండించి మరీ 'మాదిరి'
చూపించారు. అత్యంత ధర్మ
బద్ధమైన
ఈ
విషయాన్ని దాచిపెట్టి, 'సొంత'
కోడలినే
వివాహం చేసుకున్నారని ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) పై దుష్ప్రచారం చేయడం ఎంత వరకు
న్యాయం?
ముహమ్మద్ (స. అ. సం) ని విమర్శించే వారికి
… తన 'సొంత' కోడలితో వ్యభిచారం
చేసిన యూదా గోత్రపు మూల పురుషుడి గురించి తెలియదా?
యూదా గోత్రపు సింహం అని యేసు గురించి ఎంతో గొప్పగా
చెప్పుకునే ముహమ్మద్ (స.
అ.
సం) విమర్శకులైన క్రైస్తవ
పండితులకు
యూదా గోత్రపు (నీచమైన)
గొప్పతనం గురించి తెలియదా? యూదా స్వయంగా తన సొంత
కోడలైన
తామారుతో
వ్యభిచారానికి పాల్పడ్డాడు. (ఆది కాండము;
38: 15-18) అతని ఆ నీచ
కృత్యం
ద్వారా కలిగిన కవలల
అక్రమ
సంతానమే
యూదా గోత్రం (ఆది కాండం; 38:
27) అలాంటి నికృష్ట గోత్రంలో
పుట్టిన కన్య
మేరీకి
జన్మించిన యేసు పరిశుద్ధుడు ఎలా
కాగలడు?
అని
ముహమ్మద్
(స. అ. సం) అనుచరులు ప్రశ్నిస్తే, ఈ ముహమ్మద్ (స. అ.
సం) విమర్శకులైన క్రైస్తవ
పండితులు
ఎప్పటికైనా సమాధానం చెప్పగలరా? అంతటి దుర్లక్షణాలున్న
వారినే
'పరిశుద్ధ'
ప్రవక్తలని
బైబిలు ప్రకటిస్తున్నప్పుడు అలాంటి లక్షణాలు ఏమాత్రం లేని ముహమ్మద్ (స. అ.
సం) '
పరిశుద్ధ
ప్రవక్త
' కాలేరా? ఆలోచించగలరు.
దుష్టులే పరిశుద్ధులను విమర్శిస్తారు
నేటి కొందరు క్రైస్తవ
పండితులు
ప్రవక్త ముహమ్మద్ (స.
అ.
సం) వ్యక్తిత్వాన్ని సామాన్య క్రైస్తవుల
ద్రుష్టిలో
దిగజార్చడానికి ఏ విమర్శలైతే లేవనెత్తుతున్నారో అచ్చం
అలాంటి
వాటినే నాటి కొందరు యూద పండితులు
సైతం యేసు వారి వ్యక్తిత్వాన్ని సామాన్య యూదుల
దృష్టిలో
దిగజార్చడానికి " దయ్యం
పట్టినవాడని ', ' వెర్రి వాడని ',
'దుర్మార్గుడని',
' పాపి
' అని, ' అబద్ధీకుడని
', ' వ్యభిచార సంతానమని
'
తీవ్ర
విమర్శలు
చేసేవారు.
అలాంటి దుష్టులే కదా పరిశుద్ధులను విమర్శించేది. విశేషం ఏమిటంటే, కన్య
మేరీని
వ్యభిచారిణి అని, యేసు వారిని అక్రమ
సంతానమని, గారడీగాడని యేసు వారి పట్ల ఆనాటి
విధ్వేషమే యూదులలో ఈనాటికీ కొనసాగుతూఉండడం. వీటికి ఆధారం
– www.talmudunmasked.com అనే పేరుతో అంతర్జాలం లో
(net) చూడవచ్చు.
యేసు వారిని కించపరచడానికి అన్యాయమైన
ఘోర
విమర్శలకు
పాల్పడుతున్న యూద
పండితుల
కంటే
నేడు ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) వ్యక్తిత్వాన్ని కించపరచడానికి విఫల
యత్నాలు
చేస్తున్న కొందరు క్రైస్తవ పండితులు
తక్కువేమి కాదు.
కానీ అత్యంత
గమనార్హమైన
విషయమేమిటంటే
ఏ ముహమ్మద్ (స. అ.
సం) పై నైతే నెటి కొందరు క్రైస్తవ
పండితులు
అనేక అభాండాలు మోపుతున్నారో ఆయన
ఒక్క
' యహొవాను మాత్రమే దేవునిగా విశ్వసించాలని, యేసుం వారిని క్రీస్తుగా నమ్మితీరాలని, ఇంకా కన్య
మేరీ
పరిశుద్ధురాలని అంగీకరించాలని మరియు తౌరాతు ' పాత
నిబంధన
' , ఇంజీలు (కొత్త
నిబంధన)
లను
దేవునిచే పంపబడిన గ్రంధాలుగా నమ్మాలని
ప్రకటించడమే కాకుండా, అలా నమ్మడాన్ని తన
ప్రాతిపదిత
విశ్వాసంలో
ప్రధాన భాగంగా చేశారు. అంతేగాక యేసు
వారి గురించి, సామాన్య
క్రైస్తవుల
గురించి
ఆయన ద్వారా ఇవ్వబడిన
ఖుర్ఆన్ం
ప్రకటించేదేమిటో ఈ క్రింద గమనించగలరు.
(ఖుర్ఆన్ 3: 113, 114) "
గ్రంధ
ప్రజలందరూ (క్రైస్తవులు) ఒకలాంటి వారు కాదు. వారిలో సత్య మార్గంలో
స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు
ఉన్నారు.
వారు రాత్రి సమయాల్లో అల్లాహ్ (యహోవా) వాక్యాల (ఇంజీలును) పఠిస్తారు. ఆయన
ముందు
సాష్టాంగ పడతారు. అల్లాహ్ ను (యహొవా), అంతిమ
దినాన్ని (పునరుత్థానము) విశ్వసిస్తారు. మంచి
చెయ్యండని ఆగ్నాపిస్తారు, చెడుల
నుండి
ఆపుతారు.
సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. వారు
(క్రైస్తవులు) సజ్జనులు.
"
(ఖుర్ఆన్;
5:
83) "విశ్వాసుల (ముస్లిముల)
పట్ల
మైత్రి
విషయం లో 'మేము క్రైస్తవులం'
అని
అన్న వారిని నీవు అత్యంత
సన్నిహితులుగా
నీవు చూస్తావు. దీనికి కారణం ఏమిటంటే వారిలో (క్రైస్తవులు) దైవ
భక్తిగల
విద్వాంసులు, ప్రపంచాన్ని పరిత్యజించిన సన్యాసులూ
ఉన్నారు.
ఇంకా వారిలో అహంభావం లేదు.
(ఖుర్ఆన్; 5:
46) "ఈ ప్రవక్తల
తర్వాత
మేము మర్యమ్ కుమారుడైన
ఈసా (యేసు) ను పంపాము. ఆయన తన
కాలంలో
ఉన్నటువంటి తౌరాతు గ్రంధం లోని విషయాన్ని ధృవీకరించేవాడు (మత్తయి ; 5: 17) మేము
ఆయనకు ఇంజీలును (సువార్తలు)
ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వము, జ్యోతీ ఉన్నాయి.
ఇంత గొప్పగా
ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) ఖుర్ఆన్ గ్రంధం ద్వారా అటు క్రైస్తవులను, '
సత్యవంతులని
',
సజ్జనులని,
ఇటు
పాత నిబంధన
(తౌరాతు) కొత్త
నబబంధన
(ఇంజీలు) గ్రంధాలను
'మార్గదర్శకత్వము',
జ్యోతి'
అని
సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన
బోధనలను
బట్టే యేసును క్రీస్తుగా సందేహ రహితంగా
విశ్వసిస్తున్న క్రైస్తవేతరులు ముస్లిములే.
బైబిల్లో ఉన్న ఈ నాలుగు విషయాలను విమర్శిస్తే ముహమ్మద్ (స. అ. సం) విమర్శకుల సమాధానం ఏమిటి?
విమర్శ
అనేది
గోడకు కొట్టిన బంతి లాంటిది. దానిని ఎంత
వేగంగా
విసిరితే అంతే వేగంగా మన మీదకు
దూసుకు వస్తుంది. సామాన్య
క్రైస్తవులను
ఇస్లాంపట్ల ఆకర్షితులు కాకుండా చేయడానికి
ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) ను గుడ్డిగా విమర్శిస్తున్నారు. ఈ క్రింది విధంగా యేసును
విమర్శిస్తే వారిచ్చే సమాధానం ఏమిటి?
1.
(మత్తయి;
10: 24) "భూమి
మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంపకుడి; ఖడ్గమునే గాని
సమాధానమును పంపుటకు నేను రాలేదు. " అని ఉగ్రంగా ప్రకటిస్తున్న
యేసు
స్థాపించ దలచింది సమాధానమా? లేక ఉగ్రవాదమా? అలాంటి ఉగ్రుడు దేవుని పరిశుద్ధుడు అయ్యే అవకాశం
అసలు
ఉందా?
2.
(మత్తయి;
10: 35) "ఒక మనుష్యునికినీ, వాని తండ్రికినీ, కుమార్తెకునూ, ఆమె తల్లికినీ, కోడలికినీ ఆమె అత్తకునూ, విరోధమును పెట్టవచ్చితిని". అని ఉరుముతున్న యేసు
లక్ష్యం సమాజాన్ని ఐక్య పరచ
టమా? విడగొట్టటమా? ఇలా మాటలాడేవాని మానసిక
స్థితిని
గురించి అనుమానించే అవకాశం లేదా? అలాంటివాడు దేవుని సంబంధి
ఎలా కాగలడు?
3.
(లూకా; 12:
49) " నేను
భూమిమీద అగ్ని వేయవచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను.
" ఈ విధంగా యావత్ మానవాళిని అగ్నితో- దహించి పారేయాలనుకొని ఎంత గానో
కోరుకునే వాడు శాంతికాముకుడు ఎలా కాగలడు?
4.
(లూకా; 19:
47) "మరియు
నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శతృవులను ఇక్కడికి తీసుకుకువచ్చి నా యెదుట
సంహరించుడని
చెప్పెను.” తన
ప్రత్యర్ధుల
పట్ల
ఇంత
కఠినంగా
స్పంధించే వ్యక్తి సాత్వికుడు ఎలా కాగలడు? అని క్రైస్తవులను
ఆ విధంగా ప్రశ్నించకుండా ముస్లిములను ఆపింది కూడా నేడు క్రైస్తవులు గ్రుడ్డిగా విమర్శిస్తున్న
ఆ
ప్రవక్త ముహమ్మదే (స. అ.
సం)!
ముహమ్మద్ (స. అ. సం) ప్రత్యక్షంగా ఉండగా నాటి యూద, క్రైస్తవ పండితులు ఆయన ప్రస్తావన బైబిల్లో లేదని నిరూపించే విషయం
లో ఎందుకు విఫలమయ్యారు?
యేసు తన
స్వజాతీయులైన
యూదులచే
తిరస్కరించబడిన మాదిరిగానే తన
స్వజాతీయులలోని అవిశ్వాసులచే మరియు యూదులు,
క్రైస్తవులచే
ముహమ్మద్
(స. అ.
సం) సైతం ప్రారంభంలో తిరస్కరించబడ్డారు. వారు ఆయనను దైవ
ప్రవక్తే
కాదన్నారు. అంతటితో ఆగక
అటు
మక్కా బహుదైవోపాసకులు, ఇటు యూదులు,
క్రైస్తవులకు
చెందిన అవిస్వాసులందరూ ఏకమై ముహమ్మద్ (స. అ.
సం) అసలు దైవప్రవక్తే కాదని నిరూపించడానికి రవ్వంత
సాక్ష్యం
దొరికినా చాలని కాచుకుని ఉండేవారు. అటువంటి సందర్భంలో
ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) చేసిన ఒక
బహిరంగ
ప్రకటన
ఏమిటో
ఈ క్రింద గమనించగలరు.
(ఖుర్ఆన్; 7:
157) "ఈ సందేశహరుణ్ణి,
చదువనూ, వ్రాయనూ రాని ఈ ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం)
ను
అనుసరించే వారు (ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు).
అతని
ప్రస్తావన వారికి (యూదులు, క్రైస్తవులు)
తమ
వద్ద
ఉన్న
తౌరాత్ (పాత నిబంధన)
ఇంజీలు (కొత్తనిబంధన) గ్రంధాలలో
వ్రాయబడి లభిస్తుంది.
సూరే హామ్మీమ్ అస్ సజ్దహ్ (సూరే ఫుస్సిలత్) నెం
: 41
ఒక రోజు
మక్కాలోని ఖురేష్ నాయకులంతా సమావేశమై రోజు రోజుకు
పెరిగిపొతున్న ముహమ్మద్ (స. అ.
సం)
అనుచరుల సంఖ్యను
అడ్డుకునేది ఎలా? అని చర్చించుకోసాగారు.
ఈ వెల్లువను గనక అడ్డుకోకపోతే
తమ ప్రాబల్యము ప్రమాదమ్లో పడుతుందని
కొందరు ఆందోళన చెందారు. ఈ తర్జన భర్జన
తర్వాత వాళ్ళు తమందరిలోకి గొప్ప
వాక్చాతుర్యము
గల వ్యక్తి అయిన
ఉత్బా
బిన్
రబియాను రాయబారిగా ఎన్నుకున్నారు.
ఉతబా ప్రతిపాదనలు: మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ.
సం) తో మంతనాలు జరపడానికి ఉతబా వచ్చాడు. మొదట్లో అతను మహా
ప్రవక్త (స.
అ.
సం) పై ఆరోపణాస్త్రాలు సంధించాడు. అరబ్బులను అయోమయంలో పడవేసి,
సంఘంలో
చీలికను తెస్తున్నావని ఆయన్ని విమర్శించాడు. ఈ కొత్త
సందేశం
ద్వారా నువ్వు సాధించదలచిందేమిటో చెప్పు? నీ
కోర్కెలు తీర్చటానికి మేమంతా సిద్దంగా ఉన్నామని ప్రలోభపెట్టాడు. అతని ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి:
Ø ఈ
ఉద్యమం ద్వారా సిరిసంపదలను పొందాలన్నదే నీ అభిమతమైతే చెప్పు,
మేమంతా
కలసి నీకు కావలసినంత ఐశ్వర్యాన్ని
పోగుచేసి ఇస్తాం.
Ø పోనీ, అరేబియాను ఏలాలన్న కోరిక
ఉంటే
చెప్పు,
మేమంతా కలిసి నిన్ను మా నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాము.
Ø ఒకవేళ
అందమైన
స్త్రీని
మనువాడాలన్న కోరిక
ఉంటే
చెప్పు,
ఒక్కరేం
ఖర్మ పదేసి అందగత్తెలను నీకు కట్టబెట్టడానికి
సిద్ధంగా ఉన్నాం.
Ø ఒకవేళ
నీపై
చేతబడి ప్రభావం ఏమన్నా ఉంటే నిస్సంకోచంగా చెప్పు, మేము
మా సొంత ఖర్చులపై నీకు వైద్యం
చేయిస్తాము.
ఈ ప్రతిపాదనలన్నీ
విన్న తరువాత మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) ఈ సూరా (సూరే ఫుస్సిలత్) ను అతనికి
చదివి వినిపించారు. ఉతబా ఎంతగానో ప్రభావితుడయ్యాడు. తిరిగి ఫెళ్ళాక అతను ఖురైష్
సర్దారులను ఉద్దేశించి ఇలా అన్నాడు: "మీరేమన్నాఅనండి
ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) పై చేతబడి ప్రభావం ఏమాత్రం లేదు. అతను చెప్పేది కవిత్వం
అంతకన్నా కాదు. అతనొక అద్భుతమైన, అపూర్వమైన వాణిని
వినిపిస్తున్నాడు." అంటే ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) సందేశం విషయంలో ఆవేశపడకుండా ప్రశాంత హృదయంతో
ఆలోచించటం అటుంచి, 'నువ్వు కూడా అతని ఇంద్రజాలానికి
మోసపోయావులే!' అని ఉతబాను
నిందించారు. ఈ ఉల్లేఖనాన్ని పలువురు ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు
పలు విధాలుగా విశదీకరించారు. విశదీకరించే శైలి భిన్నంగా ఉన్నప్పటికీ
దీని భావం మాత్రం ఒక్కటే. ఈ విషయంలో ఇమామ్ షౌకాని ఇలా అంటున్నారు : "మొత్తానికి
దీనిపై ఖురైషుల సమావేశం జరిగిన మాట వాస్తవమనీ, వారు ఉతబాను తమ రాయబారిగా
మహాప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) దగ్గరకు పంపించారని, ఉతబా ప్రతిపాదనలకు సమాధానంగా ఆయన (స. అ. సం) ఈ సూరా మొదటి భాగాన్ని పఠించారని ఈ ఉల్లేఖనం ద్వారా మనకు తెలుస్తుంది."
No comments:
Post a Comment