Saturday, September 12, 2015

The 100



అమెరికా నుండి "ది హండ్రెడ్"  అనే పుస్తకం ఒకటి ప్రచురించబడింది. ఆ పుస్తకంలో మానవ సంస్కృతి పై విశేష ప్రభావం చూపిన వంద మంది ప్రముఖుల ప్రస్తావన అందులో ఉంది. పుస్తక రచయిత మతపరంగా క్రైస్తవుడు. విద్యా పరంగా శాస్త్రవేత్త. అయితే తన జాబితా లో ప్రధమ స్థానం యేసు క్రీస్తు (అలైహిస్సలాం) కు గాని, న్యూటన్ కు గాని కల్పించలేదు. అతని దృష్టిలో అసమాన కార్యాల మూలంగా మొట్టమొదటి స్థానం ఇవ్వదగ్గ వ్యక్తిత్వం ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (సల్లాహు అలైహివసల్లం) దే. మానవ చరిత్రపై ఆయన (స.అ.సం) చూపినంతటి ప్రభావాన్ని మరే వ్యక్తీ - అతను మతావలంబీకుడైనా, మతరహితుడైనా చూపలేదని రచయిత అభిప్రాయం. ఆయన (స.అ.సం) చేసిన అద్భుతాలను అంగీకరిస్తూ ఆ రచయిత ఇలా అంటున్నాడు.

He was the only man in the History

Who was supremely Successful

on both the Religions and Secular Levels

Dr. Michael H. Heart ; THE 100 Most Influential persons in the World 1978.

మత ప్రాతిపదికగా గాని, ప్రాపంచికంగా గాని చరిత్రలో చివరి ఘట్టం వరకు విజేతగా ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. థామస్ కార్లయిల్ (ఆంగ్లేయుడు) ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ను ప్రవక్తల నాయకునిగా ఖరారు చేశాడు. మైఖేల్ H . హార్ట్ (అమెరికన్) అయితే ఆయన్ని ప్రపంచ చరిత్రలోనే ఆయన్ని మహా మనిషిగా పేర్కొన్నాడు. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) ఘనత ఎంత సుష్పష్టమైనదంటే అది కేవలం ఆయన అనుయాయుల "విశ్వాస" స్థాయికి మాత్రమే పరిమితం కాదు - అదొక చారిత్రిక సంఘటన. చరిత్రను ఎరిగిన ప్రతి మనిషీ దీన్ని సంఘటనగా ఒప్పుకొని తీరతాడు.


ఆంగ్లం నుండి అనువాదం  

ఈ వ్యాసం మైఖేల్ H హార్ట్ (జనవరి; 1932) రచించిన "ది హండ్రెడ్" (THE 100) నుండి సేకరించబడింది. రచయిత అమెరికా దేశస్తుడు. ఖగోళ శాస్త్రంలో పండితుడు, చరిత్రకారుడు కూడాను. ఈయన ఉన్నత విద్యావంతురాలైన ఈయన భార్య - ఇద్దరు కలిసి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల గురించి అధ్యయనం చేశారు. ఆ అధ్యాయానికి అక్షర రూపం ఇస్తూ వారు 572 పేజీల ఆంగ్ల పుస్తకం వ్రాశారు. రచయిత దృష్టిలో చరిత్ర పై ప్రభావం వేసిన వంద మంది ప్రముఖుల స్థితి గతులు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)కు ఈ పుస్తకంలో మొట్టమొదటి స్థానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రంధ రచయిత దృష్టిలో ఆయన (ముహమ్మద్ (స.అ.సం) చరిత్రలో అందరి కన్నా గొప్పవారు. మానవ చరిత్రపై ఆయన వేసిన ప్రభావం మరెవరు వేయలేదు. ఈ పుస్తకంలో దైవ ప్రవక్త యేసు క్రీస్తు (అలైహిస్సలాం) ని మూడవ స్థానంలో, హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ను 16వ స్థానంలో ఉంచడం జరిగింది. ఖలీఫా హజ్రత్ ఉమర్ (రజి) కి 51వ స్థానం ఇవ్వబడింది. ఈ గ్రంధంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (స.అ.సం) గురించి వ్రాసిన వ్యాసాన్నే ఇక్కడ అనువదించి సమర్పించాము.

గ్రంధంలో మహాప్రవక్త ముహమ్మద్ (స.అ.సం)ను రచయిత ఎంతగానో ప్రశంసించాడు. అయితే ప్రవక్త గురించి రచయితకు గల పరిజ్ఞానం దృష్ట్యా అతని అధ్యయనం తీరు రీత్యా పరిశీలిస్తే చాలా మంది ముస్లిమేతర రచయితలలో (ఇస్లాం పట్ల) ఉండే భావమే ఇతనిలోను ఉందనిపిస్తుంది. ఉదాహరణకు (ముహమ్మద్ (స.అ.సం) మొదట్లో యూదులు, క్రైస్తవుల నుంచే దేవుని ఏకత్వపు భావనను గ్రహించారని చెప్పటం, అలాగే (ముహమ్మద్ (స.అ.సం) ఖుర్'ఆన్ ను రచించారని అతను అభిప్రాయ పడ్డాడు. ఈ విషయం కేవలం మన విశ్వాసాలకు మాత్రమే వ్యతిరేకం కావు, జ్ఞాన పరంగా కూడా నిరాధారమైనది. దీన్ని ఖండిస్తూ ఇప్పటికే ఎన్నో రచనలు వచ్చాయి. ఇలాంటి విషయాలు చరిత్రలో అవాస్తవికమైనవని, అభూతకల్పనలని తెలిసికూడా పాశ్చాత్య మేధావులు మాటిమాటికి అలాగే ఎందుకు వ్రాస్తారు? అసలు విషయమేమిటంటే వాళ్ళు జ్ఞానం లేక విద్యా విషయంగా భూభాగంపై కాక వేరే స్థానం నుంచి వచ్చిన మూలమును ఒప్పుకోరు. మరో చోటి నుంచి 'జ్ఞానం' గ్రహించడం అనే విషయం వారి బుద్ధికందదు. మనిషి మనసులో ఏదేని విషయం పట్ల అనుమానం వచ్చిందంటే లేక ఆ విషయమై అతని బుధి గనక తికమక పడిందంటే ఇక అతనికి ఎన్ని ఆధారాలతో నచ్చచెప్పినా అతనికి మింగుడు పడదు. అతని వాదనను ఎన్ని ఆధారాలతో ఖండించినప్పటికీ తానూ చెప్పిందే తిరుగులేని సత్యం అని పలుకుతాడు.
















No comments:

Post a Comment