Saturday, September 5, 2015

నరకం అంటే ఏమిటి?

నరకం అంటే ఏమిటి?
దుర్గతి = దుర్+గతి  ; దుర్ = చెడు ; గతి = పాప్య వస్తువు, పొందే ఫలితము ; దుర్గతి అంటే చెడు ఫలితము 

నరకం ఎలా ఉంటుంది:

(యజుర్వేదం; 40:2) ఆ లోకాలు సూర్యుడు లేని లోకాలు. ఎల్లెడెలా అంధకారం నరకం వ్యాపించి ఉంటుంది. 

(శ్రీమద్ భాగవతం; 5:26) సేకరణ సుఖ్ సాగర్ పేజి నెం: 293 - 296

1. కొరడాలతో కొడుతూ "తపృ సర్మి" అనే నరకంలోనికి తీసుకొని  వెళ్లి పడవేస్తారు. 

2. ఎర్రగా కాలుతున్న ఇనుప విగ్రహాలకు వారిని కట్టి పడవేస్తారు. అక్కడ వారు కాలుతూ ఉంటారు. 

3. మలమూత్రాలు, రక్తము, వెంట్రుకలు, క్రొవ్వు, గోళ్ళు, ఎముకలతో నిండిన "వైతరిణి" నదిలో మునకలేస్తారు. 

4. నరకంలో పడవేసి వారి నోటిలో యమదూతలు కరిగిన ఇనుప రసం పోస్తారు. 

5. అక్కడ యమ దూతలు నరకవాసిని సూదులతో పొడుస్తారు. 

6. అందులో పడిన మనిషి బాధతో మూలుగుతాడు. 

7. మనిషి అక్కడ వెంటనే గృడ్డివానిగా, పిచ్చి వానిగా మారిపోతాడు. 

8. ఇంకా అతను మొదలు నరికిన మ్రానులా పడిపోతాడు. 

నరకం ఎన్నాళ్ళు ఉంటుంది 

(గీత; 1:54) 

మనుష్యాణాం ...................... నరకే నియతం వాసో భవతి 

మనుష్యులకు నరకమందు శాశ్వతముగా నివాసము కలుగును. 

ఆ నరకం ఎవరికీ లభిస్తుంది 

(గీత; 16:21) 

త్రివిదం నరక స్వేదం .......................................... స్తస్మాదేతత్త్ర యంత్యజేత్ 

 కామము, క్రోధము, లోభము అను నీ మూడును మూడు విధములగు నరక ద్వారములు. ఇవి తనకు (జీవునకు) నాశనము కలుజేయును. 

(గీత; 4:12)

కాక్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా

 కర్మల యొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవులీ ప్రపంచమున దేవతలనారాధించుచున్నారు. ఏలయనగా కర్మ ఫలసిద్ధి ఈ మనుష్య లోకమున శ్రీఘముగు గలుగు చున్నది. 

(గీత; 7:20)

కామెంతే సైర్హృత జ్ఞానాః ప్రపద్యన్తేచ్య దేవతాః తం తం సియ 
మమా స్థాయ ప్రకృత్యా నియతాన్స్వయా

(కొందరు) తమ యొక్క ప్రకృతి (జన్మాంతర సంస్కారము) చే ప్రేరేపించ బడిన వారై విషయాడులందలి కోరికచే వివేకమును గోల్పోయి దేవతారాధనా సంబంధమైన ఆయా నియమములను అవలభించి ఇతర దేవతలను భజించు చున్నారు.
నరక విశేషాలు
నరకం అంటే ఏమిటి?
నరకం అంటే ఒక అగ్ని గుండం. నరకమనేది పాపం చేసుకున్నవారికి, వారి కర్మానుసారం శిక్షల్ని అమలు చేసే భయంకర లోకం. నరకంలో ఎల్లప్పుడూ కాలుతూ, బాధలు అనుభవిస్తూ, ప్రతిరోజు హాహాకారాలతో నిండి ఉండే నివాస స్థలం అది.  
నరకంలో ఎంత కాలం ఉంటారు?
నరకంలో ఒక నరకవాసి ఎల్లప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండే నరకవాసి తన పూర్తి జీవిత కాలంలో అన్య దైవారాధన చేస్తూ, దైవ సందేశం అందిన తర్వాత కూడా అదే స్థితిలో మరణించిన వాడై ఉంటాడు. అతను ఏ జాతికి చెందినవాడైనా సరే.
నరకం ఎలా ఉంటుంది? అక్కడ వసతులు ఎలా ఉంటాయి?
·       నరకాన్ని చూడగానే అవిశ్వాసుల ముఖాలు నల్లబడిపోతాయి. (ఖుర్ఆన్‌; 10: 27)
·       నరకవాసులు శిక్షను భరించలేక చావును కోరుతారు కాని వారికి చావు రాదు. (ఖుర్ ఆన్‌; 25: 13)
·       నరకవాసుల గాయాలనుండి ప్రవహించే చీము, నెత్తురు, మరిగే నీరు నరకవాసులకు త్రాగడానికి ఇవ్వబడుతుంది. (ఖుర్ ఆన్14: 16, 17)
·       నరకాగ్ని నరకవాసుల ముఖాల మాంసాన్ని కాల్చివేస్తుంది. వారి దవడలు బయట పడతాయి. (ఖుర్ ఆన్‌; 23: 104)
·       నరకవాసులను ఇనుప గదలతో శిక్షించడం జరుగుతుంది.(ఖుర్ ఆన్‌; 22: 19)
·        నరకంలో విసరబడిన రాయి దాని అడుగు భాగాన చేరడానికి సుమారు 70 సంవత్సరాలు పడుతుంది. (ముస్లిమ్‌)
·       నరకంలో అన్నింటికంటే తేలికైన శిక్షగా నిప్పు చెప్పులు ధరించ బడతాయి. వాటివల్ల నరకవాసుల మెదడు ఉడుకుతూ ఉంటుంది. (ముస్లిమ్‌)
·       నరకవాసి యొక్క చర్మం సుమారు 63 అడుగుల వెడల్పుగా ఉంటుంది. (తిర్మిజీ)
·       నరకవాసులకు ఇవ్వబడే ఆహారపు ఒక ముక్క అయినా భూలోకంలో పడవేస్తే ప్రాణులన్నింటి ఆహార సంపద  సర్వనాశనం అవుతుంది. (అహ్మద్, నసాయి, తిర్మిజీ, ఇబ్నెమాజా)
·       నరకవాసుల తలపై ఎటువంటి కాగే నీరు వేయబడుతుందంటే, అది తలకు రంద్రం చేస్తూ, కడుపులోకి చేరుతుంది. అవన్నీ కడుపులో నుండి జారి కాళ్ళపై పడతాయి. (అహ్మద్)
వారి వసతులు:
నరకవాసులు అగ్ని వస్త్రాలు ధరిస్తారు.
(ఖుర్ఆన్‌; 22: 19, 20) "వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి. వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది. దాని వల్ల వారి చర్మాలే కాదు వారి కడుపులోని భాగాలు సైతం కరిగిపోతాయి. "
కొంత మంది అప్రాధులకు గంధకంతో చేయబడిన దుస్తులు తొడిగిస్తారు.
(ఖుర్ఆన్‌; 14: 50) "వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి."
నరకవాసుల విశ్రాంతి కొరకు నిప్పు పడకలు పరచబడతాయి.
(ఖుర్ఆన్‌; 7: 41) "వారికి నరకమే పానుపు నరకమే దుప్పటి. మేము దుర్మార్గులకు ఇచ్చే ప్రతిఫలమిదే."
నరకవాసులు కప్పుకునేది, పరుచుకునేది అంతా నిప్పే.
(ఖుర్ఆన్‌; 39: 16) "ఆ రోజు శిక్ష వారిని పైనుండి, క్రింది నుండి కూడా కప్పివేస్తుంది. వాటి (యాతన) గురించి అల్లాహ్ తన దాసులకు భయపెడుతున్నాడు. "
(ఖుర్ఆన్‌; 18: 29) "ఒకవేళ వారు అక్కడ మంచి నీళ్ళు అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారిని సత్కరించడం జరుగుతుంది. అది వారి ముఖాలను మాడుస్తుంది. అది ఎంత మురికి పానీయం! అది ఎంత నికృ్ష్టమైన విశ్రాంతి స్థలం."


నరకంలో ఎవరు ఎక్కువ ఉంటారు :
నరకంలో పురుషులకన్నా స్త్రీలు అధిక సంఖ్యలో ఉంటారు.
"హజ్రత్ ఉసామా (. జి) ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (. . సం) బోధించారు, "నేను స్వర్గ ద్వారాల దగ్గర నిలుచుని ఉన్నప్పుడు అందులోకి పేదవారు, అగత్యపరులు అధిక సంఖ్యలో ప్రవేశించారు. ధన వంతులను స్వర్గద్వారాల దగ్గరే ఆపివేయడం జరిగింది. నరకంలోకి వెళ్ళే ధనవంతులను అంతకు ముందే నరకంలోకి పంపివేయమని ఆదేశించడం జరిగింది. మళ్ళీ నేను నరకద్వారాల దగ్గర నిలబడ్డాను, నరకంలోకి వెళ్ళే వారిలో స్త్రీలు అధికంగా ఉండడం గమనించాను." (బుఖారి)
"హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్అబ్బాస్ (. జి) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సం. . సం) ఇలా అన్నారు. "నేను స్వర్గం చూశాను, అందులో పేదవారు, అగత్యపరులు అధికంగా ఉన్నారు. ఇంకా నేను నరకం చూశాను అందులో స్త్రీలు అధక సంఖ్యలో ఉన్నారు." (తిర్మిజీ; 2/2098 సహీహ్)
స్త్రీలు నరకంలో అధికంగా ఉండడానికి కారణం:
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్అబ్బాస్ (. జి) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (. . సం) ఇలా అన్నారు: " ఈనాడు నేను నరకాన్ని చూశాను, అయితే నేను ఎన్నడూ అలాంటి దృశ్యాన్ని చూడలేదు. నేను స్త్రీలను నరకంలో అధిక సంఖ్యలో చూశాను." అనుచరులు ఇలా విన్నవించుకున్నారు: " ఓ ప్రవక్తా! అలా ఎందుకు?" ప్రవక్త (. . సం) ఇలా పలికారు, అది వారి కృతఘ్నత వల్ల. మళ్ళీ ప్రశ్నించడం జరిగింది. "వారు అల్లాహ్ పట్ల కృతఘ్నత చూపుతారా?" ప్రవక్త (. . సం) తెలిపారు; " తమ భర్తల పట్ల కృతఘ్నత చూపుతారు." వారి సేవను గుర్తించరు. నువ్వు ఒక స్త్రీకి జీవితాంతం సేవలు చెయ్యి, కాని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిపోతే ఇలా అంటుంది: ' నేను నీ వల్ల రవ్వంత సుఖాన్ని పొందలేదు.' (ముస్లిం)
"హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (. జి) ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (. . సం) ఈదుల్ అజ్హా లేదా ఈదుల్ ఫిత్ర్ సందర్భంగా ' ఈద్గాహ్ ' వెళ్ళే దారిలో కలవడం జరిగింది. అప్పుడు ప్రవక్త (. . సం) స్త్రీలనుద్దేశించి ఇలా అనడం జరిగింది. "స్త్రీలారా! దాన ధర్మాలు చేయండి. నేను నరకంలో స్త్రీలను అధిక సంఖ్యలో ఉండడం చూశాను. స్త్రీలు ఇలా విన్నవించుకున్నారు. "ఓ ప్రవక్తా! దీనికి కారణం ఏమిటి?" ప్రవక్త (. . సం) ఇలా అన్నారు: " మీరు అధికంగా శపిస్తారు, మీ భర్తల పట్ల  కృతఘ్నతగా వ్యవహరిస్తారు." (బుఖారి)
నరకంలో శాస్వతంగా ఉండేవారు:
అవిశ్వాసులు నరకంలో శాస్వతంగా ఉంటారు:
(ఖుర్ ఆన్‌; 98: 6) "గ్రంధప్రజలలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు."
(దేవుణ్ణీ, దైవగ్రంధాలను, దైవప్రవక్తలను తిరస్కరించేవారికి పట్టే దుర్గతి ఇది. పైగా వారు జీవరాశుల్లోకెల్లా నీఛమైన వారుగా లిఖించబడ్డారు.)
(ఖుర్ఆన్‌; 2: 39) "నిస్సందేహంగా విశ్వసించని వారు, మా వాక్యాలను ధిక్కరించే వారూ, నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాస్వతంగా ఉంటారు."
ముసలి వ్యభిచారి, అసత్యవాది అయిన పాలకుడు, గర్విష్టి అయిన బిచ్చగాడు నరకంలోకి ప్రవేశిస్తారు.
"హజ్రత్ అబూహురైరా (. జి) ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త (. . సం) ఇలా హెచ్చరిస్తున్నారు: " అల్లాహ్ తీర్పు దినంనాడు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడడు, వారిని పరిశుద్ధ పరచడడు, వారికి కఠిన శిక్ష పడుతుంది. 1. ముసలి వ్యభిచారి 2. అసత్యం పలికే పరిపాలకుడు 3. గర్విష్టి అయిన బిచ్చగాడు." (ముస్లిం కితాబుల్ ఈమాన్‌)

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఖుర్ ఆన్వాక్యాలుగాని, హదీసులు గాని ఉన్నాయి. మరి మనం ఈ నరకాగ్ని నుండి మనలను మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి. భయంకరమైన ఆ నరకాగ్ని నుండి సర్వ సృష్టి కర్త అయిన ఆ అల్లాహ్ మనందరినీ రక్షించుగాక! ఆమీన్
  
ఇవే ఆ భయంకరమైన, ఒళ్ళు జలదరించే విచిత్రమైన సంఘటనలు. తీర్పు దినం నాడు సంభవించే ఈ సంఘటనలను ఖుర్ఆన్మరియు హదీసులలో అనేక చోట్ల నరక శిక్షలుగా పేర్కొనడం జరిగింది. సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ మనల్ని తన దయ మరియు కరుణాకటాక్షాలతో వీటి నుంచి రక్షించు గాక! ఆమీన్‌. నిస్సందేహంగా ఆయన పరమ కృపాశీలుడు మరియు కరుణామయుడు. తాను ఏది కోరితే అది చేయగల సమర్ధుడు.




















No comments:

Post a Comment