అన్ని ధార్మిక గ్రంధాలు దేవుడు ఒక్కడు మాత్రమే అని సాక్ష్యమిస్తున్నాయి
_________________________________________________
_________________________________________________
(ఋగ్వేదం; 1:7:9) య ఏక్ శ్చ ర్షణీనాం వసూనామిరజ్యతి ఇంద్రః పంచ క్షితీనామ్
(ऋग्वेद; 1:7:9) यएकस्चर्ष णीनाम वसूनां मिरजयति इन्द्रः पंच क्षितीनाम
"ఒక్కడగు దేవుడు" భూమి పై నివసించు మనుష్యుల యొక్క సకలైశ్వర్యముల యొక్క స్వామియై ఉన్నాడు.
(ఋగ్వేదం; 1:84:7) య ఏకిద్ విదయతే మార్తాయ దాశుషే
(ऋग्वेद;1:84:7) यये किद विदयते वसु मारताय दासुषे
(ऋग्वेद;1:84:7) यये किद विदयते वसु मारताय दासुषे
ఆత్మ సమర్పణ మొనర్చు భక్తునకు, అతడొక్కడే సకలైశ్వర్యములు ఇచ్చును.
(ఋగ్వేదం; 6:45:16) య ఏక ఇత్తము ష్తుహి కృష్టీనాం విచక్షణిహ్ పతిర్జజ్ఞే వృషకృతః
(ऋग्वेद; 6:45:16) य एक इत्तमु श्तुही कृष्टीनाम विचक्षणीः पटीर्जग्ने वृषकृतः
"ఒక్కడగు దేవుడు" స్తుతింపదగినవాడు; అతి గొప్ప కార్యములు చేయువాడు; సర్వ సృష్టికి స్వామియై ఉన్నాడు.
(ఋగ్వేదం; 6:36:4) ఏకో విశ్వస్య భువనస్య రాజా
(ऋग्वेद; 6:36:4) एको विस्वस्य भुवनस्य राजा
సమస్త భ్రహ్మాండమునకు అధిపతి ఒక్కడే
(ఋగ్వేదం; 10:81:3; యజుర్వేదం; 17:19) దావ్యా పృధ్వివీ జనయన్ దేవ ఏకః
(ऋग्वेद ; 10:81:3; यजुर्वेद; 17:19) दाव्या पृध्वीवी जनयन देव एकः
భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఒక్కడే
(ఋగ్వేదం; 8:1:27) య ఏకో ఆస్తి దంసనా మహా ఉగ్రో అభి వ్రతే:
(ऋग्वेद; 8:1:27) य येको अस्ति दंसना महा उग्रो अभी व्रते:
ఆయన ఒక్కడే - తన అద్భుతమైన క్రియల ద్వారా మరియు దృఢ సంకల్పముతో మహిమగల వాడు - సర్వ శక్తిమంతుడు.
(శ్వేతాశ్వతరోపనిషత్తు; 3:2) ఏకోహి రుద్రో న ద్వితియాయ తస్థు
(स्वेतासवतारोपनिषत्; 3:2) एकोही रुद्रोणा न द्वितीयाय तस्थुः
దేవుడు ఒక్కడే ఆయన ప్రక్కన ఇంకొక్కడు లేడు.
(ఛాందోగ్యోపనిషత్తు; 6:2:1) ఏకం యవద్వితీయం
(चान्दोग्योपनिषत् ; 6:2:1) एकम यवद्वितीयम
ఆయన ఒక్కడే రెండవ వాడు లేడు
(ఐతరియోపనిషత్తు; 1:1) ఓం ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాన్యత్ కించన్ మిషత్
(अइतरेयोपनिषत् ; 1:1) ओं आत्मावा इदमेक एवाग्र आसीत् नान्यत किंचन मिषत
ప్రారభంలో దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. రెప్పల్లల్లార్చే మరేది అప్పుడు లేదు.
(ఖుర్'ఆన్; 2:163) వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లహువ ర్రహ్మానిర్రహీమ్
(खुर'आन; 2:163) व इलाहुकुम इलाहुम वाहिद ला इलाहा इल्लाहु र्रहमानिर्रहीम
"మీ దేవుడు ఒక్కడే. ఆ కరుణామయుడు, కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు."
(ఖుర్'ఆన్; 112:1) ఖుల్ హు అల్లాహు అహద్; అల్లాహు సమద్
(खुर'आन; 112:1) खुलहु अल्लाहु अहद, अल्लाहु समद
"ఇలా అనండి! 'ఆయనే అల్లాహ్! ఏకైకుడు. ఆయన నిరాపెక్షా పరుడు."
సర్వ సృష్టికర్త అయిన దైవం పుట్టించే వాడే కాని, పుట్టేవాడు కాదు
(యజుర్వేదం; 40:8) స పర్యగాత్ శుక్రం ఆకాయమవ్రణమస్నావిరం శుద్ధం అపాపవిద్ధం
(यजुर्वेद; 40:8) स पर्यगात सुक्रम अकायमवृणमस्ना वीरम सुद्धं अपापविद्धम्
"సర్వ వ్యాపకుడైన ఆ దేవుడు సర్వ శక్తిమంతుడు, శరీర రహితుడు"
(శ్వేతాశ్వతరోపనిషత్తు; 4:5) ఆజం ఏకం
(स्वेतासवतारोपनिषत्; 4:5) अजम ऐकम
ఆజం అంటే జన్మరహితుడు ఏకం అంటే ఒక్కడిన వాడు
"ఒక్కడైన వాడు పుట్టుకలేని వాడు"
(శ్వేతాశ్వతరోపనిషత్తు; 6:9) న చాస్య కశ్చిజ్జనితా న ఛాధిపః
(स्वेतासवतारोपनिषत्; 6:9) न चास्य कश्चिज्जनिता न चाधिपः
ఆ దైవానికి తండ్రి లేడు, ప్రభువు లేడు
సృష్టికర్త అయిన దేవుడు శ్రీకృష్ణుడి ద్వారా అర్జునుడితో పలికిన పలుకులు
(భగద్గీత; 7:24) అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానన్తో మమావ్యయ మనుత్తమమ్
(भगवदगीता; 7:24) अव्यक्तम् व्यक्ति मापन्नम मन्यन्ते मामबुद्धयः परम भावमजानन्तो ममाव्यय मनुत्तमम्
"నాశరహితమైనట్టియు, సర్వోత్తమమైనట్టియు ప్రకృతికి పరమై విలసిల్లినట్టియు నా స్వరూపము తెలియని అవివేకులు అవ్యక్త రూపుడగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానిగా తలంచుచున్నారు."
(బైబిల్, సంఖ్యా కాండం; 23:19) దేవుడు అబద్దమాడుటకు ఆయన మానవ పుత్రుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు.
(ఖుర్'ఆన్ 112:3) లమ్ యలిద్, వలమ్ యూ లద్
(खुर'आन; 112:3) लम यलिद वलमयू लद
"ఆయనకు సంతానము ఎవ్వరూ లేరు, ఆయన ఎవరి సంతానము కాదు"
దేవుడు అగోచరుడు, అవ్యక్తుడు - మానవ ఇంద్రియాలకు కనిపించడు.
(యజుర్వేదం; 32:2) నైన మూర్ధ్వం న తిర్యజ్ఞం న మధ్యే పరి జగ్రభత్
(यजुर्वेद; 32:2) नैन मूर्ध्वम् न तिर्यग्न्यम न मध्ये परि जग्रभत
"ఆ దేవుడు పై నుండి, క్రింద నుండి, మధ్య నుండి, వెనుక, దూరం, సమీపము నుండి పట్టజాలడు"
(శ్వేతాశ్వతరోపనిషత్తు; 4:20) న సందృశే తిష్ఠతి రూపమస్య నచాక్షుషా పశ్యతి కశ్చనైనమ్
(स्वेतासवतारोपनिषत्; 4:20) स संदृसे तिष्ठति रूपमस्य न चक्षुषा पस्यति कसचनैनम
"దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలువదు. ఆయనను కళ్ళతో ఎవరూ చూడలేరు."
(భగద్గీత; 7:24) అవ్యక్తం
(भगवदगीता; 7:24) अव्यक्तम्
"కంటికి కనిపించడు."
(ఖుర్'ఆన్; 6:103) లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్
(खुर'आन; 6:103) ला तुदृकुल अबसार वहुवा युदृकुल अबसार
"ఆయనను ఏ కన్నులూ చూడలేవు, ఆయన చూపులన్నిటిని పర్యవేక్షించి ఉన్నాడు."
దేవుడు మరణాన్ని ఇచ్చేవాడు కాని మరణించే వాడు కాదు
(ఋగ్వేదం; 10:48:5) అహమింద్రో న పరా జిగ్య ఇద్ధనం న మర్త్యవే తస్ధే కదాచన
(ऋग्वेद; 10:48:5) अहमिन्द्रो न परा जिज्ञा इद्धनम् न मर्त्यवे तस्थे कदाचना
నేను సర్వ శక్తిమంతుడగు దేవుడు ఇంద్రుడను. నాకు ఓటమి లేదు మరియు మృత్యువు లేదు.
(చాంద్యోగ్యొపనిషత్తు; 1:1) ఓం ఇత్ ఏతత్ అక్షరం ఉద్గీధముపాసీత
(चान्दोग्योपनिषत् ; 1:1) ओम इत ऐतत अक्षरम उद्गीधमु पासीत
"ఓం ఎవని నామమో, ఎవడు ఎన్నడూ 'నశింపడో' అతనిని ఉపాసించుటయే ఉత్తమము"
(బైబిలు; కీర్తనలు; 9:7, 1వ తిమోతి; 1:17) యహోవా (దేవుడు) 'శాశ్వతముగా' సింహాసనాసీనుడై ఉన్నాడు.
(ఖుర్'ఆన్; 25:58) "వతవక్కల్ అలల్ హయ్యిల్లజీ లాయమూతు వ సబ్బిహ్ బిహంది
(खुर'आन; 25:58) "वतवक्कल अलल हय्यिल्लज़ी लायमूतु व् सब्बिह बिहंदी"
"ప్రవక్తా! సజీవుడూ, ఎన్నడూ మరణించనివాడూ అయిన దేవుని పై నమ్మకం ఉంచు."
ఆ దైవానికి అనేక పేర్లు కలవు కాని అనేక రూపాలు లేవు
(ఋగ్వేదం; 1:164:46) ఇంద్రం మిత్రం వరుణమగ్నిమహురధో దివ్యః స సుపర్ణో
(ऋग्वेद; 1:164:46) इन्द्रम मित्रम मरुणमगनी महुरधो दिव्यः स सुपर्णो
"ఒకే దైవాన్ని విద్వాంసులు ఇంద్ర, మిత్ర, వరుణ, అగ్ని, దివ్య, సువర్ణ, గరుత్మాన్, యమ, మాతరిశ్వాన్ మున్నగు గుణవాచక నామములతో అనేక విధములుగా పిలుచుచున్నారు."
(బైబిల్; నిర్గమ; 6:2-3) "నేను సర్వ శక్తిగల దేవుడు పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యహోవా అను నామమున నేను వారికి తెలియ బడలేదు."
(ఖుర్'ఆన్ 7:180) "వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా ఫద్ ఊహుబిహా వజరుల్లజీన యుల్హిదూన ఫి అస్మాయిహీ సయజ్ జౌన మాకానూ యామలూన్"
(खुर'आन; 7:180) "वलिल्लाहील अस्माउल हुस्ना फद ऊहुबिहा वज़रुल्लज़ीन यूल्हेदून फी असमाईही सयज जौन माकानू यामलून"
"అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతో వేడుకొండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయాలలో సత్యం నుండి వైదొలగే వారిని వదిలిపెట్టండి."
(ఖుర్'ఆన్ 17:110) "ఖులిద్ ఉల్లాహ అవిడి ఉర్రహ్మాన్ అయ్యమ్మా తద్ ఊ ఫలహుల్ అస్మాఉల్ హుస్నా వలా తజ్ హర్ బిసలాతిక వలా తుఖాఫిత్ బిహా వబ్తఘి బైన జాలిక సబీల"
"ప్రవక్తా! వారితో అను : "అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రహ్మాన్ అని అయినా సరే. ఏ పేరుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే. మీరు నమాజు చేసేటప్పుడు కంఠాన్ని మరీ పెంచకండి, మరీ తగ్గించకండి."
"వేదాలలో "ఓం" బైబిల్ లో "యహోవా" ఖుర్'ఆన్ గ్రంధంలో "అల్లాహ్" అని ఆ దేవుని పేరు పేర్కొనడం జరిగింది. నీరు, పాని, వాటర్ అన్న పదాల భావం ఎలా ఒక్కటో ఓం, యహోవా, అల్లాహ్ అన్నా- దేవుడొక్కడే
దైవానికి విగ్రహం లేదు.
(యజుర్వేదం; 32:3 శ్వేతాశ్వతరోపనిషత్తు; 4:19) "న తస్య ప్రతిమ ఆస్థి"
(यजुर्वेद; 32:3 स्वेतासवतारोपनिषत्; 4:19) "न तस्य प्रतिम अस्थि"
"ఆయనకు పోలిన ప్రతిమ ఏది లేదు."
(యజుర్వేదం; 40:8) "శుద్ధమోపవిద్ధం"
(यजुर्वेद; 40:3) "सुद्धमप विद्धम्"
"ఆయనకు శరీరము లేదు ఆయన పరిశుద్ధుడు"
ఆయన తన యొక్క జ్ఞానము మరియు శక్తి సామర్ధ్యాలచే సర్వ వ్యాపకుడై ఉన్నాడు కానీ స్వయంగా ఆయన ఈ సృష్టి లో లేడు. సర్వం ఆ ప్రభువు యొక్క ఆధీనములోనే ఉన్నది.
(బైబిల్ లేవియా కాండం; 26:1)
"(ఆ దేవుడికి) మీరు విగ్రహములు చేసికోనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవ పెట్టకూడదు."
దైవానికి సాటి సమానులు ఎవరూ లేరు.
(యజుర్వేదం; 27:36) "న త్వావాం అన్యో దివ్యోన న జాతో న జనిష్యతే"
ఓ దేవా! నీ వంటి వాడు మరొక్కడు ఆకాశమందు గాని, భూమి గాని (భూమ్యాకాశాలలో) ఉన్న పదార్ధములలో లభించడు. ఇంత వరకు నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు.
(యజుర్వేదం;6:36:4) "పతిర్బభూతాసమో జనానామేకో విశ్వస్య భువనస్య రాజా"
"సర్వమానవులకు యజమాని ఆయనే. మరియు సమస్త బ్రహ్మాండమునకు అధిపతి ఆయన ఒక్కడే. ఆయనకు సాటి సమానము ఎవరూ లేరు."
(బైబిల్ యషయా; 40:18) "కావున మీరు ఎవనితో ఆయనను పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు?"
(ఖుర్'ఆన్; 42:11) "లైసక మిస్లి షయియం వహువస్సమీయుల్ బసీర్"
"ఆయనను పోలిన వస్తువు ఈ సృష్టిలో ఏదీ లేదు. ఆయన అన్నీచూసేవాడు, అన్నీ వినేవాడూను."
No comments:
Post a Comment