ఎవనిని ప్రార్ధించాలి యేసునా? యహోవానా?
పాత నిబంధన కాలంలో ఎవరిని ప్రార్ధించారు?
అబ్రహాము ప్రార్ధన:
(ఆదికాండము; 21:33) "అబ్రహాము బెయేర్షేబాలో ఒక పిచులవృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యహోవా పేరిట ప్రార్ధన చేసెను"
ఈ పై వాక్యంలోని సంఘటన పాత నిబంధనకు పూర్వం సంభవించింది. ఆనాడు అబ్రహాము యహోవానే ప్రార్ధించారు. ఆ తరువాత పాత నిబంధన కాలంలో ప్రవక్తలు, పరిసుద్ధులు మరియు సాధారణ విశ్వాసులు ఎవనిని ప్రార్ధించేవారు? అన్న ప్రశ్నకు సమాధానంగా క్రింద మచ్చుకు కొన్ని వాక్యాలు గమనించగలరు.
(యోనా; 2:10) "యోనా ప్రార్ధన, పశ్చాత్తాపాలకు యహోవా అంగీకరించి మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కి వేసెను."
(నిర్గమ కాండము; 10:16-19) "(ఫరో) - ఈ చావు మాత్రం తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకోమనగా అతడు (మోషే) - ఫరో యోద్దనుండి బయలు వెళ్లి యహోవాను వేడుకొనెను."
పాత నిబంధన కాలంలో యహోవానే ప్రార్ధించినట్లు స్పష్టంగా బోధపడుతుంది.
క్రొత్త నిబంధన కాలంలో ఎవనిని ప్రార్ధించారు?
(నిర్గమ కాండము; 10:16-19) "(ఫరో) - ఈ చావు మాత్రం తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకోమనగా అతడు (మోషే) - ఫరో యోద్దనుండి బయలు వెళ్లి యహోవాను వేడుకొనెను."
పాత నిబంధన కాలంలో యహోవానే ప్రార్ధించినట్లు స్పష్టంగా బోధపడుతుంది.
క్రొత్త నిబంధన కాలంలో ఎవనిని ప్రార్ధించారు?
యేసు ఎవరిని ప్రార్ధించారు?
(మార్కు; 14:34-38) అప్పుడాయన యేసు - నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముల్లో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉంది మెలుకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తోలగిపోవలేనని ప్రార్ధించుచూ - నాయనా! తండ్రీ! నీకు సమస్తమూ సాధ్యము; ఈ గిన్నె (శిలువమరణము) నా యోద్దనుండి తొలగించుము.
ఈ వాక్యం ప్రకారం యేసు స్వయంగానూ ఆదినుండి అందరూ ప్రార్ధిస్తూ వచ్చిన ఆ యహోవానే ప్రార్ధించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. యేసు అయితే యహోవానే ప్రార్ధించారు. మరి ఎవరిని ప్రార్ధించమని శిష్యులను ఆజ్ఞాపించారు?
(మార్కు; 14:34-38) అప్పుడాయన యేసు - నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముల్లో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉంది మెలుకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తోలగిపోవలేనని ప్రార్ధించుచూ - నాయనా! తండ్రీ! నీకు సమస్తమూ సాధ్యము; ఈ గిన్నె (శిలువమరణము) నా యోద్దనుండి తొలగించుము.
ఈ వాక్యం ప్రకారం యేసు స్వయంగానూ ఆదినుండి అందరూ ప్రార్ధిస్తూ వచ్చిన ఆ యహోవానే ప్రార్ధించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. యేసు అయితే యహోవానే ప్రార్ధించారు. మరి ఎవరిని ప్రార్ధించమని శిష్యులను ఆజ్ఞాపించారు?
(లూకా; 11:1-4) ఆయన (యేసు) యొకచోట ప్రార్ధన చేయుచుండెను. ప్రార్ధన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా! యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్ధన చేయనేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన - మీరు ప్రార్ధన చేయునప్పుడు - తండ్రీ! నీ నామము పరుశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము. మేము మా కచ్చి యున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేకుము, అని పలుకుడని వారితో చెప్పెను."
తద్వారా రక్షణ పొందాలనుకుంటున్న వారికి యేసు కొన్ని మౌలిక అంశాలు వివరించారు. వాటిలో మొదటిది ప్రార్ధన యహోవాకే చేయాలని స్పష్టముగా చెబుతున్నారు. రెండవది యహోవా నామము పరిశుద్ధపరచబడటం అనగా యహోవాతో పాటు మరొకరిని లేక మరి కొందరిని కూడా ఆయనకు సహవర్తులుగా భావిస్తూ యహోవాను వేడుకోమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నారు.
ఎందుకంటే ఈ పనులు చేసే శక్తి కేవలం ఒక్క యహోవాకే ఉన్నదనే విశ్వాసము పూర్వపు వారి వాలే యేసు కూడా కలిగి ఉన్నారు. అదే విశ్వాసాన్ని కలిగి, ఆయననే ప్రార్ధిస్తూ ఉండమని తన అనుయాయులకు కూడా ఆజ్ఞాపిస్తున్నారు.
ఎవనిని ప్రార్ధించమని యేసు ఆజ్ఞాపిస్తున్నారు?
(మత్తయి; 6:6) "నీవు ప్రార్ధన చేయునప్పుడు గదిలోనికి వెళ్లి గడియ వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి (యహోవా) ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి (యహోవా) నీకు ప్రతిఫలమిచ్చును."
ఈ వాక్యం ద్వారా తండ్రి అయిన యహోవానే ప్రార్ధించమని యేసు తన శిష్యులను ఆజ్ఞాపిస్తున్న వైనం స్పష్టంగా గోచరిస్తుంది. యేసును, పరిశుద్ధాత్మలను ప్రార్ధించడం, యేసు ఆజ్ఞను ధిక్కరించడం కాదా? కనుక యేసు ఆజ్ఞ ప్రకారం కేవలం యహోవానే ప్రార్ధించాలి. నిజమైన యేసు అనుచరుడు తన ప్రార్ధనల ఫలప్రదాతగా యహోవానే గుర్తించాలని పై వాక్యం ద్వారా అర్ధం అవుతుంది.
యేసు అనంతరం శిష్యులు ఎవనిని ఆరాధించారు?
(అపోస్తులు; 12:5) "పేతురు చెరశాలలో ఉంచబడెను, సంఘమైతే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి (యహోవాకి) ప్రార్ధన చేయుచుండెను."
(1వ పేతురు; 3:12) "ప్రభువు (యహోవా) కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్ధనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది."
యేసు అనంతరం శిష్యులు ఎవనిని ఆరాధించారు?
(అపోస్తులు; 12:5) "పేతురు చెరశాలలో ఉంచబడెను, సంఘమైతే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి (యహోవాకి) ప్రార్ధన చేయుచుండెను."
(1వ పేతురు; 3:12) "ప్రభువు (యహోవా) కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్ధనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది."
(యాకోబు; 1:5) "మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతను దేవుని (యహోవాను) అడుగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును."
పైన పేర్కొన్న రెండవ, మూడవ వాక్యాలు యేసు ప్రత్యక్ష శిష్యులు స్వయంగా పేర్కొన్నవి. ముఖ్యంగా యేసు వారసత్వాన్ని పేతురు చెరసాలలో వేయబడినప్పుడు ఆదిమసంఘస్తులు యేసును గాని, పరిశుద్ధాత్మనుగాని ప్రార్ధించక యహోవాను మాత్రమే ప్రార్ధించారని అత్యంత గమనించవలసిన విషయం. అలాగే పేతురు - కీర్తనలు;34:12-16 వాక్యాలలో నీతిమంతుల ప్రార్ధన యహోవా వింటాడన్న విషయాన్ని పైన పేర్కొన్న రెండవ వచనంలో ఊటంకిస్తున్నాడు. ఇంకా యేసు ప్రత్యక్ష శిష్యుడైన యాకూబు సైతం మీలో ఎవనికైనను జ్ఞానం కొదవైతే యహోవా దేవుని అడగమన్నాడే గాని యేసు, పరిశుద్ధాత్మలను అడగమనలేదు.
పౌలు వ్యక్తిగతంగా ఎవనిని ప్రార్ధించెను?
(ఫిలిప్పీయులకు; 1:6) "నేను చేయు ప్రతి ప్రార్ధనలో ఎల్లప్పుడును సంతోషంతో ప్రార్ధన చేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి (యహోవాకు) కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను."
పౌలు అతని శిష్యులు ప్రార్ధించింది ఎవనిని?
(అపోస్తుల కా 16:25) "అయితే మధ్య రాత్రి వేళ పౌలును సీలయు దేవునికి (యహోవా) ప్రార్ధించుచు కీర్తనలు పాడుచుండిరి."
ఎవనిని ప్రార్ధించమని పౌలు ఆదేశిస్తున్నాడు?
(ఫిలిప్పీయులకు; 4:6) "దేనిని గురించియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి (యహోవాకు) తెలియజేయుడి."
నేటి మన అధిక శాతం క్రైస్తవుల అపోహ ఏమిటంటే యేసుకు పూర్వపు విశ్వాసులు తమ అవసరాల నిమిత్తము యహోవాను ప్రార్ధిస్తూ ఉండేవారు. కాని యేసు అనంతరం యేసును ప్రార్దించారన్నది. కాని పై వాక్యాల ప్రకారం యేసు అనంతరం కూడా యేసు ప్రత్యక్ష శిష్యులు, పౌలు సైతం యహోవానే ప్రార్ధించైన, మరియు ప్రార్ధించమని చెప్పిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటప్పుడు యేసును దేవునిగా భావిస్తూ, ఆయనను ప్రార్ధించటం బైబిల్ గ్రంధాన్ని ధిక్కరించడం కాదా!?
సర్వ శక్తిమంతుడు (OMNI POTENT) ఎవడు?
మేలు-కీడు చేయగలిగే సమర్ధుడు ఎవడు? అని బైబిల్ గ్రంధాన్ని పరిశీలిస్తే ఈ క్రింది వాక్యాల ద్వారా లభించే సమాధానం ఏమిటో గమనించగలరు.
(నిర్గమ కాండము; 4:11) "యహోవా - మానవులకు నోరు ఇచ్చినవాడు ఎవడు? మూగవానినే గాని చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యహోవానైన నేనే గదా!?"
(ద్వితియోప దేశ కాండం; 32:39) "ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మ్రుతినొందించు వాడను, బ్రతికించువాడనూ నేనే, గాయపరచువాడనూ స్వస్థపరచువాడనూ నేనే. నా చేతిలో నుండి విడిపించు వాడెవరునూ లేడు."
(యషయా: 45:7) "నేనే వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధాన కర్తను, కీడును కలుగచేయువాడనూ నేనే. యహోవా అను నేనే వీటన్నింటినీ కలుగజేయుచున్నాను."
పై వాక్యాల ద్వారా ఒక్క యహోవా మాత్రమే -
- మృతి నొందించువాడు X బ్రతికించు వాడు
- గాయ పరచు వాడు X గాయమును కట్టువాడు
- మేలు కలిగించువాడు X కీడు కలిగించు వాడు
- లేవనెత్తు వాడు X పడద్రోయువాడు అని ప్రకటించబడుతుంది.
అందుకే యేసు సైతం దేవుడైన యహోవాను ఉద్దేశించి "నాయనా! తండ్రీ!! నీకు సమస్తమూ (మేలు-కీడు చేయుట) సాధ్యము అని మార్కు; 14:36 వచనంలో ప్రకటిస్తున్నారు. తను స్వయంగా కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి యేసు "నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపు వేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును." అని మత్తయి; 6:6లో ఆదేశిస్తున్నారు. ఈ వాక్యంలో 'నీ తండ్రి (యహోవా) నీకు ప్రతిఫలమిస్తాడన్నది అత్యంత గమనించవలసిన విషయం. ఇంకా యేసు ప్రత్యక్ష శిష్యుడైన యాకోబు - "ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించు వాడు. ఆయనే రక్షించుటకును, నశింపజేయుటకును శక్తి మంతుడైయున్నాడు; పరునికి తీర్పుతీరుచుటకు నీవేపాటి వాడవు? అని యాకోబు; 4:7వ వచనంలో ప్రకటిస్తున్నాడు.
దీని ప్రకారం పాత నిబంధనకాలంలోనే కాక, క్రొత్త నిబంధన కాలంలో మరియు యేసు అనంతరం ఆదిమ అపోస్తలులు మరియు పౌలు ప్రకటించిన సువార్తా ప్రార్ధనా కాలంలోనూ కేవలం ఒక్క యహోవాయే సర్వ శక్తి గల (OMNI POTENT) దేవునిగా పరిగణించ బడ్డాడని తెలుస్తుంది. అటువంటప్పుడు యేసు, పరిశుద్ధాత్మలను సహాయం కొరకు వేడుకోవడం వాక్య విరుద్ధం కాదా!?
సర్వజ్ఞుడు (OMNI SCIENT) ఎవడు?
సర్వజ్ఞుడు (OMNI SCIENT) ఎవడు?
సర్వ ప్రాణుల సకల అవసరాల జ్ఞానం ఎవనికి ఉంది? అని ప్రశ్నిస్తే బైబిల్ గ్రంధం ఎవని పేరు ప్రకటిస్తుందో ఈ క్రింది వాక్యాలు గమనించగలరు.
(ద్వితియోప; 29:29) "రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును."
(1వ సమూయేలు; 2:3) "యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించుచున్నాడు.........."
(సామెతలు; 21:2) "యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు"
పై వాక్యం ప్రకారం సర్వజ్ఞుడు (OMNI SCIENT) ఒక్క యహోవా మాత్రమే అని బైబిల్ ఉద్ఘాటిస్తుంది. అందుకే ఒక్క యహోవా తప్ప ఎవడూ హృదయాల రహస్యాలు ఎరగడని వాక్యం సాక్ష్యమిస్తుంది.
(మత్తయి; 24:36) "అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (ఎరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడై నను (యేసుకూడా) ఎరుగును."
No comments:
Post a Comment