Tuesday, September 8, 2015

యహోవా యే నిజమైన దేవుడు

యహోవా యే నిజమైన దేవుడు


1. (యషయా; 45:11)  ఇశ్రాయేలు 'పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యహోవా' ఈ మాట సెలవిచ్చుచున్నాడు:

'యహోవా సృష్టికర్త' 

2. (కీర్తన; 1:24)  "ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు"


సర్వ సృష్టికర్తయైన యహోవాకి ఆకలి దప్పికలు-నిద్రాహారాలు ఉండవు. వీటికి ఆయన అతీతుడు. మరియు మానవ బలహీనతలు లేనివాడు.


3. (సంఖ్యాకాండము; 23:19) దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాప్పడుటకు ఆయన నరపుత్రుడు కాడు.

4. (యషయా; 40:18) కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు?

దేవుడే తనకు సాటి సమానులుగా ఎవరిని నిలబెట్టరాదు అంటే మనం నిలబెట్టవచ్చా? అంటే అలా చేయరాదు. దేవుడే స్వయంగా ప్రకటన చేసుకున్నాక మానవ మాత్రులైన మన ప్రకటనలకు ఎలాంటి ఆధారం లేదు.

5. యహోవాయే దేవుడు:


(కీర్తన; 118:27) "యహోవాయే దేవుడు అంటే ఇంకెవ్వరూ దేవుడు కాదని, దేవుడే ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాడు." 


6. (కీర్తన; 102:27) నీవు (దేవుడు) ఏకరీతిగా నుండువాడవు 


దేవుడైన యహోవా సర్వసృష్టికి ముందు దేవుడుగా ఉన్నాడు, సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడుగా ఉన్నాడు, మరియు సృష్టికి అంతం యందు కూడా దేవుడై ఉంటాడు.


7. (యిర్మియా; 10:10)  "యహోవాయే నిజమైన దేవుడు" 


 ఆది కాండం నుండి ప్రకటన గ్రంధం వరకు యహోవాయే దేవుడని వ్రాయబడి ఉన్నది.


1. (అపోస్తులు; 3:26)  "దేవుడు తన (యేసు) సేవకుని పుట్టించి" ..... 


యేసు యహోవా ద్వారా ఈ ప్రపంచంలో సృష్టించ బడిన ఒక సృష్టిరాశి. 

2. (మార్కు; 4:28) "ఆయన (యేసు) దోనే అమరమున తలగడ మీద (తలవాల్చుకొని) నిద్రించుచుండెను."


యేసు అన్న పానీయాలు సేవించారు, నిద్రాహారాలు కలిగిఉన్నారు. 


3. (1తిమోతి; 2:5) "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయనే క్రీస్తు యేసను నరుడు"


యేసు నరుడు ప్రజలకు దేవునికి దైవ సందేశము అందించుటలో మధ్యవర్తియు మరియు క్రీస్తుయై (అభిషక్తుడు) ఉన్నాడు.


4. (యోహాను; 14:28)  "తండ్రి (దేవుడు) నా కంటే గొప్ప వాడు."

యేసు కూడా స్వయంగా ప్రకటన చేస్తున్నారు. దేవుడు నా కంటే గొప్పవాడని నన్ను ఆయనకీ సాటి సమానంగా నిలబెట్టరాదని. దీనిని అతిక్రమించడం యేసుని అగౌరపరచడమే.


5. (అపోస్తులు; 9:22) "అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి-ఈయనే (యేసు) క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న  యూదలను కలవరపరిచెను. 

యేసే క్రీస్తుయై ఉన్నాడు. కనుక మనమందరం యేసును క్రీస్తుగా నమ్మి విస్వసించాలి.

6. (హెబ్రీ; 13:8) "యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును."

యేసు ఈ భూలోకంలో పుట్టక ముందు క్రీస్తుగా ఉన్నారు. ఆయన పుట్టిన తర్వాత - క్రీస్తుగానే ఉన్నారు. ఈ ప్రపంచమునుండి దేవుని యొద్దకు ఎత్తబడిన తర్వాత క్రీస్తుగానే ఉన్నారు.


7. (ప్రకటన; 19:13; యోహాను; 1:1) "రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన (యేసు) ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది." 

దేవుడు యేసు ఏకమై లేరా? 


(యోహాను; 14:11) "తండ్రి (దేవుడు) యందు నేను (యేసు) ను నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి" 

దేవుడు యేసు ఏకమై ఉన్నారు. ఏరకంగా అంటే ఆలోచనా పరంగా ఏకమై యున్నారు తప్ప అస్తిత్వ పరంగా కాదు. ఈ విషయమై క్రింది వచనము పరిశీలించండి.

(యోహాను; 17:23) "వారి (శిష్యులు) యందు నేను (యేసు) ను నా యందు నీవు (దేవుడు) ను యుండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించి నట్లే వారిని కూడా ప్రేమించితివనియు, లోకము తేలుసుకొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని."

ఫై బైబిల్ వచనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత యహోవా- యేసు ఒకటి కాదని తేటతెల్లం అవుతుంది.


అయితే దేవుడు అని పేరు పెట్టబడిన వారు యేసు ఒక్కరేనా? యేసు కంటే ముందు ఇంకా ఎవరైనా ఉన్నారా?

(నిర్గమ; 7:1) "కాగా యహోవా మోషే తో ఇట్లనెను - ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న ఆహారోను నీకు ప్రవక్తగా నుండును"

(కీర్తన; 82:1) "దేవుని సమాజములో దేవుడు నిలిచి యున్నాడు. దైవముల మధ్య ఆయన తీర్పులు తీర్చుచున్నాడు." 


(కీర్తన; 82:6) "మీరు దైవములనియు మీరందరూ సర్వొంనతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను." 


(యోహాను; 10:34) "అందుకు యేసు-మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్ధము కానేరదు కదా! దేవుని వాక్యమెవరికోచ్చెనో వారే  దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు... నీవు దైవ దూషణ చేయుచున్నావని చెప్పుదురా?


సృష్టికర్తయైన యహోవా కొందరికి దేవుడు అని బిరుదు ఇవ్వడం జరిగింది. వారంతా కేవలం పేరు పెట్టబడిన దేవుళ్ళు. వారు ఎవరు అనే ప్రశ్నకు యేసు క్రీస్తు సమాధానం దేవుని వాక్యము ఎవరి వద్దకు రావడం జరిగిందో వారు దైవాలని తెలియజేశారు. అంటే ప్రవక్తలందరూ పేరుపెట్టబడిన దేవుళ్ళే. పై వాక్యాలను పరిశీలిస్తే పేరు పెట్టబడిన దైవాలు అనేక మంది ఉన్నారు. అందులో మోషే మరియు యేసు కూడా ఉన్నారు.


(ప్రకటన; 22:18-19) "ఈ గ్రంధమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతీ వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైన కలిపిన యెడల, ఈ గ్రంధములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ జేయును. ఎవడైనను  ఈ ప్రవచన గ్రంధమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల, దేవుడు ఈ గ్రధములొ వ్రాయబడిన జీవ వ్రుక్షములోను పరిశుద్ద పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును." 

బైబిల్ గ్రంధంలో ఉన్నది ఉన్నట్లు చదవడం-వ్రాయడం-ప్రచారం చేయాలే తప్ప మన సొంత ఊహలు - ప్రయోగాలకు గాని ఎలాంటి తావు లేదు. దీనిని అతిక్రమించి చేయు ప్రతివాడు ఇహ పర లోకాలలో పరాభవాన్ని చవిచూడడమే గాక భయంకరమైన నిత్య నరకంలో నెట్టబడతాడు.


(TITUS; 2:13; KING JAMES 1937 BIBLE ) "LOOKING FOR THAT BLESSED HOPE AND THE GLORIOUS APPEARING OF THE GREAT GOD AND OUR SAVIOUR JESUS CHRIST"

(తీతుకు; 2:13, కింగ్ జేమ్స్ బైబిల్) "శ్రేష్టుడైన సర్వోన్నతుడగు దేవుని కొరకు మరియు మన  రక్షకుడైన యేసు క్రీస్తువారి ప్రత్యక్షత, ఆశీర్వాదముల కొరకు ఎదురుచూడుము."

(తీతుకు; 2:13 క్యాధలిక్ బైబిల్ అనువాదం) "ఇట్లు ఇహలోకమందు జీవించుచు, సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు, రక్షకుడగు మన యేసు క్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలెయునని మనకు ఆ కృప తెలుపుచున్నది."

(తీతుకు; 2:13, ప్రొటెస్టెంట్ బైబిల్)  "అనగా మహా దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీటితోను, భక్తితోనూ బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

పై వచనాలను పరిశీలిస్తే యహోవాయే దేవుడని, నశించు ప్రజలకు దైవ మార్గమును చూపే వారు యేసు క్రీస్తుయై ఉన్నారు. అందుకే ఆయనను రక్షకుడు అని పిలవడం జరిగింది.

________________________________________

(1 JOHN; 5:20 KING JAMES 1937 BIBLE)  "And we know that the son of God is come, and hath given us an understanding, that we may know Him that is true; and we are in Him that is true, even in His son Jesus Christ. THIS IS THE TRUE GOD, AND ETERNAL LIFE."


(1వ యహాను; 5:20, కింగ్ జేమ్స్ బైబిల్ తెలుగు అనువాదం)   "మరియు దేవుని కుమారుడు వచ్చియున్నారని, మనము యెరుగుదుమ మరియు మనకు వివేకమనుగ్రహించుయున్నాడని, ఆయనే సత్యమైయున్నాడని తెలుసుకొనవలెను. మరియు మనము ఆయనలో ఉన్నమన్నది సత్యము, తన కుమారుడైన యేసుక్రీస్తులో కూడాను. ఈయనే యహోవా సత్యవంతుడైన దేవుడు, మరియు శాశ్వత జీవితము."


(1వ యోహాను; 5:20, ప్రొటెస్టెంట్ బైబిల్ తెలుగు అనువాదము)  "మనము సత్యవంతుడైన వానిని యెరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు." 

పై వచనము పరిశీలిస్తే ఆయనే అనగా యహోవాయే దేవుడు మరియు శాశ్వత జీవము ఇచ్చేవాడు కూడా.


______________________________________________________

(ROMANS; 9:5, KING JAMES 1937 BIBLE)   "Whose  are the fathers, and of WHOM AS CONCERNING THE FLESH CHRIST CAME, వహొ IS OVER ALL GOD BLESSED FOREVER. AMEN"


(రోమా; 9:5, కింగ్ జేమ్స్ బైబిల్ తెలుగు అనువాదం)  "వారు మన పితరుల వంశీయులే క్రీస్తు మానవ రీత్యా వారి జాతి వాడే సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్." 


(రోమా; 9:5; ప్రొటెస్టెంట్ బైబిల్ తెలుగు అనువాదము) "పితరులు వీరి వారు; శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్త్రొత్తార్హుడైయున్నాడు." 


ప్రొటెస్టెంట్ బైబిల్ రోమా; 9:5లో చూస్తె యేసే సర్వాధికారియైన నిరంతరము స్త్రొత్తార్హుడై యున్నట్లు కనిపిస్తుంది. అయితే అదే ఇంగ్లీష్ ప్రొటెస్టెంట్ బైబిల్లో సర్వాధికారియైన దేవుడు యహోవా అని స్పష్టమగుచున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్ళే పరిశీలిస్తే ప్రొటెస్టెంట్ బైబిల్ కి మూల గ్రంధమైనటువంటి క్యాథలిక్ బైబిల్ రోమా; 9:5లో సర్వాధికారియైన దేవుడు యహోవా మాత్రమే నని తెలియుచున్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి యహోవా మాత్రమే దేవుడని మనం గుర్తించాలి.

ప్రియ పాఠకులారా! మొత్తం పరిశీలనలో దేవుడు బయలు పరిచిన సత్యం ఏమిటంటే యహోవాయే దేవుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని, యహోవా, యేసు ఒకటి కాదని వేరువేరని తెలిసింది. కనుక మన విశ్వాసము బైబిల్ కు అనుకూలమై ఉండాలి తప్ప ప్రతికూలంగా ఉండకూడదు. దీనికి వ్యతిరేకమైన విశ్వాసమును ఏర్పాటు చేసుకొని జీవించు ప్రతి ఒక్కరు ఇహ పర లోకాలలో పరాభవాన్ని, నష్టాని చవి చూడ వలసి వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ఇహ-పరలోకాలలో నష్టం నుండి కాపాడు గాక! ఆమెన్
































No comments:

Post a Comment